10వ, తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా: విద్యార్థుల సందేహాలకు - సమాధానాలు
10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 21 వ, తేదీ నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉన్న సందేహాలకు, సమాధానాలు. 1. ప్రస్తుతం ఓ.ఎమ్.ఆర్ షీట్ లో విద్యార్థులు నింపవలసిన అంశాలు ఏమిటి ? జ: ఓ.ఎమ్.ఆర్ పత్రం మూడు భాగాలు ఉంటుంది.OMR పైన హాల్ టికెట్ నెంబర్, విద్యార్థి వివరాలు ప్రింట్ అయి వస్తాయి. సరి చూసుకుని ఏమైనా తప్పులు గుర్తించినట్లయితే ఇన్విజిలేటర్ కు తెలియజేయాలి. పార్టీ - 1 లొ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ మరియు రూమ్ నెంబర్ మీరు రాయాలి. విద్యార్థి సంతకం అని ఉన్నచోట మీరు హాల్ టికెట్ లో ఎలా సంతకం చేశారో అలాగే సంతకం చేయాలి. పార్ట్ - 2 లో మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ మాత్రమే రాయాలి. isa మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ పైన విద్యార్థులు కేవలం సబ్జెక్టు పేరు: తెలుగు/ English/ Mathematics.... ఇలా రాయాలి. PAPER - I అని వేయాలి. ప్రతి పేజీ లో బార్ కోడ్ ముద్రించబడి ఉంటుంది. Note: ఈసారి మీకు అందించే మెయిన్ ఆన్సర్ షీట్ లో 24 బ్రాడ్ రూల్ లైన్స్ ఉన్నట్లు సమాచారం. 2. విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి ? జ: ఒత్తిడి తగ్గించుకోవాలంటే పరీక్షకు 12 గంటలకు ముందే చదవడం ఆపేసి ప్రశాంతంగా ఉండాలి. ర...