10వ, తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా: విద్యార్థుల సందేహాలకు - సమాధానాలు
10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 21 వ, తేదీ నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉన్న సందేహాలకు, సమాధానాలు.
1. ప్రస్తుతం ఓ.ఎమ్.ఆర్ షీట్ లో విద్యార్థులు నింపవలసిన అంశాలు ఏమిటి ?
జ: ఓ.ఎమ్.ఆర్ పత్రం మూడు భాగాలు ఉంటుంది.OMR పైన హాల్ టికెట్ నెంబర్, విద్యార్థి వివరాలు ప్రింట్ అయి వస్తాయి. సరి చూసుకుని ఏమైనా తప్పులు గుర్తించినట్లయితే ఇన్విజిలేటర్ కు తెలియజేయాలి. పార్టీ - 1 లొ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ మరియు రూమ్ నెంబర్ మీరు రాయాలి. విద్యార్థి సంతకం అని ఉన్నచోట మీరు హాల్ టికెట్ లో ఎలా సంతకం చేశారో అలాగే సంతకం చేయాలి. పార్ట్ - 2 లో మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ మాత్రమే రాయాలి. isa
మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ పైన విద్యార్థులు కేవలం సబ్జెక్టు పేరు: తెలుగు/ English/ Mathematics.... ఇలా రాయాలి. PAPER - I అని వేయాలి. ప్రతి పేజీ లో బార్ కోడ్ ముద్రించబడి ఉంటుంది.
Note: ఈసారి మీకు అందించే మెయిన్ ఆన్సర్ షీట్ లో 24 బ్రాడ్ రూల్ లైన్స్ ఉన్నట్లు సమాచారం.
2. విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి ?
జ: ఒత్తిడి తగ్గించుకోవాలంటే పరీక్షకు 12 గంటలకు ముందే చదవడం ఆపేసి ప్రశాంతంగా ఉండాలి. రాత్రిళ్ళు మొత్తం మెలకువతో ఉండకూడదు. సరియైన నిద్ర చాలా ముఖ్యం.
పరీక్షకు ముందు రోజు కొత్త ప్రశ్నలు కాని, అవసరం లేని సిలబస్ కానీ చదవకండి. అప్పడివరకు మీరు బాగా చదివిన ముఖ్యమైన అంశాలు చాలా అర్థవంతంగా, మరొక సారి recapitulation చేసుకోండి. అంతే కాని కొత్త విషయాలు చదివి, లేదా పరీక్ష కేంద్రం వద్ద మీ స్నేహితుల చెప్పిన విషయాలు విని ఆదుర్దా పడకండి. పరీక్ష కేంద్రం లోకి వెళ్లే ముందు చర్చ చేయకండి. అనవసర ఆందోళనకు గురి అవుతారు.
3. హాల్ టికెట్ నెంబర్ ఎక్కడెక్కడ రాయాలి ?
జ: ఎక్కడ రాయకూడదు. లెటర్ లో కానీ, ఇతరచోట్లా ఎక్కడ కూడా మన పేరు, హాల్ టికెట్ నెంబర్ వేయొద్దు. కోడింగ్ -డికోడింగ్ లో మీ పేరు ఉన్న చోట చింపివేస్తారు. దాంతో దాని వెనుకాల ఉన్న ఆన్సర్ కూడా కోల్పోతాము.
4. ప్రశ్న పత్రం ఇవ్వగానే సమాధానం రాయవలసిన ప్రశ్నలను ఎలా ఎంచుకోవాలి ?
జ: బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయాలి.దానితో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పేపర్ దిద్దేవారికి ప్రారంభం లోనే మనమీద మంచిగా రాశాడు అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటి జవాబు బాగా రాశారు కాబట్టి మీలో ఉత్సాహం, జవాబులు సులభంగా రాయగలను అనే నమ్మకం పెరుగుతుంది. మిగిలిన జవాబులు బాగా రాయగలుగుతారు.
5..మార్జిన్ ఎలా కొట్టాలి ?
జ: పేపర్స్ రెండువైపులా పిన్ చేసి సీల్ చేస్తారు, కాబట్టి నాలుగు వైపులా మార్జిన్ కొట్టాలి.కుడి మరియు క్రింది వైపు తక్కువ మార్జిన్ సరిపోతుంది ఇలా చేయడం వలన పేపర్ చివరలో ఉన్న ఆన్సర్స్ కట్ కావు. పరీక్ష దిద్దేవారికి చాలా సులభంగా ఉంటుంది. పార్ట్- బి ముడి వేసేటప్పుడు పేపర్లు తిప్పగలిగేలా ముడి వేయాలి. దగ్గరకు బిగించి ముడి వేయకూడదు.
6. సమాధానాలు సెక్షన్ వైస్ గా వరసగా రాయాలా ? ముందుగా బాగా తెలిసిన సమాధానాలు రాయవచ్చా ? ఒక సెక్షన్ లో సమాధానం తెలిసిన ప్రశ్న ముందుగా, ఆ తర్వాత వేరే ప్రశ్నలు రాయవచ్చా ?
జ: వీలైనంతవరకు ప్రశ్నలకు సమాధానాలు వరుస క్రమంలో రాయడానికి ప్రయత్నం చేయాలి. అలా రాయలేనప్పుడు ఆ సెక్షన్ లో మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయాలి. ప్రశ్న నెంబర్ స్పష్టంగా రాయాలి. తెలియని ప్రశ్నకు సమాధానం రాసే ప్రయత్నం చేయవద్దు
7. సమాధానాలు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?సమాధానాలు పాయింటు వైస్ గా రాయాలా ? పేరాగ్రాఫ్ వైస్ గా రాయాలా ?
జ: జవాబులను సాధ్యమైనంతవరకు పాయింట్స్ రూపంలో రాయాలి. ప్రశ్న నంబర్స్ మాత్రమే మార్జిన్ బయట ఉండాలి.
ఆన్సర్ పాయింట్స్ నెంబర్లు మార్జిన్ లోపల ఉండాలి.
పాయింట్స్ 1,2,3...ఇలా నంబర్స్ వేయాలి. చుక్కలు, ( * ) పెట్టొద్దు. ఎందుకంటే పేపర్ దిద్దేవారికి మనం ఎన్ని పాయింట్స్ రాశామో స్పష్టంగా తెలియాలి.
8. ఎలాంటి ప్రశ్నకు ఎన్ని వాక్యాలు రాయాలి ?
జ: ప్రశ్నలకు జవాబు ఎన్ని వాక్యాలు రాయాలో సూచనలు ఇస్తారు. ఆ సూచనను తప్పకుండా పాటించాలి. అవసరం లేకున్నా రెండు, మూడు పేజీల జవాబు రాయకండి.
ఉదాహరణకు: 7 మార్కుల ప్రశ్నలకు 14 పాయింట్స్ రాస్తే బాగుంటుంది. ప్రతి పాయింట్ కు హాఫ్ మార్క్ కేటాయిస్తారు. ఇలా రాసినట్లయితే మీకు గరిష్ట మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.
10. రాత గుండ్రంగా ఉంటేనే మార్కులు వేస్తారా ?
జ: రాత స్పష్టంగా, సాధ్యమైనంతవరకు గుండ్రంగా, దోషాలు లేకుండా రాయాలి.రాతలో మొదటి లైన్ ఎంత స్పష్టంగా రాస్తామో, చివరి లైన్ వరకు అదే స్పష్టత ఉండేలా చూసుకోవాలి.
రాత గుండ్రంగా లేకపోయినా తప్పులు మాత్రం రాయకూడదు.
11. లెటర్ ఒక్క పేజీలోనే రాయాలా ? ఎలాంటి నిబంధనలు పాటించాలి ?
జ: లెటర్ అనేది సృజనాత్మకత ప్రశ్న కిందికి వస్తుంది.సృజనాత్మకత ప్రశ్నలు ఏవైనా ఒక్క పేజీలోనే రాయాలి. లెటర్ కు సంబంధించి అన్ని నియమాలు పాటించాలి.
సృజనాత్మక ప్రశ్నలకు ఉదా: కరపత్రం, సంభాషణ, ఆహ్వానం లాంటివి.
12. ఇన్విటేషన్ ( ఆహ్వానం ) రాసేటప్పుడు డిజైన్ ఏమైనా వేయాలా.
జ: పేపర్ మూలలకు చిన్నపాటి డిజైన్ లాంటిది వేస్తె చాలు.
13. వ్యాసాలు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు నియమాలు ఏమిటి ?
జ: వ్యాసం తప్పనిసరిగా 3 పేరాగ్రాఫ్స్ ఉండాలి.
14.పార్ట్ - బీ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ: పార్ట్ - బీ లో కొట్టివేతలు, దిద్ధుడు ఉండకుండా చూడాలి. ఒకవేళ కొట్టివేత ఉన్నా కనపడే ఆన్సర్ స్పష్టంగా ఉండాలి. పూర్తిగా తప్పు అయితే దానిపై ఇన్టూ మార్క్ పెట్టి, పక్కన జవాబు స్పష్టంగా రాయండి.
15. గణితం, ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్ పరీక్షల పట్ల ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జ: గణితం లో జవాబులు రాసేటప్పుడు అదనపు స్టెప్స్ రాసి లెక్కను చాలా పెద్దగా చేయకండి. లాజికల్ గా సమాధానాలు రాయండి. ఇక్కడ మీరు ఎన్ని స్టెప్స్ వేశారు అనే దానికంటే, ఎంత లాజిక్ ఉపయోగించారు అనేదే ముఖ్యం.
గణితం రఫ్ వర్క్ లెక్కకు కుడివైపు మార్జిన్ కొంత ఎక్కువ వదిలి అక్కడే రఫ్ వర్క్ చేయండి. రఫ్ కదా అని చెత్త, చెత్తగా చేయకండి. లేదా చివరి పేజీలో రఫ్ చేయండి.isa
గణితం లో ఏదైనా గ్రాఫ్ లేదా నిర్మాణం, సైన్స్ లో బొమ్మలకు పెన్సిల్ వాడండి. భాగాలు తప్పకుండా గుర్తించాలి.
ముఖ్యమైన పాయింట్, లేదా హెడ్డింగ్ మాత్రమే అండర్ లైన్ చేయండి. ఎక్కడపడితే అక్కడ అండర్ లైన్ చేయవద్దు.
16. English writing ఎలా ఉండాలి ?
A: మీరు ఇంగ్లీష్ రైటింగ్ పాఠశాల పరీక్షలలో ఎలా రాశారో అలాగే రాయండి. పబ్లిక్ పరీక్షలకు ఇంగ్లీష్ రాత కర్షీవ్ రైటింగ్ అని కానీ, విడి అక్షరాల రైటింగ్ అని కానీ, సెకండ్ లెటర్స్ కలిపి రాత అని కానీ ప్రత్యేకంగా ఉండదు.
మీరు punctuations నియమాలు పాటిస్తూ small letters తో రాయండి. అక్షర దోషాలు లేకుండా పదాలు, వాక్యాలు రాయండి.
17. ఇతర జాగ్రత్తలు ఏమిటి ?
జ: విద్యార్థి పరీక్ష హాల్లోకి ప్రశాంతంగా వెళ్లాలి. ప్రశ్నాపత్రం చదవడానికి 15 నిమిషాల కేటాయిస్తారు. ప్రశ్నలను రెండుసార్లు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. పరీక్ష గదిలోకి రెండు బ్లూ పెన్నులు, ఒక బ్లాక్ పెన్ను, పెన్సిల్,30 సెంటీమీటర్ల స్కేల్, ఎరేజర్, షార్పనర్ మరియు మంచినీళ్ల సీసా తీసుకొని వెళ్ళండి. కొత్త పెన్నులు వాడకండి. కొంత రాసిన పెన్నులు తీసుకుని వెళ్ళండి.
పరీక్షా సమయంలో మంచినీరు 4 లేదా 5 సార్లు కొద్దిగా (గుక్కెడు ) తాగండి. మంచినీరు ఎక్కువగా తాగి వాష్ రూమ్ కి వెళ్లి సమయాన్ని వృధా చేయకండి.
చివరగా ప్రశ్నలకు సమాధానాలు రాయడం పూర్తయిన తర్వాత మీకు సమయం మిగిలినట్లయితే మీరు రాసిన సమాధానాలు ఒకసారి చెక్ చేసుకోండి.
All the Best...... 💐💐💐💐💐
Comments
Post a Comment