Adding the teacher's name from the old school to the transferred new school

 Left school ➡️ import teacher

ఇటీవల ఉపాధ్యాయ బదిలీలు పూర్తి అవ్వడం జరిగింది. 



బదిలీ అయిన ఉపాధ్యాయులు వారి యొక్క పాత స్కూల్ నుండి వారి పేరును LEFT SCHOOL చేయాల్సి ఉంటుంది.

 ఆ తర్వాత వారు ట్రాన్స్ఫర్ అయినటువంటి కొత్త స్కూల్లో IMOPRT చేసుకుని add చేయాల్సి ఉంటుంది. 

ఈ ప్రాసెస్ అంతా కూడా మీ మొబైల్ లో చేయడానికి వీలవుతుంది. 

మీరు యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసి  చేయండి. 

కుడివైపు పైన మూడు లైన్స్ కనిపిస్తాయి. ఒకసారి క్లిక్ చేయండి. 

 లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. మీకు అన్ని రకాల లాగిన్స్ కనిపిస్తాయి.

ఇక్కడ teachers profile లాగిన్ చేయండి.

నెక్స్ట్ టీచర్ DCF ఎడిట్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి.

    in school activities 

తర్వాత స్క్రీన్ లో మీకు ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది సంఖ్య చూపిస్తుంది. (ఆ సంఖ్య పక్కన add న్యూ టీచర్ లేదా add న్యూ నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఉంటుంది ఇది కొత్తగా రిక్రూట్ అయిన వారి కోసం ఉపయోగించేటటువంటి ఆప్షన్).

మన నేమ్ ఆల్రెడీ add అయి ఉంటుంది కాబట్టి మీరు మీ పేరును ఆ స్కూల్ నుంచి లెఫ్ట్ చేయడానికి టీచర్స్ సంఖ్యపై ఒకసారి క్లిక్ చేయండి. 

తర్వాత పేజీలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరి టీచర్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి మీ పేరుకు కుడి పక్కన *Left Shool* అనే ఆప్షన్ ఉంటుంది.

లెఫ్ట్ స్కూల్ ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీ డీటెయిల్స్ తో పాటు చివర్లో reason సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

రీజన్ బాక్సులో transfer సెలెక్ట్ చేసుకోండి. 

డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అక్కడ కూడా ట్రాన్స్ఫర్ టు మీ కొత్త స్కూల్ పేరు రాయండి.

 తరువాత last date in service school అని ఉంటుంది. అక్కడ మీరు మీ relieving date సెలెక్ట్ చేయండి.

అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత

 left school క్లిక్ చేయండి. మీ పేరు ఆ స్కూల్ డ్రాప్ బాక్స్ లోకి వెళ్తుంది. 

ఆ తర్వాత మీరు జాయిన్ అయినా కొత్త స్కూల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో యుడైస్ ప్లస్ ఓపెన్ చేసి మళ్లీ టీచర్ మాడ్యూల్ లాగిన్ చేయాలి. 

టీచర్ డిసిఎఫ్ లోకి వెళ్లినట్లయితే అక్కడ పైన import టీచర్ అని కనిపిస్తుంది. 

ఇంపోర్ట్ టీచర్ క్లిక్ చేయండి ఆ తర్వాత టీచర్ యొక్క నేషనల్ కోడ్ మరియు డేట్ అఫ్ బర్త్ అడుగుతుంది. మీ నేషనల్ కోడ్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇంపోర్ట్ చేయండి మీ పేరు కొత్త పాఠశాలలో యాడ్ అవుతుంది. 

ఒకవేళ మీకు నేషనల్ కోడ్ తెలియనట్లయితే ఆ పక్కనే సెర్చ్ నేషనల్ కోడ్ కూడా ఉంటుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఇచ్చినట్లయితే మీ యొక్క నేషనల్ కోడ్ కనిపిస్తుంది. (in school activities)

టీచర్ను బదిలీ చేయడానికి ఇక్కడ CLICK చేయండి


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS