VENDOR MAPPING IN PFMS ACCOUNT

 

PFMS అకౌంట్లో ప్రతివెండర్ కు ఒక unique code ఉంటుంది.

మీరు ఒక పాఠశాలలో వెండర్ గా యాడ్ చేసుకోగానే మీకు కేటాయించబడిన యూనిక్ కోడును ఒకచోట నమోదు చేసుకోవాలి. ఇది భవిష్యత్తు ట్రాన్సాక్షన్స్ కొరకు ఉపయోగపడుతుంది.



మీకు యూనిక్ కోడ్ తెలియనట్లయితే మీ పాఠశాల operator ( DO )లాగిన్ లో వెండెర్స్ లోకి వెళ్లి చూసినట్లయితే, అందరి వెండర్స్ పేర్లు వారి యొక్క యూనిక్ కోడ్స్ కనిపిస్తాయి.

ఈ కోడ్ ఒక్కొక్క వెండర్ కు ఒక్కో విధంగా ఉంటుంది. ఒక వెండర్ యొక్క కోడ్ మరొక వండర్ తో అసలు మ్యాచ్ కాదు.

మనం ఒక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఆ పాఠశాల యొక్క PFMS ఎకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన పేరు వెండర్ గా add చేసుకుంటాము. 

బదిలీ అయి మరొక పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడి PFMS ఎకౌంట్లో మళ్లీ మన ఎకౌంటును వెండర్ గా add చేయాలని ప్రయత్నం చేసినట్లయితే వెండర్ already exist అని వస్తుంది. అక్కడ యాడ్ అవదు.

ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు already exist అయిన వెండర్ ను మీ కొత్త పాఠశాల పిఎఫ్ ఎంఎస్ అకౌంట్లో Mapping చేయవలసి ఉంటుంది.

Vendor మ్యాపింగ్ చేయడానికి మీరు ఆపరేటర్ లాగిన్ చేయవలసి ఉంటుంది. 

ఆపరేటర్ లాగిన్ లో 


Master ➡️ vender ➡️ manage vendor లోకి వెళ్ళాలి.

స్క్రీన్ పై ఆప్షన్స్ కనిపిస్తాయి. 

ఆప్షన్స్ లో వెండర్ యూనిక్ కోడ్ అని ఒక బాక్స్ ఉంటుంది. 

ఆ బాక్స్ లో మీ యొక్క యూనిక్ కోడ్ టైప్ చేసి సెర్చ్ చేయండి.

సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మీ యొక్క పేరు, అకౌంట్ నెంబరు, బ్యాంక్ వివరాలు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. 

మీ పేరుకు ఎడమవైపు చివరలో ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. 

చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వండి. 

అక్కడే ఉన్న మ్యాపింగ్ అనే ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేయండి. 

మీ పేరు వెంటనే మీ కొత్త పాఠశాలలో PFMS ఎకౌంట్లో వెండర్ గా add అవుతుంది. 

తర్వాత మీరు వెండర్స్ లోకి వెళ్లి మీ పేరు add అయినదా ?లేదా ?  చెక్ చేసుకోవచ్చు.

For Login.     CLICK HERE 




Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION