10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు

 SSC TELUGU - సొంత వాక్యాలు



1.పటాటోపము: నేడు జరిగే పెళ్లిళ్లు ఎంతో పొటాటోపముతో జరుపుతున్నారు. 

2. అనుమాన బీజాలు - నిజమైన స్నేహితుల మధ్య అనుమాన బీజాలు ఉండరాదు.

3.అతలాకుతలం : తుఫాను గాలికి మా ఊరు మొత్తం అతలాకుతలం అయింది.

4.పీడ వదలడం : సమాజం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం జరగాలి.

5.ఆదాన ప్రధానాలు: ఏదైనా పని త్వరగా జరగాలంటే ఆదాన ప్రధానాలు అవసరం.

6.యాది చేసుకొనుట: నేను నా బాల్య స్నేహితులను కలిసి చిన్ననాటి ఆటలను యాది చేసుకున్నాను.

7.మాయమాటలు: మా గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తి మాయ మాటలు చెప్పి డబ్బులతో పారిపోయినాడు.

8.ఏకశిస్తు: నేను నా స్నేహితుడికి ఇవ్వవలసిన డబ్బులను ఏకశిస్తుగా చెల్లించినాను.

9.జంకని అడుగులు: నేను రాత్రి సమయములో జంకని అడుగులు వేస్తూ మా పొలం కావలి వెళతాను. 

10.సత్యహీనుడు : నా స్నేహితుడు రాజు ఎల్లప్పుడు సత్యహీనుడుగా మాట్లాడుతాడు.

11 సన్నిధానం: దేవుని సన్నిధానంలో మేమంతా ప్రశాంతంగా గడిపినాము.

12.కల్లోలం: మా ఇంట్లోకి ప్రవేశించిన కోతి కల్లోలం చేసింది.

13.గండి కొట్టు: నా స్నేహితుడు వేసిన ఉపాయానికి నేను తెలివిగా గండి కొట్టాను.

14.చెవివారిచ్చి : నేను మా నాన్న మాటలను చెవివారిచ్చి వింటాను.

15.పచ్చపూస: అధికారులు అందరూ పచ్చపూసలు కారు.

16. పెడచెవిన పెట్టు: మా అమ్మ చెప్పిన మాటలను నేను పెడచెవిన పెట్టినాను. 

17. చెరగని త్యాగం: ఆపదలో ఉన్న మిత్రునికి రక్తం ఇచ్చి నేను చెరగని త్యాగం చేసినాను.

18: మహమ్మారి: కరోనా మహమ్మారికి ఎందరో బలైనారు

19.పద్మవ్యూహం: హైదరాబాదులో జీవనం పద్మవ్యూహం లాంటిది.

20: గవిన్ల: చిరుతలు ఎల్లప్పుడు గవిన్లలో నివసిస్తాయి.

21. ఆవిర్భవించు: తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరం లో ఆవిర్భవించింది. 

22.పలికి లేదనుట: మా నాన్న ఎప్పుడు పలికి లేదనుట చేయలేదు.

23.కురచగుట: మా నాన్న తెచ్చిన చొక్కా కురచైంది.

24. యాచించు, చెత్తులొగ్గి: నేను ఎవరిని చేతులొగ్గి యాచించను.

25. రమ్యమైన: మా ఊరిలోని రామాలయం రమ్యమైన కట్టడం.

26. క్షేత్రం: యాదగిరి గుట్ట ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.

27. సయ్యాటలు: చెట్టుకొమ్మపై రెండు పక్షులు సయ్యాటలు ఆడుతున్నాయి.

29. వెనకాడరు: ఎంత డబ్బు ఖర్చు అయినా మా నాన్న వెనకాడడు

30. పసందు: జిలేబి తింటే నాకు భలే పసందు గా ఉంటుంది.

31: దిక్కుతోచని: దిక్కుతోచని సమయంలో నా స్నేహితుడు భగవంతున్ని మొక్కుకున్నాడు. 

32. కుటిలవాచితనం: నా స్నేహితుడు రాజు ఎల్లప్పుడూ కుటిలవాచితనం తో ఉంటాడు.

33. పొలిమేర: దొంగను మా ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాము.

34. ఏకతాటిపై: మా అన్నదమ్ములం ఎల్లప్పుడు ఏకతాటిపై ఉంటాము.

35. మచ్చుతునక: మా ఊరి శివాలయం శిల్ప కళకు ఒక మచ్చుతునక.

36. నిరంతరం: మా నాన్న నిరంతరం మాకు మంచి మాటలు చెబుతారు.

37. బాసిల్లు: మా గ్రామం ఎల్లప్పుడూ పాడి పంటలతో బాసిల్లుతుంది.

38. మూఢనమ్మకాలు: ఇంకా కొంత మంది మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు.

39. నరరూప రాక్షనుడు: తల్లిదండ్రులను పోషించని వాడు నరరూప రాక్షసుడు.

40. ముసురుకొను: నా స్నేహితుని ఇంటిని ఎన్నో కష్టాలు ముసురుకున్నాయి.

41: ప్రాణం పోయు: ప్రాణం పోయు వైద్యులు దేవుడితో సమానం

42. చెవినిల్లుకట్టుకొని: మా గురువుగారు మంచిగా చదవాలని చెవినిల్లు కట్టుకొని చెప్పారు 

43.గొంతువినిపించు: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది కవులు తమ గొంతు వినిపించినారు.

44. యజ్ఞం: ఉద్యోగం సాధించాలంటే యజ్ఞం లా చదవాలి.

45. వ్యాప్తి: కరోనా రోగం వేగంగా వ్యాప్తి చెందింది.

46.  ఉద్భోదించు: మా మా గురువుగారు ఎల్లప్పుడూ మంచి మాటలు ఉద్బోధిస్తారు.

47. ఎడారి దిబ్బలు: మా గ్రామం లో పొలాలు అన్ని ఎడారి దిబ్బల మాదిరి అయినాయి.

48.పుట్టినిల్లు: మా గ్రామం ఎన్నో కలకు పుట్టినిల్లు.

49.పాటుపడడం: మా గ్రామ అభివృద్ధికి మా నాన్న ఎంతగానో పాటుపడ్డారు.

50.తలదాచుకోవడం: జోరు వానలో నేను ఒక టెంటు లో తలడచుకున్నాను.

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS