SSC TELUGU - RAMAYANAM ముఖ్యమైన మూడు ప్రశ్నలు - జవాబులు

 

in school activities: Q 1. రామ రావణ యుద్ధ వృత్తాంతం.



1.రావణుడు సీతను అపహరించడం వలన రామ రావణ యుద్ధం జరుగుతుంది. 

2.ఈ యుద్ధంలో శ్రీరామునికి హనుమంతుడు మరియు సుగ్రీవుడు అతని వానరసేన సహాయం అందిస్తారు. 

3.అరణ్య లో ఉండగా రావణుని చెల్లెలు శూర్పనక శ్రీరామున్ని చూసి ఇష్టపడుతుంది. తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. 

3. శ్రీరాముడు ఆమె కోరికను తిరస్కరిస్తాడు.

4. ఇది అవమానంగా భావించిన సూర్పనఖ రామలక్ష్మణులతో గొడవ పడుతూ సీతా దేవిని నిందిస్తూ, లక్ష్మణునితో గొడవ పడుతుంది. లక్ష్మణుడు ఆమెను అణిచివేయడానికి ముక్కు, చెవులు కోసి పంపిస్తాడు. 

5.కోపంతో వెళ్లిన శూర్పణఖ అవమాన భారంతో జరిగిన విషయాన్ని తన అన్న అయిన రావణునికి వివరిస్తుంది. సీతను అపహరించి వివాహం చేసుకోవాలని కోరుతుంది.

6.శ్రీరాముని మీద కోపంతో రావణుడు సీతను అపహరించాలని పన్నాగం వేస్తాడు. 

7.మారీచుని మాయాబంగారులేడిలా మారి, కుటీరం వద్ద సీతకు కనిపించాలని ఆజ్ఞాపిస్తాడు. 

8.అడవిలో బంగారు లేడిని చూసిన సీత, తనకా లేడి కావాలని శ్రీరామున్ని అడుగుతుంది.

8.శ్రీరాముడు లక్ష్మణున్ని, సీతకు రక్షణగా ఉంచి తను లేడిని బంధించడానికి బయలుదేరుతాడు. 

9.కొంత దూరం వెళ్లినాక శ్రీరాముడు లేడి పైకి బాణం సంధిస్తాడు. అప్పుడు మాయా మారీచుడు లక్ష్మణా , సీతా అంటూ అరిచి నేలకొరుగుతాడు.

10. ఆ అరుపులు విన్న సీత, శ్రీరామునికి ఏదో అపాయం జరిగినది వెంటనే వెళ్లాలని లక్ష్మణున్ని ఆదేశిస్తుంది. 

11.లక్ష్మణుడు సీతకు తగిన జాగ్రత్తలు చెప్పి లక్ష్మణ రేఖ గీసి ఏ పరిస్థితుల్లో కూడా ఈ గీతను దాటవద్దని తెలియజేసి అరణ్యంలోకి వెళ్తాడు. 

12.ఇట్టి సమయంలో రావణుడు మాయాబ్రాహ్మణుని వేశంలో సీత ఉన్న కుటీరం వద్దకు వెళ్లి బిక్షను అడుగుతాడు. 

13.భిక్ష వేయడానికి వచ్చిన సీతను లక్ష్మణ రేఖ దాటేలా చేసి అక్కడి నుండి సీతను అపహరిస్తాడు. 

14.సీతను లంకకు తీసుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. 

15 సీతను వెతకడానికి శ్రీరాముడు హనుమంతుని సహాయాన్ని కోరుతాడు. 

16.సీతను వెతుకుతుండగా సుగ్రీవుని సమస్యను తెలుసుకున్న శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యాన్ని అప్పగించి తమకు సహాయం చేయాలని కోరుతాడు. 

17.హనుమంతుని సహాయం చేత సీత లంకలోని, అశోక వనంలో ఉన్నదని శ్రీరాముడు తెలుసుకుంటాడు.

18. రాముడు తన దూతగా అంగదుణ్ణి పంపి రావణునికి తన సందేశాన్ని వినిపించాడు. ‘సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని’ అంగదుడు చెప్పాడు. కానీ, అంగదున్ని రావణుడు తృణీకరించాడు.

18.శ్రీరాముడు హనుమ, సుగ్రీవ మరియు వారి వానర సేన సహాయంతో లంకకు సముద్రం పై వారధి నిర్మిస్తారు.

19.లంకపై దండయాత్రకు వెళ్లి ఎందరో రాక్షస వీరులను సంహరిస్తాడు.

20. చివరగా రావణుడు యుద్ధ రంగంలోకి వస్తాడు. రామ, రావణుల మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది.

21. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపిస్తారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేస్థాయి.

22. చివరకు రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణున్ని సంహరిస్తాడు.

23. సీతను తిరిగి తమ రాజ్యానికి తీసుకొని వస్తాడు.

                      ***********

 in school activities: Q2: సూర్పనఖ కురూపిగా మారిన విధానాన్ని వివరించండి

1.శూర్పణఖ విశ్రావుని కుమార్తె.రావణాసురుడి చెల్లెలు. 

2. ఈమె దుష్ట బుద్ధిగల రాక్షసున్ని వివాహమాడుతుంది. 

3. శూర్పణఖ భర్త అధికారం కోసం ప్రయత్నించి రావణాసురుని చేతిలో చంపబడుతాడు. 

4. తన భర్తను చంపినందుకు శూర్పణఖ చాలా అసంతృప్తి చెంది.వితంతువుగా లంక, దక్షిణ భారతదేశంలోని అరణ్యాల మధ్య గడుపుతుంది.

5. అలా అరణ్యాల మధ్య తిరుగుతూ పంచవటి కుటీరం లో రాముడిని చూస్తుంది.

6. వితంతువుగా ఉన్న ఆమె మనస్సులో దివ్య తేజస్సు గల రాముడిని చూసి ప్రేమ కలిగి అతనిని వివాహమాడాలని అనుకుంటుంది.

7. ఆమెకు ఉన్న మాయ శక్తిని ఉపయోగించుకునే అందమైన యువతిగా మారి శ్రీరాముని వద్దకు వెళుతుంది.

8. ఆ అరణ్యంలో అంత అందమైన యువతిని చూసిన శ్రీరాముడు ఆమె అందాన్ని గురించి పొగుడుతాడు. 

9. అదే సమయంలో శూర్పణఖ తనను వివాహమాడమని శ్రీరామున్ని కోరుతుంది. 

10. అప్పుడు శ్రీరాముడు, శూర్పణఖను తన సోదరుడు లక్ష్మణుడుని సంప్రదించమని చెపుతాడు. ఆమె లక్ష్మణుని వద్దకు వెళుతుంది.

11. లక్ష్మణుడు తన ఆనందంకోసం, ఆమెను ఆటపట్టించాలని తాను రాముడి సేవకుడునని చెప్తాడు.అందువల్ల, ఇంత అందగత్తెవైన నువ్వు తన భార్యగా ఉండడం కంటే, రాముని రెండవ భార్యగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు.

12. ఆ మాటలకు శూర్పణఖ కోపంతో సీత గురించి అసభ్యంగా మాట్లాడుతుంది.

13. సీత రక్షణకు వచ్చిన లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరిస్తాడు.

14. వెంటనే అందమైన యువతీగా ఉన్న శూర్పణఖ అవమానంతో తన నిజరూపాన్ని ధరించి కూరూపైగా మారిపోతుంది.

 in school activities: Q3: రామాయణం ఆధారంగా సోదర బంధం

జ: రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నులు నలుగురు సోదరులు దశరథుని కుమారులు. తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు.

ఒకరి పట్ల మరొకరికి ఎనలేని గౌరవం, భక్తి భావం ఉంటాయి. తన అన్న అయిన శ్రీరాముడు అంటే మిగిలిన ముగ్గురు సోదరులకు అభిమానము, గౌరవం ఉంటుంది. శ్రీరాముని తండ్రితో సమానంగా భావిస్తారు.


            కైకేయి కోరిక మేరకు రాముడు 14 సంవత్సరాలు వనమాసం చేయవలసి వస్తుంది.వనమాసానికి బయలుదేరుతుండగా సీత కూడా తను వస్తానని ప్రయాణం అవుతుంది. శ్రీరాముడు అంటే అపారమైన గౌరవభావం ఉన్న లక్ష్మణుడు సైతం తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు అన్న రామయ్య! అని, తను అన్నను వదిలి ఉండలేనని తాను కూడా అన్నతో పాటు వచ్చి సేవలు చేసుకుంటానని శ్రీరామున్ని వెంట బయలుదేరుతాడు.

         శ్రీరాముడు అడవులకు బయలుదేరుతూ భరతునితో నువ్వు రాజ్య పాలన చేయాలని ఆజ్ఞాపిస్తాడు. సత్య ధర్మాలకు కట్టుబడి ఆడిన మాట తప్పని ఈ వంశంలో తన అన్న ఉండగా నేను రాజ్యపాలన చేయలేనని భరతుడు చెబుతాడు. భరతుడి మాటలు చాలా ప్రియమైనవి, రాముడి పాదుకల ద్వారా పద్నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించడానికి అంగీకరిస్తాడు. తన అన్న అడవిలో కష్టాలు పడుతుంతే తాను రాజుగా జీవించడానికి నిరాకరించి. తను ఒక గుడిసెలో ఉండి ఆ పాదుకలను పగలు మరియు రాత్రి పూజిస్తాడు. 


            శత్రుఘ్నుడు మందర పై బాగా కోపగించుకుంటాడు. నీవల్లనే మా అన్నయ్య అడవి పాలయ్యాడు. మా తండ్రి మరణించాడు. నిన్ను ఏమి చేసినా పాపం లేదని కోపంతో రగిలిపోతాడు. భరతుడు, శత్రుఘ్నున్ని శాంత పరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తే అడవికి వెళ్ళిన మా అన్నయ్య తిరిగి వస్తాడని చెప్పుకుంటూ బాధపడతాడు. 

               

           సోదరుల అనుబంధం ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఉండరు అన్నట్లు రామలక్ష్మణ, భరత శత్రుఘ్నులు ఉంటారు.

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు