పోటీ పరీక్షల ప్రత్యేకం - తెలుగు


గౌరవ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులు & విద్యార్థులకు

ఏప్రిల్ మరియు మే ఈ రెండు నెలలు విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి. పాఠశాల లో  సంవత్సర పరీక్షలు,ఉన్నత చదువుల కోసం జరిగే పోటీ పరీక్షలు చాలా వరకు ఈ రెండు నెలల్లో నిర్వహించడం జరుగుతుంది.

కాబట్టి ఈ రెండు నెలలు మంచి ప్రణాళికతో చదివితే ప్రతి విద్యార్థి తరువాతి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు.

ప్రస్తుత కోవిడ్ పరిస్తితి లో విద్యార్థులు గ్రూప్ గా చదివే అవకాశం మరియు సందేహాలు నివృత్తి చేసుకొనే అవకాశం లేదు.

ఇలాంటి పరిస్తితి లో మీరు మీ ఇంట్లోనే ఉంటూ,పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ మీ సందేహాలు నివృత్తి చేసుకొనే విధంగా 40 రోజుల ప్రణాళికతో మీ ముందుకు వస్తుంది
 "in school activities".

మీ కొరకు ప్రతి సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు పోస్ట్ చేయడం జరుగుతుంది. జవాబులు తరువాత రోజు పోస్ట్ చేయబడుతాయి.మీరు ఈ ప్రశ్నలను ఒక ప్రత్యేకమైన నోట్ బుక్ లో వ్రాసుకొంటూ

గురుకుల, మోడల్ స్కూల్, నవోదయ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.

ప్రతి రోజు మీ కోసం కొత్త ప్రశ్నలు యాడ్ చేయడం జరుగుతుంది.మీరు రోజూ బ్లాగ్ లోని ఈ పేజీ ఓపెన్ చేసి కొత్తగా జోడించబడిన ప్రశ్నలు రాసుకోండి.

మీరు జవాబులు పోస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీకు తెలిసిన జవాబులు ప్రశ్నల సంఖ్య తో పోస్ట్ చేయగలరు.
                                
                       All the best.....

 





New study material

ఈరోజు ప్రశ్నలు......


1. టీచర్ పాఠం చెబుతున్నది. ఈ వాక్యంలో "చెబుతున్నది" పదం ఏ కాలానికి చెందినది ?
  A. వర్తమాన కాలం 
  B. భూతకాలం 
  C. భవిష్యత్తు కాలం
  D. ఏది కాదు
2. బస్సు వచ్చి ఆగగానే అందరూ ఎక్కారు ఈ వాక్యంలో అసమాపక క్రియ.
   A. వచ్చి 
   B. అందరూ 
   C. ఎక్కారు 
   D.. బస్సు
3. రైలు కొరకు అందరూ నిలబడ్డారు. కొరకు అనేది ఏ విభక్తి అవుతుంది.
    A. తృతీయా విభక్తి 
    B. పంచమి విభక్తి 
    C.చతుర్ధీ విభక్తి 
    D. షష్ఠీ విభక్తి
4. రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టెను. ఈ వాక్యంలో కర్మను తెలిపే పదం.
  A. రాముడు 
  B. శివ ధనుస్సు 
  C. ఎక్కుపెట్టి ను 
  D. శివుడు
5. రాజు పామును చూసి భయంతో పరిగెత్తాడు. ఈ వాక్యంలో కర్త ఎవరు.
  A. పాము 
  B. రాజు 
  C.పరిగెత్తాడు
  D. భయంతో
6. నేను ఉగాది కి ఊరు వెళ్తాను. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది.
  A. భూత కాలం 
  B. భవిష్యత్తు కాలం 
  C. వర్తమాన కాలం 
   D. తద్దర్మ కాలం
7. ఈ క్రింది పదాలలో ద్విత్వాక్షరాలు ఉన్న పదం ఏది ?
  A. ఆనంద నిలయం 
  B. చక్రవర్తి 
  C. మొక్కజొన్న 
  D సరళ
8. మా ఇంటి లో బంతి పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ వాక్యంలో విశేషణ పదం ఏది ?
   A. మా ఇల్లు 
   B. బంతి పూలు 
   C. అందంగా
   D. ఉంటాయి

9. బట్టలు అనే పదానికి అర్థం ఏమిటి ?
   A. మంచి నీరు
   B. భోజనం
   C. వస్త్రాలు 
   D. సరుకులు
10. క్రింది పదాలలో భిన్నమైన పదం ఏది ?
    A. పైరు కోయడం 
    B. బంతి కట్టుడు 
    C. కలుపు తీయడం 
    D. ధాన్యం విక్రయం
11. జాలి అనే పదానికి అర్థం ఏమిటి ?
   A. లొల్లి
   B. దయ 
   C. గొడవ 
    D. పౌరుషం
12. తనాబి అనే పదానికి అర్థం ఏమిటి ?
   A. సందుక
   B. బీరువా
   C. తలుపు
   D. కిటికీ
13. "సుతుడు" అనే పదానికి అర్థం ఏమిటి ?
     A. రాజు 
     B. పురోహితుడు 
     C. స్నేహితుడు
     D. కుమారుడు
14. "లగ్గం" అనే పదానికి అర్థం ఏమిటి ?
   A. లఘువు
   B. పెండ్లి 
   C. మేళం 
   D.పెండ్లి పత్రిక
15. ఈ క్రింది పదాలను క్రమంలో ఉంచి రాయండి.
       గిర్ని - వడ్లు - బియ్యం - దుకాణం
   
   A. వడ్లు - బియ్యం - గిర్నీ - దుకాణం
   B. వడ్లు - గిర్ని - బియ్యం- దుకాణం 
   C. దుకాణం - బియ్యం - వడ్లు - గిరిని 
   D. వడ్లు - బియ్యం- దుకాణం - గిర్ని

16. ఉగాది పచ్చడి లో ఉండని పదార్థం ?
  A. ఉప్పు 
  B. చింతపండు 
  C. వేపపువ్వు 
  D. పాలు

17. మార్పు తీర్పు రచించిన కవి పేరు
   A. కవితా లహరి 
   B.మామిండ్ల రామా గౌడ్
   C. రామయ్య 
   D.నారాయణ రెడ్డి

18. అంగడి అనగా
  A. సరుకులు అమ్మే ప్రదేశం 
  B.మేకలు అమ్మే ప్రదేశం
  C. పండ్లు అమ్మే ప్రదేశం
  D. పైవన్నీ
19. కర్షకులు ఏమి చేస్తారు ?
  A. యంత్రాలను బాగు చేస్తారు
  B. కుండలు తయారు చేస్తారు
  C. పంటలు పండిస్తారు
  D. క్షవరం చేస్తారు

20. కోడి బుట్టలో గుడ్డు పెట్టింది. ఈ వాక్యంలో క్రియ పదం ఏది ?
    A. కోడి 
    B. బుట్ట 
    C. పెట్టింది 
    D గుడ్డు
21. క్రింది పదాలలో భిన్నమైన దానిని గుర్తించండి.
   A. రైలు 
   B.బస్సు 
    C. విమానం 
    D. సైకిల్

జవాబులు

1. A
  ( చెబుతున్నది అనగా పని జరుగుతున్నది కావున "వర్తమాన కాలం" అవుతుంది. )
2. A
3. C 
4. B (దేని మీదనైతే పని ప్రయోగింపబడినదో దాన్ని కర్మ అంటారు. ఇక్కడ రాముడు శివధనస్సు ఎక్కుపెట్టి పని చేశాడు. కావున శివధనుస్సు కర్మ అవుతుంది.)
5. B ( పని చేసేవారిని కర్త అంటారు. ఇక్కడ రాము భయం తో పరిగెత్తాడు. కాబట్టి రాము కర్త అవుతాడు. )
6. ఈ వాక్యం జరగబోయే పనిని తెలియజేసినది ఇలాంటి వాక్యాలను భవిష్యత్ కాల వాక్యాలు అంటారు. కాబట్టి జవాబు "భవిష్యత్ కాలం".
7. మొక్క జొన్న.
( ఒక హల్లుతో అదే హల్లు తొత్తుగా వచ్చినట్లయితే అలాంటి అక్షరాలను ద్విత్వ అక్షరాలు అంటారు.
ఇక్కడ మొక్కజొన్న అనే పదంలో క్క,మరియు న్న అక్షరాలు రావడం జరిగినది.
కావున ఇక్కడ జవాబు మొక్కజొన్న అవుతుంది.)
8. అందంగా
 ( నామవాచకం గుణాన్ని తెలిపె పదాలను విశేషణం అంటారు. ఇక్కడ బంతిపువ్వు నామవాచకం అవుతుంది, దాని గుణం "అందంగా" ఉంది )
9. C
10. D ధాన్యం విక్రయం. ( మిగిలిన మూడు పదాలు పైరులో చేసే పనులు )
11. B
12. B
13. D
14. B
15. B
16. D
17. B
18. D
19. C ( కర్షకులు అనగా రైతులు, వీరు పంటలు పండిస్తారు )
20. C ( పనిని తెలియజేసే పదాలను క్రియ అంటారు. ఇక్కడ "పెట్టింది" అనే పదం పనిని తెలియజేస్తుంది. )
21. C ( విమానం భిన్నమైనది. మిగిలిన మూడు రోడ్డుపై వెళ్తాయి విమానం ఆకాశంలో ప్రయాణిస్తుంది )

       🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

1. క్రింది పదాలలో గుణింత పదాన్ని గుర్తించండి
        A. వర్ణమాల B.మొండితనం 
         C. గొప్పతనం D. పడమర
2. పిపీలిక అనగా అర్థం ఏమిటి ?
   A.చీమ  B.దోమ C.బొద్దింక  D.ఈగ

3. క్రింది వానిలో క్రియారహిత వాక్యము ఏది?
  A.పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. 
   B.రామయ్య పొలం దున్నుతున్నాడు.
   C.రామప్ప దేవాలయం చాలా అందమైనది.
   D.సింహం జింక ను వేటాడుచున్నది.

4. నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటారు ?
    A. విదియ నుండి దశమి వరకు
    B. పాడ్యమి నుండి నవమి వరకు
    C. తదియ నుండి ఏకాదశి వరకు
    D.పాడ్యమి నుండి దశమి వరకు

5. ఈ క్రింది వానిలో జరగబోయే పనిని తెలియజేసే వాక్యం ఏది ?
     A. చదివాడు      B.చదువుతూ ఉన్నాడు
      C.చదువుతాడు D. చదివినాడు

6. ఇనుడు అనే పదానికి సమాన అర్థం ఉన్న పదం ఏది ?
   A.గాలి  B మేఘం  C.నీరు  D.సూర్యుడు

7. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు. వాక్యంలో గొప్ప అనే పదం దీనిని తెలియజేస్తుంది ?
       A.నామవాచకం   B.సర్వనామం 
        C.విశేషణం         D.క్రియా

8. క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం ఏది ?
  A. తెలంగాణ     B.తమిళనాడు 
  C కర్ణాటక           D.కేరళ

9. ఇవ్వబడిన పదాలలో సరి అయిన వరుసక్రమాన్ని గుర్తించండి ?
  A. నీరు ఆవిరి మేఘం వర్షం
  B. ఆవిరి  మేఘం నీరు వర్షం
  C.నీరు మేఘం ఆవిరి వర్షం
  D. మేఘం వర్షం ఆవిరి నీరు

10. ఇది పువ్వులపై వాలి మకరందాన్ని పీల్చుకుంటాయి ?
  A.పిచ్చుకలు      B.రామచిలుకలు 
  C.గోరింకలు       D.సీతాకోకచిలుకలు

11. బహుమతి ఈ పదం తో సంబందం ఉన్న పదం ?
  A. చెట్లు.          B. చప్పట్లు
  C. దుప్పట్లు      D. తిట్లు

12. మితభాషి అనగా ఏమిటి ?
 A. ఎక్కువ మాట్లాడేవాడు
  B. అనర్గళంగా మాట్లాడేవాడు 
  C.తక్కువగా మాట్లాడేవాడు
   D.మాటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించే వాడు

13. తాళపత్ర గ్రంధాలు వేటితో తయారు చేసేవారు ?
     A.తాటి ఆకులు.    B. కొబ్బరి ఆకులు 
     C. అరటి ఆకులు.  D. టేకు ఆకులు

14. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ, మంచి పుస్తకం కొనుక్కో. అన్నది ఎవరు ?
   A.వీరేశలింగం పంతులు B.మహాత్మా గాంధీ  
   C. జోహార్ లాల్ నెహ్రూ   D.అంబేద్కర్

15. వరి పంట పండించడం లో మొట్ట మొదట చేసే పని ఏది ?
   A.దుక్కి దున్నడం     B.కోత కోయడం 
   C.నాటు పెట్టడం       D.నారు మడి చేయడం

16. వేయి స్తంభాల గుడి ఏ పట్టణంలో ఉన్నది ?
      A. హైదరాబాద్   B.కరీంనగర్ 
      C.వరంగల్          D.నల్గొండ

17. అచ్చు యంత్రం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు
  A.అలెగ్జాండర్ గ్రహంబెల్  B.జాన్ గూటెన్ బర్గ్
    C. గ్రెగర్ మెండల్                D.ఐన్ స్టీన్

18. బోనం అనే పదానికి అర్థం
   A.భోజనం   B.గుణం  C.దానం   D.వనం

19. దగ్గర అనే పదానికి వ్యతిరేక పదం
       A.వేగం  B.దారి  C.దూరం  D.పరుగు

20. కోళ్లు ఫామ్ లో పెంచుతారు. ఈ వాక్యంలో కోవెలలో దేనిని తెలియజేస్తుంది ?
       A.ఏక వచనం B. బహువచనం 
       C. ద్వి వచనం  D. సహ వచనం

జవాబులు

1. B
2. A
3. C
4. B
5. C
6. D
7. C
8. C
9.  A (నీరు ఆవిరి మేఘం వర్షం)
10. D ( సీతాకోక చిలుకలు)
11. B ( చప్పట్లు)
12. C ( తక్కువగా మాట్లాడేవాడు)
13. A ( తాటి ఆకులు )
14. B ( మహాత్మా గాంధీ)
15. A
16. C ( వరంగల్ )
17. B ( జాన్ గూటెన్ బర్గ్ )
18. A ( భోజనం )
19. C
20. B ( బహువచనం)


                          💐💐💐💐💐💐💐
హనుమంతుడు రాముని యొక్క దూతగా లంక కు వెళ్ళాడు వాక్యంలో నామవాచకం గుర్తించండి.
   A.హనుమంతుడు B.రాముడు C.లంక   
     D . పైవన్నీ

2. గోపి పరిగెత్తుకొని వచ్చి నాయనమ్మను చుట్టేశాడు . ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది ?

3. గుర్రం అనే పదానికి సమానార్థకం ఇచ్చే పదం ఏది ?
  A. గజము B.వానరము C.తురగం D.మర్కటం

4. మంత్రాలకు _________ రాలవు.
  A.నిమ్మకాయలు B. చింతకాయలు C. పనస కాయలు D. మామిడి కాయలు

5. ముగ్గులలో గొబ్బిళ్లు పెడుతారు వాక్యంలో విభక్తి ని గుర్తించండి.
 A. ముగ్గు B.గొబ్బిళ్ళు C.పెడతారు D.లో

6. సందీప్ నాయనమ్మను కథలు చెప్పమని అడిగాడు. వాక్యంలో కర్మ పదాన్ని గుర్తించండి.
 A. సందీప్ B.అడిగాడు C.కథలు 
   D నాయనమ్మ

7. మన ముఖ్యమంత్రి పండితులను శాలువాలతో సత్కరించారు. వాక్యంలో క్రియ పదాన్ని గుర్తించండి.

8. తనువు అనే పదానికి అర్థం ఏమిటి ?
9. గోల్కొండ కోట ఏ పట్టణంలో ఉన్నది.
10. రాజు శ్రీధర్ హైదరాబాద్ పోతున్నారు. ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది ?
11. తెలంగాణ రాష్ట్ర టీవీ ఛానల్ పేరు ఏమిటి ?
      A.సప్తగిరి B.టీ న్యూస్ C.యాదగిరి.   
      D. మాటీవీ

12. కొండగట్టు పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉన్నది ?
  A. సూర్యాపేట B.కరీంనగర్ C.జగిత్యాల
   D. నిజామాబాద్
13. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. అని అన్నది ఎవరు ?

14. ఎండలు ఎక్కువగా ఉండే రుతువు ఏది ?
   A.వర్షరుతువు B.శరదృతువు 
   C.హేమంత ఋతువు D గ్రీష్మ ఋతువు

15. చెట్లు పచ్చపచ్చని చిగుళ్ళతో పరవశాన్ని కలిగించే ఋతువు ఏది ?

జవాబులు

1. D
2. భూతకాలం (పని పూర్తి అయినది కాబట్టి)
3. C తురగం
4. B చింతకాయలు
5. D లో
6. D నాయనమ్మ
7. సత్కరించారు
8. శరీరం
9. హైదరాబాద్
10. వర్తమాన కాలం
11. C యాదగిరి
12. B కరీంనగర్
13. బాలగంగాధర్ తిలక్
14. D, గ్రీష్మ ఋతువు
15. వసంత ఋతువు

                            🌾🌾🌾🌾🌾🌾🌾🌾

1. మన జాతీయ జెండా దేనికి ప్రతిరూపము.
  A.శాంతి B.సహనం C.సత్యం D.పైవన్నీ
2. సరోజినీ నాయుడు ను ఏ జైలులో నిర్బంధించారు ?

3. మన జాతీయ జెండాను రూపొందించినది ఎవరు ?
4. కథల పుస్తకాలు అంటే రవికి ఎంతో ప్రీతి.
వాక్యంలో ప్రీతి అనే పదానికి అర్థం ఏమిటి ?
5. జ్యోత్స్న వంటి దోస్తులు ఉండడం చాలా గర్వంగా ఉంది. వాక్యంలో సంశ్లేష ప్రధాని గుర్తించండి.
  A. జ్యోత్స్న B.దోస్త్ C.గర్వం D.చాలా

6. బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు.
7. ఊరడి అనగా ఏమిటి ?
8. చాకలి ఐలమ్మ ఏ గ్రామంలో జన్మించింది ?
9. పెనిమిటి అనే పదానికి అర్థం ఏమిటి ?
10. భారత ప్రధాన మంత్రిగా పని చేసిన మహిళ ఎవరు ?
11. కృష్ణ మామిడి పండ్లు తిన్నాడు. ఈ వాక్యంలో కర్మ పదాన్ని గుర్తించండి.
    A.కృష్ణ B. మామిడి పండ్లు C.తిన్నాడు

12. చాకలి ఐలమ్మ పట్వారీ ని ఎదురించింది. ఈ వాక్యంలో కర్త ఎవరు ?

13. కయ్యం అనే పదానికి అర్థం ఏమిటి?

14. క్రింది వానిలో పొదుపు చేయవలసినది ఏమిటి ?
  A. నీరు B.విద్యుత్ C.గ్యాస్ D.పైవన్నీ

15. ఒక సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించడాన్ని ఏమంటారు ?

16. అంధకారం అనగా ఏమిటి ?

17. ఈ నిమ్మ పండు చాలా పులుపు గా ఉన్నది. ఈ వాక్యం లో విశేషణ పదాన్ని గుర్తించండి.

జవాబులు

1. D పైవన్నీ
2. ఎరవాడ జైలు
3. పింగళి వెంకయ్య
4. ఇష్టం
5. A జ్యోత్స్న
6. ఆషాడ మాసం
7. ఒడిబియ్యం సమర్పించుట.
8. వరంగల్ జిల్లా కిస్టాపురం
9. భర్త
10. ఇందిరాగాంధీ
11. B. మామిడి పండ్లు ( పనిచేసేవారిని కర్త అంటారు. పని దేని మీద చేయబడుతుందో దానిని కర్మ అంటారు. పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. ఈ వాక్యంలో పని మామిడి పండ్ల మీద జరిగింది)

12. చాకలి ఐలమ్మ
13. పంచాయతీ లేక యుద్ధం
14. D పైవన్నీ
15. పోస్టరు
16. చీకటి
17. పులుపు

                           🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

1. లత నాట్యం చేసింది. ఈ వాక్యంలో క్రియ పదాన్ని గుర్తించండి.
2. ఆహా !ఈ భవనం ఎంత అందంగా ఉన్నది . ఈ వాక్యంలో ఆహా అనే పదాన్ని ఏమంటారు ?
3. తుదకు ఆ కథ సుఖాంతం అయ్యింది వాక్యంలో తుదకు పదానికి అర్థం ఏమిటి ?
4. వాక్యం లో స్వల్ప విరామ చిహ్నాన్ని ఏమంటారు ?
   1.ఫుల్ స్టాప్ 2.కామ 3.ప్రశ్న గుర్తు 4.ఆశ్చర్యార్థకం

5. అమ్మా! నాకు గుర్రం కావాలి. వాక్యం లో ! గుర్తు ను ఏమంటారు ?
         
        పారాగ్రాఫ్ చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
     కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పోతన అను రాక్షసిని పంపించాడు. ఆ రాక్షసి అందమైన గోపిక రూపంతో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బ తీశాడు.

6. అందమైన గోపిక రూపం ధరించినది ఎవరు ?
     1.చిన్ని కృష్ణుడు 2.పూతన 3.కంసుడు

7. పూతనను సంహరించింది ఎవరు ?
    1. కంసుడు 2.గోపిక 3. చిన్ని కృష్ణుడు

8. సంహరించాడు అనే పదానికి అర్థం ఏమిటి ?

9. స్నిగ్ధ జూ కు వెళ్లి సింహాన్ని చూసింది. ఈ వాక్యంలో సంయుక్త పదాన్ని గుర్తించండి.
10. పిన్( PIN ) అనే పదం దేనిని తెలియజేస్తుంది.
11. కరువు లేని తరువు చోట అనే పదాలను వరుస క్రమంలో అమర్చండి.
12. పకపక అనే పదానికి జంట పదాన్ని గుర్తించండి.
13. నేను లేని వేల నేల నేలంతా ఎడారి. ఈ వాక్యంలో నేను ఎవరు ?
14. అయినా జాతర చూసేటందుకు మేమందరం వెళ్ళాం. ఈ వాక్యంలో క్రియ పదం గుర్తించండి.
15. లత అందరి కంటే వేగంగా పరుగెత్తింది. ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి.
16. అంగడి అనే పదానికి అర్థం ఏమిటి ?
17. సంచయిక అనే పదానికి అర్థం ఏమిటి ?
18. చంద్రుడు క్రమంగా పెరుగుతూ ఉండే పక్షాన్ని ఏమంటారు ?
19. చంద్రుడు క్రమంగా తగ్గుతూ ఉండే పక్షాన్ని ఏమంటారు ?
20. తిథులలో మొదటిది ఏది ?

జవాబులు

1. చేసింది
2. అవ్యయం. (ఓహో, ఆహా, ప్రతి, అను పదాలను అవయవాలు అంటారు)
3. చివరకు
4. 2. కామా
5. ఆశ్చర్యార్థక చిహ్నం
6. 2. పూతన
7. 3 చిన్ని కృష్ణుడు
8. చంపాడు
9. స్నిగ్ధ
10. పోస్టల్ ఇండెక్స్ నెంబర్
11. తరువు లేని చోట కరువు.
12. నవ్వడం (పకపక - నవ్వడం)
13. చెట్టు.
14. వెళ్ళాం
15. లత
16. సంత
17. పొదుపు
18. శుక్లపక్షం 
19. కృష్ణ పక్షం
20. పాడ్యమి.

                         🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
       
1. ఆదిత్య రేపు హైదరాబాద్ వెళ్తాడు. ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది ?
2. వేయి స్తంభాల గుడి ఏ పట్టణంలో ఉన్నది ?
3. శ్రీ జోగులాంబ ఆలయం ఎక్కడ ఉన్నది ?
4. కళ్యాణం అనే పదానికి అర్థం ఏమిటి ?
5. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం ఎక్కడ ఉన్నది ?
6. తరువు అనగానేమి ?
7. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉన్నది ?
8. సాలార్ జంగ్ మ్యూజియం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
9. రెబెక్కా శిల్పం ని చెక్కినది ఎవరు ?
10. రాజు బడికి పోతున్నాడు . ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది ?
11. భద్రాచలం మన రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. ఈ వాక్యంలో నామవాచకం ఏది ?
12. 'నమ్రత' అనే పదానికి అర్థం ఏమిటి ?
13. ఎగ్గులు అనగా ఏమిటి ?
14. ఈ క్రింది వానిలో మనకు ఉండకూడనిది ?
   A. శాంతం B.అనుకువ C.సంపద D.క్రోధం

15. పరహిత మే పరమ__________.
   A. ధర్మం B.కోపం C.గర్వం  

16. సజ్జనులు అనగా ఎవరు ?
17. రాజు తిన్న లడ్డు తియ్యగా ఉన్నది ఈ వాక్యంలో విశేషణ పదం ఏది?
  A. రాజు B. లడ్డు. C. తియ్యగా. D. తినడం

18. తింటే గారెలు తినాలి, వింటే ______ వినాలి
19. కవిత్రయం అని ఎవరిని అంటారు ?
20. తెలుగు సంవత్సరాలలో మొదటిది ఏది ?
21. ప్రస్తుత తెలుగు సంవత్సరం ఎన్నవది ?
22. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని ?
23. తెలుగు సంవత్సరాలలో చివరిది ఏది ?


జవాబులు
1. భవిష్యత్ కాలము
2. వరంగల్
3. అలంపురం
4. పెళ్లి, వివాహం
5. యాదగిరిగుట్ట
6. చెట్టు, వృక్షం
7. బాసర
8. 1951
9. G B బెన్ జోలి
10. వర్తమాన కాలం (పని జరుగుతోంది కాబట్టి)
11. భద్రాచలం
12. వినయం
13. నిందలు, తిట్లు.
14. D. క్రోధం
15. A. ధర్మం.
16. మంచివారు
17. C తియ్యగా
18. భారతం
19. నన్నయ, తిక్కన, ఎర్రన.
20. ప్రభవ
21. 35వ, (ప్లవ)
22. 60
23. అక్షయ.

                              🌟🌟🌟🌟🌟🌟🌟

1. కుక్క విశ్వాసం గల జంతువు. ఈ వాక్యంలో విశేషణ పదాన్ని గుర్తించండి.
2. రైతులు హలాలతో పొలాలు దున్నారు వాక్యంలో హలం యొక్క అర్థం ఏమిటి ?
3. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని._____ అందమైన నగరం.
4. దేశమును ప్రేమించుమన్నా.... గేయ రచయిత ఎవరు ?
5. తెలంగాణ రాష్ట్ర రాజ ముద్ర లో ఏఏ చిహ్నాలు ఉంటాయి.
6. చార్మినార్ దేనికి చిహ్నం ?
7. సుమిత్ర పాఠశాలకు వెళ్ళింది. ఈ వాక్యము ఏ కాలాన్ని తెలియజేస్తుంది ?
8. నిండు మనసుతో సమాజసేవ చేసే వారికి గౌరవ ప్రతిష్ఠలు దాసోహం అంటాయి. అని అన్నది ఎవరు ?
9. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఈ వాక్యంలో క్రియ పదాన్ని రాయండి.
10. క్రింది వారిలో ప్రముఖ ఒగ్గు కళాకారుడు ఎవరు ?
11. సేద్యం అనే పదానికి అర్థం ఏమిటి ?
12. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు ____________ వత్తురది యెట్లన్నన్

13. తన దుఖమే తనకు_____________.
14. హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు. హేమం పదానికి అర్థం ఏమిటి ?
15. గోదావరి నది జన్మస్థానం ఏది ?
16. గోదావరి నది కి మరొక పేరు ఏమిటి ?
17. భారత దేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉన్నది ?
18. పోచంపాడు వద్ద గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి ?
19. ధర్మపురి క్షేత్రంలో గల దైవం పేరు ఏమిటి ?
20. గాధా సప్తశతి అనే గ్రంథం రాసింది ఎవరు
21. గాధా సప్తశతి అనే గ్రంథం ఏ భాషలో రాయబడింది
22. ఇండియా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ?
23. గాధా సప్తశతి గ్రంధంలో మొత్తం ఎన్ని కథలు ఉన్నాయి?
24. రామగుండం లో ఏ రకమైన విద్యుత్ తయారవుతుంది ?
25. గోదావరి నది ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ?
26. పుష్కరం అనగా ఎన్ని సంవత్సరాలు ?

జవాబులు 
1. విశ్వాసం
2. నాగలి
3. అది
4. గురజాడ అప్పారావు
5. కాకతీయ కళాతోరణం, చార్మినార్, మూడు సింహాల గుర్తు
6. తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి
7. పని పూర్తి అయినది కాబట్టి "భూతకాలం".
8. మున్షి ప్రేమ్ చంద్
9. ఆడుతున్నారు
10. మిద్దె రాములు
11. వ్యవసాయం
12. బంధువులు
13. నరకము
14. బంగారం
15. మహారాష్ట్రలోని నాసిక్
16. దక్షిణ గంగ
17. బాసర 
18. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
19. నరసింహ స్వామి
20. హాలుడు
21. ప్రాకృత భాషలో
22. మొగస్తనీస్
23. 700
24. థర్మల్ విద్యుత్
25. అంతర్వేది
26. 12 సంవత్సరాలు

                 🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶


ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మన జాతీయ పక్షి పేరు ఏమిటి ? 

2. చార్మినార్ ఏ పట్టణంలో ఉన్నది ?

3. వేములవాడ లో గల దైవము పేరేమిటి ?

4. శిల్పం అనే పదానికి బహువచనం ఏమిటి ? 

5.సిరులు అనగా అర్థం ఏమి ?
 
6.తెలంగాణలో ప్రవహించే అతి పెద్ద నది ఏది ? 

7.పోతన పుట్టిన ఊరు పేరు ఏమిటి ?
 
8.రుద్రమ్మ పరిపాలించిన రాజ్యం ఏది ? 

9. తెలంగాణలో అతిపెద్ద చర్చి ఏ పట్టణంలో ఉన్నది ?

10. పరమానందయ్య శిష్యులు ఎందరు ?

11. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ ?

12. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏదీ ?

13. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది ?

14.తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది ?

15.తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది ?

16. వర్షం దీని వల్ల కురుస్తుంది?
17. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైన పండుగలు ఎవి?

18. జెండాలు అనే పదానికి ఏకవచనం ఏమిటి?

19. భారత కోకిల అని ఎవరిని అంటారు?

20. మన జాతీయ పతాకం ను ఎవరు రూపొందించారు.

21. శత జయంతి అనగా ఎన్ని సంవత్సరాలు?

జవాబులు
1.నెమలి
2. హైదరాబాద్
3. రాజరాజేశ్వరుడు
4. శిల్పాలు
5. సంపదలు
6. గోదావరి
7. బమ్మెర
8. కాకతీయ రాజ్యం
9.మెదక్
10. 12 మంది
11. 2-జూన్ , 2014
12.జింక
13. పాలపిట్ట
14. తంగేడు పువ్వు
15. జమ్మి చెట్టు
16. మేఘం
17. దసరా, బతుకమ్మ
18. జెండా
19. యుద్ధం
20. సరోజినినాయుడు
21. పింగళి వెంకయ్య
22. 100 సంవత్సరాలు
                           
                                  🔅🔅🔅🔅🔅🔅

నోట్: ఈ ప్రశ్నలకు జవాబులు రేపు పోస్ట్ చేయబడుతాయి.మీకు జవాబులు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మీ జవాబులు పోస్ట్ చేయండి.

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

SMC 2024 ELECTION

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం