అర్ధ వేతన సెలవు నిబంధనలు
అర్థవేతను సెలవు నిబంధనలు ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules లో 13,18,23 నందు పొందుపరచారు. సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సంవత్సరానికి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సంవత్సరం నకు కొన్ని రోజులు తక్కువైనను ( సంవత్సరం పూర్తి కాకుంటే) ఈ సెలవు జామచేయకూడదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967) ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీసు క్రింద పరిగణిస్తారు. అర్జిత (Earned Leave) సెలవు మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సంవత్సరం సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు. అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు. 1.వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate) - ( 100%) 2.స్వంత వ్యవహారాలపై (Private Affairs) ( 50% - జీతం) ఈ కారణాలతో అర్థవేతన సెలవు మంజూరు చేయించుకోవచ్చు 👉 ఉద్యోగి అనారోగ్య చికిత్స కోసం ( 100% pay) 👉 అర్ధ వేతనం ఈ క్రింది కారణాలతో ఉద్యోగి కుటుంబ సభ్యులచికిత్స కోసం ఉద్యోగి ఉన్నత విద్య కోసం ఉద్యోగి పిల...