పోటీ పరీక్షల ప్రత్యేకం - గణితం

 


గౌరవ ఉపాధ్యాయులకు,
తల్లితండ్రులకు & విద్యార్థులకు

ఏప్రిల్ మరియు మే ఈ రెండు నెలలు విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి. పాఠశాల లో  సంవత్సర పరీక్షలు,ఉన్నత చదువుల కోసం జరిగే పోటీ పరీక్షలు చాలా వరకు ఈ రెండు నెలల్లో నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి ఈ రెండు నెలలు మంచి ప్రణాళికతో చదివితే ప్రతి విద్యార్థి తరువాతి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు.
ప్రస్తుత కోవిడ్ పరిస్తితి లో విద్యార్థులు గ్రూప్ గా చదివే అవకాశం మరియు సందేహాలు నివృత్తి చేసుకొనే అవకాశం లేదు.
ఇలాంటి పరిస్తితి లో మీరు మీ ఇంట్లోనే ఉంటూ,పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ మీ సందేహాలు నివృత్తి చేసుకొనే విధంగా 40 రోజుల ప్రణాళికతో మీ ముందుకు వస్తుంది
 "in school activities".
మీ కొరకు ప్రతి సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు పోస్ట్ చేయడం జరుగుతుంది. జవాబులు తరువాత రోజు పోస్ట్ చేయబడుతాయి.మీరు ఈ ప్రశ్నలను ఒక ప్రత్యేకమైన నోట్ బుక్ లో వ్రాసుకొంటూ
గురుకుల, మోడల్ స్కూల్, నవోదయ, సైనిక్ స్కూల్ 
 ( వరంగల్ & రుక్మపూర్) లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.

ప్రతి రోజు మీ కోసం కొత్త ప్రశ్నలు యాడ్ చేయడం జరుగుతుంది.మీరు రోజూ బ్లాగ్ లోని ఈ పేజీ ఓపెన్ చేసి కొత్తగా జోడించబడిన ప్రశ్నలు రాసుకోండి.

మీరు జవాబులు పోస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీకు తెలిసిన జవాబులు ప్రశ్నల సంఖ్య తో పోస్ట్ చేయగలరు.
                                
                       All the best.....

ఈరోజు ప్రశ్నలు....

New study  meterial


1. పావు కు భిన్న రూపం?
  A. 1/2         B. 1/4         C. 3/4        D. 1/3

2. సగానికి భిన్న రూపం.
  A. 1/2          B. 1/4        C. 3/4       D. 1/3

3. ముప్పావు కు భిన్న రూపం.
    A. 1/2.          B. 1/4       C. 3/4         D. 1/3

4. రాములమ్మ తనకున్న 5 సమాన భాగాలు భూమిని తన ఇద్దరు పిల్లలతో సమానంగా పంచితే ఒక్కొక్కరికి వచ్చే భాగాలు ఎన్ని?
  A. 2 1/2                   B. 2 3/4
  C. 2                          D. 3 1/2

5. ఒక కిలో గ్రామ్ బియ్యం ధర ₹ 30 అయిన రెండున్నర కిలోల బియ్యం కు ఎంత ధర అవుతుంది?

6.పావు 1/4 లీటర్ కు ఎన్ని మిల్లీలీటర్లు?

7. అర లీటర్ కి( 1/2 ) ఎన్ని మిల్లీ లీటర్లు.

8. ముప్పావు లీటర్ కు (3/4) కి ఎన్ని మిల్లీ లీటర్లు.

9. 1/10 లేదా 1/5 లలో ఏ భిన్నం పెద్దది?

10. 4 1/8 లేదా 4 1/4 లలో ఏ భిన్నం పెద్దది?

11. 2/9, 3/9, 5/9, 1/9 లలో ఏది చిన్నది?
      A. 2/9.                   B. 3/9
      C. 5/9                    D. 1/9

12. కౌశిక్ 24 గంటల్లో 8 గంటలు నిద్ర పోతాడు. మిగిలిన భాగం మెలకువతో ఉంటాడు. అయిన మెలకువతో ఉండే భాగం ఎంత.
    A. 8/24                 B. 16/24
    C. 24                    D. 24/16

13. ఉస్మాన్ పాఠశాల నుండి ఇంటికి గల దూరాన్ని 7/10 భాగాన్ని సైకిల్ పై వెళ్తాడు. మిగిలిన భాగాన్ని నడిచి వెళ్తాడు.అతడు ఎంత భాగాన్ని నడిచి వెళతాడు.

14. చెవి రింగుల బరువు 32 గ్రాములు ఉంటుంది. దాని బరువు లో 7/8 వెండి ఉంటే,ఆ చెవి రింగులు లో వెండి ఎన్ని గ్రాములు ఉంటుంది.
15. రాజు మార్కెట్ లో 3/4 కిలో గ్రాముల ఆపిల్ పండ్లు తెచ్చాడు. దానిలో 1/4 కిలో గ్రామ్ పండ్లు తిన్నట్లయితే మిగిలినవి ఎన్ని?

16. ఆశిష్ తన హోం వర్క్ లో 7/12 భాగాన్ని శనివారం,3/12 భాగాన్ని ఆదివారం చేసిన మొత్తం ఎంత?

17. పావుకిలో కు ఎన్ని గ్రాములు?
18. 1/2 కి.గ్రా. ఎన్ని గ్రాములు?
19. 3/4 కి.గ్రా కు ఎన్ని గ్రాములు?

20. 10 టాబ్లెట్ గల స్ట్రిప్ లో మూడు టాబ్లెట్లు వేసుకున్నట్లయితే మిగిలిన భాగం ఎంత?
        A. 3/10                B. 1/10
        C. 7/10                 D. 10/10


Answers

1. B
2. A
3. C

4. A ,( 5 సమాన భాగాలను ఇద్దరికీ పంచినట్లయితే 2 పూర్తి భాగాలు, ఒక సగభాగం వస్తుంది కాబట్టి జవాబు: 2 1/2)

5. ₹ 75. ఒక కిలోగ్రామ్= ₹ 30
       2 కి.గ్రా.= 2×30 = 60
      అరకిలో ధర = ₹15 కావున
    2 1/2 కిలోల ధర= 60+15 = ₹ 75

6. 250 మీ. లీ
7. 500 మీ. లీ
8. 750 మీ.లీ

9. 1/5 పెద్దది. కారణం ఒక వస్తువును 10 భాగాలు చేసినట్లయితే భాగాలు చిన్నవిగా ఉంటాయి. ఐదు భాగాలు చేసినట్లయితే భాగాలు పెద్దవిగా ఉంటాయి. కాబట్టి 1/5 పెద్ద భిన్నం అవుతుంది.

10. 4 1/4 పెద్దది. కారణం రెండు భిన్నా లలో పూర్తి భాగాలు నాలుగు ఉన్నాయి. తర్వాత ఒక దానిని 8 భాగాలు మరియు నాలుగు భాగాలు చేసినారు. 8 భాగాలు చేసినట్లయితే అవి చిన్నగా ఉంటాయి. నాలుగు భాగాలు చేసినట్లయితే అవి పెద్దగా ఉంటాయి. 

11. D భిన్నాల లో హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం ఏది పెద్దగా ఉంటే అది పెద్ద భిన్నం అవుతుంది. లవం అనేది చిన్నగా ఉంటే అది చిన్న బిన్నం అవుతుంది. 
కాబట్టి జవాబు: 1/9

12. B
    మొత్తం 24 గంటలు. 
    8 గంటలు నిద్రపోతాడు.
   మెలకువతో ఉండేది 16 గంటలు.
   కావున మెలకువతో వుండే భాగం= 16/24

13. ఇంటి నుండి పాఠశాలకు గల మొత్తం దూరం 10.
ఉస్మాన్ సైకిల్ పై వెళ్లేది = 7
ఉస్మాన్ నడిచి వెళ్లేది = 10-7 = 3
కావున ఉస్మాన్ నడిచి వెళ్లే భాగం= 3/10

14. చెవి రింగుల బరువు= 32 గ్రా.
చెవి రింగులో వెండి భాగం = 7/8
 వెండి బరువు గ్రాములలో = 32 × 7/8
          = 28 గ్రా.

15. ఆపిల్ పండ్లు= 3/4 కి.గ్రా (అనగా ముప్పావు కిలో)
       తిన్నవి= 1/4 (అనగా పావు కిలో)
     3/4 - 1/4 
     ముప్పావు కిలో లో, పావుకిలో తిన్నట్లయితే అరకిలో మిగులుతాయి.
  కావున జవాబు= 1/2

16. మొత్తం = 7/12 + 3/12
                  = 7+3/12
                 = 10/12
17. 250 గ్రా
18. 500 గ్రా
19. 750 గ్రా.

20. మొత్తం ట్యాబ్లెట్లు= 10
      వేసుకున్న టాబ్లెట్లు= 3 
      మిగిలిన టాబ్లెట్లు = 7
    మిగిలిన టాబ్లెట్ల భాగం= 7/10

   🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

1. శ్రీనిత  ₹ 80 తో 1/4 కిలో గ్రాముల కారంపొడి తీసుకున్నది. అయినా ఒక కిలో గ్రామ్ కారంపొడి ధర ఎంత ?
   A. ₹ 160   B.₹ 320.   C.₹ 240.   D.₹ 310

2. 7/2 + 5/2 + 3/2 = 
   A.15/6     B.15/2    C. 15/8   D.15/3

3. తేజ 18 కిలోల ఆలుగడ్డలు కొన్నాడు. వాటిలో  2/3 వ,భాగం వండుకుని తిన్నారు. 1/3 వ భాగం కుళ్ళి పోయినాయి. అయిన కుళ్ళిపోయిన ఆలుగడ్డలు ఎన్ని ?
  A.12 కి.గ్రా   B.9 కి.గ్రా  C.6 కి.గ్రా  D. 8 కి.గ్రా

4. ఒక రొట్టెను ఐదుగురికి విభజించగా ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ?
  A. 1/2   B. 1/3     C. 1/4     D. 1/5

5. చెవి రింగులు బరువు 32 గ్రాములు. వాటిలో 5/8 విభాగము వెండి ఉన్నట్లయితే వెండి బరువు ఎంత ?
  A.16.   B.20.    C.18.     D.14

6.  2/3, 5/3, 4/3, 7/3 భిన్నాల లో పెద్ద బృందాన్ని గుర్తించండి.
  A.2/3    B.5/3    C.4/3    D.7/3

7. Rama జ్వరం తగ్గడానికి 10 టాబ్లెట్లు నుండి మొదటి రోజు 3 టాబ్లెట్లు వేసుకున్నది. టాబ్లెట్స్ స్ట్రిప్ లో ఎంత భాగం మిగిలినది ?
   A.3/10    B.7/10   C.1/10    D.10/10

8. ఉస్మాన్ పాఠశాల నుండి ఇంటికి గల దూరాన్ని 7/10 భాగాన్ని సైకిల్ పై  వెళ్తాడు. మిగిలిన భాగము నడిచి వెళ్తాడు. అతడు ఎంత భాగాన్ని నడిచి వెళతాడు.

9. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు ఉన్నారు వారిలో 3/4 మంది బాలురు. ఆ తరగతిలో బాలురు సంఖ్య ఎంత ?

10. అబ్దుల్లా ఒక చెట్టు లో 3/4 భాగాన్ని ఎక్కాడు. ఇంకా ఎక్కవలసిన చెట్టు భాగం ఎంత

11. ఒక గులాబీ మొక్కకు 15 గులాబీలు ఉన్నవి. అందులో నుండి వాణి తన గది అలంకరణ కోసం 1/5 వ భాగం తీసుకుంది. ఆమె తీసుకున్న గులాబీ పూలు ఎన్ని ?

12. రఘు 7/12 భాగం పనిని సోమవారం.
 3/12 వంతు  పనిని మంగళవారం పూర్తి చేశాడు. రఘు ఇంకా పూర్తి చేయవలసిన పని ఎంత ?

13. రాము 3/4 కి.గ్రా ఆపిల్ పండ్లను కొన్నాడు. అతడు 1/4 తమ్ముడికి ఇచ్చాడు. ఇంకా మిగిలిన ఆపిల్ పండ్ల భాగం ఎంత ?

14. జాన్ తన వద్ద ఉన్న కేకులో 2/5 భాగం స్నేహితులకు పంచాడు. ఇంకా అతని వద్ద ఎంత భాగం మిగిలింది?

15. జాన్ మార్కెట్ నుండి 12 ఆపిల్ పండ్లను తెచ్చాడు.అందులో 5 /12 భాగం ఆపిల్ పండ్లను అతను ఇంటిలోని వాళ్లు తిన్నారు. 3/12 భాగం పండ్లు చెడిపోయాయి. ఇంకా మిగిలిన  పండ్లు ఎన్ని. దానిని భిన్న రూపంలో రాయండి.

జవాబులు

1.  B
      1/4 కి.గ్రా. కారం పొడి = ₹ 80
      (పావు కిలో కారం పొడి ధర = ₹ 80)
     ఒక కిలోగ్రాము కారం పొడి ధర= 4×80
                                               = ₹ 320
2.   A
        7/2+5/2+3/2 = 7+5+3/2+2+2
                             = 15/6

3.  C
       మొత్తం ఆలుగడ్డలు 18 కిలో గ్రాములు
       వండుకొని తిన్నవి = 2/3
        = 18×2/3 = 12 కి.గ్రా
        కుళ్ళి పోయినవి = 18×1/3 = 6 కి.గ్రా

4. D ( 1/5 )

5. B
     చెవి రింగులు పరువు 32 గ్రాములు 
     వెండి భాగము 5/8
      = 32×5/8 = 20 గ్రా.

6.  D.  (7/3) హారాలు సమానంగా ఉన్నప్పుడు ఏ భిన్నం లవం పెద్దగా ఉంటుందో ఆ భిన్నం పెద్ద భిన్నంగా గుర్తించాలి.

7. మొత్తం టాబ్లెట్ లు =10
      వేసుకున్న టాబ్లెట్లు= 3 =3/10
    మిగిలిన టాబ్లెట్లు 10-3 = 7
మిగిలిన టాబ్లెట్ల భాగం = 7/10

8. ఉస్మాన్ 10 భాగాలలో 7 భాగాలు సైకిల్ పై వెళ్తాడు.
    మిగిలిన భాగాలు 3 నడిచి వెళతాడు.
     నడిచి వెళ్లే భాగం = 3/10

9. తరగతిలోని విద్యార్థుల సంఖ్య= 32 మంది తరగతి లో బాలుర భాగము= 3/4 
    తరగతి లోని బాలుర సంఖ్య =
        = 32 × 3/4= 24 మంది.

10. చెట్టు మొత్తం 4 భాగాలు 
      అబ్దుల్లా మూడు భాగాలు ఎక్కాడు.
      మిగిలిన భాగాలు 1 
       కాబట్టి ఎక్కవలసిన భాగం 1/4

11. గులాబీ మొక్కకు గల పూవుల సంఖ్య 15. అలంకరణ కోసం కోసిన పూల భాగం 1/5 
 ఆమె తీసుకున్న పూవుల సంఖ్య= 
     1/5 × 15 = 3 పూవులు.

12. రఘు చేయవలసిన మొత్తం పని 12 భాగాలు
  అతడు పూర్తి చేసిన పని 7+3 = 10 భాగాలు
 మిగిలిన పని = 12- 10 = 2
  రఘు పూర్తి చేయవలసిన పని = 2/12

13. మిగిలిన ఆపిల్ పండ్ల భాగం =
      3/4-1/4 = 2/4 = 1/2

14. కేకు మొత్తం 5 భాగాలు.
 స్నేహితులకు పంచినది 2 భాగాలు.
 మిగిలినది 3 భాగాలు
  కాబట్టి = 3/5 మిగిలినది.

15. జాన్ కొన్ని ఆపిల్ పండ్లు 12
       ఇంటిలోని వాళ్ళు తిన్నవి = 5.
        చెడిపోయినవి = 3
      మొత్తం = 5+3 =8
      మిగిలినవి = 12-8 = 4
మిగిలిన ఆపిల్ పండ్ల భాగం = 4/12.

                       🌹🌹🌹🌹🌹🌹🌹🌹
          
1. ఒక గంటకు ఎన్ని నిమిషాలు ?
2. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు ?
3. ఒక గంటకు ఎన్ని సెకండ్లు ?
  A. 60   B. 120   C. 3600  D. 24

4. AM సమయాన్ని ఎప్పుడు లెక్కిస్తారు ?
    
5. PM సమయాన్ని లెక్కించే వ్యవధి ఏది ?

6. మనం ఇంటిలో ఉపయోగించే గడియారంలో 1: 30 pm  సూచించే సమయం ?
  A.ఉదయం B.మధ్యాహ్నం C.సాయంత్రం 
   D. రాత్రి

7. సాధారణ గడియారంలో సమయం 2pm అవుతున్నప్పుడు రైల్వే గడియారంలో ఎంత చూపిస్తుంది ?
  A. 13 గంటలు    B. 14 గంటలు  
  C. 15 గంటలు     D. 16 గంటలు

8. 6:00 am కు సమానమైన 24 గంటల సమయం ఏది ?
  A. 6:00  B. 18:00   C. 16:30  D. 20:00

9. 2 నిమిషాల 30 సెకన్లకు మొత్తం సెకండ్లు ఎన్ని ?

10. రైల్వే గడియారం లో 20 గంటలు సమయం అయినప్పుడు, సాధారణ గడియారంలో ఎంత సమయం చూపిస్తుంది ?
             A. 20:00      B. 8:00 am 
            C.  8:00 pm D.  16:30

11. 190 సెకండ్లకు ఎన్ని నిమిషాలు ?
   A. 2 నిమిషాల 10 సెకండ్లు
   B.  3 నిమిషాల 10 సెకండ్లు 
   C.  4 నిమిషాల 10 సెకండ్లు
   D.   5 నిమిషాల 10 సెకండ్లు

12. గాయత్రి 6: 00 am కు నిద్ర లేచి 9: 00 pm కు నిద్ర పోయినా ఆమె ఎంత సమయం మెలకువగా ఉంది ?

13. 11 pm అనగా రైల్వే సమయంలో ఎంత అవుతుంది ?
  A. 22:00  B. 23: 00  C. 24: 00 D. 11 am

14. 116 వారాలకు ఎన్ని రోజులు ?

15. గాయత్రీ ఉదయం 11: 30 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేటకు చేరుకున్నది. ఆమె ప్రయాణించిన సమయం ఎంత ?

16. AM అనగా ఏమిటి ?

17. PM అనగా ఏమిటి ?

18. తరుణ్  పాఠశాలకు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పట్టింది. తరుణ్ ప్రయాణానికి మొత్తం ఎన్ని నిమిషాల సమయం పట్టింది ?

19. భారత్ ఇంగ్లాండ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4:45 గంటలకు ముగిసింది మ్యాచ్ కి పట్టిన సమయం ఎంత ?

20. ఒక సంవత్సరం అనగా ఎన్ని రోజులు ?
21. లీవ్ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి ?
22. లీపు సంవత్సరము లో ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి ?
23. ఒక వారం అనగా ఎన్ని రోజులు ?
24. 31 రోజులు కలిగిన నెల ఏది ?
   A. ఫిబ్రవరి B. ఏప్రిల్  C.జనవరి D.సెప్టెంబర్

25. ఒకవేళ సెప్టెంబర్ 9, 2012 రోజు ఆదివారం అయినప్పుడు అక్టోబర్ 9, 2012 ఏ వారం అవుతుంది ?

జవాబులు

1.  60
2.  60
3.  C
4.  మధ్య రాత్రి 12 గంటల నుండి ఉదయం
 11: 59 గంటల వరకు
 ( 12:00 am - 11:59 am)

5. మధ్యాహ్నం 12 గంటల నుండి 11:59 వరకు
    ( 12:00 pm - 11: 59pm)

6. B
7.  B
8.  A ( సాధారణ గడియారంలో 6 am అయినప్పుడు 24 గంటల గడియారం కూడా 6:00 చూపిస్తుంది)

9.  రెండు నిమిషాలకు 120 సెకండ్లు
    మొత్తం సెకండ్లు= 120+30 = 150

10. C ( 8pm)
11. B ( 3 నిమిషాల 10 సెకండ్లు)

12.   6:00 am నుండి 6:00 pm వరకు
         = 12 గంటలు
        6:00 pm నుండి 9: 00 pm వరకు 
         = 3 గంటలు
మొత్తం సమయం = 12 + 3 = 15 గంటలు.

13. B ( 23:00)

14. ఒక వారం = 7 రోజులు
 116 వారాలకు మొత్తం రోజుల సంఖ్య
   = 116×7 = 812 రోజులు
15. బయలుదేరిన సమయం = 11: 30 am
       చేరిన సమయం = 2:00 pm    
        ప్రయాణించిన సమయం = 
   11:30 నుండి 12:00 వరకు = 30 ని.
    12:00 నుండి 2:00 వరకు =. 2 గంటలు
    మొత్తం 2 గంటల 30 నిమిషాలు.

16. ante meridiem

17. post meridiem

18. 1 గంట = 60 నిమిషాలు
        ప్రయాణానికి పట్టిన సమయం=
         60 + 15 = 75 నిమిషాలు.

19. మ్యాచ్ ప్రారంభ సమయం = 9:30am
      మ్యాచ్ ముగిసిన సమయం = 4:45 pm
 👉   9:30 గంటల నుండి 12 గంటల వరకు =   
    2 గంటల 30 ని.
 👉  12 గంటల నుండి 4:45 వరకు = 
      4 గంటల 45 ని.
మొత్తం సమయం = 2:30 + 4: 45 = 
                 7 గంటల  15 నిమిషాలు

20. 365
21.  366
22.   29
23.   7
24.  C

25.  సెప్టెంబర్ 9, 2012 రోజు ఆదివారం అయిన ( మళ్లీ ఏడు రోజుల తర్వాత ఆదివారం వస్తుంది) కాబట్టి
   సెప్టెంబర్ 16 ఆదివారం 
   సెప్టెంబర్ 23 ఆదివారం 
   సెప్టెంబర్ 30 ఆదివారం 
   అక్టోబర్ 7 ఆదివారం 
   అక్టోబర్ 8 సోమవారం 
   అక్టోబర్ 9 మంగళవారం

                        💠💠💠💠💠💠💠

1. కిరోసిన్ కొలవడానికి ప్రమాణాలు ఏవి ?
        A. మీటర్      B.కిలోగ్రామ్
         C. లీటర్.      D. గ్రాములు

2. 110 లీటర్ల పాలను అర లీటర్ ప్యాకెట్లు గా తయారు చేయాలంటే ఎన్ని ప్యాకెట్లు చేయగలము ?
   A. 50   B.220   C.440   D. 55

3. ఒక లీటరు పాల ధర 20 రూపాయలు అయిన 20లీ. 750 మి. లీ పాల ధర ఎంత ?

4. ఒక వ్యక్తి 250 మి.లీ, 500 మి.లీ పాల ప్యాకెట్లను అమ్మాడు. ఒకవేళ అతను 6 లీ. పాలను మొత్తం 17 ప్యాకెట్లలో చేసి అమ్మితే ఏ రకం ప్యాకెట్లు ఎన్ని అమ్మాడు ?
  A. 250 మి.లీ - 10, 500 మి.లీ - 7
  B.  250 మి.లీ - 7, 500 మి.లీ - 10
  C. 250 మి.లీ - 11, 500 మి.లీ - 6
  D. 250 మి.లీ - 6, 500 మి.లీ - 11

5. తెలుపురంగు 4 లీటర్లకు ₹ 120 అయిన. 10 లీ. డబ్బాకు ఎంత ధర అవుతుంది ?

6. ఒక బస్సు డ్రైవర్ పెట్రోల్ బంకులో డీజిల్ కోసం ₹ 2250 చెల్లించాడు. డీజిల్ రేటు ₹ 50 అయినా బస్సు డ్రైవర్ ఎన్ని లీటర్ల డీజిల్ కొన్నాడు ?

7. ఒక కప్పులో 50 మి.లీ టీ పడుతుంది అలాంటి 12 కప్పుల లో ఎంత పరిమాణం టీ పడుతుంది ?

8. ఒక ఆవు ఉదయం 14 లీ 500 మీ పాలు మరియు సాయంత్రం ఒకటి 13 లీ 750 మి.లీ పాలు ఇస్తుంది. అయినా ఆవు ఒక రోజు లో ఇచ్చే పాల పరిమాణం ఎంత ?

9. రాజు తన కారులో ప్రతి 3 రోజులకు ఒకసారి 5 లీ పెట్రోల్ పోయిస్తాడు. అయినా అతను ఒక నెల లో ఎన్ని పెట్రోల్ పోయిస్తాడు ?

10.  9 లీ.+ 750 మి.లీ + 3 లీ. 250 మి.లీ ___
     A. 13 లీ 750 మి.లీ
     B. 13 లీ. 250 మి.లీ
     C. 13 లీ
      D. 14 లీ. 

11. ఒక నీళ్ళ ట్యాంక్ 9000 లీటర్ల నీటిని తీసుకెళ్తుంది. అది ప్రతి ప్రాంతానికి 1500 లీటర్ల నీటిని సరఫరా చేయాలంటే అన్ని ప్రాంతాలకు సరఫరా చేయగలదు ?

12. ఒక లీటర్ డీజిల్ తో ఒక బస్సు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 55 లీటర్ల డీజిల్ పోసినట్లయితే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ?

13. 18 లీ + 7 లీ. 500 మి.లీ =________మి.లీ

14. 100 మీ లీ రంగు డబ్బా 23 రూపాయలు అయిన. 1000 మి.లీ రంగు డబ్బా వెల ఎంత ?

15. 90 లీ పాలు 1/4 లీ. ప్యాకెట్లు చేయాలనుకుంటే ఎన్ని పాకెట్లు అవుతాయి ?

జవాబులు

1. C
2. B
3. లీటరు పాల ధర. ₹ 20
    20 లీ. ధర = 20×20 = ₹ 400
    750 మి. లీ. పాల ధర = ₹ 30
  20 లీ. 750 మి. లీ ధర = ₹ 430.

4. A
మొత్తం పాలు = 6 లీ
  250 మి.లీ ప్యాకెట్లు = 10 అనుకో నుము.
    250 × 10 = 2500 మి. లీ. 
  500 మేలి ప్యాకెట్లు= 7 అనుకోను
   7×500 = 3500 మి.లీ
    2500+3500 = 6000 = 6 లీ.
కాబట్టి  250 మి.లీ ప్యాకెట్ల సంఖ్య = 10, మరియు 500 మిల్లీ ప్యాకెట్ల సంఖ్య = 7

5. 4 లీ. = ₹ 120 అయిన 
   ఒక లీ. ధర = 120 ÷ 4 = 30 రూపాయలు
   10 లీటర్ల ఖరీదు = 30 × 10 = ₹ 300

6. బంకు లో చెల్లించిన సొమ్ము = ₹ 2250
     1 లీ. డీజిల్  రేటు = 50 
   బస్సు డ్రైవర్ కొన్న డీజే పరిమాణం =
     2250 ÷ 50 = 45 లీ.

7. ఒక కప్పులో పట్టు టి పరిమాణం = 50 మి.లీ
     కప్పుల సంఖ్య = 12
    మొత్తం టి పరిమాణం =
        12 × 50 = 600 మి.లీ

8. ఉదయం ఇచ్చే పాల = 14 లీ. 500 మి.లీ
సాయంత్రం ఇచ్చే పాల  = 13 లీ. 750 మి.లీ
ఒక రోజులో ఇచ్చే పాల = 28 లీ. 250 మి.లీ

9. కారులో ప్రతి 3 రోజులకు ఒకసారి 5 లీ. పెట్రోలు పోయిస్తాడు. 
ఒక నెలలో గల రోజుల సంఖ్య 30.
 రాజు పెట్రోల్ పోయించుకున్న రోజులు =
      30 ÷ 3 = 10రోజులు
      ఒక ఒక రోజుకు 5 లీటర్లు
      10 రోజులకు = 10×5 = 50 లీ.

10. C
           లీ  9.000 మి.లీ
                0.750
                3.250
 మొత్తం=13.000
               13 లీ.

11. నీళ్ళ ట్యాంక్ పరిమాణము = 9000 లీ.
 ప్రతి ప్రాంతానికి సరఫరా చేయు నీటి పరిమాణం = 1500 లీ
 సరఫరా చేయు ప్రాంతాల సంఖ్య =
   9000 ÷ 1500 = 6 ప్రాంతాలు.

12. 1 లీ. కు బస్సు ప్రయాణించు దూరం 
          = 5 కి.మీ
 55 లీటర్లకు బస్సు ప్రయాణించి దూరం = 
           55 ÷ 5 = 11 కి.మీ

13. 18 లీ.                = 18000 మి.లీ
        7 లీ. 500 మి.లీ=    7500 మి.లీ
          మొత్తం =.           25500 మి.లీ

14.     100 మి.లీ = ₹ 23
   1000 లో  10,  100 లు ఉంటాయి.
    కాబట్టి 10×23 = 230 రూపాయలు

15.  1 లీ. లో  1/4 పాకెట్లు 
         4 తయారవుతాయి.
  90 లీ = 90 × 4 = 360 ప్యాకెట్లు.




                         🌾🌾🌾🌾🌾🌾🌾🌾
1. ఒక లారీ 7500 కిలోగ్రాముల బరువు మోయగలదు. ఆ లారీ లో 15 కిలోగ్రాముల బరువున్న కార్టన్లు ఎన్ని మోయగలదు ?
    A.450.      B. 600.    C.350.     D.500

2. ఒక కిలోగ్రాము కు ఎన్ని గ్రాములు ఉంటాయి ?
  A.100     B.1000.      C.10000       D.10

3. ఒక పెట్టెలో 9 కి.గ్రా. 750 గ్రాముల ఆపిల్ పండ్లు ఉన్నాయి. అలాంటివి 14 పెట్టెలు ఉన్న మొత్తం ఆపిల్ పండ్ల బరువు ఎంత ?
   A.135 కి.గ్రా. 500 గ్రా.      B. 136 కి.గ్రా. 500 గ్రా
  C. 138 కి.గ్రా 500 గ్రా.       D. 140 కి.గ్రా. 500 గ్రా

4. ఒక టెక్ 100 క్వింటాల బరువును మోయగలదు. ఆ ట్రక్కులో 4650 కి.గ్రా బరువుగల సామాను నింపబడినది. ఇంకా ఆ ట్రక్కు ఎంత బరువు గల సామాను
మోయగలదు.
   A. 5350 కి.గ్రా.        B. 5430 కి.గ్రా
  C. 5240 కి.గ్రా          D. 5530 కి.గ్రా

5. సంతోషి 4 కి.గ్రా 500 గ్రా జిలేబి, 2 కి.గ్రా 500 గ్రా. మైసూర్ పాకు, 1 కి.గ్రా 750 గ్రా బాదుషా, 750 గ్రా. జామూన్ కొన్నది. సంతోషి కొన్న మొత్తం స్వీట్ ల బరువు ఎంత ?
  A. 7 కి.గ్రా 250 గ్రా                B. 8 కి.గ్రా   250 గ్రా
  C. 9 కి గ్రా 250 గ్రా                 D 10 కి.గ్రా 250 గ్రా

6. ఒక ఆవు రోజుకు 5 కి.గ్రా 250 గ్రాముల దాణా తింటుంది. ఆ ఆవు కు ఏప్రిల్ మాసంలో ఎంత దాని అవసరం అవుతుంది ?

7. క్రింది వానిలో 1/2 వ, భాగం తిప్పిన అదే విధంగా కనిపించే ఆకారం ఏది ?
    A.♣️. B.♠️ C.♥️ D .🔶

8. రాధిక 2 కి.గ్రా 500 గ్రాముల బెల్లం కొన్నది. దానిలోనుండి పాయసం వండడానికి 1 కి.గ్రా 750 గ్రాముల బెల్లం వాడిన మిగిలినది ఎంత ?
    A. 250 గ్రా. B.500 గ్రా. C.750 గ్రా  
    D. 1 కి.గ్రా

9.     7 కీ.గ్రా 350 గ్రా. + 2 కి.గ్రా 650 గ్రా. = _________

10.   6 కి.గ్రా 150 గ్రా - 3 కి.గ్రా 870 గ్రా = ___________

11. ఒక పడవ 200 కి.గ్రా బరువును మోయగలదు. పడవలో కూర్చున్న వ్యక్తుల బరువు 112 కి. గ్రా అయితే ఇంకా ఎంత బరువు పడవ మోయగలదు ?

12. ఒక ఆటో ట్రాలీ 700 కి.గ్రా బరువుగల గ్యాస్ సిలిండర్లను మోస్తున్నది. గ్యాస్ తో నింపి ఉన్న ఒక్కొక్క సిలిండర్ బరువు దాదాపు 35 కి. గ్రా అయినా, అలాంటివి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఆటో లో ఉన్నవి ?

13.    1750 గ్రా. = _____ కి.గ్రా + ______ గ్రా.

14. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475 కి.గ్రా ఉపయోగించారు. ఎన్ని కిలోల బియ్యం వినియోగించకుండా మిగిలి ఉన్నవి ?

15. ఒక మామిడి పండు బరువు 400 గ్రాములు. ఒక జామపండు బరువు 200 గ్రాములు, ఒక కర్బూజ బరువు
 1 కి.గ్రా 200 గ్రాములు. ఈ సమాచారంతో క్రిందనున్న ఖాళీలను పూరించండి.

  1. 5 కర్బూజా పండ్ల బరువు = ___________
  2. ఐదు మామిడి పండ్లు మరియు రెండు జామపండ్ల = _______ కర్బూజ పండ్ల బరువు.
  3. రెండు మామిడిపండ్ల బరువు = _________
    జామ పండ్ల ధరలు

జవాబులు

1. D (500)
2. B (1000 గ్రాములు)
3. B ( 136 కి.గ్రా 500 గ్రా )
4. A. ( 5350 కి.గ్రా )
5. C. ( 9 కి. గ్రా 250 గ్రా )

6. ఆరు ఒక రోజులో తినే దాన 5 కి.గ్రా 250 గ్రా.
    ఏప్రిల్ మాసం లో 30 రోజులు ఉంటాయి
  30 రోజులకు కావలసిన దాన
        5.250 × 30 = 157 కి.గ్రా 500 గ్రా.

7. D
8. C ( 750 గ్రా.)
9. 10 కి.గ్రా
10. 2 కి.గ్రా 280 గ్రా
11. 200 - 112 = 88 కి.గ్రా

12. ఆటో ట్రాలీ మోయగల బరువు 700 కి.గ్రా
 గ్యాస్ సిలిండర్ బరువు = 35 కి.గ్రా
 ర్యాలీ మాయ గల సిలిండర్ల సంఖ్య =
     700 ÷ 35 కి.గ్రా = 20 
13. 1 కి.గ్రా + 750 గ్రా

14. పంపిణీ చేయబడిన బియ్యం = 
  6 క్వింటాళ్లు = 600 కి.గ్రా
ఒక క్వింటాల్ = 100 కిలోలు
  వినియోగించబడిన బియ్యం 475 కి.గ్రా 
  మిగిలి ఉన్న బియ్యం = 
      600 - 475 = 125 కి.గ్రా

15.
   1. 5 కర్బూజా పండ్ల బరువు= 
             5 × 1 కి.గ్రా 200 గ్రా. = 6000 గ్రా.
                       = 6 కి.గ్రా
     
  2. 5 మామిడి పండ్లు మరియు   
              2 జామపండ్లు బరువు 
    5 × 400 + 2 × 200 = 2000+400 = 2400
   కర్బూజాపండు బరువు = 1200 గ్రా.
   2400 ÷ 1200 = 2 కర్బూజ పండ్లు.

   3. రెండు మామిడిపండ్ల బరువు
          = 2×400 = 800 గ్రా.
జామ పండు బరువు = 200 గ్రా
     800 ÷ 200 = 4 జామ పండ్లు


                     ♠️♠️♠️♠️♠️♠️♠️

1. లంబ కోణం విలువ ఎంత ?
2. 180 డిగ్రీలు ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారు ?
3. అల్ప కోణం విలువ ఎంత ఉంటుంది ?
4. గడియారం లో 9 గంటల సమయం చూపిస్తున్నప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుంది.

5. గడియారం లో రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఏ ఏ సమయాల్లో చూపిస్తుంది ?

6. వృత్తం యొక్క కేంద్రం నుండి వృత్త పరిధి పై ఒక బిందువును కలిపే రేఖాఖండం ని ఏమంటారు ?

7. వృత్త పరిధి పై రెండు బిందువులను కలిపే రేఖా ఖండాన్ని ను ఏమంటారు ?

8. వృత్త కేంద్రం గుండా వెళ్లే అతి పెద్ద జ్యా ను ఏమంటారు ?

9. ట్యాన్ గ్రామంలో మొత్తం ఎన్ని ఆకారాలు ఉంటాయి ?
10. టాన్ గ్రామ్ ఆకారాలలో త్రిభుజాల ఎన్ని ఉంటాయి ?
11. ట్యాన్ గ్రామ్ ఆకారాలలో చతురస్రాలు ఎన్ని ఉంటాయి ?

12. మ్యాప్ లో M అనే ఆకారం దేనిని సూచిస్తుంది .
  A. ద్వారము B.గోడ C.కిటికీ D.చెట్టు

13. అద్దంలో చూసినప్పుడు అదే ఆకారంలో కనిపించే అక్షరం ఏది ?
                 B       Q       F       H

14. 👕 ఆకారానికి ఎన్ని సౌష్టవ రేఖలు ఉంటాయి ?
        A.1 B.2 C.3 D.4
       
15. ⏩ ఆకారాన్ని 1/4 వ, భాగం తిప్పితే ఎలా కనిపిస్తుంది ?
      A.⏪ B.⏫ C.⏩ D.⏬
జవాబులు

1. 90°
2. సరళ కోణము
3. 45°
4. 90° ( లంబకోణం)
5. 9:00, 3:00
6. వ్యాసార్థం
7. జ్యా
8. వ్యాసము
9. 7
10. 5
11. 2
12. C కిటికీ
13. H
14. A 1 (నిలువు సౌష్టవ రేఖ ఉంటుంది)
15. D

                        💠💠💠💠💠💠💠

1. ఒక షాపు యజమాని వారం లో అమ్మిన 🚗 వివరాలు
               🚗 = 3
        
       సోమవారం : 🚗🚗
       మంగళవారం: 🚗
       బుదవారం. :. 🚗🚗🚗
      గురువారం : 🚗🚗🚗🚗
      శుక్రవారం :. 🚗🚗🚗
      శనివారం :. 🚗

2. సోమవారం నాడు అమ్మిన కార్లు ఎన్ని ?
3. వారం లో ఏ రోజు ఎక్కువ కార్లు అమ్ముడు అయినాయి ?
4. వారం మొత్తంలో అమ్మిన కార్ల సంఖ్య ఎంత ?

5. పొడవును ఈ క్రింది ప్రమాణాల్లో కొలుస్తారు ?
  A.మీటరు B.సెంటీమీటరు C.కిలోమీటరు D. పైవన్నీ

6. ఒక మీటరు కు_______ సెంటీమీటర్లు.
7. ఒక బ్రిడ్జి కింది నుండి 3 మీటర్ల 50 సెంటీమీటర్ల ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తున వాహనాలు మాత్రమే వెళ్లగలవు. ఈ బ్రిడ్జి కింద నుంచి ఈ క్రింది వానిలో ని ఏ వాహనములు వెళ్లగలవు ?
        A. 400cm B. 365 cm C. 340cm.                  
        D. 455cm

8. మధు ఇల్లు అతని బడి నుండి 3 కి.మీ దూరంలో ఉంది. అతడు 2 కి.మీ ల 350 మీ దూరం సైకిల్ పై వెళ్లి, మిగిలిన దూరం నడిచి వెళ్ళాడు. అతడు నడిచి వెళ్లిన దూరం ఎంత

9. 80 మీటర్ల పొడవు గల గోడ అడుగుభాగం వెంబడి ఉంచడానికి 20cm పొడవుగల ఇటుకలను ఎన్ని వాడాలి ?

10. 7750 మీ.= _______ కి.మీ. ________ మీ. ________ సె.మీ.
    
11. 12 సేం.మీ. 8 మీ.మీ. = ________ మీ.మీ.

12. ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీ 
  3 మీ 10 సెం. మీ బట్టను వాడుతాడు. అలాంటి 4 కోటులను కుట్టడానికి ఎంత బట్ట అవసరం ?

13. క్రింది వానిలో అతి పొడవైన నది ఏది ?
          గోదావరి = 14,65,000 కి.మీ.
                గంగ = 2526 కి.మీ
            యమున = 1400 మీ
            నర్మద =. 13,12,000 మీ

14. సూర్యాపేట నుండి హైదరాబాద్ మధ్య దూరం 162 కి.మీ . క్రింది వాని లో ఈ దూరానికి సమానమైన కొలత ఏది ?
  A. 162000 cm B. 16200 cm
  C. 1620000 cm C. 1620 cm

15. 1/2 కి.మీ = __________ మీ.

16. ఒక వస్త్ర వ్యాపారి 140 మీ పొడవుగల పోచంపల్లి కాటన్ గుడ్డను కొనెను. దాని నుండి 46 మీ 85 సెం. మీ అమ్మిన, ఇంకా మిగిలిన గుడ్డ ఎంత ?

17. నేను షాపుకు వెళ్లి 2 మీ. 50 సెం.మీ బట్టను కుర్తా కొరకు, 3 మీ 75 సెం.మీ బట్టను పైజామా కొరకు కొన్నాను. అయినా నేను కొన్న మొత్తం బట్ట పొడవు ఎంత ?

18. పాఠశాల ప్రధానోపాధ్యాయులు 18 మీటర్ల రిబ్బన్ కొన్నారు. అతను ఒక్కొక్క బాలికకు 25 సెం.మీ పొడవు గల రిబ్బన్ ఇవ్వాలనుకున్న మొత్తం ఎంత మంది బాలికలకు పంచగలరు ?

19. 60 మీ + 55 సెం మీ = _______ సెం మీ
  A. 6055 సెం మీ. B. 6550 సెం మీ
  C. 655 సెం మీ D. 65 సెం మీ

20. పొడవును కొలవడానికి ప్రమాణాలు ఏవి ?
  A. మీటర్లు B.లీటర్లు C.కిలోలు D.రూపాయలు

జవాబులు

2. 6
3. గురువారం
4. 42
5. D పైవన్నీ
6. 100
7. C 340cm
8. మధు ఇల్లు బడి కి మధ్య దూరం 3000 మీటర్లు
మధు సైకిల్ పై వెళ్లిన దూరం 2350 మీటర్లు
  మధు నడిచి వెళ్లిన దూరం = 
     3000-2350 = 650 మీ.
     
9. గోడ పొడవు 80 మీ = 800cm
    ఇటుక పొడవు = 20cm
 కావలసిన ఇటుకలు = 800÷20 = 400.
10. 7 కి.మీ 700 మీ. 50 సెం.మీ

11. 12 cm = 120 మి.మి
        120 + 8 = 128 మి.మి

12. ఒక కోటు కుట్టడానికి బట్ట పొడవు =
       3మీ. 10 సెం. మీ
  4 కోటులకు కావలసిన బట్ట 
     4 × 3 మీ. 10 సెం.మీ = 12 మీ. 40 cm.

13. అన్ని నదుల పొడవులను మీటర్లలోకి మార్చి ఏది పెద్దదో గుర్తించాలి.
    గంగా నది అన్నింటికంటే పొడవైన నది.
      
14. A 162000 cm

15. 1/2 అనగా అర కిలోమీటరు 
         జ: 500 మీ.

16. మొత్తం గుడ్డ = 140 మీ.= 14000 సెం.మీ
     అమ్మినది 46 మీ. 85 సెం. మీ = 4685 cm
  మిగిలిన గుడ్డ = 14000 - 4685 = 9315 cm
     93 మీ. 15 సెం. మీ.

17. 2 మీ 50 సెం.మీ + 3 మీ 75 సెం.మీ
           = 6 మీ 25 సెం.మీ

18. రిబ్బన్ పొడవు = 18 మీ = 1800 సెం మీ
  ఒక్కొక్కరికి ఇవ్వగల రిబ్బన్ పొడవు
    = 1800 ÷ 25 = 72 మంది

19. 655 సెం మీ

20. A మీటర్లు



                           🌻🌻🌻🌻🌻🌻🌻🌻


1. క్రింది సంఖ్యలలో రెండు చే నిశ్శేషంగా భాగించబడిన ఏ సంఖ్య ఏది ?
  A. 23456. B. 35675 C.98743 D. 67549

2. శ్రీవల్లి వ్యవసాయ నిమిత్తం ₹ 97 50 అప్పుగా తీసుకుంది. ఆ తప్పును 6 నెలలలో సమాన భాగాలుగా చెల్లించాలి అయినా ఆమె నెలకు ఎంత చెప్పినా చెల్లించాలి ?

3. ఈ క్రింది సంఖ్యలలో ఏది 3, చే నిశ్శేషంగా భావించబడుతుంది ?
   A. 124 B. 347. C.459 D. 764

4. ఒక కోళ్ల ఫారం లో కోళ్ళు 180 గుడ్లు పెట్టాయి. వీటిని ఒక్కో పాకెట్లో 6 గుడ్ల చొప్పున ప్యాక్ చేయాలంటే ఎన్ని ప్యాకెట్లు చేయాలి .

5. ఒక రోజుకు 8 పేజీల చొప్పున చదివితే, 120 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది.

6. ఒక చోట నుండి ఒక రోజులో 936 ఆపిల్ పండ్లు తెంపినారు. వాటిని సమానంగా 12 పెట్టెలలో ప్యాక్ చేసి మార్కెట్ కు పంపారు. ఒక్కో పెట్టెలో ఎన్ని పనులు ఉన్నాయి

7. 228 అరటి పండ్లు ఎన్ని డజన్లకు సమానము ?

8. ఒక లీటర్ డీజిల్ తో ఒక బస్సు 5 కిలోమీటర్లు నడుస్తుంది. ఆ బస్సు 55 కిలోమీటర్లు నడవడానికి ఎన్ని లీటర్ల డీజిల్ అవసరము.

9. ఒక రేడియో వ్యాపారి 23 రేడియోలు కొని దుకాణదారు నికి ₹ 9000 ఇచ్చాడు. షాపు వాడు 7 రూపాయలు తిరిగి ఇచ్చాడు. అయినా ఒక్కొక్క రేడియో వెల ఎంత ?

10. రెండు సంఖ్యల లబ్దం 77. వాటిలో ఒక సంఖ్య 7, అయినా రెండవ సంఖ్య ఎంత ?

11. ఒక దర్జీ ప్రతి చొక్కాకు 6 గుండీలు కుడుతున్నాడు. అతని వద్ద మొత్తం 84 గుండీలు ఉంటే వాటిని ఎన్ని చొక్కాలకు కుట్టగలడు.

12. 68÷ 6 సమస్యలో భాగాఫలం ఎంత ?

13. ₹ 93 లో ఎన్ని ₹ 10 లో ఉన్నాయి ?

14. నేను 50 కి, 60 కి మధ్య ఉంటాను. నన్ను 7 చే భాగించగా శేషం 1 వచ్చింది అయిన నేనెవరిని ?

15. ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి ?

16. ఒక తోటలో 15 వరుసలలో మొత్తం 105 నిమ్మచెట్లు కలవు. అయినా ఒక్కొక్క వరుసలో ఎన్ని నిమ్మ చెట్లు కలవు.

జవాబులు

1. A (23456 సరి సంఖ్య సంఖ్యలన్నీ రెండు చేయి భాగించబడతాయి కాబట్టి. 23456 రెండు చేత భాగించబడుతుంది)

2. శ్రీవల్లి నెలకు చెల్లించవలసిన సొమ్ము = 
        ₹ 9750÷6 = ₹ 1625
3. ఒక సంఖ్య లోని అంకెల మొత్తం 3 నిశ్శేషంగా భాగించబడిన ట్లయితే, ఆ సంఖ్య 3 నిశ్శేషంగా భావించబడుతుంది.
      జ: C 459= 4+ 5+ 9 = 18. 18 అనే సంఖ్య మూడు చే భావించబడుతుంది. కాబట్టి 459, 3 చే భావించబడుతుంది

4. చేయాల్సిన ప్యాకెట్ల సంఖ్య= 180÷6 = 30
      30 ప్యాకెట్లు చేయాలి.

5. 120 పేజీలు చదువుటకు పట్టు రోజులు 
       = 120÷8 = 15 రోజులు.

6. ఒక్కో పెట్టెలో తట్టు పండ్ల సంఖ్య
       = 936+12= 78

7. 228÷12 = 19 డజన్లు

8. కావలసిన డీజిల్ =
          55÷5 = 5 లీటర్లు.

9. వ్యాపారి దుకాణదారుడు కి ఇచ్చినవి
       ₹ 9000. 
     తిరిగి ఇచ్చినవి ₹ 7
 కాబట్టి రేడియోలో ఖరీదు 9000-7 = 8993
   ఒక్కో రేడియో ఖరీదు = 899÷23
              = 391 రూపాయలు.

10. రెండవ సంఖ్య=
                77÷7 =11
11. దర్జీ కుట్టగల చొక్కాలు 
        84÷6 = 14 చొక్కాలు.

12. భాగించగా వచ్చేది భాగఫలం
    68÷6 = 11 
     భాగఫలం = 11

13. 9 ఉంటాయి.  

14. 57
         57 ను 7 భాగించగా శేషం ఒకటి వస్తుంది.

15. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి.
  వారానికి ఏడు రోజులు ఉంటాయి
   కాబట్టి 365 ÷ 7 = 52 వారాలు.

16. 105 ÷ 15 = 7 వరుసలు.
                                  🌻🌻🌻🌻🌻🌻🌻

1. 5 కేజీల బరువు గల గోధుమపిండి ప్యాకెట్ వెల 125 అయినా 42 కేజీల గోధుమపిండి ప్యాకెట్ వెల ఎంత ?

2. ఒక ఆవు రోజుకు 5 కేజీల 750 గ్రాములు తింటుంది. అయినా ఏప్రిల్ నెలలో ఆ ఆవు కు ఎంత దాన కావాలి ?

3. ఒక ఇంటికి అదే నెలకు ₹ 350 అయిన.రెండు సంవత్సరాలకు కిరాయి ఎంత అవుతుంది ?

4. ఒక సైకిల్ ధర ₹ 3250 రామయ్య, 3 సైకిళ్లు కొన్ని దుకాణదారులకు ₹ 12000 ఇచ్చాడు రామయ్యకు ఇంకా ఎన్ని రూపాయలు తిరిగి వస్తాయి ?

5. ఒక పెట్టెలో 9 కేజీల 750 గ్రాములు, యాపిల్ పండ్లు ఉన్నాయి. అలాంటివి 14 పెట్టెలు ఉన్న మొత్తం ఆపిల్ పండ్లు ఎన్ని కేజీలు ఉంటాయి ?

6. జలజ తన కారులో ప్రతి 3 రోజులకు ఒక సారి, 6 లీటర్ల పెట్రోలు పోస్తుంది. అయినా ఒక నెలలో ఆమె తన కారులో ఎంత పెట్రోలు పోస్తుంది ?

7. హైదరాబాద్ నుండి నల్గొండ కు బస్ చార్జీలు పిల్లలకు ₹ 75 పెద్దలకు ₹ 100 అయిన. నలుగురు పిల్లలు, నలుగురు పెద్దలకు, మొత్తం ఎంత ఛార్జి అవుతుంది ?

8. ఒక తోటలో చెట్లు 148 వరుసలో ఉన్నాయి. ప్రతి వరసకు 65 చెట్లు ఉన్న తోటలోని మొత్తం చెట్ల సంఖ్య ఎంత ?

9. ఒక డబ్బాలో 26 లడ్డూలు చొప్పున 385 డబ్బాలలో ఎన్ని లడ్డూలు ఉంటాయి ?

10. సుధ రోజుకు 189 చొప్పున సంపాదిస్తుంది. జనవరి నెలలో ఆమె సంపాదన ఎంత ?

11. ఒక పెట్టెలో 78 యాపిల్ పండ్లు ఉన్నాయి. ఒక ఆపిల్ పండు ₹ 14 అమ్మిన. యాపిల్ పండ్ల ఖరీదు ఎంత ?

12. ఒక గంటకు ఎన్ని సెకండ్లు ఉంటాయి ?

13. ఒక ఏనుగు ఒక రోజుకు 150 కిలోల ఆహారం తీసుకుంటుంది. అయిన ఒక వారంలో ఎంత ఆహారం అవసరం అవుతుంది ?

14. 125 × ______ = 500

15. ఒక హాస్టల్కు రోజుకు 5 కేజీల కందిపప్పు అవసరం. అయిన ఒక సంవత్సరంలో ఎంత కందిపప్పు అవసరం అవుతుంది ?

జవాబులు

1. ఒక కేజీ పాకెట్ వెల :125÷ 5 = 25
 42 కేజీలకు 42×25 = 1050
     
2. ఏప్రిల్ నెలకు 30 రోజులు ఉంటాయి కాబట్టి,
      30× 5.750 = 172.500 కేజీలు

3. నెలకు ₹ 350.
   ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి.
    రెండు సంవత్సరాలకు 24 నెలలు.
      రెండు సంవత్సరాల కిరాయి= 
        350×24 = 8400 రూపాయలు.

4. మూడు సైకిల్ ధర = 3250×3 = 9750
       దుకాణదారులకు 12000 ఇచ్చాడు కాబట్టి
         12000-9750 = 2250 రూపాయలు తిరిగి వస్తాయి.

5. ఒక పెట్టెలో ఉన్న ఆపిల్ పండ్లు =
   9 కేజీల 750 గ్రాములు
   14 పెట్టెలో ఉన్న ఆపిల్ పండ్లు మొత్తం బరువు = 14× 9.750 = 136.5 కేజీలు.

6. జలజ కారులో, 3 రోజులకు ఒక సారి పెట్రోల్ వస్తుంది కాబట్టి ఒక నెలలో ఆమె 10 సార్లు పెట్రోల్ వస్తుంది.
       10×6 = 60 లీటర్లు.

7. పిల్లలకు ఛార్జి = 4× 75 = 300 
   పెద్దలకు ఛార్జి = 4× 100 = 400
  మొత్తం చార్జి. =. 700 రూ.

8. తోటలోని మొత్తం చెట్ల సంఖ్య = 
           148 ×65 = 9620

9. డబ్బా లోని లడ్డూల సంఖ్య = 26 
డబ్బా ల సంఖ్య = 385 
మొత్తం లడ్డూల సంఖ్య 385 × 26 = 10,010

10. సుధ సంపాదన రోజుకు ₹189.
 జనవరి నెలకు 31 రోజులు ఉంటాయి.
   కాబట్టి జనవరి నెల సంపాదన
      = 31×189 = 5859 రూ.

11. ఒక పెట్టెలో ఆపిల్ పండ్ల సంఖ్య 78.
   ఒక యాపిల్ పండు ₹ 14 .
    మొత్తం ఆపిల్ పండ్ల ధర = 78×14 = 1092

12 . ఒక గంటకు 60 నిమిషాలు.
 ఒక నిమిషానికి 60 సెకండ్లు.
 కాబట్టి ఒక గంటకు = 60×60= 3600 సెకన్లు.

13. ఏనుగు ఒక రోజు తీసుకునే ఆహారం 150 కిలోలు.
 ఒక వారానికి 7 రోజులు ఉంటాయి.
 అయినా ఒక వారంలో అవసరమగు ఆహారం
     = 150×7 = 1050 కిలోలు.

14. 4

15. ఒక రోజుకు కావలసిన కందిపప్పు 5 కి.గ్రా
 ఒక సంవత్సరానికి 365 రోజులు
 మొత్తం కందిపప్పు = 365×5= 1825 కిలోలు.


ఈరోజు ప్రశ్నలు

1. 235+341+_____+ = 999

2. 5346 - ______ = 4111

3. 2011 జనాభా లెక్కల ప్రకారం రాచపల్లి గ్రామంలో 1482 మంది పురుషులు, 1683 మంది స్త్రీలు ఉన్నారు. ఆ గ్రామ జనాభా మొత్తం ఈ క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది ?
   A. 2000 B.3000 C.4000 D.5000

4. ఒక క్రికెట్ మ్యాచ్ లో కపిల్ దేవ్ 148 రవి శాస్త్రి 199 పరుగులు చేశారు. రవిశాస్త్రి ఎన్ని పరుగులు ఎక్కువగా చేశారు ?

5. నాలుగంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్య ను తీసివేసిన ఎంత వస్తుంది ?

6. 1200 రావాలంటే 2380 నుండి ఎంత తీసివేయాలి ?

7. మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్య కు, రెండు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య కు మధ్య గల భేదం ఎంత ?

8. నాలుగు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య నుండి 1 తీసివేసిన వచ్చే జవాబు ఈ క్రింది వానిలో దేనికి సమానము ?
 A. రెండు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య
B. మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య
C. నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య

9. సుధ వద్ద ₹ 75 ఉన్నవి. రాధ వద్ద, సుధ వద్ద ఉన్న వాటికంటే ₹19 తక్కువ ఉన్నవి. రాధ వద్ద ఉన్న రూపాయలు ఎన్ని ?

10. మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య కు, రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య కు భేధమెంత ? 

11. శ్రీధర్ నెలకు ₹9250 లు, అతని భార్య నెలకు ₹ 7650 సంపాదిస్తున్నారు. వారు నెలకు ₹ 12725 లుక్ ఖర్చు చేసినట్లయితే వారు చేసే పొదుపు ఎంత ?

12. ఒక ఎన్నికల లో గెలిచిన వ్యక్తికి 273 ఓట్లు వచ్చాయి. ఓడిన వ్యక్తికి, గెలిచిన వ్యక్తి కంటే 45 ఓట్లు తక్కువ వచ్చాయి. అయిన ఓడిన వ్యక్తి కి వచ్చిన ఓట్లు ఎన్ని ?

13. శ్రేయ పర్సులో ₹ 149 ఉన్నాయి. ఆమె దుకాణదారు కి ₹ 268 చెల్లించాల్సి ఉంది. అయినా శ్రేయకు ఇంకా ఎన్ని రూపాయలు అవసరం ఉంది ?

14. 418 కన్నా 904 ఎంత ఎక్కువ ?

15. సారంపల్లి గ్రామంలో  2695 మంది పురుషులు, 2682 మంది స్త్రీలు ఉన్నారు. ఆ గ్రామ జనాభా మొత్తం ఎంత ?

జవాబులు

1. 423
2. 1235
3. B. 3000
4. 51
5. 9999 - 100 = 9899 
6. 1180
7. 100 - 99 = 1
8. B. మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య
          1000 - 1 = 999

9. 75-19 = 56 రూపాయిలు

10. 999-99 = 100

11. శ్రీధర్ సంపాదన + అతని భార్య సంపాదన
       ఖర్చు= 9250+7650 = 16900
      పొదుపు = 16900-12725 =4175

12. 273-45 = 228

13. 268-149 = 119 రూపాయలు

14. 904-418 = 486

15.  పురుషులు + స్త్రీలు
         2595+2682 = 5277

                       🌟🌟🌟🌟🌟🌟🌟

1. స్థానాలు ఒకట్ల నుండి పది కోట్ల వరకు వరుస క్రమంలో రాయండి .

2. 2,36,384 సంఖ్యలో 6 యొక్క స్తాన విలువ ఎంత ?

3. 9,09,919 సంఖ్యను భారతీయ సంఖ్యామనం లో ఎలా చదువుతావు ?

4. నాలుగు అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని ?

5. ఒక లక్షా ఆరువందల తొమ్మిది సఖ్యను అంకెల్లో రాయండి ?

6. మూడు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు, రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు భేదం ఎంత ?

7.200000 + 600 + 10 + 7 సంక్షిప్త రూపం లో సమానమైన సంఖ్య ఏది ?

8. నేను మూడంకెల సంఖ్య ను నాయొక్క వందల స్థానం లోని అంకె ఒక అంకె సంఖ్యల్లో మిక్కిలి పెద్దది, ఓకట్ల స్థానం లోని అంకె ఒక అంకె సంఖ్యల్లో మిక్కిలి చిన్నది. నా పదుల స్థానంలో 5 ఉన్నచో నేను ఎవరు ?

9. 5678 సంఖ్యలో 5 మరియు 7 యొక్క స్టాన విలువల భేదం ఎంత .

10. ఒక కోటి అనగా __________ లక్షలు

11. సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య _________.

12. 99,999 సంఖ్య తరువాత వచ్చు సంఖ్య ఏది ?

13. 10000 సంఖ్యకు ముందు వచ్చు సంఖ్య ఎంత ?

14. 9999, 99999, 10000, 999 సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది ?

15. 9 99 999 సంఖ్యకు 1 కలిపితే ఎంత అవుతుంది ?

                                ✳️✳️✳️✳️✳️

జవాబులు
1.పది కోట్ల, కోటి, పది లక్షలు, లక్ష, పదివేలు,వేలు,వందలు,పదులు,ఒకట్లు
2. 6 యొక్క స్థాన విలువ = 6000
3.  తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది.
4. నాలుగు అంకెలలో చివరి సంఖ్య 9999.కాబట్టి నాలుగు అంకెల సంఖ్యలు మొత్తం 9999 ఉంటాయి. జ: 9999
5.  100609
6.  999౼99 = 900
7.  200617
8.  950
9.  5000౼70 = 5030
10.  100 లక్షలు
11.  2
12.   100000
13        9999
14.    99999
15.  10,00,000

*************************************************
ఈ క్రింది సమస్యలు సాధించండి.

16. 5, 1, 0, 9 లచే ఏర్పడు మిక్కిలి పెద్ద సంఖ్య ఏది ?

17. 9, 0, 2, 1 అంకెలచే ఏర్పడు మిక్కిలి చిన్న సంఖ్య ఏది.

18. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అక్షరాలలో రాయండి ?

19. నేను నాలుగు అంకెల సంఖ్యను పదుల స్థానం లో 0, వేల స్థానంలో 3, ఒకట్ల స్థానంలో 9, వందల స్తానం లో 7 ఉన్నచో నేనెవరిని ?

20. నా యొక్క ఒకట్ల స్తానం లో 3 ఉన్నది.పదుల స్తానంలోని అంకె ఒకట్ల స్తానం అంకెకు 2 రేట్లు ఉంటుంది. వందల స్తానం లోని అంకె ఒకట్ల స్తానం అంకెకు 3 రెట్లు ఉంటుంది. అయిన నేనెవరిని.

21. 99 సంఖ్యకు 1 కలిపితే ఎంత అవుతుంది.

22. నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది.

23. ఒక మిలియన్ ___________ లక్షలకు సమానం అవుతుంది.

24. 2000 అనే సంఖ్యకు ముందు వచ్చే సంఖ్య ఏది ?

25. 267 మరియు 276 లలో చిన్న సంఖ్య ఏది ?

జవాబులు

16.   9510
17.  1029
18.  ఎనమిది వేల ఎనమిది వందల నలబై ఎనమిది.
19.  3709
20.   ఒకట్ల స్తానం : 3
పదుల స్తానం :2 రెట్లు కాబట్టి : 2×3 = 6
వందల స్తానం : 3 రెట్లు కాబట్టి : 3×3 = 9
             సంఖ్య = 963.
21.  99+1= 100
22.  9999
23.  10,00,000
24.   1999
25.     267.

                                ✳️✳️✳️✳️✳️✳️


1.క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.
10001, 100001, 1001,1111

2. 2336509 సంఖ్యను భారతీయ సంఖ్యామనం ప్రకారం కామాలు ఉంచి రాయండి.
3. 6392,6782, 6784, 6654 సంఖ్య లను అవరోహణ క్రమంలో రాయండి.
4. 3,00,600 సంఖ్యను అక్షరాలలో రాయండి
5. ఐదు అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు,నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు బేధం ఎంత ?

6. 3,4,5 సంఖ్యలచే ఏర్పడు అన్ని సంఖ్యలు రాయండి.
7. 2001, 20011, 20001, 20000 సంఖ్యలను < గుర్తు ఉపయోగించి రాయండి.

8. 49 కి సమానమైన రోమన్ సంఖ్య ఏదీ ?

9. 101 కి సమానమైన రోమన్ సంఖ్య ఏది ?

10. C + LX + IX కు సమానమైన హిందు అరబిక్ సంఖ్య ఏదీ ?

11. CXXV కి సమానమైన హిందు అరబిక్ సంఖ్య ఏది ?
12. 0,4,9 లచే ఏర్పడే మిక్కిలి మూడంకెల పెద్ద సంఖ్య, మిక్కిలి మూడంకెల చిన్న సంఖ్య రాయండి .
13. 10001 సంఖ్యకు ముందు వచ్చే సంఖ్య ఏది ?
14. 32 మరియు 53 మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ?

జవాబులను
1. 1001, 1011, 10001,100001
2. 23,36,509
3. 6784, 6782,6654, 6392.
4. మూడు లక్షల అరువందలు.
5. 10000 - 9999 = 1
6. 345, 354, 435, 453, 543, 534.

7. 2001< 20001< 20011< 200000.

8. XLIX (XL= 40, IX = 9 XLIX = 49)
9. CI ( C= 100, I = 1 Then CI= 101)
10. C = 100, LX =60, IX = 9
         100+60+9=169

11. 125 
12.     పెద్ద సంఖ్య : 940
          చిన్న సంఖ్య : 409
13. 10000
14. 20
                      🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నోట్ : జవాబులు రేపు పోస్ట్ చేయబడుతాయి.
 పోస్ట్ చేయబడుతున్న విషయం (subject) కు  సంబంధించి మీరు సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్ లో చేయవచ్చు.

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION