APAAR ID GENERATE చేసే విధానం

 APAAR - 

AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY.



APAAR ఐడి క్రియేట్ చేయడానికి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల నుండి 

parent consent form 

తీసుకోవాలి. 

Parent consent form fill చేసే విధానం.

పాఠశాల పేరు 

 యుడైస్ కోడ్ 

తల్లి /తండ్రి పేరు 

 విద్యార్థి పేరు 

 పెన్ నెంబర్

తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్. 

చివరలో consent form తీసుకున్న 

తేదీ మరియు ప్లేస్ వివరాలు నమోదు చేయాలి. 

తల్లి /తండ్రి/గార్డియన్ సంతకం చేయాలి 


ఈ ఫామ్ లోనే 

Headmaster consent form ఉంటుంది.

ప్రధానోపాధ్యాయుల పేరు 

 విద్యార్థి పేరు 

తేదీ, ప్లేస్ నమోదు చేయాలి. 

చివరలో ప్రధానోపాధ్యాయులు సంతకం చేయాలి. 

APAAR ID జనరేట్ చేయడానికి 

అపార్ వెబ్ సైట్ 

 లేదా 

యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయాలి. 


లాగిన్ చేసిన తర్వాత 

కుడివైపు main menu కనిపిస్తుంది.

ఇక్కడ మీరు APAAR ID జనరేట్ మాడ్యూల్ లోకి వెళ్ళాలి.

➡️ మీరు ఐడి క్రియేట్ చేయాలనుకున్న తరగతి ఎంపిక చేసుకోవాలి. 

సెక్షన్ అని ఉన్నచోట All సెలెక్ట్ చేయండి. అందరి విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. 

విద్యార్థి పేరుకు కుడివైపున ACTION 

అనే బటన్ కనిపిస్తుంది.

action లో

 apaar Id generate select చేయాలి.

APAAR ID జనరేట్ చేయడానికి ముందే 

విద్యార్థి జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి

ఇలా చేసిన వారికి మాత్రమే

➡️ generate APAAR ID 

అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. 

అపార్ ఐడి జనరేట్ చేయాలంటే ఈ క్రింది డేటాను ముందుగా అప్డేట్ చేయాలి 

1. విద్యార్థి యొక్క ప్రొఫైల్ వివరాలు అప్డేట్ చేయాలి. 

2. పిన్ నెంబర్ జనరేట్ అయి ఉండాలి. 

3. విద్యార్థి ఆధార్ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. 

4. విద్యార్థి యొక్క వివరాలు స్కూల్ రికార్డ్స్ లో ఆధార్ లో ఉన్న వివరాల ప్రకారం సరిగా ఉండాలి. 

5. విద్యార్థి యొక్క మొబైల్ నెంబరు అప్డేట్ చేసి ఉండాలి. 

పైన తెలుపబడిన ఐదు రకాల వివరాలు మీరు యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో అప్డేట్ చేసినట్లయితే ఆ విద్యార్థికి APAAR ID ని జనరేట్ చేయడానికి వీలవుతుంది. 

ఇలా అప్డేట్ చేసిన ప్రతి విద్యార్థికి కుడివైపున

 APAAR ID జనరేట్ బటన్ Enable అవుతుంది. 

👉 కాబట్టి ముందుగా మీరు యూడైస్ ప్లస్ లోని స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్లి విద్యార్థుల యొక్క వివరాలన్నీ ఆధార్ ప్రకారం సరి చేయాల్సి ఉంటుంది. 

వివరాలన్నీ అప్డేట్ చేసిన తర్వాత 

APAAR ID జనరేట్ బటన్ క్లిక్ చేయగానే మరొక ఫామ్ ఓపెన్ అవుతుంది. 

ఈ ఫామ్ లో 

విద్యార్థి యొక్క పేరు, 

డేట్ అఫ్ బర్త్,

పిన్ నెంబర్, 

Additional information లో 

తల్లిదండ్రుల పేర్లు, 

విద్యార్థి యొక్క కమ్యూనిటీ వివరాలు, 

విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తాయి.


ఇక్కడ మీరు విద్యార్థి యొక్క

 CONSENT FORM online చేయాలి.

I అని ఉన్నచోట విద్యార్థి యొక్క తండ్రి/తల్లి/ పేరు లేదా గార్డియన్ పేరు ఇవ్వాలి,  

తర్వాత అతనితో విద్యార్థికి గల బంధుత్వాన్ని ఎంపిక చేయాలి. 

➡️ mother/ father/ guardian.

తర్వాత తల్లి/తండ్రి/ గార్డియన్ 

యొక్క ఐడి కార్డును సెలెక్ట్ చేయాలి. 

ID card వివరాలు

ఆధార్, 

డ్రైవింగ్ లైసెన్స్, 

ఓటర్ ఐడి,

పాన్ కార్డ్, 

పాస్ పోర్ట్ 

👉 వీటిలో తల్లి తండ్రి గార్డియన్ ఇచ్చిన 🆔 కార్డు ఎంపిక చేయాలి. 

ఆ ఐడి కార్డుకు సంబంధించిన నెంబర్ ఇవ్వాలి.

Place and date ఇవ్వాలి.


తర్వాత ప్రధానోపాధ్యాయుల కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయాలి.

ప్రధానోపాధ్యాయుల పేరు నమోదు చేయాలి. విద్యార్థి పేరు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. 

అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత submit పైన క్లిక్ చేయాలి. 

Consent form సక్సెస్ ఫుల్ గా సబ్మిట్ అవుతుంది వెంటనే 

ఆ విద్యార్థికి అపార్ ఐడి 

జనరేట్ అవుతుంది.ఐడి నెంబర్ కూడా అక్కడ కనిపిస్తుంది.


Helpline Number :

18008893511

APAAR ID నమూన..



APAAR జనరేట్ చేయడానికి CLICK HERE 

APAAR vedio చూడడానికి CLICK HERE 

 Consent form download 

Consent form fill చేసే విధానం CLICK HERE 






Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION