గ్రామ పంచాయతీ ఎన్నికల FAQ
1.గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ బ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది ? జ: గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ బ్యాలెట్ పింక్ కలర్ లో ఉంటుంది. బ్యాలెట్ లో రెండు భాగాలు ఉంటాయి. 1. కౌంటర్ ఫైల్ 2. ఓటరుకు ఇవ్వవలసిన బ్యాలెట్ పత్రం. PO తనకు ఇవ్వబడిన బ్యాలెట్లు సరిచూసుకుని కౌంటర్ ఫైల్ పై గ్రామపంచాయతీ పేరు, గ్రామపంచాయతీ నెంబర్, వార్డు నెంబరు రాసి ఉంచుకోవాలి. బ్యాలెట్ పేపర్ భాగంలో ఎలాంటి రాతలు రాయకూడదు. బ్యాలెట్ పేపర్ను వెనుకకు తిప్పి కుడివైపు పైన, కింద డిస్టింగిష్డ్ స్టాంపు వేయాలి. కౌంటర్ ఫైల్ పై మరియు బ్యాలెట్ పేపర్ పై వెనక వైపు కుడివైపున ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాలి. డిస్టింగేష్డ్ స్టాంపు వేసేటప్పుడు మరియు సంతకం చేసేటప్పుడు అవి గుర్తుల పైకి వెళ్లకుండా చూసుకోవాలి. కౌంటర్ ఫైల్ కు మరియు ఓటర్ కు ఇవ్వవలసిన బ్యాలెట్ కు మధ్యలో ఒక గొలుసు ప్రింటు ఉంటుంది. గొలుసు ప్రింటుపై స్కేల్ పెట్టి బ్యాలెట్ పేపర్ ను జాగ్రత్తగా చింపి మడత పెట్టీ ఓటర్ కు ఇవ్వాలి. ఓటరు బాణాల క్రాస్ మార్క్ తో తన ఓటును గుర్తించి మళ్లీ అలాగే మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేస్తాడు. 👉 సర్పంచ్ అ...