Socio econamic సర్వే - సూచనలు
Socio econamic సర్వేకు వెళ్తున్న ( గణకులు )
ఎన్యుమరేటర్లకు సూచనలు
1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం. ( Nov: 1 - 3 )
2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.
3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.
4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.
5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి.
5. ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని వారికి తెలియజేయండి.
6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా సులభం అవుతుంది.
7. మీరు వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే పక్కన ఉన్నవారికి తెలియజేసి సర్వే సమాచారం చెప్పమనండి.
మీ ఎన్యుమరేషన్ బ్లాక్ లో అన్ని కుటుంబాలను గుర్తించిన తర్వాత సర్వే ప్రారంభించండి.( Nov: 6 - 18 )
8. సర్వే రోజు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ కుటుంబంలో సరియైన సమాచారాన్ని వివరంగా ఎవరు చెబుతారో వారిని పిలవండి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను తీసుకొని ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా నమోదు చేసుకోండి.
పేరు, వయసు, ఆధార్ సంఖ్య...
9. మొదటిరోజు సర్వేను నిదానంగా చేస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా యజమానిని అడిగి వివరాలు రాసుకోండి.
9. మొదటి రోజు రెండు లేదా మూడు సర్వే పారాలను పెన్సిల్ తో రాసుకోండి. దీనివలన ఏ అంశాలలో తప్పులు జరుగుతున్నాయో మీకు సులభంగా తెలుస్తుంది.
10. ఒక కుటుంబంలో పదిమంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నట్లయితే రెండవ ఫారాన్ని నింపండి. ఉమ్మడి కుటుంబంలో ఫారం నింపేటప్పుడు యజమాని, అతని భార్య పెద్దకొడుకు, అతని భార్య పిల్లలు/ చిన్న కొడుకు అతని భార్య, పిల్లలు వరుస క్రమంలో రాసుకోండి. ఇలా చేస్తే యజమానితో బంధుత్వం మీరు సులభంగా రాయగలుగుతారు. సమయం ఆదా అవుతుంది.
11. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ప్రతీ కాలం లోని వివరాలు అడిగి పూరించాలి.
12. 20వ, కాలంలో వివరాలను నింపినట్లైతే 21,22,23,24 లో సమాచారం నమోదు చేయాలి. 20వ కాలం ఖాళీగా ఉన్నట్లయితే మిగిలిన పూరించవలసిన అవసరం లేదు.
13. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పినట్లయితే ఆదాయపన్ను చెల్లిస్తారు గమనించగలరు. ప్రయివేటు పనులు, వ్యాపారస్తులు కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అడగండి.
14. 43 వ, కాలం a, b, c చాలా ముఖ్యమైన అంశాలు. పెన్షన్, రైతు బంధు, కల్యాణలక్ష్మి, ప్రభుత్వ ఇల్లు, స్కాలర్ షిప్స్, సిఎం సహాయ నిధి, రుణమాఫీ, రైతు భీమా, ఆరోగ్యశ్రీ, గొర్రెల పంపిణీ, చేనేత, దళిత బంధు
15. 46( a) నుండి 46(f) అంశాలు రాజకీయ పరమైనవి, కొంతమందికి మాత్రమే ఉంటాయి గమనించగలరు.
16. 48వ, కాలం వలసకు సంబంధించింది ( ఇతర రాష్ట్రం, ఇతర దేశం )
మీ కుటుంబంలో మీ పిల్లలు ఉన్నత చదువు, ఉద్యోగం, పెళ్లి , వ్యాపారం, కోసం వలస వెళితే వారి వివరాలు, వారు వెళ్లిన దేశం, లేదా రాష్ట్రం వివరాలు. 48(a), 48(b), 48(c), 48(d) రాయాలి.
వలస వెళ్లనట్లయితే ఈ కాలమ్స్ నింపవలసిన అవసరం ఉండదు.
👉 4వ, పేజీ 24 వ అంశం వివరణ:-
అసంఘటిత రంగం అనేది ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని మరియు దాని మార్గదర్శకాలు మరియు నిబంధనలను అనుసరించని వ్యాపారాలతో రూపొందించబడింది. ఈ వ్యాపారాలు సాధారణంగా వ్యవస్థీకృత రంగంలో ఉన్న వాటి కంటే డబ్బు మరియు ఉద్యోగులు వంటి తక్కువ వనరులను కలిగి ఉంటాయి. అవి తక్కువ సామర్థ్యం మరియు ఉత్పాదకతను కలిగి ఉంటాయి.
ఉదా: వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, హోటల్ నిర్వహణ, ఇంటి పని, వ్యవసాయం, తోటలు, మత్స్యకారులు, టాక్సీ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, చిన్న-స్థాయి తయారీ, స్వయం ఉపాధి కార్మికులు.
👉 25 వ, కాలం
కులవృత్తులు
కుమ్మరి, కమ్మరి, కళాలి, వడ్రంగి, కంసాలి, మేదరి, మంగలి, పౌరహిత్యం, చెప్పులు కుట్టడం, కథలు చెప్పడం, గొర్రెల కాపరి, రాళ్ళు కొట్టడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం....
👉 27 వ, అంశం
కులవృత్తుల వలన వచ్చే ఆరోగ్య సమస్యలు.
అవగాహన కొరకు కొన్ని అంశాల వివరణ
వడ్రంగి: చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు
కమ్మరి: చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు
కలాలి: కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, కాలేయ సంబంధిత వ్యాధులు, కాళ్లు చేతులు విరగడం.
పౌరోహిత్యం: గొంతు సంబంధిత వ్యాధులు
గొర్రెల కాపరి: శ్వాస సంబంధిత సమస్యలు
👉 45వ అంశం :డి నోటిఫై చేసిన సంచార జాతులు
ఒక ఊళ్లో స్థిరనివాసం లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లేవారు.
ఉదా: నాటు మందులు అమ్ముకునేవారు
కథలు చెప్పేవారు,
నోట్: పూర్తి సమాచారం కొరకు ఎమ్మార్వో ను సంప్రదించగలరు.
👉 చివరలో యజమానితో సంతకం పెట్టించండి.
ధన్యవాదాలు......
Comments
Post a Comment