Posts

TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం

Image
  TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం  👉 జిల్లా భీమా కార్యాలయం:  మీ టి ఎస్ జి ఎల్ ఐ జిల్లా ఆఫీసు పేరు రాయండి  👉 పాలసీ నెంబర్:  కొత్తగా అప్లై చేసేవారు New అని రాయాలి.  ప్రీమియం పెంపదల చేసుకునేవారు వారి పాలసీ నెంబరు రాయాలి.  👉 ప్రతిపాదన నెంబర్: ఇక్కడ ఏమీ రాయకండి  1. Name: మొదట మీ సర్ నేమ్ రాయండి,  2. SEX: male / female 3. Father's name : సర్ నేమ్ తో సహా బాక్సులు సరిపోయినట్లయితే రాయండి. లేదా పేరు మాత్రమే రాయండి.  4. మీ హోదా రాయండి. SGT/SA/LFLHM... 5. Employee office address: మీ పాఠశాల చిరునామా రాయండి. సర్వేస్ రికార్డులో నమోదు చేసిన అడ్రస్ మాత్రమే రాయండి.  6. Date of birth: DDMMYY 7. Date of first appointment: మొదటి నియామకపు తేది రాయండి. 8. Marital status: married/ unmarried /Widow /divorce  9. Is married number of children and their ages: పిల్లల సంఖ్య రాసి వారి వయస్సులు ఒక్కో బాక్స్ లో ఒక్కొక్కరి వయసు వరసగా రాయాలి  10. Basic and pay scale: మొదటి బాక్స్ లో బేసిక్ పే రాయండి, రెండో బాక్స్ లో మీ యొక్క పే స్కేల్ రాయండి...

Socio econamic సర్వే - సూచనలు

  Socio econamic సర్వేకు వెళ్తున్న ( గణకులు ) ఎన్యుమరేటర్లకు సూచనలు  1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం. ( Nov: 1 - 3 ) 2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.  3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.  4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.  5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి. 5. ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని వారికి తెలియజేయండి. 6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా...

అర్ధ వేతన సెలవు నిబంధనలు

Image
  అర్థవేతను సెలవు నిబంధనలు ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules లో 13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సంవత్సరానికి  20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.  సంవత్సరం నకు కొన్ని రోజులు తక్కువైనను ( సంవత్సరం పూర్తి కాకుంటే) ఈ సెలవు జామచేయకూడదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967) ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీసు క్రింద పరిగణిస్తారు. అర్జిత (Earned Leave) సెలవు మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు. అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు. 1.వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate) - ( 100%) 2.స్వంత వ్యవహారాలపై (Private Affairs) ( 50% - జీతం)  ఈ కారణాలతో అర్థవేతన సెలవు మంజూరు చేయించుకోవచ్చు  👉  ఉద్యోగి అనారోగ్య చికిత్స కోసం ( 100% pay) 👉 అర్ధ వేతనం ఈ క్రింది కారణాలతో ఉద్యోగి కుటుంబ సభ్యులచికిత్స కోసం  ఉద్యోగి ఉన్నత విద్య కోసం ఉద్యోగి పిల...

How to PRAN application form

Image
  PRAN FILL చేసే విధానం PRAN form capital letters మాత్రమే రాయాలి.  బ్లాక్ పెన్ తో రాయాలి.  రాసేముందు బాక్సులు సరిపోతాయా లేదో చెక్ చేసుకోండి.  సరిపోనట్లయితే షార్ట్ నేమ్ ఉంటే రాయండి.  ఉదా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు SBI  👉 మూడో పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి చదవండి           ********************* Print my PRAN in Hindi: NO Select your category: state government                          ------------- 1. PERSONAL DETAILS Salutation:  Married male : shri              female: smt Unmarried female: kumari Unmarried male: shri Applicant name: BURRA NIKHIL Father name. BURRA RAJU Mother name: BURRA RENUKA పేరులో మూడు భాగాలు ఉన్నట్లయితే మీ టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఒక్కొక్క భాగాన్ని మధ్యలో ఖాళీ గడిని వదులుతూ ఫిల్ చేయండి.  రెండు భాగాలు ఉన్నట్లయితే మొదటగా మీ ఇంటి పేరు తర్వాత ఒక గడిని ఖాళీగా వదిలి మీ పేరు రాయం...

APAAR ID GENERATE చేసే విధానం

Image
 APAAR -  AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY. APAAR ఐడి క్రియేట్ చేయడానికి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల నుండి  parent consent form  తీసుకోవాలి.  Parent consent form fill చేసే విధానం. పాఠశాల పేరు   యుడైస్ కోడ్  తల్లి /తండ్రి పేరు   విద్యార్థి పేరు   పెన్ నెంబర్ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్.  చివరలో consent form తీసుకున్న  తేదీ మరియు ప్లేస్ వివరాలు నమోదు చేయాలి.  తల్లి /తండ్రి/గార్డియన్ సంతకం చేయాలి  ఈ ఫామ్ లోనే  Headmaster consent form ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల పేరు   విద్యార్థి పేరు  తేదీ, ప్లేస్ నమోదు చేయాలి.  చివరలో ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి.  APAAR ID జనరేట్ చేయడానికి  అపార్ వెబ్ సైట్   లేదా  యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాలి.  లాగిన్ చేసిన తర్వాత  కుడివైపు main menu కనిపిస్తుంది. ఇక్కడ మీరు APAAR ID జనరేట్ మాడ్యూల్ లోకి వెళ్ళాలి. ➡️ మీరు ఐడి క్రియేట్ చేయాలనుకున్న తరగతి ఎంపిక చేసుకోవాలి.  స...

PRASHAST app ఎందుకు ? ఉపయోగం ఏమిటి ?

Image
  అన్ని వైకల్య పరిస్థితులు కనిపించే విధంగా ఉండవు. చాలా వైకల్యాలను పరిశీలన ద్వారా గుర్తించవలసి ఉంటుంది. నూతన విద్యా విధానం 2020 కి అనుకూలంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులలో గల వైకల్యాలను  ప్రశస్త్ ఆప్ ద్వారా గుర్తించడానికి NCERT వారు తయారు చేసినటువంటి ఒక సాధనము. చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను విద్యార్థులలో గుర్తించవలసి ఉంటుంది. PRASHAST అనగా..  " ప్రాథమిక అంచనాలు పాఠశాలల కోసం స్క్రీనింగ్ టూల్". Pre assessment holistic screening tool. ప్రశస్త్ app ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి అన్ని రకాల శారీరక, మానసిక, సామాజిక,విద్యా సామర్ధ్యాలకు, చలనాలకు సంబంధించినటువంటి వైకల్యాలను పరిశీలించి యాప్ లో ఒక సర్వే ఫారం ను పూర్తి చేయవలసి ఉంటుంది.  ఇది పూర్తిగా app లో చేసేటటువంటి సర్వే ఎలాంటి డాక్యుమెంట్ ఉపయోగించవలసిన అవసరం లేదు. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది.  ఈ యాప్ ను అందరూ ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.  యాప్ లో ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల మెయిల్ ద్వార...

VENDOR MAPPING IN PFMS ACCOUNT

Image
  PFMS అకౌంట్లో ప్రతివెండర్ కు ఒక unique code ఉంటుంది. మీరు ఒక పాఠశాలలో వెండర్ గా యాడ్ చేసుకోగానే మీకు కేటాయించబడిన యూనిక్ కోడును ఒకచోట నమోదు చేసుకోవాలి. ఇది భవిష్యత్తు ట్రాన్సాక్షన్స్ కొరకు ఉపయోగపడుతుంది. మీకు యూనిక్ కోడ్ తెలియనట్లయితే మీ పాఠశాల operator ( DO )లాగిన్ లో వెండెర్స్ లోకి వెళ్లి చూసినట్లయితే, అందరి వెండర్స్ పేర్లు వారి యొక్క యూనిక్ కోడ్స్ కనిపిస్తాయి. ఈ కోడ్ ఒక్కొక్క వెండర్ కు ఒక్కో విధంగా ఉంటుంది. ఒక వెండర్ యొక్క కోడ్ మరొక వండర్ తో అసలు మ్యాచ్ కాదు. మనం ఒక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఆ పాఠశాల యొక్క PFMS ఎకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన పేరు వెండర్ గా add చేసుకుంటాము.  బదిలీ అయి మరొక పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడి PFMS ఎకౌంట్లో మళ్లీ మన ఎకౌంటును వెండర్ గా add చేయాలని ప్రయత్నం చేసినట్లయితే వెండర్ already exist అని వస్తుంది. అక్కడ యాడ్ అవదు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు already exist అయిన వెండర్ ను మీ కొత్త పాఠశాల పిఎఫ్ ఎంఎస్ అకౌంట్లో Mapping చేయవలసి ఉంటుంది. Vendor మ్యాపింగ్ చేయడానికి మీరు ఆపరేటర్ లాగిన్ చేయవలసి ఉంటుంది.  ఆపరేటర్ లాగిన్ లో  Master...