అర్ధ వేతన సెలవు నిబంధనలు

 అర్థవేతను సెలవు నిబంధనలు

ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules లో 13,18,23 నందు పొందుపరచారు.

సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సంవత్సరానికి  20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.

 సంవత్సరం నకు కొన్ని రోజులు తక్కువైనను ( సంవత్సరం పూర్తి కాకుంటే) ఈ సెలవు జామచేయకూడదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)



ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీసు క్రింద పరిగణిస్తారు.

అర్జిత (Earned Leave) సెలవు మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1.వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate) -

( 100%)

2.స్వంత వ్యవహారాలపై (Private Affairs) ( 50% - జీతం)


 ఈ కారణాలతో అర్థవేతన సెలవు మంజూరు చేయించుకోవచ్చు 

👉  ఉద్యోగి అనారోగ్య చికిత్స కోసం ( 100% pay)

👉 అర్ధ వేతనం ఈ క్రింది కారణాలతో

ఉద్యోగి కుటుంబ సభ్యులచికిత్స కోసం 

ఉద్యోగి ఉన్నత విద్య కోసం

ఉద్యోగి పిల్లలు ఉన్నత విద్య కోసం

ఉద్యోగి పిల్లల రక్షణ కోసం

ఇతర వ్యక్తిగత కారాణాలు)


  సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును

ఇంక్రిమెంట్లు, సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.


👉 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు. సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. 

     సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

(G.O.Ms.No.186 Dt:23-07-1975)

ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

👉 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం, డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)


(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)


అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA, CCA లు చెల్లించబడవు.

క్యాన్సర్, మానసిక జబ్బులు, కుష్టు, క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.

ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి. కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుట గాని, లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.


నోట్: అర్థవేతనపు సెలవులు ఎక్కువగా వైద్య పరమైన కారణాలతో మాత్రమే వాడుకోవాలి. పూర్తి వేతనం లభిస్తుంది.

వ్యక్తిగత కారణాలతో వాడుకున్నట్లయితే అర్ధ వేతనం మాత్రమే లభిస్తుంది. 

కాబట్టి 240 రోజులు పూర్తి వేతనంతో వాడుకున్న తర్వాత మాత్రమే, అవసరమైనచో మిగిలిన సెలవులను అర్థవేతనంతో వాడుకోవాలి.


Leave letter & DDO Proceedings model

CLICK HERE 

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION