PRASHAST app ఎందుకు ? ఉపయోగం ఏమిటి ?
అన్ని వైకల్య పరిస్థితులు కనిపించే విధంగా ఉండవు. చాలా వైకల్యాలను పరిశీలన ద్వారా గుర్తించవలసి ఉంటుంది.
నూతన విద్యా విధానం 2020 కి అనుకూలంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులలో గల వైకల్యాలను ప్రశస్త్ ఆప్ ద్వారా గుర్తించడానికి NCERT వారు తయారు చేసినటువంటి ఒక సాధనము.
చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను విద్యార్థులలో గుర్తించవలసి ఉంటుంది.
PRASHAST అనగా..
"ప్రాథమిక అంచనాలు పాఠశాలల కోసం స్క్రీనింగ్ టూల్".
Pre assessment holistic screening tool.
ప్రశస్త్ app ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి అన్ని రకాల శారీరక, మానసిక, సామాజిక,విద్యా సామర్ధ్యాలకు, చలనాలకు సంబంధించినటువంటి వైకల్యాలను పరిశీలించి యాప్ లో ఒక సర్వే ఫారం ను పూర్తి చేయవలసి ఉంటుంది.
ఇది పూర్తిగా app లో చేసేటటువంటి సర్వే ఎలాంటి డాక్యుమెంట్ ఉపయోగించవలసిన అవసరం లేదు.
దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది.
ఈ యాప్ ను అందరూ ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ లో ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
ఇతర ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
ఉపాధ్యాయులు అందరూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ ను ధ్రువీకరించాలి.
ధ్రువీకరణ పూర్తయిన తర్వాత విద్యార్థులను పరిశీలించి app లో సర్వే ను ఆన్లైన్ విధానంలో పూర్తి చేయవలసి ఉంటుంది.
సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ వివరాలను గోప్యంగా ఉంచాలి.
కావాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉన్నతాధికారులకు మాత్రమే తెలియజేయవచ్చు.
సర్వేను మొదట ఉపాధ్యాయులు పూర్తి చేస్తారు ఆ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ మరొకసారి సర్వేను పూర్తి చేస్తారు.
ఈ సర్వేలో PART -1 & PART -2 రెండు భాగాలు ఉంటాయి.
పార్ట్-1 సర్వేను పాఠశాల ఉపాధ్యాయులు పూర్తి చేస్తారు.
పార్ట్- 2 సర్వేను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పూర్తి చేస్తారు.
ఈ సర్వేలో విద్యార్థి అవయవాల ఉపయోగం.
పనులు ఎలా చేస్తున్నాడు.
మాటలు ఎలా మాట్లాడుతున్నాడు.
కాళ్లు చేతులు ఎలా ఉన్నాయి.
తల ఎలా ఉన్నది,
పొడవు పొట్టి,
చేతివేళ్లు మొదలైన శారీరక అవయవాలకు సంబంధించిన సర్వే ప్రశ్నలు ఉంటాయి.
విద్యార్థి ఎలా చదువుతున్నాడు ?
చూపు ఏ విధంగా ఉంది ?
రంగులను గుర్తిస్తున్నాడా ?
నల్లబల్ల సరిగా కనిపిస్తుందా ?
ఎలా రాస్తున్నాడు ?
చదివేటప్పుడు సరిగా చదువుతున్నాడా ?
హోంవర్క్ సరిగా చేస్తున్నాడా ?
అతని ప్రవర్తనలు తరగతి గదిలో ఇతర విద్యార్థులతో ఎలా ఉన్నాయి ?
ఉపాధ్యాయుని సూచనలు పాటిస్తున్నాడా ?
గణిత చిహ్నాలను గుర్తిస్తున్నాడా ? లాంటి
అకడమిక్ అంశాలకు
సంబంధించిన సర్వే ప్రశ్నలు ఉంటాయి.
ప్రశస్త యాప్ ఈ లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొండి.
PRASHAST vedio చూడడానికి CLICK HERE
వైకల్యాలు రకాల CLICK HERE
Comments
Post a Comment