Posts

Showing posts from November, 2022

పెన్షనర్ మరణిస్తే ఏం చేయాలి ?

Image
  పెన్షనర్ మరణిస్తే సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులు మరణించిన పెన్షనర్లకు రావలసిన ప్రయోజనములు ఏవో తెలుసుకోవలసి ఉంటుంది.  ఇందుకు వారి కుటుంబ సభ్యులే కాకుండా, వారి బంధుమిత్రులు కూడా అవగాహన కలిగి ఉండాలి.  ఈ క్రింది విషయాలు గమనించగలరు: 1) సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో అట్టి విషయమును సంబంధిత ట్రెజరీ అధికారులకు ఫోన్ ద్వారా గాని లేదా లిఖితపూర్వకంగా గాని నమ్మకమైన వ్యక్తుల ద్వారా తెలియజేయాలి. 2) పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యధావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలుపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 3) పెన్షనర్ మరణించిన విషయము తెలియజేయునపుడు తప్పకుండా వారి *పి.పి. వో. నెంబర్, పి. పి. ఓ. ఐ. డి. నెంబర్, మరియు పేరు ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి*  4) సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ కేవలం ఒక అప్లికేషన్ మరణ ధ్రువీకరణ పత్రం జతపరుచుచూ ట్రెజరీ అధికారి గారికి పెట్టినచో అ

బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు

Image
  బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు. బయోమెట్రిక్ మిషన్ ను రాష్ట్ర విద్యాశాఖ తరఫున బయోమెట్రిక్ డిపార్ట్మెంట్ వారు వివిధ పాఠశాలలకు అందించడం జరుగుతుంది. బయోమెట్రిక్ మిషన్ పాఠశాలకు అందించేటప్పుడు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఐడి లు కేటాయించి వారి వివరాలన్నీ అందులో పొందుపరిచిన తరువాత, ప్రధాన ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ మిషన్ ను అందిస్తారు. బయోమెట్రిక్ డేటా మొత్తం ఆధార్ డేటా తో అనుసంధానం అయి ఉంటుంది. పాఠశాల సిబ్బందితోపాటు ఆ పాఠశాలలో స్టూడెంట్ ఇన్ఫో ప్రకారం నమోదు అయిన ప్రతి పిల్లవానికి ఒక బయోమెట్రిక్ ఐడిని కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ బయోమెట్రిక్ టెక్నీషియన్స్ మిషన్లలో సేవ్ చేసి ఇస్తారు. బయోమెట్రిక్ మిషన్లో యుఐడిఏఐ ఆధారంగా తంబు వేస్తూ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వేలి ముద్రల ద్వారా హాజరు నమోదు కానీ వారు, ఐరిష్ (కంటి పాప) స్కాన్ చేయడం ద్వారా హాజరు వేయవలసి ఉంటుంది. ఆధార్ లో  వేలిముద్రలు అప్డేట్ చేసుకున్న వారికి వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ మిషన్ లో హాజరు నమోదు అవుతుంది. కొంతమంది విద్యార్థులకు వేలిముద్రలు అప్డేట్ చేసి ఉండవు