సందేహం - సమాధానం - 1

 ఈ పేజీలో మన ఉపాధ్యాయుల సర్వీస్ కు సంబందించిన సందేహాలకు సమాధానం దొరుకుతుంది.

ఈ సమాధానాలు వివిధ ఉపాధ్యాయ పత్రికల నుండి సేకరించబడినవి.



సందేహం--సమాధానం

ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. ఆగస్టు నెలలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.నాకు కొత్త PRC ప్రకారం బెనిఫిట్స్ వస్తాయా??పూర్తి పెన్షన్ వస్తుందా??

జవాబు:
పూర్తి పెన్షన్ రాదు.వాస్తవంగా 11వ PRC ,2018 జులై నుంచి అమల్లోకి రావాలి.ఐతే నోషనల్, మానిటరి బెనిఫిట్స్ ఎప్పటి నుంచి ఉంటాయో ఇప్పుడే చెప్పలేము.


ప్రశ్న:
మెడికల్ సెలవు కోసం డాక్టర్ సెర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సెర్టిఫికెట్ ఒకే డాక్టర్ వద్ద తేవాలా??
జవాబు:
ఒకే డాక్టర్ వద్ద అవసరం లేదు. రెండూ వేర్వేరు డాక్టర్ల దగ్గర తేవచ్చు.


ప్రశ్న:

నా తలిదండ్రులకి వైట్ కార్డు ఉంది.పొరపాటున EHS లో నమోదు చేశాను. ఇపుడు తొలగించాలి అంటే నేను ఏమి చేయాలి??

జవాబు:
ఈhf పోర్టల్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.లేదా సంబంధిత ddo ను సంప్రదించాలి.


ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

జవాబు:

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.

సందేహం
సర్వీసు పెన్షను పొందడానికి ఎన్ని సంవత్సరాల మినిమము సర్వీసు చేయాలి?

జవాబు
✍️(i) కనీసం 10 సంవత్సరాలు సర్వీసు చేయాలి.*
✍️(ii) అంటే 5 సంవత్సరాల సర్వీసు + 5 సంవత్సరాల వెయిటేజీ అన్న మాట.
✍️(iii) లేకపోతే సర్వీసు గ్రాట్యూటీ చెల్లిస్తారు.*


సందేహం
పెన్షను ఎప్పుడు రద్దు అవుతుంది?
జవాబు
✍️(i) ఒక సంవత్సరం వరకు పెన్షను తీసుకోకుంటే దానిని Un drawn Pension గా భావించి, కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
✍️(ii) మూడు సంవత్సరాల వరకు పెన్షను డ్రా చేయకపోతే అట్టి పెన్షను రద్దు అవుతుంది.*
SR87(a) - T.R. 16


సందేహం
నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

జవాబు:
✍️పెన్షన్ ను ఆదాయం గా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.


సందేహం
✍️నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీలు వేయలేదు. ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

జవాబు:
✍️సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చ.


సందేహం
✍️నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??

జవాబు:
✍️జీఓ, 127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న:

నేను sgt ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా?

జవాబు:

✍️మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.*

ప్రశ్న:

📝ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి?*

జవాబు:

✍️ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.

సందేహం

   నేను LFL HM గా పనిచేయుచున్నాను.6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను.12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి.నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.*

సమాధానం

మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ,బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి.మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.


ప్రశ్న:

వేసవి సెలవులలో ఎంఇఓ కార్యాలయంలో సర్వీసు రిజిష్టర్, బిల్లులు చేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు వస్తుందా?*

జవాబు:

బిల్లులు,ఎస్ఆర్ ల బాధ్యత ఉపాధ్యాయులది కాదు. కాని వేసవి సెలవులలో మీ ఎంఈవో  ఆ విధమైన డ్యూటీ చేయమని ఉత్తర్వులు ఇస్తే జీవో 35; తేదీ. 16.01.1981 ప్రకారం మీకు సంపాదిత సెలవు జమచేయవలసి ఉంటుంది.


ప్రశ్న:

హైస్కూల్ ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తే హెచ్ఎం అలవెన్స్ ఇస్తారా?

జవాబు:

ఎఫ్ఆర్ 49 ప్రకారం ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా 15 రోజులు అంతకన్నా ఎక్కువ కాలం పనిచేస్తే ఎఫ్ఏసి అలవెన్స్ మంజూరు చేయబడుతుంది.


ప్రశ్న:

ఒకే డీఎస్సీకి చెందిన A, B అను ఇరువురు ఉపాధ్యాయులలో A అను ఉపాధ్యాయుడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పదోన్నతి రిలింక్విష్ చేశారు,Bపదోన్నతి స్వీకరించారు.  తదుపరి A   పదోన్నతి పొందారు.B ఉపాధ్యాయుడు A ఉపాధ్యాయుడితో స్టెప్ అప్ పొందవచ్చునా?

జవాబు:

అవకాశం లేదు.  సీనియర్ అయిన ఉపాధ్యాయుడు ప్రస్తుత కేడర్ లో మరియు ఫీడర్ కేడర్ లో రెండింటిలోను సీనియర్ అయివుండాలి.


ప్రశ్న:

ఏ.పీ.జి.ఎల్.ఐ  పెంపుదలకు ఏ సర్టిఫికెట్లు జతచేయాలి. ఎంత వరకు పెంపుదల చేసుకోవచ్చు.*

జవాబు:

మూలవేతనంలో 20% వరకు పెంపుదల చేసుకోవచ్చు. మీ మూలవేతనం ప్రకారం చెల్లించవలసిన మొత్తం చెల్లించేటట్లయితే ఎలాంటి సర్టిఫికెట్లు జతపరచనవసరం లేదు.అంతకుమించి పెంచుకొనేటట్లయితే "గుడ్ హెల్త్ సర్టిఫికెట్" జతచేయవలసి వుంటుంది.

ప్రశ్న:  20 సంవత్సరాల Qualifying Service చేసిన తరువాత రిటైర్ కావాలంటే పాటించవలసిన నిబంధనలు తెలపండి?

జవాబు

(1) ఏ రోజు రిటైర్ కావాలనుకున్నారో దానికంటే 3 నెలల ముందు నోటీసు / అప్లికేషన్ ఇవ్వాలి.

(2) రూలు 8,9,10 లోబడి మంజూరు చేస్తారు.

(3) 20 సంవత్సరాలు లెక్కించడానికి E.O.L on any Purpose,E.O.L for Prosecuting higher studies మినహాయించాలి.

(4) సంబంధిత అధికారి నోటీసు పీరియడ్ ముగియక ముందే అతని విన్నపాన్ని ఆమోదించామని లేక తిరస్కరించామని తెలపాలి.
.
(5) ఈ విధంగా రిటైర్మెంటు ఆమోదం పొందిన వారికి 5 సంవత్సరాలకు మించకుండా సర్వీసు వెయిటేజీ కలుపుతారు.

(6) వీరికి తిరిగి Rule 29 ప్రకారం ఇచ్చే వెయిటేజీ వర్తించదు. రూలు 43 (1) నుండి (7) వరకు.

ప్రశ్న:  కారుణ్య నియామకం గురించి కొంత సమాచారం

జవాబు: భార్య భర్త ఇద్దరూ ఉద్యోగులైనపుడు అందులో ఎవరో ఒక్కరు చనిపోయినచో అట్టి ఉద్యోగం వారి పిల్లలకు వర్తించదు. కానీ ఒక్కరు రిటైర్డ్ అయిన పిదప సర్వీస్ లో ఉన్న ఒక్కరు చనిపోయినచో వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అర్హత ఉంటుంది.

TESTS REQUIRED FOR PROMOTIONS
ప్రశ్న: పదోన్నతి పొందడానికి ఏ ఏ పరీక్షలు పాస్ కావాలి ?
జవాబు:
ఎ) ప్రస్తుతం అమలులోనున్న నియామకాల ప్రకారము సెకెండరీ గ్రేడ్ టీచర్లు , యస్.ఎ.గా పదోన్నతి పొందుటకు BA,BEd/B.SC , B.Ed. ఉన్నచాలు అర్హతలు ఎక్కువగా ఉన్నచో అర్హతలను బట్టి వేరువేరుగా పోస్టులకు పదోన్నతికై అవకాశం కలదు. PS(LFL)HM పదోన్నతికి కేవలం SGT సర్వీసు సీనీయర్టీ మాత్రమే చూస్తారు.  మిగతాపరీక్షలు Pass కావలసిన అవసరం లేదు .  LFL HM పదోన్నతికి Inter + TTC వారు అర్హులు .

స్కూల్ ఆసిస్టెంట్ (పండిట్ గ్రేడ్-1, పీడిలతో సహా) మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, MEO/High School HM ప్రమోషన్ కొరకు గ్రాడ్యుయేషన్ + బి ఈడీ అకడమిక్ అర్హతలతో పాటు ఈ క్రింది శాఖాపరమైన పరీక్షలు కూడా ఉత్తీర్ణత పొందాలి.

1) Departmental test for Gazetted Officers of Education Dept. Paper I & II (88&97)

2) Accounts test for Executive Officers (Paper Code : 141)

3) Special Language test for the officers of the Education Dept.in Telugu (Highter Standard) 37.

4) Special Language test for the officers of the Education Dept. in Hindi / Urdu of Lower Standard

పదవ తరగతి లేదా ఆపైస్థాయిలో హిందీ / ఉర్దూ ఒక భాషగా చదివినవారు  Special Language test for the officers of the Education Dept. in Hindi / Urdu of Lower Standard  ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

  ఇంటర్మీడియట్ లేదా ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదివినవారు  Special Language test for the officers of the Education Dept.in Telugu (Highter Standard) Paper Code :37  పరీక్ష ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

G.O.No.29 మరియు 30 విద్య, తేది: 23.6.2010 ప్రకారం SSC/HSC/MPHSC తో పాటు 5/4/3 సం॥ల చదువుల పూర్తి చేసి, బీ ఈడీ పండిట్ ట్రైనింగ్, BPED అర్హతలు పొందియుండాలి.

   సర్వీసులో ఒక ప్రమోషన్ కూడా 'తీసుకొననివారు 45సం|॥ల వయసు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న కేటగిరి నుండి పై కేటగిరికి (AAS ) ప్రమోషన్కు  పై నాలుగు శాఖాపరమైన పరీక్షలు పాస్ కానవసరం లేదు.

EHS సందేహాలు - సమాధానాలు

ప్రశ్న 1 : ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
సమాధానం : ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.

2.ప్రశ్న : తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
సమాధానం : తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.

3.ప్రశ్న : ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
సమాధానం : కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.

4.ప్రశ్న : సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
సమాధానం : అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.

5.ప్రశ్న : దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
సమాధానం : అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.

6.ప్రశ్న : నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
సమాధానం : కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

7.ప్రశ్న : భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
సమాధానం : అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.

8.ప్రశ్న : ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?

సమాధానం : కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.

9.ప్రశ్న : నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?
సమాధానం : అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.

10.ప్రశ్న : 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి వుంటుంది?
సమాధానం : ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్‌ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్‌ చేస్తుంది.

11.ప్రశ్న : నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయటం ఎలా?
సమాధానం : హోమ్‌ పేజీలో సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత 'ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌' పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ జెనరేట్‌ చేసిన పాస్‌వర్డ్‌ దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరుకు, ఇ మెయిల్‌ ఐడికి అందుతుంది.

12.ప్రశ్న : కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?
సమాధానం : పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్‌ జెఇఓ (ఇహెచ్‌ఎస్‌) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్‌ వివరాలను ఎడిట్‌ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్‌ చేయటానికి కుదరదు.

13.ప్రశ్న : పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్‌ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?
సమాధానం : అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.telangana.gov.in పోర్టల్‌లో యూజర్‌ ఐడి, పేరు, అసలు మొబైల్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.

14.ప్రశ్న : ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్‌ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి లేదా పాస్‌వర్డ్‌' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?
సమాధానం : ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఏదీ వుండదు. రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్‌ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ "nAI0xQk7" ” (కేస్‌ సెన్సిటివ్‌) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్‌ చేయాలి.

15.ప్రశ్న : పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?
సమాధానం : రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్‌ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.

16.ప్రశ్న : ఆధార్‌ కార్డులో వున్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్‌ చేయాలి?
సమాధానం : సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరు వ్రాయండి.

17.ప్రశ్న : పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?
సమాధానం : పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.

18.ప్రశ్న : లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?
సమాధానం : దరఖాస్తుదారు రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్‌ పంపటం జరుగుతుంది.
ఎ. దరఖాస్తుదారు పాస్‌వర్డ్‌ మారుస్తున్నప్పుడు
బి. దరఖాస్తుదారు ''ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు
సి. పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు
డి. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు

Income Tax పైన కొన్ని సందేహాలు-సమాధానాలు

ప్రశ్న: ప్రతీ నెల నా జీతం నుండి IT ని మా DDO గారు cut చేయిస్తున్నారు. చాలా సంత్సరాల నుండి ఇలాగే చేస్తున్నాం.నేను టాక్స్ కట్టినట్లా కాదా?

సమాధానం: కాదు మీరు కట్టిన వేల రూపాయలు tax వృధా అవుతుంది. ఎందుకనగా మీ DDO గారు నీ పేరు మీదుగా cut చేసిన Tax వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.(Tan అనేది ఒకరకంగా జీరో Account లాంటిదే) అక్కడే టాక్స్ జమ అయి ఉంటుంది .కానీ ప్రభుత్వం నకు నీ పేరు మీదుగా చేరకుండా Unknown గా ఉంటుంది.

ప్రశ్న: నేను కట్టిన టాక్స్ నా పేరు మీదుగా ప్రభుత్వం నకు చేరాలంటే ఏమి చేయాలి ?

జబాబు:ముందుగా మీ DDO గారి ద్వారా మీరు కట్టిన tax ను chalan no తొ పాటుగా నీ యెక్క PAN account లొ జమ చేయించుకోవాలి.దీన్నే TDS అంటారు. TDS process అయితేనే నీ PAN అకౌంట్లో నీవు కట్టిన టాక్స్ జమ అవుతుంది.

ప్రశ్న: TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా ?

జవాబు: కాదు. మీరు ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది. చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చు కు వెనుకడుగు వేసి. వేల రూపాయల పన్ను ను చేతుల్లో నుండి జారవిడుచు కుంటున్నాం .పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు. ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.


మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని .సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే మీరు ప్రభుత్వం దృష్టి లో పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.


ప్రశ్న:

OD తర్వాత CL పెట్టవచ్చా?

జవాబు:

మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.

  

ప్రశ్న:

మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్ అవకాశం ఉందా ?


జవాబు:

RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.



ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా  ?


జవాబు:బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 90 మాత్రమే వాడుకోవాలి.


ప్రశ్న:GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా ?


జవాబు:ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.

:

ప్రశ్న: ఫీజు రీ-అంబర్సుమెంట్ ఎప్పుడైనా డ్రా చేయవచ్చా?

జవాబు:మూడు సంవత్సరాలు లోపు బిల్ పెట్టి డ్రా చేసుకోవాలి.ఇద్దరు పిల్లలు కి చెరో 2500 ఇస్తారు.


ప్రశ్న:సర్.నా GPF లో ప్రస్తుతం 6 లక్షలు కలవు.నేను కొత్త గృహం నిర్మిస్తున్నాను.నేను నా అకౌంట్ నుండి ఎన్ని లక్షలు partfinal పొందవచ్చు.. దానికి కావలిసిన పత్రాలు తెలుపగలరు ?


జవాబు15 ఇయర్స్ సర్వీస్ కలిగి ఉండవలెను.

ఇంజినీర్ estimation కాపీ.

గృహ అనుమతి పత్రం..

DDO sanction proceeding, employee అకౌంట్ attested కాపీ.

మీకు ఉన్న 6 లక్షల నుండి 75% partfinal అనగా 4.5 లక్షలు ఇస్తారు..

వీటిని తిరిగి చెల్లింపు చేయను అక్కర్లేదు


టి ఎస్ జి ఎల్ ఐ సమాచారం.

ప్రశ్న: పాలసీ బాండ్ పోతే ఏంచేయాలి.?


ఒకవేళ పాలసీ బాండ్ పోతే ఒక నెలలో రూపాయలు ఐదు అదనంగా ప్రీమియం మినహాయించి ఆ షెడ్యూల్ ను జతపరిచి TSGLI జిల్లా కార్యాలయంలో ఇచ్చి నూతన బాండు పొందవచ్చును.


ప్రశ్న: రిటైరైన వారు పాలసీ సొమ్ము పొందుట ఎలా ?

జవాబు: Form - 1 లో దరఖాస్తును నింపి ఒరిజనల్ పాలసీ బాండో జిల్లా భీమాకార్యాలయమునకు పంపుకోవాలి. (రాజీనామా,డిస్మిస్ స్వచ్చంద పదవీ విరమణ సందర్భాలలో కూడా ఇదే ఫార్ములా పూర్తిచేసి ఇదే విధముగా పాలసీ సొమ్మును పొందవచ్చును)


శాశ్వత వైకల్య ప్రయోజనం:

  సర్వీసులో ఉండగా శాశ్వత వైకల్యం పొందితే గరిష్టంగా రూపాయలు 30 వరకు నెలసరి ప్రీమియంలు మినహాయింపు పొందవచ్చు.


వైకల్య వివరాలు:

1.తిరిగి పొందలేని విధంగా రెండు కళ్ళ దృష్టి పోవడం.


 2.మడమల వద్ద కానీ, వాటిపైన గాని పాదాలు తొలగించడం.


3.మణికట్టు వద్ద కానీ లేదా వాటి పైన కానీ చేతులు తొలగించబడడం.


4.మడమ వద్ద కాని,పైన కాని పాదం తొలగించడం మరియు మణికట్టు వద్ద కానీ దానికి పైన కానీ ఒక చేయి తొలగించబడడం


పై శాశ్వత వైకల్యాల సంభవించిన వెంటనే అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి 90 రోజుల లోపు వైద్యాధికారి సర్టిఫికెట్ పంపించాలి.


ప్రశ్న: ఈ నెలలో మెటర్నిటీ లీవ్ పెట్టిన ఉపాధ్యాయురాలి ఇంక్రిమెంట్ ఈ నెల లో ఉంటే incre. మంజూరు చేస్తారా?

  ససమాధానం :Increment date తర్వాత leave పెడితే sanction చేయొచ్చు. Leave starting date, increment date కంటే ముందు ఉంటే, leave పూర్తి అయిన తర్వాతనే sanction చేస్తారు.


ఏ రోజున తప్పక రిటైర్ కావాలి ?


జవాబు: పుట్టిన తేది ఆ నెలలో ఒకటవ తేదీ కాకుండా ఉన్నవారికి 58/60 అయిన నెలలో చివరి రోజున రిటైర్ కావాలి.


ఉదా: - పుట్టిన తేది 2-1-1954 అయితే 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు అయితే రిటైర్మెంట్ 31-1-2012 అవుతుంది. పుట్టిన తేది ఒకటవ తేదీ అయితే పుట్టిన నెలకంటే ముందు నెల చివరి రోజున రిటైర్ కావాలి.


ఉదా:- పుట్టిన తేది 1-1-1954 అయితే 58 సంవత్సరాల రిటైర్ మెంటు వయసు అయితే రిటైర్మెంటు 31-12-2011 అవుతుంది.


రూలు -42 Executive Instruction (i) GO.Ms.No. 289, Fin.&Plg. Dept., dt.4-11-1974


ఉద్యోగి బ్రతికి వుండగా ఎటువంటి నామినేషన్ సమర్పించకుండా మరణిస్తే ఏం చేయాలి ?


పెన్షన్ మంజూరు అధికారి, అతని చివర తెలిపిన చిరునామాకు ఉత్తరం వ్రాసి అతని వారసులకు తగిన పత్రాలు సమర్పించాలని తెలపాలి. అంతే కాకుండా వాటిని ఎలా నింపాలి ఎలా సమర్పించాలి అని కూడా తెలియజేయాలి.

 

రూలు 47 Executive Instructions (1)

GM.No. 04645407656/PSC-1/82/Fin& Plg.(FW.PSC) Dept., dt.2-12-198


మరణించిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుంటే (Legally Married) ఫ్యామిలీ పెన్షన్ ఎలా చెల్లిస్తారు ?

1) ఫ్యామిలీ పెన్షన్ సమాన వాటాలుగా ఇద్దరికీ చెల్లించాలి. 

2) ఒకవేళ ఒక భార్య చనిపోయినా/ తిరిగి పెళ్ళి చేసుకొన్నా, ఆమె వాటా ఆమె ద్వారా జన్మించిన పిల్లలకు చెల్లించాలి...

3) పిల్లలు లేకపోతే ఆమె వాటా రద్దు చేస్తారు.  

4) చనిపోయిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుండి, అందులో ఒకరు ముందుగానే మరణిస్తే, ఆమె ద్వారా కలిగిన పిల్లలకు ఆమె బ్రతికి వుంటే ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ వాటా చెల్లించాల

రూలు 50 (6) (ఎ) (i)(ii)


బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి  ?

 

ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి

ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?


జవాబు:

వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.*

*(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

ప్రశ్న: సర్వీసు పెన్షను పొందడానికి ఎన్ని సంవత్సరాల మినిమము సర్వీసు చేయాలి?

జవాబు: (i) కనీసం 10 సంవత్సరాలు సర్వీసు చేయాలి.
(ii) అంటే 5 సంవత్సరాల సర్వీసు + 5 సంవత్సరాల వెయిటేజీ అన్న మాట.
(iii) లేకపోతే సర్వీసు గ్రాట్యూటీ చెల్లిస్తారు.

ప్రశ్న: పెన్షను ఎప్పుడు రద్దు అవుతుంది?

జవాబు: (i) ఒక సంవత్సరం వరకు పెన్షను తీసుకోకుంటే దానిని Un drawn Pension గా భావించి, కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
(ii) మూడు సంవత్సరాల వరకు పెన్షను డ్రా చేయకపోతే అట్టి పెన్షను రద్దు అవుతుంది.
SR87(a) - T.R. 16

ప్రశ్న: సర్వీసు అంటే ఏమిటి?

డ్యూటీలో ఉన్న కాలాన్ని, అన్ని రకముల సెలవులు, అసాధారణ (Extraordinary leave) సెలవుతో సహా సర్వీసు క్రింద పరిగణించబడుతుంది.

డ్యూటీలో ఉన్న కాలాన్ని పరిగణనలోనికి తీసుకొని ఆర్జిత సెలవు
(Earned leave) లెక్కిస్తారు. (Rule 4A)

ii సర్వీసులో పూర్తి కాబడిన సంవత్సరాల ఆధారంగా అర్థజీతం సెలవు
(Half pay leave) లెక్కిస్తారు. [Rule 13 (a) & 18(a)]

ప్రశ్న:  వేతనం (Pay) అనగా ఏమిటి ?

జవాబు: సర్వ సాధారణంగా ఉద్యోగికి ప్రతినెల వచ్చేటటువంటి జీతభత్యములను అన్నిటిని కలిపి పే (Pay) అని అంటూ వుంటాము (Rule 4 (d) (1)]. సెలవులో వెళ్ళుటకు ముందు స్థిరమైన జీతం ఇతర భత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా సెలవు జీతం ఇవ్వవలసియుంటుంది (Rule 4 (d) (1)].

ప్రశ్న: సర్వీసులో Interruption అంతరాయము వుంటే, పెన్షన్ కు అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?

జ|| సర్వీసులో అంతరాయము కలిగిన కాలాన్ని పెన్షనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో పరిగణిస్తారు.

(1) గైర్హాజరు కాలానికి సెలవు మంజూరు చేసినప్పుడు

(2) సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు

(3) జాయినింగ్ టైము వినియోగించినప్పుడు

(4) పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు

(5) పెన్షను మంజూరు అధికారి వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు
రూలు 27 (ఎ) నుండి (ఎఫ్) (2)

ప్రశ్న: నా భార్య CPS ఉద్యోగి.ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి ?

జవాబు: CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

ప్రశ్న: నేను జీత నష్టపు సెలవు పెట్టి Higher Education పూర్తి   చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??

జవాబు: జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. మూడు సంవత్సరాలు దాటిన (EOL) జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

సందేహం:ఒక ST ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వోదోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుని కి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉంటుందా?

సమాధానం:అర్హత ఉంటుంది. తాత లేక తండ్రి ఉద్యోగస్థులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులైనప్పటికి వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Rc.No.860/Ser.4-3/2018 తేది: 12.01.2018 ద్వారా వివరణ ఇచ్చారు.

సందేహం:ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సంధర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా?సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు?

సమాధానం:సస్పెండైన ఉద్యోగి క్రమశిక్షణా చర్యలు పూర్తికాకుండానే చనిపోయిన సంధర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించి అతనికి రావాలసిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో.275,F&P,తేది:8-8-1977 ద్వారా సూచించింది.

సందేహము: చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు  పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?

సమాధానము:G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.

సందేహము:చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
సమాధానము:చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.

సందేహము: చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?

సమాధానము:వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.

సందేహము:మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?

సమాధానము:చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా  Other than casual,spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.

సందేహము:సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?

సమాధానము: అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును.

సందేహము: భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?

సమాధానము:వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో Women Employees అని ఉన్నది.

సందేహము:చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?

సమాధానము:అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.

సందేహము:పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా ?

సమాధానము:GO.209 point.3 లో  ఇలా ఉన్నది "Children needs like examinations, sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.

సందేహము:చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్  వర్తిస్తాయా ?

సమాధానము:వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును

సందేహం: అక్టోబర్ 31న పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయునికి నవంబర్ 1న వార్షిక ఇంక్రిమెంటు మరియు 18 సం౹౹ ఇంక్రిమెంటు రెండు ఉన్నాయి. రెండు ఇంక్రిమెంట్లు పొందడానికి వీలవుతుందా?

సమాధానం:వీలు కాదు.రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 మరియు G.O.Ms.No.235 తేది: 27.10.1998 ప్రకారం పదవీ విరమణ పొందిన మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంటు ఉన్నచో ఆ ఇంక్రిమెంట్ ను నోషనల్ గా పరిగణిస్తూ పెన్షన్ కు లెక్కిస్తారు. నవంబర్ 1న ఇంక్రిమెంటు ను నోషనల్ గా మంజూరుచేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపాలి. కాని AAS (18 సం౹౹ ఇంక్రిమెంటు) ను మాత్రం పదవీ విరమణ అనంతరం పరిగణలోకి తీసుకోరు కావున పెన్షన్ కు లెక్కించరు.

సందేహం:నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు?

సమాధానం:మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి
FR-82 లోని సబ్ రూల్.6 ప్రకారం వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కన్నా  తక్కువ ఉన్నప్పుడు మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి 30 సంపాదిత సెలవులు (24+6) జమచేయబడతాయి
*సందేహం--సమాధానం*

ప్రశ్న:జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా?

జవాబు:సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రశ్న:స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు?

జవాబు:జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వులలోని పేరా 7  ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది

ప్రశ్న:ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం?

జవాబు:ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.
7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd)

ప్రశ్న:ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?

జవాబు:ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును

ప్రశ్న:HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా?

జవాబు:కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు

ప్రశ్న:ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?
జవాబు:కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)

ప్రశ్న:నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?

జవాబు:ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.

ప్రశ్న:పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి ?

జవాబు:తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి
వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.

ప్రశ్న:ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం  ఎన్ని  పిరియడ్లు బోధించాలి?

జవాబు:కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )

ప్రశ్న: LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?

జవాబు:డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత  అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.
ప్రశ్న:ప్రభుత్వ /మండల/జడ్పి   స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?

జవాబు:ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును

ప్రశ్న:ఫైవారు 24 సం|ల స్నేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?

జవాబు:HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి.

ప్రశ్న:నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?
జవాబు:అవును. .

ప్రశ్న: ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి  ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి

జవాబు:పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి
ప్రశ్న :సరెండర్ లీవు ఎస్ క్యాష్ మెంటు కోసం ఇంటరీమ్ రిలీఫ్, అదనపు అర్హతలకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయా లేదా?

జవాబు :Memo No. 64861/797/FR.I/71 -1, Dt. 14.07.72 GO.Ms.No.25, F&P, Dt.05.02.96) ప్రకారం సరెండర్ లీవు ఎన్ క్యాష్ మెంటు కోసం అదనపు అర్హతలకు/ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొన్నందుకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. అయితే Memo No.31948/398/PCI/98-1,Fin, Dt.12.08.98 ŏ0 ఇంటరీమ్ రిలీఫ్, మాత్రం రాదు

ప్రశ్న:జీత నష్టపు సెలవు వాడుకొన్నప్పుడు ఆ కాలానికి అర్ధ వేతన సెలవులు జమ అవుతాయా?

జవాబు:అవును. A.P Leave Rules: Rule 13 (a)లో క్రింది విధంగా ఉన్నది “The half pay leave in respect of the period spent on duty and on leave including extraordinary leave.

ప్రశ్న:PAT ఉత్తీర్ణత లేని ఒక SGT ఉపాధ్యాయుడు 12 సంవత్సరాల స్కేలు తీసుకున్నాడు. 18సంవత్సరాల స్కేలు కోసం అర్హత లేదని అభ్యంతరం పెడుతూ ఉన్నారు

జవాబు:18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే ప్రత్యేకంగా స్కేలు అంటూ ఏమీ లేదు. అందుచేత ఆ స్కేలు కోసం ప్రత్యేకంగా ఉత్తీర్ణత పొందాల్సిన అర్హతలు కూడా ఏమీ లేవు.

ప్రశ్న :ఒక SGT ఉపాధ్యాయుడు 2010 లో 8 సంవత్సరాల స్కేలు తీసుకుని తిరిగి 6/12/18/24 స్కీము రావడం తో 2008 నుండి 6 సంవత్సరాల స్కేలుచేసుకొని అరియర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది తప్పు అంటున్నారు. సరియేనా?

జవాబు:6//18/24 స్కీము, GO.Ms.No.96 Finance (Pay Com mission - II) Dept తేదీ : 20,05, 2011 ద్వారా 1-2 2010 నుండి అమలైనది. కాబట్టి అంతకుముందు తేదీ నుండి 6 సంవత్సరాల స్కేలు తీసుకోవడం తప్పు, మీరు 1-2-2010లో 8 సంవత్సరాల స్కేలు తీసుకున్నారు కనక అది అలాగే ఉంచి అదనంగా తీసుకొన్న మొత్తము రికవరీ కట్టడం మంచిది. అయితే మీకు 12 సంవత్సరాల స్కేలు యథావిధిగా 12 సంవత్సరాల పూర్తి చెయ్యిగానే వస్తుంది

ప్రశ్న :ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి.?

జవాబు :సర్వీస్ మొత్తం 240 రోలు కమ్యుటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గింపు చేయబడతాయి తదుపరి కూడా సెలవు అవసరమైతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే ఖాతాలో నిల్వయున్నంత వరకు వాడుకోవచ్చు.
 

దేహం: నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు?

సమాధానం: మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.
FR-82 లోని సబ్ రూల్.6 ప్రకారం వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కన్నా  తక్కువ ఉన్నప్పుడు మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి 30 సంపాదిత సెలవులు (24+6) జమచేయబడతాయి.

 సందేహం:ఒక ST ఉపాధ్యాయుని అన్న ప్రభుత్వోదోగిగా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుని కి ఇన్ సర్వీసులో ఉన్నత చదువులు చదవడానికి ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉంటుందా?

 సమాధానం:అర్హత ఉంటుంది. తాత లేక తండ్రి ఉద్యోగస్థులైతే అర్హత ఉండదు. కానీ వారు ఉద్యోగులు కాకపోయినట్లయితే ప్రస్తుత తరంలో ఎంతమంది అన్నదమ్ములు ఉద్యోగులైనప్పటికి వారందరికీ ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ పొందే అర్హత ఉంటుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Rc.No.860/Ser.4-3/2018 తేది: 12.01.2018 ద్వారా వివరణ ఇచ్చారు.

సందేహం:ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటూ అనారోగ్య కారణాలతో చనిపోయిన సంధర్భంలో అతని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వవచ్చునా?సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణిస్తారు?

సమాధానం:సస్పెండైన ఉద్యోగి క్రమశిక్షణా చర్యలు పూర్తికాకుండానే చనిపోయిన సంధర్భంలో అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వవచ్చు.సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించి అతనికి రావాలసిన జీతభత్యాలు అతని వారసులకు చెల్లించాలని ప్రభుత్వం జీవో.275,F&P,తేది:8-8-1977 ద్వారా సూచించింది.

1)Aసందేహం:A) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?

B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న భద్రాద్రి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.                       


2) సందేహం: ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?

సమాధానం:ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.

SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.
SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.
పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.     
                 
3)సందేహం:ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

సమాధానం:వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.

(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)
                      
4)  సందేహం:దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

సమాధానం: FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.

                        
5) : సందేహం:ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?

సమాధానం:ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.                       

6) సందేహం: మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

సమాధానం:రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు.  సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది. విజయ్ ఏ కె                      

7): సందేహం:ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

సమాధానం:అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి........

ప్రశ్న:నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి?

జవాబు:జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేయించి, DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించాలి. స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయంచాలి

ప్రశ్న:నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా?

జవాబు:ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి, కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న:ఒక డీజేబుల్డ్ ఉద్యోగికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?
జవాబు:జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న:ఒక ఉద్యోగి ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?

జవాబు:ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

ప్రశ్న:బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా ?

జవాబు:Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

సందేహం: స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?

జవాబు:ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.

ప్రశ్న: నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?
జవాబు:వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.

ప్రశ్న:కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా ఉపాధ్యాయురాలు ఆ సెలవులను 6 నెలలలోపు వినియోగించుకోవచ్చునా? ఉద్యోగియైన భర్తకు కూడా సెలవులు మంజూరు చేస్తారా ?

సమాధానం:G.O.MS.No.1415 తేది: 10-6-1968 ననుసరించి శస్త్రచికిత్స జరిగిన రోజు నుండి మహిళా ఉపాధ్యాయులకు 14 రోజులు, పురుష ఉపాధ్యాయులకు 6 రోజులు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తారు. భార్య ఆపరేషన్ చేయించుకున్నచో ఉద్యోగియైన భర్తకు ఆమె సహాయార్థం 7 రోజులు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తారు (G.O.Ms.No. 802 M&H తేది: 21-4-1972)

ప్రశ్న:స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో 12 సం. స్కేలు తీసుకున్న ఉపాధ్యాయుడి GIS ఎంత మినహాయించాలి ? ఎప్పటి నుండి మినహాయించాలి.?

సమాధానం: G.O.Ms.No. 151 Fin. తేది : 16-10-2015 ప్రకారం 12 సం. స్కూల్ అసిస్టెంట్ స్కేలు అనగా ప్రధానోపాధ్యాయుల స్కేల్ ఆఫ్ పే (35120 -110850) కు చేరుకున్నందున GIS లో Group 'A' గా పరిగణించి రూ.120 మినహాయించాలి. మినహాయింపు మరుసటి నెలనుండి ప్రారంభించాలి.

ప్రశ్న:స్కూల్ అసిస్టెంట్ ఒక యస్.జి.టి. ఉర్దూ మీడియం (సర్వీసులో జూనియర్) మరొక యస్.జి.టి. తెలుగు మీడియం (సర్వీసులో సీనియర్) ఇరువురు ఒకే స్కూల్ అసిస్టెంట్ పోస్టులోనికి ప్రమోషన్ పొందారు. ప్రస్తుతం ఉర్దూ నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు ఎక్కువ వేతనం తీసుకుంటున్నాడు. యస్.జి.టి. కేడర్ లో సీనియర్ అయిన ఉపాధ్యాయుడు ఆ జూనియర్  తో stepup చేసుకోవచ్చునా?

సమాధానం: అవకాశం లేదు. G.O.MS.No. 93 Fin. తేది : 3-4-2010
లోని పేరా 3(3) ప్రకారం క్రింది కేడర్లో సీనియర్, జూనియర్లు ఇరువురు ఒకే Unit of Appointment కు చెంది ఉండాలి

ప్రశ్న: రిటైరైన ఉపాధ్యాయునికి అర్థజీతపు సెలవు అకౌంట్లో ఉన్న అన్నిటికి నగదు చెల్లిస్తారా ? కమ్యుటేషన్ చేసుకుని పూర్తి దినాలకు నగదు చేసుకోవచ్చునా ?

Samadhanam: చెల్లించరు. 300 లోనుంచి రిటైరైనపుడు నిలువలో ఉన్న EL'S ను తీసువేసి మిగిలిన వాటికి మాత్రమే (అకౌంట్ లో నిలువ ఉంటే) నగదు చేసుకోవడానికి అనుమతినిస్తారు కమ్యుటేషన్ చేసుకునేందుకు అవకాశం లేదు. నగదు చేసుకోవడానికి అర్హత గల దినాలకు ఆర్థవేతనం అప్పటి DA చెల్లిస్తారు.

శ్న:నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా?

జవాబు:ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి, కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న:ఒక డీజేబుల్డ్ ఉద్యోగికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?

జవాబు:జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న:ఒక ఉద్యోగి ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?

జవాబు:ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

ప్రశ్న:బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా?

జవాబు:Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

ప్రశ్న:నేను సెకండరీ గ్రేడ్ టీచర్‌గా 30-03-1998 లో నియామకం అయ్యాను. ఇప్పటి వరకు నాకు సర్వీసు రెగ్యులరైజేషన్ కాలేదు. రెగ్యులర్ స్కేల్ వచ్చిన తరువాత ఎన్ని సంవత్సరములకు సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయించుకోవాలి. ?చేయించుకోలేకపోతే ఏమౌతుంది?

 సమాధానం:రెగ్యులరైజేషన్ అనేది సర్వీసులో చేరిన తేదీ నుండి చేయబడాలి. సర్వీసులో చేసిన మొదటి రెండేళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ గా లెక్కిస్తారు. ఆ కాలంలో పై అధికారులు అతడి సేవలు సంతృప్తికరంగా లేవనుకుంటే ఆ ప్రొబేషనరీ కాలాన్ని మరొక ఏడాది పొడిగించవచ్చు. అప్పటికి అతడి సేవలు సంతృప్తికరంగా లేకపోతే సర్వీసు నుండి తొలగిస్తారు. ఎటువంటి ఉత్తర్వులు లేకపోతే 3 ఏండ్లు సర్వీసు పూర్తి అయితే ఎప్రూవ్డ్ ప్రొబేషనర్ గా పరిగణించ బడతారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి సర్వీసు రెగ్యులరైజేషన్ తప్పనిసరి. అందుచే మూడేండ్ల లోపు సర్వీసు రెగ్యులరైజేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి.*

ప్రశ్న:నేను కారుణ్య నియామకం ద్వారా తేదీ.05-09-2002 న రెగ్యులర్ టీచర్‌గా చేరితిని. నేను అపాయింట్ మెంట్ నుండి రెగ్యులర్ స్కేల్ తీసుకుంటున్నాను‌. నేను 2002 DSC వారి కంటే సీనియర్ నా? కాదా?

సమాధానం:జీ.వో.ఎం.ఎస్.నెం.221, విద్య, తేదీ 16-07-1994 మేరకు అప్రెంటీస్ సర్వీసు కూడా ప్రొబేషన్ కు లెక్కించెదరు. అందుచేత 2002 DSC లో ఎంపికైన వారికంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్ కాదు. Rule 19: The apprenticeship shall count for Probation.

పాఠశాల నిర్వహణ-కొన్ని ముఖ్య విషయాలు:
A.E.R Rule-46(A):
ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.

A.E.R-46(B):
అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.

A.E.R Rule 42(C):
ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.
A.E.R.-46(J):
పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.

A.E.R-45:
ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.

A.E.R-35:విద్యార్ధుల హాజరును, ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.
A.E.R Rule123(B):
ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.
A.E.R-33:
ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.
Rc.No.527/E2/97,Dt:16-07-1997:

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.

A.E.R Rule 77:
ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి.

A.E.R Rule 99:
విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి T.C పై ప్రవేశము కోరు విద్యార్థులు వారు చేరే జిల్లా విద్యాశాఖాధికారి గారి కౌంటర్ సిగ్నిచర్ విధిగా ఉండవలెను.

A.E.R Rule 124(A):
అడ్మిషన్ రిజిస్టరుకు ప్రతి పేజీకి నెంబరు తప్పనిసరిగా వేయాలి. సీరియల్ నెంబరును చిన్న స్కూళ్లకు 5 సంవత్సరముల కు ఒకసారి, పెద్ద స్కూళ్లకు 3 సంవత్సరములకు ఒకసారి సంఖ్య పెద్దదై అసౌకర్యముగా ఉంటే మార్చుకోవాలి.

ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ లోకల్,నాన్ లోకల్ నిర్ణయించు విధానం:

స్కూల్ స్టడీ 7 సంవత్సరములలో ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే దానినిబట్టి లోకల్,నాన్ లోకల్ నిర్ణయిస్తారు.
ఒక వ్యక్తి 10వ తరగతి వరకు వేరే జిల్లాలో చదివితే అతను సొంత జిల్లాలో నాన్ లోకల్ గా పరిగణించబడతారు

ఎక్కడా చదవకుండా ప్రయివేటుగా పరీక్ష వ్రాస్తే ఎక్కడ నివాస సర్టిఫికెట్ చూపిస్తే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.

2 లేదా 3 జిల్లాల్లో చదివితే 7 సంవత్సరాలలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉంటే అదే లోకల్ అవుతుంది.

రెండు జిల్లాలోనూ సమానంగా 3+3 ఉంటే చివరి 3 సంవత్సరాలు చదివిన జిల్లాయే లోకల్ అవుతుంది.
ప్రశ్న:భర్త చనిపోయినందు వలన కారుణ్య నియామకం పొందిన ఉద్యోగిని జీతంతోపాటు కుటుంబ పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఆమె పునర్వివాహం చేసుకుంటే ఉద్యోగంలో కొనసాగుతూ పెన్షన్ తీసుకోవచ్చునా ?
సమాధానం:ఉద్యోగంలో కొనసాగవచ్చును. అయితే ఆమె కుటుంబ పెన్షన్ కు అర్హురాలు కాదు. అర్హత గలిగిన పిల్లలంటే వారికి వస్తుంది.On death or remarriage of widow, her share of family pension shall become payable to her eligible child.* (G.O.Ms.No.188,Fin. Plg. Dt: 22-8-98) (6(II)of Rule 50 of A.P.Revised Pension Rules 1980)

ప్రశ్న:నేను టీచర్‌గా పనిచేయుచున్నాను. ఆ కేడర్ లో నేను ఇప్పుడు ప్రొబెషనర్ ను. ఇండియన్ నావీలో ఉద్యోగం వచ్చే అవకాశం కలదు. నేను ఎవరిని సంప్రదించాలి ?

సమాధానం:మీరు'లీన్'పై 5 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగం చేసే అవకాశం యున్నది. మీ జిల్లా అధికారిని సంప్రదించవలెను.

ప్రశ్న:పెన్షనర్ కోర్టు ద్వారా జైలు శిక్ష పడినచో అతని పెన్షన్ పాక్షికంగా, పూర్తిగా రద్దు చేయుటకు ఏ నిబంధన ప్రకారం గవర్నమెంట్ అధికారం కలదు ?

సమాధానం:రూల్.9. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ 1980 మేరకు ప్రభుత్వానికి పెన్షన్ నిలిపివేయడానికి గాని ఉపసంహరించడానికి గాని అధికారం కలదు. దానిపై అప్పీల్ చేయడానికి జీ.వో.ఎం.ఎస్.నెం.53, ఎఫ్ అండ్ పి తేదీ.12.4.99 అవకాశం కల్పించబడినది. జీ.వో.ఎం.ఎస్.నెం. 664, ఫైనాన్స్ తేదీ.7.10.04 లో ఇదే రూల్ కు మరొక ప్రొవిజన్ చేర్చబడినది.
Misappropriation, bigamy, bribary, corruption moral tirputed, forgery, out rage of modesty of women, misconduct. కారణంగా శిక్షలు పడే ఉద్యోగస్తులకు పెన్షన్ పాక్షికంగా, లేదా పూర్తిగా గాని నిలుపుచేయు అధికారం కల్పించబడినది.

సందేహం:సర్, నేను 24 yr service పూర్తి చేసుకున్నాను. డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ అయినాను. ప్రమోషన్ ఇస్తే నాకు తప్పకుండా SA గా ప్రమోషన్ వస్తుంది. నేను ప్రమోషన్ కు ముందు 24 ఇయర్స్ ఇంక్రిమెంట్ తీసుకోవడం మంచిదా లేక స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ తీసుకోవడం మంచిది తెలియజేయగలరు.

జవాబు: మీరు 24 సం. స్కేల్ తీసుకొంటే SA post lo FR22B వర్తించదు. అనగా మీకు promotion కు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది మరల SA cader lo 6years scale రాదు. మీరు 24Years scale తీసుకోకుండా ఉంటే ప్రమోషన్ fixation lo FR22B వర్తిస్తుంది. అంటే promotion date na ఒక ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ date na notional ga oka incriment మరియు AGI incriment వస్తుంది. SA cader lo 6 years Incriment వస్తుంది.

పెన్షనర్ కోర్టు ద్వారా జైలు శిక్ష పడినచో అతని పెన్షన్ పాక్షికంగా, పూర్తిగా రద్దు చేయుటకు ఏ నిబంధన ప్రకారం గవర్నమెంట్ అధికారం కలదు ?

సమాధానం:రూల్.9. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ 1980 మేరకు ప్రభుత్వానికి పెన్షన్ నిలిపివేయడానికి గాని ఉపసంహరించడానికి గాని అధికారం కలదు. దానిపై అప్పీల్ చేయడానికి జీ.వో.ఎం.ఎస్.నెం.53, ఎఫ్ అండ్ పి తేదీ.12.4.99 అవకాశం కల్పించబడినది. జీ.వో.ఎం.ఎస్.నెం. 664, ఫైనాన్స్ తేదీ.7.10.04 లో ఇదే రూల్ కు మరొక ప్రొవిజన్ చేర్చబడినది.*

Misappropriation, bigamy, bribary, corruption moral tirputed, forgery, out rage of modesty of women, misconduct. కారణంగా శిక్షలు పడే ఉద్యోగస్తులకు పెన్షన్ పాక్షికంగా, లేదా పూర్తిగా గాని నిలుపుచేయు అధికారం కల్పించబడినది.

సందేహం:Additional Charge Arrears (FAC Allowence) Bill చేసేటప్పుడు CPS కటింగ్ ఉంటుందా

జవాబు:Additional Charge Arrears (FAC Allowence) Bill చేసేటప్పుడు CPS కటింగ్ ఉండదు

ప్రశ్న:మున్సిపాలిటీలో గుమస్తాగా పనిచేస్తున్నవారు అర్హతలుంటే టీచర్‌గా వెళ్ళేందుకు అవకాశం ఉన్నదా?

సమాధానం:పాఠశాల విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) వారి కంట్రోల్ లో ఉన్న గుమస్తాలకు మాత్రమే ఉపాధ్యాయులుగా ప్రమోషన్ పొందుటకు అర్హులు

ప్రశ్న:24 సంవత్సరాల సర్వీసుకు ఒక ఇంక్రిమెంట్ పొందిన ఎస్.జి.టి, సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొంది 6 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేస్తే, స్పెషల్ గ్రేడ్ స్కేల్ పొందవచ్చునా?

సమాధానం:అవకాశం లేదు. సర్క్యులర్ మెమో. 5476/A/137/F.R.11 2007 ఫైనాన్స్, తేదీ.12.03.07.

ప్రశ్న:మా పాఠశాల నందు లేడీ ఎటెండరు ఉంది. ఆమెకు15+5+7 సెలవులు వర్తించునా?

సమాధానం:లేడీ ఎటెండరుకు 15+7 సెలవులు మాత్రమే వర్తిస్తాయి. అదనపు 5 రోజులు సి.ఎల్ ఉపాధ్యాయినిలకు మాత్రమే వర్తిస్తాయి. జీ.వో.ఆర్‌.టి.నెం. 374, విద్య, తేదీ.16.03.1996.

సందేహం:అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?
ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న భద్రాద్రి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

సమాధానం:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.

సందేహం:భర్త చనిపోయినందు వలన కారుణ్య నియామకం పొందిన ఉద్యోగిని జీతంతోపాటు కుటుంబ పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఆమె పునర్వివాహం చేసుకుంటే ఉద్యోగంలో కొనసాగుతూ పెన్షన్ తీసుకోవచ్చునా ?

సమాధానం:ఉద్యోగంలో కొనసాగవచ్చును. అయితే ఆమె కుటుంబ పెన్షన్ కు అర్హురాలు కాదు. అర్హత గలిగిన పిల్లలంటే వారికి వస్తుంది.
On death or remarriage of widow, her share of family pension shall become payable to her eligible child.* (G.O.Ms.No.188,Fin. Plg. Dt: 22-8-98) (6(II)of Rule 50 of A.P.Revised Pension Rules 1980)

ప్రశ్న: స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?


జవాబు: జి.ఓ.నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ:10-03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4వ తరగతి నుండి 10 వరకు గల 7 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.


ప్రశ్న : EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?


జవాబు: జి.ఓ.నెం:43, తేదీ: 05-02-1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ద్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.


ప్రశ్న: EL's ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?


జవాబు: 01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన తరువాతే EL's జమ చేసేవారు. జి.ఓ.నెం:384,తేదీ: 05-11-1977 నుండి జనవరి 1న ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL'S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 15, జులై 1న మరో 15 EL'S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 3, జులై 1న మరో 3 EL'S సర్వీస్ ఖాతాలో జమ చేస్తారు.


ప్రశ్న : లీవ్ నాట్ డ్యూ అంటే ఏమిటి..?


జవాబు: ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL'S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.


ప్రశ్న :ఆగష్టు-15,జనవరి-26న జెండా వందనానికి హాజరు కాకపోతే చర్యలు ఉంటాయా..?

జవాబు: ఆగష్టు-15, జనవరి-26 తేదీలు జాతీయ సెలవు దినాలు కావున రిజిస్టర్ లో సంతకం అవసరం లేదు. అనారోగ్యం ఉంటే జెండా వందనానికి హాజరు కాకుండా ఉండవచ్చు. అయితే సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం తగిన కారణాలు లేకుండా జెండా వందనానికి హాజరు కాకపోతే పై అధికారులు చర్యలు తీసుకోవచ్చు.

సందేహం-ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది? ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?


జ:- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.

( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980) రూల్ : 42,43


పెన్షన్ కమ్యూటేషన్:

వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును. దీనినే పెన్షన్ కమ్యూటేషన్ అంటారు.

( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999 )

గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది

పెన్షన్

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.

పెన్షన్ లెక్కించు విధానము:-

చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు

20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.


కుటుంబ పెన్షన్ వివరాలు

రిటైర్మెంట్ గ్రాట్యుటీ

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:

5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .


డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)

1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )

5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38

/4 (చెల్లించాల్సిన రోజు)

మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

   పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.


2.  కుటుంబ పెన్షన్: -

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%


3. అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-


అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,


FAMILY PENSION

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .


 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.


 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.


a) మొదటి 7 ఇయర్స్ కి 50%


b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.


 EXample 1:


ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్

 ➡ 7740×30/100 =2322.00

ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.


 Example 2:


 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్

11530×50/100=5765.00.


 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 11530×30/100 = 3459.00


CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)


రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు

1.స్వచ్ఛంద పదవి విరమణ.

2.పదవీ విరమణ

3.ఆకాలమరణం


ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.


1. స్వచ్ఛంద పదవీవిరమణ::---

ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

సూచన :--మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.


దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.A.S


2. సాధారణ పదవీ విరమణ

ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

సూచన

  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.


3. ఆకాలమరణం పొందిన సందర్భంలో

ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ  కి చెల్లిస్తారు.


దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను....

. ప్రశ్న:స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??

జవాబు :జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.


ప్రశ్న:సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??

జవాబు:సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.


ప్రశ్న:ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??

జవాబు :అవసరం లేదు.


ప్రశ్న:మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??

జవాబు:అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.


ప్రశ్న:నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??

జవాబు:స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.


ప్రశ్న:నేను 31.7.17న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా??

జవాబు :జీఓ.235 తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది.


ప్రశ్న:నేను Sgt నుండి SA గా పదోన్నతి పొందాను.నా కన్నా జూనియర్ sgt నుంచి lfl hm గా పదోన్నతి పొంది , నా కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు నేను స్టెప్ అప్ చేఇ0చు కోవచ్చా??

జవాబు:వీలు లేదు. ఒకే కేటగిరీ లో ఒకే సబ్జెక్టులో పదోన్నతి పొందిన వారితో మాత్రమే స్టెప్ అప్ కు అవకాశం ఉంది.


ప్రశ్న: వేసవి సెలవుల్లో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకి invegilator గా వెళ్లాను. ఏ జీఓ ప్రకారం ELs జమ చేస్తారు.??

జవాబు:ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదు. Rc. No.362 తేదీ:16.11.2013 CSE, AP ప్రకారం ELs జమ చేయవచ్చు.

 ప్రశ్న:నేను sgt గా చేస్తున్నాను. AU లో అడిషనల్ సబ్జెక్టు గా తెలుగు చేశాను. నాకు SA తెలుగు కి అవకాశం ఉంటుందా??

జవాబు: తెలుగు అదనపు సబ్జెక్టు గా చేస్తే అర్హత ఉంటుంది. సింగిల్ సబ్జెక్టు గా చేస్తే అర్హత వుండదు.

 ప్రశ్న: నేను తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాను.నేను BA సంస్కృతం మరియు శిక్షా శాస్త్రి పాస్ అయ్యాను.నేను SA సంస్కృతం పోస్టుకి అర్హుడనేనా??

జవాబు: అర్హులే.

. ప్రశ్న: ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా??

జవాబు✅ :

అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేఇ0చుకోవచ్చు.

 ప్ర: చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

జవాబు✅ :

 G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.

ప్రశ్న:స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

జవాబు✅ :

డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.

ప్రశ్న:ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

జవాబు :

G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి

 ప్రశ్న:

వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

జవాబు✅ :

ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది.రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.

 ప్రశ్న:

 ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

జవాబు✅ :

G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.

ప్రశ్న:

నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??

జవాబు✅ :

మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు 

ప్రశ్న❓:

నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??

జవాబు✅ :

వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.

ప్రశ్న❓:

11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా??

జవాబు✅ :

జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.

ప్రశ్న❓:

సరెండర్ కాలానికి IR చెల్లించబడతాయా??

*జవాబు✅ :*

 IR మాత్రం చెల్లించబడదు.

ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??జవాబు:

అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.

ప్రశ్న:

పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు??

జవాబు:

జీఓ.167 తేదీ:20.9.17 ప్రకారం వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగుల కి 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.


ప్రశ్న:

నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??

జవాబు:

ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.

ప్రశ్న:

SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??

జవాబు:

అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.

ప్రశ్న:

ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??

జవాబు:

103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.


ప్రశ్న:

ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

జవాబు:

చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.

ప్రశ్న:చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??

జవాబు:అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.

ప్రశ్న:అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా??

జవాబు:జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి

ప్రశ్న:నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా??

జవాబు:జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు

ప్రశ్న:చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా??

జవాబు:జీఓ.132 తేదీ:6.7.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.

ప్రశ్న:నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?

జవాబు:మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.

ప్రశ్న:తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా??

జవాబు:విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.

ప్రశ్న:నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా??

జవాబు:లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0ది.

ప్రశ్న:మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా??

జవాబు:అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న:ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?

జవాబు:G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.

ప్రశ్న:ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?

జవాబు:A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.

ప్రశ్న:సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?

జవాబు:FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.

ప్రశ్న:కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?జవాబు:కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.


ప్రశ్న:ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

జవాబు:జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.

ప్రశ్న:పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా??

జవాబు:మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది.2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు.కానీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.ప్రస్తుతం ఒక్కో పిల్లవాడికి 1000రూ మాత్రమే ఇస్తారు. ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.


ప్రశ్న:ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన, ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

జవాబు:జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.*


ప్రశ్న:నేను ఒక CPS ఉద్యోగిని. ఏ సందర్భంలో 50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు ?

జవాబు:మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది. (eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.


ప్రశ్న:ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?

జవాబు:వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు. 1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.


ప్రశ్న:ఐటీ లో ధార్మిక సంస్థలకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?

జవాబు:కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.


ప్రశ్న:ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా?

జవాబు:FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.


ప్రశ్న:OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా?

జవాబు:మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.


ప్రశ్న:TSGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా?

జవాబు:జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించే వారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.


ప్రశ్న:మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి?

జవాబు:హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.


ప్రశ్న:నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?

జవాబు:క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.


ప్రశ్న:డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి?

జవాబు:ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు (కోడ్--37) రాయాలి. అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.


ప్రశ్న:UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?

జవాబు:FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి అనుమతితో జమ చేయవలసి ఉంటుంది.

  

నా PRAN అకౌంట్ లో లాగిన్ కావాలంటే నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం నాతో లేదు. మరి ఏవిధంగా లాగిన్ కావాలి?

జవాబు: ముఖ్యంగా CPS ఉద్యోగులు తమ మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే S-2 ఫారం పూర్తి చేసి మీ DDO తో అటెస్టెడ్ చేయించి మీ సంబంధిత STO లో అందచేయాలి._


S-2 ఫారంను మనం ఎందుకు దరఖాస్తు చేసుకుంటామంటే గతములో మనం PRAN అప్లికేషన్ పూర్తి చేసినపుడు ఇచ్చిన సమాచారంలో ఏమన్నా మార్పులు చేసుకోవాలి అంటే S2 ఫారంను దరఖాస్తు చేసుకోవడం తప్పని సరి

ప్రతి CPS ఉద్యోగి తమ పేరులో దోషాల సవరణ, మొబైల్‌ నెంబర్,మెయిల్ ID, నామినీ మార్పు,బ్యాంక్ డీటెయిల్స్ మార్పు (ఏ సమాచారం మార్పు) చేసుకోవడానికైనా S-2 ఫారం పూర్తి చేసి STO లో సమర్పించాలి

S2 FORM పై వివరణ

S2 FORM బ్లాక్ పెన్ తో మాత్రమే పూరించాలి.మరియు మనం ఏ వివరాలైతే మార్చాలనుకుంటున్నామో వాటికెదురుగా లెఫ్ట్ సైడ్ లో ఉన్న బాక్స్ లో టిక్ చేసి మన వివరాలు నమోదు చేయాలి.

ఇందులో SECTION A, B,C,D లు ఉంటాయి

SECTION A

Changes or Correction in Personal details

ఇందులో మన పేరు, తండ్రి పేరు,పాన్ నెంబర్,

 Present Address, Permanent Address,మొబైల్ నెంబర్,

 Email ID, Bank Details, Value Added Service మొదలగు సమాచారంతో కూడిన COLOUMNS ఉంటాయి.

వివరణ

1.మన PRAN కార్డ్ నందు మన SURNAME కానీ... మన పేరు కానీ... మన తండ్రి గారి పేరు కానీ... తప్పుగా ముద్రితమై ఉంటే S2 ఫారం దరఖాస్తు చేసుకొని మార్పు చేసుకొనవచ్చును.


2. గతంలో PRAN అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న సమయంలో మనకి పాన్ నెంబర్ లేకుండా కొత్తగా పాన్ నెంబర్ పొందినట్లైతే S2 ఫారం ద్వారా మన పాన్ నెంబర్ ను PRAN అకౌంట్ కు లింక్ చేసుకోవచ్చు.

3. గతములో ఇచ్చిన అడ్రస్ ను ఇపుడు మార్చుకోవాలి అన్నా S2 ద్వారా మార్పు చేసుకోవచ్చు.

4. గతములో మొబైల్ నెంబర్ ఇవ్వకున్నా... ఇచ్చిన మొబైల్ నెంబర్ మారి యున్నా.. కొత్త మొబైల్ నెంబర్ ను S2 ఫారం ద్వారా మార్పు చేసుకోవచ్చు.

5. గతములో Email ID ఇవ్వకున్నా.. ఇపుడు కొత్తగా Email ID ని నమోదు చేసుకోవాలి అన్నా... S2 ఫారం తప్పని సరి.

6. గతములో ఇచ్చిన BANK అకౌంట్ నెంబర్ గాని మారినట్లైనా... గతములో ఇచ్చిన BANK అకౌంట్ ను కనుక వేరే శాఖకు మార్చుకున్నా... కొత్త శాఖ యొక్క MICR ని కూడా S2 ఫారం ద్వారా మార్చుకోవచ్చును.

 7. పాక్షిక ఉపసంహరణ (Partial withdraw) కు అప్లై చేసుకున్న సందర్భంలో బ్యాంక్ డీటెయిల్స్ అప్ డేట్ చేసుకొన్న తర్వాత అప్లై చేసుకోమని సూచిస్తుంది .కావున ప్రతి ఒక్క CPS ఉద్యోగి తమ బ్యాంక్ బ్రాంచ్ పేరు ( SBH నుండి SBI), బ్యాంక్ IFSC కోడ్ కూడా మార్చుకోవాలి.దీనికి గాను మళ్ళీ S-2 ఫారం పూర్తి చేసి STO లో ఇవ్వాలి.ఈ సందర్భంలో ఫారంతో పాటు బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ జత పరచాలి.

8. కొత్తగా మొబైల్ నెంబర్,Email ID లను మార్చుకోవాలన్నా ఇక్కడ నమోదు చేసి Value Added Services COLOUMN వద్ద YES అని టిక్ మార్కుని నమోదు చేస్తేనే మన మొబైల్ కు,మెయిల్ కి మెసేజ్ లు వస్తాయి.

SECTION B

Changes or corrections in Nomination Details

గతములో ఇచ్చిన NOMINEE లను మార్చుకోవాలి అన్నా, గతములో పెళ్లి కాకుండా ఇపుడు వివాహం అయి వారి SPOUSE లను NOMINEE లుగా మార్చాలి అన్నా, గతములో పిల్లలు లేకుండా కొత్తగా పిల్లలను నామినీలు గా నమోదు చేసుకోవాలి అన్నా S-2 ఫారం తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలి._

 (గరిష్టంగా ముగ్గురిని మాత్రమే నామినీలుగా ఉంచడానికి అవకాశం ఉంటుంది.మరియు వారికి కేటాయించిన percentage ల మొత్తం 100 కు సరిపోవాలి.ఒక వేళ నామినీ మైనర్ ఐనట్లైతే వారి సంరక్షకుల వివరాలు నమోదు చేయాలి.)_

SECTION C

Reissue of T Pin or I PIN

మనకి PRAN కిట్ వచ్చినపుడు ఇచ్చిన IPIN, TPIN లను కనుక పోగొట్టుకున్నా ,తిరిగి వాటిని పొందాలి అంటే S2 ఫారం తప్పని సరి._

SECTION D

Reissue of PRAN Card

మనకి వచ్చిన PRAN కిట్ లను మనం పొందనపుడు, PRAN కార్డ్ ను పోగొట్టుకున్నా తిరిగి వాటిని పొందాలి అంటే S2 ఫారం తప్పనిసరి.

ఒకవేళ ఉద్యోగితో రిజిస్టర్డ్ మొబైల్ ఉన్నట్లయితే OTP తో లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్,Email ID, పాన్ నంబర్,బ్యాంక్ డీటెయిల్స్,నామినీ డీటెయిల్స్,డూప్లికేట్ PRAN కార్డ్ కొరకు అప్లై చేయడం,పాక్షిక ఉపసంహరణ కు అప్లై చేయడం మొదలైనవాటిని ఆన్లైన్ లో కూడా చేయవచ్చు.

సందేహం: Invalid Pension ఎప్పుడు చెల్లిస్తారు?

సమాధానం:ఒక ఉద్యోగి,అతను చేస్తున్న ఉద్యోగము చేయలేడని మెడికల్‌ అధారిటీ డిక్లేరు చేస్తే అతనికి రూలు 45 లోబడి Invalid Pension మంజూరు చేస్తారు

అయితే మెడికల్‌ అధారిటి ఉద్యోగి ఇప్పుడు చేస్తున్న పనికంటే తక్కువ శ్రమ కల్గిన పనిచేయగలడు అని భావిస్తే అతనిని ఆ పోస్టులో నియమించవచ్చు.ఆ పని చేయడానికి అతనికి ఇష్టం లేకపోతే అప్పుడు అతనికి Invalid Pension మంజూరు చేస్తారు.

ఉద్యోగి దుర అలవాట్ల కారణంగా అతనికి అనారోగ్యం సంభవిస్తే అతనికి Invalid Pension మంజూరు చేయబడదు.

రూలు 37 (1) (2) (3)

సందేహం; సర్వీసులో Interruption అంతరాయము వుంటే, పెన్నన్‌కు అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?

సమాధానం: సర్వీసులో అంతరాయము కలిగిన కాలాన్ని పెన్సనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో పరిగణిస్తారు.

(1) గైర్హాజరు కాలానికి సెలవు మంజూరు చేసినప్పుడు

(2) సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు

(3) జాయినింగ్‌ టైము వినియోగించినప్పుడు

(4) పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు

(5) పెన్షను మంజూరు అధికారి వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు

రూలు 27 (ఎ) నుండి (ఎఫ్‌) (2)


సందేహం: సస్పెన్షన్ పీరియడ్‌ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??

సమాధానం:సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్థ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*  


ప్రశ్న: నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??

సమాధానం:జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్‌,AAS స్కేల్స్‌ వాయిదా పడతాయి. మూడు సంవత్సరములు పైన జీత నష్టపు సెలవు కాలం పెన్లన్‌ కి అర్హదాయక సర్వీస్‌ గా పరిగణింపబడదు.


ప్రశ్న:నేను B.Ed లో 3rd methodology గా maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా??

జవాబు:మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.

ప్రశ్న:పిల్లలను దండించటం నేరమా??

జవాబు:జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.


ప్రశ్న:నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా??

జవాబు:జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.


ప్రశ్న:నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా??

జవాబు:అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

ప్రశ్న:నేను దసరా సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా??

జవాబు:దసరా సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.


సరెండరు లీవు - కొన్ని వివరణలు

ఒక ఆర్థిక సంవత్సరములో 15 రోజుల ఆర్జిత సెలవు సరెండరు చేయవచ్చు. అదేవిధంగా రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజుల వరకు సరెండరు చేయవచ్చు. ఒక సరెండరు లీవుకు మరొక సరెండరు లీవుకు మధ్య వ్యవధి 12 నెలలు/24 నెలలు వుండవలెనని ఇదివరలో షరతు వుండెడిది. కాని

Govt. Circular Memo No 13870/A/436/FRI/2005 Fin.(FRI) Dept. dt 27-6-2005

ద్వారా జారీ చేసిన వివరణ ద్వారా, ఆర్థిక సంవత్సరములో 15 రోజులు, రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజులు అని తెలియజేసింది.

(Also.see Govt. Circular Memo No. 17915-c/542 FRI/2005 Fin: Dept. dt. 4-7-2005)


FAC అలవెను గురించి వివరణ.....

విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్‌ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్‌ఎంలుగా.__FAC MEO లుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. ఈ విషయమై వివరణ.

 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.

మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్‌ అలవెనుస్‌ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.

 తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్‌ అలవెన్సుస్‌ చెల్లిస్తారు.

ఒకరోజు గ్యాప్‌ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే. __ మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అంద్‌ అలవెన్సులను FAC Allowance గా చెల్లిస్తారు.


సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

 సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి (Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

 ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.

(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)

(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)*

 సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

 AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాక ముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.

 రెండు సం. కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.

(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.


 సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

 సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

 జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము (Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.

(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీ చేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.

(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు. ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969)


ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?

జ॥ (1) వర్క్‌మెన్‌ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులు - 60 సంవత్సరాలు.*

             *(2) ఇతరులు - 61 సం॥లు(తెలంగాణ), 60 సం॥లు(ఆంధ్రప్రదేశ్‌).*

 

ఏ రోజున తప్పక రిటైర్‌ కావాలి?

జ॥ పుట్టిన తేది ఆ నెలలో ఒకటవ తేదీ కాకుండా ఉన్నవారికి 61/60 అయిన నెలలోచివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా: - పుట్టిన తేది 2-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌మెంట్‌ వయసు అయితే రిటైర్‌మెంట్‌ 31-1-2015 అవుతుంది. పుట్టిన తేది ఒకటవ తేదీ అయితే పుట్టిన నెలకంటే ముందు నెల చివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా:- పుట్టిన తేది 1-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌ మెంటు వయసు అయితే రిటైర్‌మెంటు 31-12-2014 అవుతుంది.

రూలు -42

Executive Instruction (i)

GO.Ms.No. 289, Fin.&Plg. Dept., dated. 4-11-1974.

ప్రశ్న: పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌ ఏ రోజు వరకు చెల్లిస్తారు?

సమాధానం: 1) కుమారులకు 25 సంవత్సరాల వయసు వరకు లేక అతను సంపాదన మొదలు పెట్టే రోజు వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు* 

GO.Ms.No. 287, F&P dt. 12-8-1999

2) కుమార్తెలకు పెళ్ళి అయ్యేంత వరకు/వారు సంపాదన మొదలు పెట్టెంత వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు.

రూలు 50.

Executive instruction (iv) (ii) (a) (b)

GO.Ms.No. 278, Fin& Plg. (Fw-Pen-I) Dept., dt. 19-10-1987.


సందేహం:కన్సాలిడేట్ పెన్షను అంటే ఏమిటి?

సమాధానం:PRC లు అమలులోకి వచ్చినప్పుడు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఆ PRC లోని నిబంధనలకు అనుగుణంగా “పే” ఫిక్స్‌ చేస్తారు. అలాగే పెన్షనర్లకు వారి పెన్షను ఫిక్స్‌ చేయడాన్ని కన్సాలిడేట్‌ పెన్సను అంటారు.

సందేహం:ఎన్ని సంవత్సరాలు క్వాలిఫైయింగ్‌ సర్వీసు చేసి రిటైర్‌ అయితే రిటైర్‌మెంట్‌ గ్రాట్యూటీ చెల్లిస్తారు?

సమాధానం:5 సంవత్సరాల క్వాలిఫైయింగ్‌ సర్వీసు చేసి రిటైర్‌ అయితే రిటైర్‌మెంట్‌ గ్రాట్యూటీ చెల్లిస్తారు.

రూలు 46 (1)(ఎ)

సందేహం:5 సంవత్సరాల క్వాలిఫైయింగ్‌ సర్వీసు చేసి చనిపోయిన ఉద్యోగికి రిటైర్‌మెంట్‌ గ్రాట్యూటీ ఎలా, ఎంత మొత్తం చెల్లిస్తారు?

సమాధానం:రూలు 47 (1)లో తెలిపిన విధంగా అతని కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. అలాగే అతను 18 సంవత్సరాల క్వాలిఫైయింగ్‌ సర్వీసు చేస్తే ఎంత మొత్తం అయితే వస్తుందో అంత మొత్తం చెల్లిస్తారు.

రూలు -46 (1) (బి)

సందేహం:రిటైర్‌మెంటు గ్రాట్యూటీ చెల్లించడంలో ఆలస్యమైతే దానిపై వడ్డీ చెల్లించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా?

సమాధానం:ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి (ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌ అనుమతి కూడా అవసరం) రూలు 46 (1) - ఎ.


GO.Ms.No. 185, Fin& Plg. (FW.Pen-I) dept., dt. 9-11-1992

ప్రశ్న:నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?

జవాబు:మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.

ప్రశ్న:తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా??

జవాబు:విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.

ప్రశ్న:నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా??

వాబు:లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0

ప్రశ్న:మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా??

జవాబు:అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న:ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?

జవాబు:G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.

ప్రశ్న:ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?

జవాబు:A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.

ప్రశ్న:సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?

జవాబు:FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.

ప్రశ్న:కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?

జవాబు:కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది

ప్రశ్న:ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

జవాబు:జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.:



ప్రశ్న: TSGLI  విషయంలో మనం చేస్తున్న పొరపాట్ల గురించి అవగాహన కొరకు ఈ పోస్టింగ్...


జవాబు:  ఒక ఉపాధ్యాయుడు ఏప్రిల్,2021 న రిటైర్ కావలసి ఉంది... తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 3సం౹౹ రిటైర్మెంట్ వయస్సు పెంచడం వలన ఏప్రిల్,2024 వరకు సర్వీస్ ఉంది. కానీ APGLI పాలసీ మాత్రం ఏప్రిల్,2021 తో ముగుస్తుంది. కావున APGLI అమౌంట్ సెటిల్మెంట్ ప్రపోజల్ ఫార్మ్స్ పంపాలి.


ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆగస్ట్,2020 లో ఆఖరి ప్రీమియం అని పట్టా లో క్లియర్ గా రాసి ఉన్నప్పటికి ఏప్రిల్ వరకు ప్రీమియం కడుతూనే ఉన్నారు.ఆయన వద్ద A, B, C అనే 3 పట్టాలు ఉన్నాయి. వాటి విలువ 750/- ... కానీ ఆయన గత 5 సం౹౹లు గా 2000/- చొప్పున ప్రీమియం కడుతున్నారు. 53 సం౹౹ దాటిన తరువాత పంపే పట్టా ప్రపోజల్ ను అంగీకరించరు. కాబట్టి ఆయన కి కేవలం 750/- కి సంబంధించిన పాలసీ అమౌంట్ సెటిల్మెంట్ చేస్తారు. ఆ పై కట్టే  అమౌంట్ ని ఎంత కట్టామో అవే ఇస్తారు...


57సం౹౹ లోకి ప్రవేశించిన వారు ఆఖరి ప్రీమియం ఎప్పుడో పట్టా చూసి గమనించగలరు.

52సం౹౹ దాటిన వారు కొత్త పట్టాలకి ప్రపోజల్ ఫార్మ్స్ పంపుటలో తొందరపడ గలరు

ప్రశ్న:

CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి?


జవాబు:

ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.


ప్రశ్న:

వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు?


జవాబు:

మెమో.14568, తేదీ:31.1.2011 ప్రకారం పే, డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.


ప్రశ్న:

ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు?


జవాబు:

ఇంటి మరమ్మతులు, విస్తరణకు మూలవేతనానికి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ, ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.


ప్రశ్న:

DSC నియామకాలలో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?


జవాబు:

మొత్తం ఖాళీల లో 80% కేవలం స్థానికులకు, మిగిలిన 20% ఖాళీలు ఓపెన్ కాంపిటేషన్ కింద స్థానికులకి, స్థానికేతరులకి కలిపి ఇస్తారు.


ప్రశ్న:

ఒక టీచర్ వైద్య కారణాలపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు. అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా?


జవాబు:

వాయిదా పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే, నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.

సందేహం


*నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?


జవాబు:

24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.


సందేహం

నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా?*


జవాబు:

FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.*


సందేహం

ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు  ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?*


జవాబు:మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.

సందేహం: ఉద్యోగి రెగ్యులర్‌ ఇంక్రిమెంటు ముందురోజే రిటైర్‌మెంట్‌ అయితే అ ఇంక్రిమెంటును కూడా 'పేలో కలుపుకొని పెన్షను లెక్కిస్తారా?


సమాధానం:అలా మంజూరు చేసే ఇంక్రిమెంటు “నోషనల్‌ ఇంక్రిమెంటు” దీనిని పేలో కలుపుకొని పెన్షను లెక్కిస్తారు. కాని ఏ ఇతర ప్రయోజనాలకు దీనిని పరిగణించరు.*

రూలు 32.


Executive Instruction (iv)


GOMsNo. 235, F&P (FWRI Dept, dt. 27-10-1998,


సందేహం:

కంపన్‌సేట్‌ అలవెన్సు ఎప్పుడు మంజూరు. చేస్తారు?*

సమాధానం

సాధారణంగా Dismiss మరియు Remove చేసిన ఉద్యోగికి పెన్షను/గ్రాట్యూటీ లభించదు కాని కొన్ని అసాధారణ సందర్భాలలో చేసే Dismis/Remove చేసే అధికారి ఉద్యోగికి Invalid పెన్షను /గ్రాట్యూటీలో 2/3 మించకుండా మంజూరు చేయవచ్చు.


రూలు -40

కాంపన్‌సేట్‌ అలవెన్సు రూలు 45 లోని నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేయాలి, రూలు -41

సందేహం:ఉద్యోగి ఎక్కువ సర్వీసు చేస్తే ఎక్కువ వెయిటేజీ ఇస్తారా?


సమాధానం:సూపరాన్యుయేషన్‌ ద్వారా రిటైరు అయిన ఉద్యోగులకు వారి సర్వీసుతో నిమిత్తం లేకుండా పుల్‌ పెన్షన్‌ను పొందటానికి సరిపడు సర్వీసుకు మించకుండా అంటే 33 సంవత్సరాలు మించకుండా వెయిటేజీ కలుపుతారు.అంటే 33 సంవత్సరాలకు తక్కువ పడితే సర్వీసు 5 సంవత్సరాలకు మించకుండా వెయిటేజీ కలుపుతారు.


రూలు 29 Executive Instruction (i)


Govt. Memo No 57233-B/8 10/Pen-I/81-1 F&PEW Pen-I, Dept., dt. 28-4-1982.

సందేహం:యాంటిసిపేటరీ గ్రాట్యూటీ ఎప్పుడు చెల్లిస్తారు, ఎంత చెల్లిస్తారు?


సమాధానం:ఉద్యోగి రిటైరైన తరువాత అతని పెన్షనరీ బెనిఫిట్స్‌ మంజూరు చేయడానికి ఆలస్యము అయితే అప్పుడు అతనికి రిటైర్‌మెంట్‌ రోజు వరకు వున్న రికార్డు ప్రకారము ఎంత గ్రాట్యూటీ రాగలదో లెక్కించి అందులో 80% యాంటిసిపేటరీ గ్రాట్యూటీ చెల్లిస్తారు. APTC Fom 47 లో డ్రా చేయాలి.

ఏవైనా కేసులు పెండింగ్‌లో వుంటే యాంటిసిపేటరీ గ్రాట్యూటీ చెల్లించరు.

పైనల్‌ గ్రాట్యూటీలో యాంటీసిపేటరీ గ్రాట్యూటీ మొత్తం రికవరీ (adjust) చేసి మిగిలిన మొత్తం చెల్లించాలి.

రూలు 51(C)

భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సంధర్భంలో ఫ్యామిలీ పెన్నను ఎలా చెల్లిస్తారు?


జ॥ 1) భార్య/ భర్తలు ఎవరో ఒకరు సర్వీసులో కాని / రిటైర్‌ అయిన తరువాత చనిపోతే అతని/ఆమె, భాగస్వామి పెన్షను బ్రతికి వున్నంత వరకు చెల్లించాలి.

బ్రతికి వున్న వారు రిటైర్‌ అయితే రెండు పెన్నన్లు,1 సర్వీసు పెన్నను 2 ఫ్యామిలీ పెన్నను చెల్లిస్తారు.

భార్య/భర్త (తల్లి/తండ్రి) ఇద్దరూ చనిపోతే వారి పిల్లలకు రెండు ఫ్యామిలీ పెన్సనులు చెల్లిస్తారు కాని రెండు ఫ్యామిలీ పెన్నన్లు కలిపి నెలకు ప్రస్తుతము గరిష్టంగా రూ.27830/- గా సవరించారు.

రూలు 50, 10 (ఎ) (i) (ii) (బి)

GO. (P) No. 245 F (Pen.I) Department Dated 4-9-2012.


సందేహం: సస్పెన్షన్‌ (Suspension) కాలము పెన్షన్‌ లెక్కించడానికి పరిగణిస్తారా?


సమాధానం: ఎంక్వయిరీ ముగిసిన తరువాత అతనిపై మోపిన అభియోగాలు ఎటువంటివి నిర్ధారణ కాకపోవడం, మొత్తాన్ని రద్దు చేయడం అట్టి సందర్భంలోనే సస్పెన్షన్‌ కాలమును పెన్షను లెక్కించడానికి పరిగణిస్తారు. లేకపోతే పరిగణించరు. కాని Competent Authority తన ఉత్తర్వులో సస్పెన్షన్‌ కాలాన్ని, పెన్షనుకు లెక్కించమని ప్రత్యేకంగా తెలిపినప్పుడు లెక్కిస్తారు.

రూలు - 23

సందేహం:అప్రెంటిస్‌గా చేసిన కాలమును పెన్షనుకు లెక్కించడానికి పరిగణిస్తారా?


సమాధానం:పరిగణించరు, కాని ఉపాధ్యాయులకు మాత్రము వారి అప్రెంటిస్‌ కాలమును 'పెన్షనుకు లెక్కించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.


రూలు -16

GOMsNo. 2, Edn. (SWE SPPIID) Dept. dt. 5-1-2004*


*Memo No. 8663/Ser-1/2010 dt. 1-7-2010 of S.E. dept.,

సందేహం:నేను, మరొక టీచర్ ఇద్దరం ఒకేసారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము. HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్?


సమాధానం:

Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు. వారికే ముందు HM పదోన్


కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా?


సమాధానం: ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.


సందేహం:ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు. అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు. ఇస్తారా?


సమాధానం: ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవులో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.

సందేహం:ఉద్యోగి పదవీ విరమణ పొందునాటికి 'సస్పెన్నన్‌'లో వున్నచో అతనిని పదవీ విరమణ పొందటానికి అనుమతించవచ్చా?


సమాధానం:అనుమతించవచ్చును, కాని పెన్షన్‌ ప్రయోజనాలు, ఆ కేసులు మొత్తం పూర్తి అయ్యేంతవరకు విడుదల చేయరాదు.


రూలు -9 Executive Instructions (vii)2

సందేహం: పదవీ విరమణకు రెండు నెలల ముందు ప్రమోషను వస్తే అ పోస్టులో చేసిన 'పేఫిక్సేషన్‌ను ఆధారంగా చేసుకొని పెన్షన్‌ లెక్కిస్తారా?*


సమాధానం:లెక్కిస్తారు కాని “రెగ్యులర్‌ వెకెన్సీ"లోనే పదోన్నతి వచ్చిందని దృవీకరణ చేయాలి.అలాగే ఆ ప్రమోషన్‌ పోస్టులో ఎన్ని రోజులు పనిచేసాడన్న నిబంధన లేదు.*


రూలు 32


Executive Instruction (V)


*GO.Ms.No. 87, F&P(FW.Pen-I) Dept., dt. 25-5-199

 ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు. తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు?

జవాబు:

*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*             


2. ప్రశ్న:

*పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu, Hindi, Urdu ఎవరు రాయాలి?*


జవాబు:

*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.Language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.*

*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.Language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.*    


3. ప్రశ్న:

*సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?*


జవాబు:

*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను, రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.*

*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది. Leave may be surrendered at any time not exceeding 15/30 days... అని వున్నది. అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.*


4. ప్రశ్న:

*నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను. రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే, DEO గారి అనుమతి తీసుకోవాలా?*


జవాబు:

*అవును. తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.*


5. ప్రశ్న:

*"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?*


జవాబు:

*1933 APLR రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.

*సందేహం*


*సాధారణంగా ప్యామిలీ పెన్షన్‌ను ఎంత చెల్లిస్తారు?*


*సమాధానం*


*చివరి మూల వేతనం లో 30% శాతము మొత్తాన్ని నెలనెలా ఫ్యామిలీ పెన్పన్‌గా చెల్లిస్తారు. ఫ్యామిలీ పెన్టన్‌ లెక్కించే క్రమంలో పైసలు వస్తే తరువాత రూపాయకు పెంచి చెల్లించాలి.*


*ఉదా:- 3015.06 పై.*


*3016/- రూ. పెంచి చెల్లించాలి.*


*రూలు - 50 (2), 2-ఎ.


*సందేహం*


*6 లేదా 12 సంవత్సరాల సర్వీసు నిండే ముందు పదోన్నతి వస్తే ఫీడర్ కేటగిరీలో 6 లేదా 12 సంవత్సరాలు నిండే వరకు ఆగి, ఆ స్కేల్ పొందాక పదోన్నతి స్కేల్ పొందే అవకాశం ఉందా ?*


*సమాధానం:*


*ప్రమోషన్ ఆర్డర్ అందుకున్న తరువాత 25 రోజుల్లోగా క్రొత్త పోస్ట్ లో చేరకపోతే ఆ ప్రమోషన్ రద్దవుతుంది. జీ.వో.ఎం.ఎస్.నెం. 123, జీఏడి తేదీ. 14.03.2001.

*సందేహం*


*ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు. తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు?*

*సమాధానం:*


*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷


*F.R.26(a) ఏదయినా పరీక్ష వ్రాసి పాస్‌ అయిన ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మిసహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లుగా భావించాలి.*


*కొత్తగా ఉద్యోగంలో చేరిన లేదా ప్రమోషన్‌ పోస్ట్‌ లో చేరిన ఉద్యోగికి అతని వార్షిక ఇంక్రిమెంట్‌12 నెలల కాలం పూర్తికాకుండానే మంజూరు అవుతుంది .*


*Ex: 29.02.2008 నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగి మొదటి వార్షికి ఇంక్రిమెంట్‌ 1.02.2009 నకే మంజూరు అవుతుంది.

*సందేహాలు - సమాధానాలు*


1. ప్రశ్న:

*నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను. మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది. మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది. మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు. వాస్తవమేనా?*


జవాబు:

*ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విషయం మాత్రమే జి.ఓ.209; తేది.21.11.2016 పేర్కొనడం జరిగింది. కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు. ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది. కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వరు.*



2. ప్రశ్న:

*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?*


జవాబు:

*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.*



3. ప్రశ్న:

*వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?*


జవాబు:

*వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.*



4. ప్రశ్న:

*ఒక టీచరుకు అక్టోబర్ 2021 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?*


జవాబు:

*20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.*



5. ప్రశ్న:

*ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?*


జవాబు:

*క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

*సందేహం*


*సర్వీస్ బుక్ (New format ) లో కేవలం AGI కి సంబందించిన పేజీలు సరిపోవడం లేదు. కొత్తగా కొన్ని పేజీలు add చేయాలా? లేక ఇంకో SB కొని volume 2 గా నిర్వహించుకోవాలా?*


*సమాధానం*


*Go ms no 216 dt 21.6.64 ప్రకారం సర్వీస్ బుక్ పూర్తి అయిన యెడల దానికి పేజీలు చెర్చరాదు,కాని రెండవ సర్వీస్ బుక్ ను volume -ll గా కొనసాగించాలి

*సందేహాలు - సమాధానాలు*


1 .ప్రశ్న:

*నేను 31.7.23న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా?*


జవాబు:

*జీ.ఓ.235; తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది.*



2. ప్రశ్న:

*నేను Sgt నుండి SA గా పదోన్నతి పొందాను. నా కన్నా జూనియర్ sgt నుంచి Lfl hm గా పదోన్నతి పొంది, నా కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు నేను స్టెప్ అప్ చేయించుకోవచ్చా?*


జవాబు:

*వీలు లేదు. ఒకే కేటగిరీలో ఒకే సబ్జెక్టులో పదోన్నతి పొందిన వారితో మాత్రమే స్టెప్ అప్ కు అవకాశం ఉంది.*



3. ప్రశ్న:

*వేసవి సెలవుల్లో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకి invegilator గా వెళ్లాను. ఏ జీఓ ప్రకారం ELs జమ చేస్తారు?*


జవాబు:

*ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదు. Rc. No.362 తేదీ:16.11.2013 CSE, AP ప్రకారం ELs జమ చేయవచ్చు.*



4. ప్రశ్న:*

*నేను sgt గా చేస్తున్నాను. AU లో అడిషనల్ సబ్జెక్టు గా తెలుగు చేశాను. నాకు SA తెలుగు కి అవకాశం ఉంటుందా?*


జవాబు:

*తెలుగు అదనపు సబ్జెక్టుగా చేస్తే అర్హత ఉంటుంది. సింగిల్ సబ్జెక్టు గా చేస్తే అర్హత వుండదు.*



5. ప్రశ్న:

*ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే, అతనికి PRC వర్తించదా?*


జవాబు:

*అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేసుకోవచ్చు.

*సందేహం - సమాధానం*


ప్రశ్న:

*ప్రభుత్వ ఉద్యోగులకి ఏయే సమయాలలో మెడికల్ లీవ్ ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు.? మెడికల్ లీవ్ తీసుకొన్న వారికి ఏమైన సాలరీ ఇస్తారా? ఉద్యోగులకి మెడికల్ లీవ్ వల్ల నష్టము ఏమైనా ఉంటుందా? వీటి గురించి స్పష్టముగా తెలియజేయగలరు? మెడికల్ లీవ్స్ సర్వీసులో ఎన్ని సార్లు తీసుకోవచ్చు?*


జవాబు:

*మెడికల్ లీవ్ అంటూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ లేవు. ఏ సెలవు అయినా వైద్య అవసరాల కోసం పెట్టుకోవడాన్ని మెడికల్ లీవ్ గా వ్యవహరిస్తారు.*


*1. ఉద్యోగులకి ప్రతీ సంవత్సరం 30 earned leaves ఉంటాయి. (జనవరి 1 న 15, జులై 1 న 15 అడ్వాన్స్ గా ఇస్తారు) ఇవి పెట్టుకుంటే పూర్తి వేతనం వస్తుంది. గరిష్టంగా 300 రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మనకి ఉన్న earned leaves ప్రతీ సంవత్సరం 15 రోజులు సరెండర్ చేసి పదిహేను రోజులకు సమానమైన జీతం పొందవచ్చు. టెంపరరీ ఉద్యోగులకి ప్రతీ ఆరు నెలలకు 8 క్రెడిట్ అవుతాయి. గరిష్టంగా 30 నిల్వ ఉంటాయి. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం 6 క్రెడిట్ అవుతాయి.*


*2. ఒక సంవత్సరం రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన వారికి 20 అర్ధ వేతన సెలవులు క్రెడిట్ అవుతాయి. వీటికి సగం పే, సగం DA, పూర్తి HRA వస్తుంది. ఈ సెలవులను వైద్య కారణాలపై వాడుకుంటే రెట్టింపు సెలవులు తగ్గించి పూర్తి జీతం ఇస్తారు. తాత్కాలిక ఉద్యోగులకు ఇవి ఉండవు. అప్రెంటిస్ లకు సంవత్సరానికి 30 సెలవులు వైద్య కారణాలపై వాడుకోవచ్చు.*


*3. EL, HPL లేకపోతే EOL ఉపయోగించుకోవాలి. దీనికి జీతం రాదు. ఇది ఇంక్రిమెంట్లకు, పెన్షన్ కు కౌంట్ కాదు. వైద్య కారణాలపై ఉపయోగించుంకుంటే ఇంక్రిమెంట్ కి లెక్కిస్తారు.*


                      ***********


ప్రశ్న:మ్యూచ్యువల్ ట్రాన్స్‌ఫర్ లో వెళ్ళడం లాభమా? నష్టమా? తెలుపగలరు.*


జవాబు:మీరు అడిగేది ఇతర జిల్లాలకు వెళ్లాడానికా?*

మన రాజ్యాంగం ప్రకారం స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు. కేంద్రం మిగిలిన రాష్ట్రాల్లో ఇలాగే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు ఉండవు.

కానీ ఆర్టికల్ 371 డి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా రిజర్వేషన్లు, సీనియారిటీ లిస్టులు నిర్వహించ బడతాయి. అందువల్ల నియామక యూనిట్ పరిధి దాటి బదిలీలకు అవకాశం ఉండదు.*

ఎవరైనా సీనియారిటీ వదులుకుని వెళ్ళడానికి సిద్దపడితే ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.

ఒక వేళ, వేరే dept కి వెళ్ళాలి అంటే, మీ క్యాడర్ లో ఉన్న సీనియారిటీ అంత పోతుంది. కొత్త dept లో మీరు అందరికన్నా జూనియర్ అవుతారు.


1. ప్రశ్న:నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?


జవాబు:స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.


 ప్రశ్న:Sir...2021,2022 లో retirement ఉండి.. 3years extension పొందుతున్న వారికి GIS deduction ఎప్పటి వరకు చేయాలి ?*


జవాబు:GPFలాగే, GIS కూడా రిటైర్మెంట్ కు 3 నెలల ముందు వరకు మినహాయించాలి. అన్ని రకాల ప్రభుత్వ మినహాయింపులు 3 నెలల ముందు నుండి ఆగిపోతుంది.


                        

. ప్రశ్న:డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?


జవాబు:AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం, F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.


4. ప్రశ్న:SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?*


జవాబు:అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి. మరియు బి.యిడి కలిగి ఉండాలి.*


ప్రశ్న:ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?*


జవాబు:రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. Sc/ St/ Bc/ Oc కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.*



1 ప్రశ్న:610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?*


జవాబు:అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.



2. ప్రశ్న:నేను SA గా పదోన్నతి పొందాను. నాకు ప్రస్తుతం 56 ఇయర్స్. GOT పాస్ అయ్యాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?


జవాబు:మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.



3. ప్రశ్న:నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?


జవాబు:వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి. ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.


 ప్రశ్న:11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా?*


జవాబు:జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.



5. ప్రశ్న:సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి?


జవాబు:జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు, స్పెషల్ పే చెల్లించబడతాయి. ఐతే IR మాత్రం చెల్లించబడదు.


1. ప్రశ్న:నా భార్య టీచర్. ఆమె మరణించింది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు?*


జవాబు:భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయి, భార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు & పెన్షన్ భర్త తీసుకోవచ్చు.*

అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే (కొడుకు కి 18 సంవత్సరాలు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు.



2. ప్రశ్న:ఈ--ఫైలింగ్ ఎప్పుడు చెయ్యాలి?*


జవాబు:ముందుగా 26 ఏఎస్ ఫారం పరిశీలించుకోవాలి. దానిలో మనం చెల్లించిన ఆదాయపన్ను మొత్తం జమ ఐనది, లేనిదీ తెలుస్తుంది. అది సరిగా ఉన్నప్పుడే ఈ-ఫైలింగ్ కి వెళ్ళాలి. జులై 31 లోగా ఈ-ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. అకనాలెడ్జిమెంట్ కింది భాగంలో పంపమని నోట్ ఉన్న వారు తప్పనిసరిగా  అకనాలెడ్జిమెంట్ ని డిపార్ట్మెంట్ కి పంపాలి.*



3. ప్రశ్న:కారుణ్య నియామకాలకి గరిష్ట వయోపరిమితి ఎంత?*


జవాబు:భార్య/భర్త కారుణ్య నియామకం పొందవలసి వచ్చినప్పుడు గరిష్ట వయసు 45 సంవత్సరాలు. మిగిలిన వారి విషయంలో సాధారణ నియామక వయోపరిమితి వర్తిస్తుంది.*


 ప్రశ్న:డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చేస్తున్నాను. దీంతోపాటు బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌ను కూడా ఒకేసారి దూరవిద్యలో చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా?*


జవాబు:ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగ ప్రకటననుబట్టి మీ విద్యార్హతను వాడుకోవాలి. అంతేతప్ప రెండు కోర్సులనూ ఒకే ఏడాది పూర్తిచేసినట్లు చూపిస్తే కొన్నిసార్లు చిక్కులు ఏర్పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఒక దూరవిద్య కోర్సు, ఒక రెగ్యులర్‌ కోర్సుకు వెసులుబాటు కల్పిస్తాయి.

దూరవిద్య కోర్సును అభ్యసించేముందు సంబంధిత విశ్వవిద్యాలయానికి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయం నుంచే కోర్సును అభ్యసించాలి.


1.  ప్రశ్న:సర్, CCL అంటే ఏమిటి? ఎలా వాడుకోవచ్చునో ? వివరించగలరు.


జవాబు:ఎవరైనా ఉద్యోగి అత్యవసర పరిస్థితులలో విధులకు హాజరు కావాలని ఆదేశించడం లేదా టర్న్ డ్యూటీ లు చేయడం వల్ల పబ్లిక్ హాలిడే లేదా ఆప్షనల్ హాలిడే వినియోగించుకోలేక పొతే అతని సెలవు ఖాతాకు నష్ట పరిహారపు సెలవు జమ చేస్తారు.* (CCL)

ఈ సెలవు ఆరు నెలల లోపు ఉపయోగించుకొన వచ్చును. గరిష్టంగా ఉద్యోగు సెలవు ఖాతాలో 7 నష్ట పరిహారపు సెలవులు నిల్వ ఉంటాయి.

ఈ సెలవు ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఒక క్యాలండర్ సంవత్సరంలో గరిష్టంగా 10 నష్ట పరిహారపు సెలవులు వాడుకొనవచ్చును. ఈ సెలవు వినియోగించుకోవడానికి ముందస్తు మంజూరు తప్పనిసరి. CL, OH మరియు ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును.

సెలవు రోజున అధికారిక పర్యటనల లో ఉంటే నష్ట పరిహారపు సెలవు ఇవ్వబడదు.


 ప్రశ్న:సర్, నేను 2018 అక్టోబర్ లో జూనియర్ అసిస్టెంట్ గా అపాయింట్ మెంట్ అయ్యాను. 2020 డిసెంబర్ లో ప్రొహిబిషన్ డిక్లరేషన్ కూడా అయ్యింది. అయితే నాకు ఎన్ని EL's క్రెడిట్ చేస్తారు ? వాటిని ప్రస్తుతం వాడుకోవచ్చా ? ఎన్ని హాఫ్ పే లీవ్స్ ఇయర్ కు వస్తాయి?* 


జవాబు:ప్రతి ఇయర్ కి 30 EL వస్తాయి. మీరు జాయిన్ అయిన తేదీ నుండి ప్రతి ఇయర్ complete అయితే 20 HPL డేస్ కలుస్తాయి. మీ అవసరతను బట్టి ఒక నెల (లేదా ) పదిహేను రోజులు వాడుకోవచ్చను.




3.  ప్రశ్న:

*ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు డిప్యూటేషన్ మీద  వెళ్ళవచ్చును?*


జవాబు:

*డిప్యూటేషన్ పై వెళ్ళేవారికి 5 సంవత్సరాల కాలం దాటకుండా ఉండాలి.*




4.  ప్రశ్న:

*20 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నది కదా? అందుకొరకు ఏమేమి సిద్ధం చేసుకోవాలో? వివరించగలరు.*


జవాబు:

*20 yrs అర్హత సర్వీసు పూర్తిచేసి ఉండాలి. ఎటువంటి allegations, charges disciplinary procs పెండింగులో లేవని ddo ధృవీకరించాలి, సివిల్ సర్జన్ జారీ చేసిన గుడ్ హెల్త్ సర్టిఫికెట్, కారుణ్యానియమకం అవసరం లేదని కుటుంబ సభ్యుల డిక్లరేషన్, అన్నిటితో పాటుగా వ్యక్తిగత దరఖాస్తు, SR, DDO లెటర్ ను నియామక అధికారికి ప్రతిపాదనలు సమర్పించాలి.

*సందేహాలు - సమాధానాలు*


1. ప్రశ్న:

*CPS ఉద్యోగులకు 50 వేల అదనపు పన్నురాయితీ కి అవకాశం ఉందా?*


జవాబు:

*అవకాశం ఉంది. అయితే దీనిని మ్యానువల్ రిటర్న్ లలో అనుమతించనప్పటికి ప్రస్తుతం e ఫైలింగ్ లో అనుమతించబడుతున్నది.*



2. ప్రశ్న:

*ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?*


జవాబు:

*G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*



3. ప్రశ్న:

*ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?*


జవాబు:

*A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా & Leave Salary payable in India after the end of each calender month & కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.*



4. ప్రశ్న:

*సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?*


జవాబు:

*FR-24 లో &Increment should be drawn as a matter of course,unless it is withheld & అని ఉంది. క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.*


5. ప్రశ్న:

*కారుణ్య నియామక  పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?*


జవాబు:

*కుటుంబ పెన్షన్ వస్తుంది. కాని  G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు. అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.

*సందేహాలు - సమాధానాలు*


1. ప్రశ్న:

*ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?*


జవాబు:

*జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.*



2. ప్రశ్న:

*నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైమ్ చేసుకోవచ్చు.?*


జవాబు:

*మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.*



3. ప్రశ్న:

*ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?*


జవాబు:

*వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.*



4. ప్రశ్న:

*ఐటీ లో ధార్మిక సంస్థలకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?*


జవాబు:

*కొన్ని సంస్థలకు 100% , మరికొన్ని సంస్థలకు 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*



5. ప్రశ్న:

*పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు?*


జవాబు:

*వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగులకి (నాన్ గెజిటెడ్) 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.

*🏵️సందేహాలు - సమాధానాలు*


*♦️❓ప్రశ్న:*

నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??

*✅జవాబు:*

ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.

•••••••••

*♦️❓ప్రశ్న:*

SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??

*✅జవాబు:*

అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.

•••••••••

*♦️❓ప్రశ్న:*

ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??

*✅జవాబు:*

103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.

•••••••••

*♦️❓ప్రశ్న:*

ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

*✅జవాబు:*

చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.

•••••••••

*♦️ ❓ప్రశ్న:*

చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??

*✅జవాబు:*

అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.

ప్రశ్న:సర్ ఏదైనా బిల్ ట్రేసరి కి పంపిన తర్వాత ఎన్ని రోజుల లోగా ఆ బిల్ ను అప్రూవ్ లేదా రిజెక్ట్ చెయ్యాలి?

జవాబు:బిల్ స్వభావాన్ని బట్టి 3 నుండి 7 రోజులలోగా రిజెక్ట్/ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

 ప్రశ్న:ఫైనాన్స్ బెనిఫిట్ లేకపోయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి ఇప్పుడు పి ఆర్ సి ప్రకారం fitment  పొందవచ్చా?

జవాబు:నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చాక ప్రస్తుతపు బేసిక్ ఆధారంగా PRC Time Scale ప్రకారం ఫిట్ మెంట్ చేసి Basic Pay ని Fix చేసాక, ఆ Fix చేసిన Basic కి Regular benefit పొందవచ్చు.

Wef date A నెల నుండి D నెల వరకు నోషనల్  అని E నెల నుండి G వరకు GPF/ZPPF/CPS అకౌంట్ లో అని, H నుండి Cash అన్నపుడు మీకు ఆ నోషనల్ ఇంక్రిమెంట్ benefit ఈ periods లో కలిసి పోయి, Cash Benefit Period నుండి  Fix అయిన Basic Pay నుండి Regular benefits పొందవచ్చు.

ప్రశ్న:సర్, ప్రమోషన్, అపాయింట్మెంట్ బై ట్రాన్స్‌ఫర్ అనే ఈ రెండు ఒక్కటేనా? వివరించగలరా?

జవాబు:"ప్రమోషన్" అంటే మీరు ఒక క్యాడర్ నుండి వేరే పై క్యాడర్ కి ప్రమోట్ అయ్యి ఆ పై క్యాడర్ యొక్క సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఉన్న క్యాడర్ యొక్క సర్వీస్ రూల్స్ same అయి ఉంటే అది ప్రమోషన్ అంటారు.

అలా కాకుండా మీ present క్యాడర్ నుండి ఇంకో క్యాడర్ కి వెళ్ళినప్పుడు ఆ పై క్యాడర్ యొక్క సర్వీస్ రూల్స్ వేరేవి అయి ఉంటే దానిని అపాయింట్మెంట్ by ట్రాన్స్ఫర్ అంటారు.


ఉదాహరణకి: ఒక JA అనేవాడు SA అయితే అది ప్రమోషన్, వారి సర్వీస్ రూల్స్ ఒకటే APMS.

అలా కాకుండా ఒక అటెండర్ (OS) అనే వాడు JA అయ్యాడు అనుకుందాం. అంటే APLGS రూల్స్ నుండి APMS రూల్స్ కి వెళ్తాడు. కాబట్టి APPOINTMENT BY TRANSFER అవుతుంది.


1. ప్రశ్న:

*అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా?*


జవాబు:

*జీఓ.28; తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.*



2. ప్రశ్న:

*నా వయస్సు 57 ఇయర్స్. నేను ఇప్పుడు TSGLI ప్రీమియం పెంచవచ్చా?*


జవాబు:53 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు. బాండ్ కూడా ఇవ్వరు.


 ప్రశ్న:చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో ఎన్ని రోజులు  వాడుకోవచ్చు?


జవాబు:లీవు ఆరు సార్లకు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.అంటే ఒక్క రోజు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి15రోజులకు మించకూడదు

నిబంధనల కు లోబడి ఒక సంవత్సరం లో ఎన్ని రోజులు అయినా వాడుకోవచ్చు.


ప్రశ్న:నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను. నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?

జవాబు:మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు. తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు, SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.

ప్రశ్న:తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా?

జవాబు:విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ: 14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.

ప్రశ్న:నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను. నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా?

జవాబు:లేదు. మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతుంది.

ప్రశ్న:మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు. రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను. ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా?

జవాబు:అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న:నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను. పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా?

జవాబు:పెన్షన్ ను ఆదాయంగా చూపాలి. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సంపాదిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.

ప్రశ్న:నేను బదిలీ అయ్యాను. పాత మండలంలో చాలా ఎంట్రీలు వేయలేదు. ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు. ఆ ఎంట్రీల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి?

జవాబు:సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చ.

ప్రశ్న:నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగంనకు ఎంపిక అయ్యాను. నేను ఆ ఉద్యోగంలో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా?

జవాబు:జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టులో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది. అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న:సార్ ఒక టీచర్ కి సంవత్సరకాలానికి 6 సంపాదిత సెలవులు ఇస్తాము. అతను డెప్యుటేషన్ పై అడల్ట్ ఎడ్యుకేషన్ లో పనిచేశారు. 30 రోజులు సంపాదిత సెలవు నమోదు చేయాలంటే సదరు డిపార్ట్మెంట్ వారు విడిగా ప్రొసీడింగ్స్ ఇవ్వాలా, లేక డైరెక్టుగా 30 రోజులు మేము నమోదు చేయవచ్చునా?

సమాధానం:మీ నాన్ టీచింగ్ స్టాఫ్ సెలవుల్లో పని చేస్తే ఏ విధానాన్ని ఫాలో అవుతారో అదే మీరు ఫాలో అవడమే. జీతం ఎవరు ఇచ్చారో, వారే SR లో నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి డిప్యుటేషన్ లో ఉన్న అడల్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొసీడింగ్స్ తెచ్చుకుని (prevention summer holidays) ఇక్కడ సాలరీ DDO HM/MEO తో నమోదు చేయించుకోవాలి

ప్రశ్న:సర్ ఎవరయినా CPS గురించి క్లియర్ గా చెప్పండి. కొత్తగా ఉద్యోగం వచ్చి పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు తెలియదు. ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్పటం లేదు. అసలు CPS విధానం లేక ముందు ఎలా ఉండేది? CPS ఎప్పుడు తీసుకు వచ్చారు? CPS విధానం వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కాస్త వివరంగా చెప్పగలరు? మేము కూడా ఈ పోరాటంలో బాగస్వాములం అవుతాం*

సమాధానం:CPS విధానంపై అవగాహన-1

మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అమలౌతున్న సర్వీస్ పెన్షన్ లు 2 రకాలు

1.1980 పెన్షన్ రూల్స్ (ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్)

ఈ విధానం 2004 ఆగస్ట్ 31 వరకు ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అయిన వారికి వర్తిస్తుంది.

Note: ఈ విధానంలో ఉద్యోగి జీతం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది

CPS(Contributory pension scheme)

ఈ విధానం 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అయిన వారికి వర్తిస్తుంది.

ఈ విధానంలో ఉద్యోగి జీతంలో (PAY+DA) లో 10% జీతాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాన్ని పెన్షన్ గా ప్రభుత్వేతర సంస్థలు* ఉద్యోగికి పెన్షన్ ఇస్తాయి.


CPS విధానం పై అవగాహన -2

ఉద్యోగి తను ప్రతీ నెలా (Pay+DA) లో 10% జీతానికి సమానమైన వాటాను కలిపి ట్రస్టీ బ్యాంక్ (Axis bank)కు పంపి ఫండ్ మేనేజర్లు (SBI, LIC, UTI) ద్వారా ఆ మొత్తాన్ని  షేర్ మార్కెట్ లో NAV లను కొని పెట్టుబడి  పెడుతుంది. *మనకు నచ్చిన లాభాన్ని ఇచ్చే NAV (నెట్ అసెట్ వేల్యూ) లను కొనే అవకాశం ఉద్యోగికి లేదు*. ఫండ్ మనేజేర్స్ వారికి నచ్చిన ఫండ్స్ లో మన డబ్బుని పెట్టుబడి పెడతారు.

Note: Chapter 6 లో 20(2)(g) ప్రకారం షేర్ మార్కెట్ లో ఉన్న మన సొమ్ముకు ఎటువంటి గ్యారెంటీ లేదని చెప్పటం జరిగింది.* అంటే *మనకు నష్టం వచ్చిన ప్రభుత్వానికి గానీ ఫండ్ మనేజర్స్ కు గానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతా రాహిత్యం.

గతంలో YES బ్యాంక్ దివాలా తీయటం మనం చూసే ఉన్నాం. Axis Bank ఈ పరిస్థితికి రాదని గ్యారెంటీ లేదు.

ప్రభుత్వం GO Ms No 655, Ft:22/09/2004 ఇప్పుడు ఇస్తున్న 10% మాచింగ్ గ్రాంట్ ను భవిష్యత్ లో ఒక కొత్త GO ఇవ్వటం ద్వారా 5% లేదా2% తగ్గించ వచ్చు లేదా పూర్తిగా తీసివేయవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది.

సింపుల్ గా చెప్పాలంటే....

ఇప్పుడు రిటైర్ అయిన ఒక ఉద్యోగి కి పాత పద్ధతిలో పెన్షన్ అయితే 50000 వస్తుంది అనుకుంటే, NPS లో 20000 వస్తుంది.

పాత విధానంలో మొత్తం 50000 ప్రభుత్వమే ఇస్తే, NPS లో వచ్చే 20000 లో సగం వాటా ఉద్యోగులది.

పాత విధానంలో 50000 DA, PRC లు పెరిగినపుడల్లా పెరిగి 20 ఏళ్ళ తరువాత 1 లక్ష వరకు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

NPS లో 20 ఏళ్ల తరువాత కూడా అదే ఇరవై వేలు ఉంటుంది.

కనీసం చెప్పిన 20000 కూడా గ్యారంటీ ఏమీ ఉండదు. స్టాక్ మార్కెట్ పై ఆధారపడి అది 15000 కావచ్చు, 25000 కావచ్చు.

(సిపిఎస్ పై నాకు ఉన్న అవగాహన మాత్రమే. ఇంకా అనుభవజ్ఞులైన వారిని కూడా అడగండి)

ప్రశ్న:నేను 2 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు నల్గొండ జిల్లాలో చదివాను. తర్వాత ప్రైవేట్ గా పదవ తరగతి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ గా చదివినట్టు ప్రైవేట్ పాఠశాల వారు దగ్గరలో గల గవర్నమెంట్ హైస్కూల్ లో ప్రైవేట్ సర్టిఫికెట్ ద్వారా ఎస్ఎస్సి రాయించారు. మరి ఇప్పుడు ఖమ్మం జిల్లాకి నేను లోకల్ అవుతాను కదా!? వీలైతే వివరంగా చెప్పగలరు

సమాధానం:4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే అది లోకల్ గా ట్రీట్‌ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా కొన్ని తరగతులు ఒకచోట, మరికొన్ని వేరొక చోట చదివిన సందర్భంలో ఎక్కువ కాలం ఎక్కడ చదివి యున్నారో అదే లోకల్ గా ట్రీట్ చేస్తారు. కనుక ఇప్పుడు మీకు నల్గొండ లోకల్ అవుతుందే కానీ ఖమ్మం జిల్లా కాదు

ప్రశ్న:3 రోజుల క్రితం నా స్నేహితురాలు ఒకరు ప్రమాద జరిగి మరణించారు. తను అటవీ శాఖలో 4వ తరగతి  ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ మరణించారు. తనకి ఇంకా వివాహం కాలేదు. తనకి ఉద్యోగం కూడా బ్యాక్ లాగ్ ద్వారా నియామకం చేయడం జరిగింది. ఇప్పుడు తను మరణించారు కనుక తను కుటుంబ సభ్యులు ఎవరికయినా కారుణ్య నియమకం ఇస్తారా ఇది నా సందేహం. దీని గురించి చెప్పగలరు.

జవాబు:తప్పకుండా ఇస్తారు. తన కన్నా చిన్న వారు తమ్ముడు చెల్లెలు అర్హత కలిగి ఉంటే కారుణ్యా నియమకం ఇస్తారు. తల్లిదండ్రులకు నియామకానికి అర్హత లేదనుకుంటాను.

ప్రశ్న:మా ఏరియాలో ప్రభుత్వ టీచర్ ఒకరు ముఖ్యమంత్రి గార్కి వ్యతిరేకం ఉన్న పోస్ట్ తో whatsapo DP పెట్టుకున్నాడు. గ్రామస్తులు తన పై ఉన్నతాధికారులు కు కంప్లెయింట్ ఇచ్చారు. టెన్షన్ పడుతున్నాడు. అలా పెట్టుకోవడం తప్పా?*

జవాబు:కండక్ట్ రూల్ 17 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించకూడదు. దీనికి ఒక మినహాయింపు ఏమిటంటే ఉద్యోగులు వారికి చెందిన సమస్యల పట్ల కేవలం ఉద్యోగులే ఉన్న వేదికలపై తన అభిప్రాయాలు పంచుకొవచ్చు.*

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ ని DP గా పెట్టుకోవడం అంటే ఈ రూల్ క్రింద తప్పుగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే DP అనేది పబ్లిక్ గా అందరికీ display అయ్యేది. అలాగే ఉద్యోగి రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ ప్రచారాలు కానీ పెట్టుకోకూడదు, ప్రచారం చేయకూడదు (అధికారంలో ఉన్న పార్టీ తరపున అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరపున అయినా సరే). దీనిని కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది.*

ప్రశ్న:నేను 2018 డి.యస్.సి. లో ex-serviceman కోటలో రెసిడెన్షియల్ స్కూల్ లో  పి.ఈ. టి. గా సెలెక్ట్ అయితిని, నాకు ఆర్మీ లో ఇచ్చిన pay scale ఇక్కడ పొందుటకు ఏమి అయిన జి. ఓ. లు గాని ఎలా పొందాలో తెలుపగలరు.*

జవాబు:మీకు GO MS No. 95 Finance (FR II) Dept DT. 03.04.2012 is applicable for Ex Service men pay fixation

ప్రశ్న:సర్, ప్రమోషన్ ఇచ్చే సమయంలో స్పౌజ్ ప్రియారిటీ ఉంటుందా? ట్రాన్స్‌ఫర్ సమయంలో స్పౌజ్ కు ప్రియారిటీ ఇస్తున్నారు కదా ! ప్రమోషన్స్ లో కూడా ఇస్తారా? తెలుపగలరు.

జవాబు:Promotion కి spouse కి సంబంధము ఉండదు. ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. పదోన్నతులకి అర్హత విషయంలో spouse వల్ల ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. పదోన్నతుల సందర్భంలో ఇచ్చే పోస్టింగ్ విషయంలో ఎలాంటి ప్రభుత్వ మార్గదర్శకాలు లేవు కాబట్టి నియామక అధికారులు వారి విచక్షణాధికారం మేరకు ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా కౌన్సిలింగ్ నందు కోరుకునే అవకాశాన్ని బట్టి ఉంటుంది

ప్రశ్న:Sir చిన్న clarification medical leave 240 days entire service లో ఉపయోగించుకోవాలి. అంటే commutation చేస్తే 480 యేనా? దయచేసి clarity ఇవ్వండి.

జవాబు:అవును సర్.  మొత్తం సర్వీస్ లో 240 కముటెడ్ లీవ్ వాడుకోవచ్చు. 480 హాఫ్ పే లీవ్స్ డెబిట్ అవుతాయి.

ప్రశ్న:Declaration of Probation చేయడానికి Date of Joining consider చేస్తారా సార్, లేదా Appointment Order date ని consider చేస్తారా సార్ ? ఏదైనా జీవో ఉన్నదా? చెప్పగలరు.

జవాబు:Date of Joining ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ మీకన్నా మెరిట్ లిస్ట్ లో ముందున్న వారు కనుక మీ కన్నా ఆలస్యంగా చేరితే, వారు చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. AP State and Subordinate Service Rules, 1996 చూడండి.

ప్రశ్న:ఫైనాన్స్ బెనిఫిట్ లేకపోయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి ఇప్పుడు పి ఆర్ సి ప్రకారం fitment  పొందవచ్చా?

జవాబు:నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చాక ప్రస్తుతపు బేసిక్ ఆధారంగా PRC Time Scale ప్రకారం ఫిట్ మెంట్ చేసి Basic Pay ని Fix చేసాక, ఆ Fix చేసిన Basic కి Regular benefit పొందవచ్చు.

Wef date A నెల నుండి D నెల వరకు నోషనల్  అని E నెల నుండి G వరకు GPF/ZPPF/CPS అకౌంట్ లో అని, H నుండి Cash అన్నపుడు మీకు ఆ నోషనల్ ఇంక్రిమెంట్ benefit ఈ periods లో కలిసి పోయి, Cash Benefit Period నుండి  Fix అయిన Basic Pay నుండి Regular benefits పొందవచ్చు.

ప్రశ్న:ఒక ఉద్యోగి పదోన్నతి పొంది వేతన స్థిరీకరించేందుకు వ్రాతపూర్వకమైన లెటర్ ఇవ్వకపోతే ఏమి చేయాలి? ఏదైనా జీ వో ఉన్నదా?

జవాబు:GO 145/19-5-2009 లోని అంశాల ప్రకారం పదోన్నతి పొందిన ఉద్యోగి వేతన స్థిరీకరణ కోసము ఒక నెల లోపు వ్రాత పూర్వక అభీష్టం తెలపకపోయిన యెడల సంబంధిత డీడీఓ ఆ ఉద్యోగికి అత్యంత లాభదాయిక ఉండు పద్ధతిలో వేతన స్థిరీకరణ చెయ్యాలి.

ప్రశ్న:Sir, హిస్తరెక్టమి ఆపరేషను జరిగితే దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు కదా... మరి జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా? కొంచెం తెలుపగలరు*

జవాబు:ఏ సెలవు పెట్టినా జీతం రొటీన్ గా ఇవ్వరు. మీరు పెట్టిన సెలవు మంజూరు అయితేనే ఇస్తారు. జీతం బిల్లు తయారు చేసే సమయానికి మంజూరు అయితే అందరితో పాటు వస్తుంది. లేకపోతే ఎప్పుడు మంజూరు చేస్తే అప్పుడు వస్తుంది. మీకు ఆ ఆపరేషన్ అయిన తరువాత మీ ఆఫీస్ వాళ్ళు sanction ప్రొసీడింగ్స్ ఇస్తే, అది బిల్ కి enclose చేస్తే జీతం వస్తుంది.

ప్రశ్న:A) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా? హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?

B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది: 23-4-2013న భద్రాద్రి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం,,లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు. వీరిలో ఎవరు సీనియరు?

జవాబు:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సందర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది. 2000 సం,,రంలో అదే జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.

ప్రశ్న:ఒక వ్యక్తికి 21.11.2017 కి. 12 years Complete అయింది,. కానీ అతను 09-03-2021 లో Dept Test పాస్ అయ్యారు. ఇప్పుడు అతనికి 12 years 22-11-2017 నుంచి వర్తిస్తుందా? లేక 09.03.2021 నుండి వర్తిస్తుందా? దయచేసి వివరించగలరు*

జవాబు:చివరి exam జరిగిన తేదీ తర్వాత రోజు నుంచి 12 ఇయర్స్ వర్తిస్తుంది.

ప్రశ్న:CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాల్ చేసుకోవచ్చు?

జవాబు:మూడు సందర్భాలలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో, మరణించిన సందర్భంలో, పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో

ప్రశ్న:ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు. అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు?

జవాబు:అతనికి 2015, 2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి, 2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి మంజూరు చేస్తారు.

 ప్రశ్న:సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా?

జవాబు:వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.

ప్రశ్న:నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా?

జవాబు:అవకాశం లేదు.

 ప్రశ్న:నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి?

జవాబు:CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

ప్రశ్న:నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా?

జవాబు:ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.

 ప్రశ్న:ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా?

జవాబు:చేర్చకూడదు. అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రశ్న:నా భార్య హౌస్ వైఫ్. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా?

జవాబు:జీఓ. 802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

ప్రశ్న:మెడికల్ సెలవులో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?

జవాబు:చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది. మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు. అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

ప్రశ్న:స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జవాబు:స్వచ్ఛంద ఉద్యోగ విరమణకి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR, 10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు, సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి

ప్రశ్న:సమ్మర్ హాలిడేస్ టీచర్లకు ఎందుకు ఇస్తున్నారు? మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఎందుకు ఇవ్వరు?

జవాబు:సమ్మర్ హాలిడేస్ ఉపాధ్యాయుల హక్కు కాదు. అది విద్యార్థులు సౌలభ్యం కోసం ఉన్నవి. నిపుణుల సూచన మేరకు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుదల కోసం పెట్టినవి. అందుకని విద్యాశాఖను వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించడమైనది. వారికి వెకేషన్ పీరియడ్ ఉండటం వలన EL's సంవత్సరానికి 6 మాత్రమే ఇస్తారు. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి సంవత్సరానికి 30 EL's ఇస్తారు.

 ప్రశ్న:మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?

జవాబు:చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది. మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు. అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

ప్రశ్న:స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జవాబు:స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు, సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి.

ప్రశ్న:Medical reimbursement children age లిమిట్ ఎంత? ఒకవేళ లిమిట్ దాటి వివాహములు కాని వారికి ఏమైనా మినహాయింపు ఉంటుందా?

జవాబు:మెడికల్ రీయింబర్స్మెంట్ 25 Years వరకు ఏజ్ లిమిట్ ఉంది. 25సం,,రములు దాటిన యెడల ఎటువంటి మినహాయింపు లేదు.

ప్రశ్న:ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అయిన 57 సం/ టీచర్ got, eot నుండీ మాకు మినహాయింపు ఉంది అని 12 years స్కేల్ శాంక్షన్ చేయమంటున్నారు. ఇవ్వావచ్చునా? అయితే అతను eot, got టెస్ట్ లు పాస్ అవ్వలేదు. ఏమిచేయాలి?

జవాబు:ఒక్క ప్రమోషన్స్ కొరకు మాత్రమే మినహాయింపు ఉంది. 12 years స్కేల్ కొరకు ఎటువంటి రిలాగ్జేషన్ లేదు. 12 years Scale కావాలంటే తప్పనిసరిగా E.O.T. and G.O.T. పాస్ కావాలి. కావున ఆ సర్ E.O.T & G.O.T పాస్ కానందున 12 years Scale ను మంజూరు చేయకూడదు. Age relaxation for first promotion only

ప్రశ్న:అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

జవాబు:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.   

ప్రశ్న:ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?

జవాబు:ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.    

ప్రశ్న:ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

జవాబు:వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.

(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

ప్రశ్న:దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

జవాబు:FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.

ప్రశ్న:ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?

జవాబు:ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.

ప్రశ్న:సమ్మర్ హాలిడేస్ టీచర్లకు ఎందుకు ఇస్తున్నారు? మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఎందుకు ఇవ్వరు?

జవాబు:సమ్మర్ హాలిడేస్ ఉపాధ్యాయుల హక్కు కాదు. అది విద్యార్థులు సౌలభ్యం కోసం ఉన్నవి. నిపుణుల సూచన మేరకు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుదల కోసం పెట్టినవి. అందుకని విద్యాశాఖను వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించడమైనది. వారికి వెకేషన్ పీరియడ్ ఉండటం వలన EL's సంవత్సరానికి 6 మాత్రమే ఇస్తారు. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి సంవత్సరానికి 30 EL's ఇస్తారు.

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)

👉 పాస్ పోర్ట్ కు కాని, విదేశాలకు వెళ్ళడానికి అనుమతి పొందేందుకు ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి.అది ఎవరు మంజూరుచేస్తారు. ఏమేమి ధృవపత్రాలు సమర్పించాలి అను విషయంలో చాలామంది ఉపాధ్యాయులకు స్పష్టతలేదు.అట్టి విషయంలో కొంత సమాచారం.

👉 SA,SGT,LP,PET తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులకు నో అబ్జెక్షన్  సర్టిఫికెట్ జారిచేయు అధికారం జిల్లా విద్యాశాఖాధికారి గారికి,గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,యం.ఈ.వో ల విషయంలో RJD లకు అధికారమిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆర్.సి.నం.212/SER-IV-2/2014;తేది:26-2-2015 ను జారీచేసింది.

👉 పాస్ పోర్ట్ పొందుటకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి ఒక ఒరిజినల్ సెట్,ఒక జిరాక్స్ సెట్ సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD కార్యలయంలో సమర్పించాలి. 3 పాస్ పోర్ట్ ఫొటోలు అదనంగా జత చేయాలి.


👉 విదేశాలకు వెళ్ళుటకు అనుమతి కొరకు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి 3 ఒరిజినల్ సెట్లు,సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD  కార్యలయంలో సమర్పించాలి.

సందేహం:సర్వీస్ బుక్ (New format ) లో కేవలం AGI కి సంబందించిన పేజీలు సరిపోవడం లేదు. కొత్తగా కొన్ని పేజీలు add చేయాలా? లేక ఇంకో SB కొని volume 2 గా నిర్వహించుకోవాలా?

సమాధానం:Go ms no 216 dt 21.6.64 ప్రకారం సర్వీస్ బుక్ పూర్తి అయిన యెడల దానికి పేజీలు చెర్చరాదు,కాని రెండవ సర్వీస్ బుక్ ను volume -ll గా కొనసాగించాలి

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

SMC 2024 ELECTION

కొత్త GPF వెబ్సైట్ లో మీ యొక్క జిపిఎఫ్ వివరాలు చెక్ చేసుకునే విధానం