SSC PUBLIC EXAMINATIONS - TELUGU GUESS PAPER
SSC PUBLIC EXAMINATIONS - TELUGU GUESS QUESTION PAPER
PART - A : 60 మార్కులు
PART - B : 20 మార్కులు
ప్రాజెక్టు - : 20 మార్కులు
TOTAL - 100
👉 ప్రశ్నలను జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి.
మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయండి.
కొట్టివేతలు దిద్దుడు లేకుండా చూసుకోండి.
ప్రశ్న నెంబరు తప్పకుండా వేయండి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👉 I. అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం పై 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
ఉపవాచకం నుండి రెండు పేరాగ్రాఫ్ లు ఇస్తారు.
ఈ పేరాగ్రాఫ్ పై ప్రశ్నలు వివిధ రకాలుగా అడిగే అవకాశం ఉన్నది.
1. ఒక ప్రశ్న ఇచ్చి సమాధానం రాయమనడం
2. తప్పు ఒప్పులను గుర్తించడం.
3. జత పరచడం
4. కీలకమైన పదాలు కొన్ని ఇచ్చి వాటిని వివరించమనడం.
ఇలా కూడా అడగవచ్చు. కాని
నోట్: ఎక్కువగా పేరాగ్రాఫ్ కు సంబంధించి ప్రశ్నలు ఇచ్చి వాటికి జవాబులు రాయమంటారు.
👉 అపరిచిత గద్యాలు
భాష ,సాహిత్య, చారిత్రక అంశాలకు సంబంధించిన రెండు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు ఇస్తారు.
ప్రతి పేరాగ్రాఫ్ కు 5 ప్రశ్నలు ఇస్తారు.
5Q × 1M = 5 మార్కులు ( ఒక పేరాగ్రాఫ్ లో )
👉 ఈ ప్రశ్నలకు జవాబులను ఒక వాక్యంగా రాయాలి.
5Q × 2 M = 10 మార్కులు ( మరొక పేరాగ్రాఫ్ లో )
ఈ ప్రశ్నలకు జవాబులను రెండు వాక్యాల రూపంలో రాయాలి.
పదాల రూపంలో రాసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వబడవు
💠💠💠💠💠💠💠💠💠💠
👉 పరిచిత పద్యాలలో పువ్వు గుర్తు పెట్టినటువంటి పద్యాలు అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. పుస్తకం మొత్తంలో 15 ముఖ్యమైనటువంటి పద్యాలు ఉన్నాయి.
🔶 రెండు పద్యాలలో నుండి ఒక పద్యాన్ని రాయవలసి ఉంటుంది ఐదు మార్కులు ఉంటాయి.
1Q × 5M = 5 మార్కులు
1. దానశీలం -
💠 కారే రాజులు... రాజ్యముల్...
పోతన రాసిన ఈ పద్యంలో శబ్దాలంకారాల సొగసు, భక్తి రసం, పండిత పామరులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ మూడు కవిత లక్షణాలు ఈ పద్యంలో ఉన్నాయి. V V.IMP
👉 ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము మరియు భావము నేర్చుకోవాలి. ప్రతిపదార్ధము రాసేటప్పుడు చివరిలో ఉన్న భార్గవ అనే సంబోధన పదాన్ని మొదటగా తీసుకొని, చివరకు క్రియా పదంతో ముగించాలి.
💠 కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపును.....
2. వీర తెలంగాణ
💠 నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్..
💠 తెలంగాణ భవదీయ పుత్రికలలో తేండ్రించు......
3. శతక మధురిమ
💠 పోత్తం బై కడు నేర్పుతో హితము...
💠 భండన భీముడార్తజన భాంధవుడుజ్వల....
4. భిక్ష
💠 వేద పురాణ శాస్త్ర పదవీ యసియైన పెద్దము....
💠 ఆ కంఠంబుగా నిప్డు మాదుకర....
👉 పైన ఇవ్వబడిన పద్యాలలో నుంచి ఏవైనా రెండు పద్యాలు పరీక్షలో తప్పకుండా వస్తాయి.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
.
II. వ్యక్తీకరణ సృజనాత్మకత అనే సామర్ధ్యం పై ప్రశ్నలు ఉంటాయి.
👉 స్వీయ రచనకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
ఈ స్వీయ రచనలో లఘు సమాధాన ప్రశ్నలు మరియు వ్యాస రూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి.
👉 లఘు సమాధానానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఉంటాయి.
4Q × 3M = 12 మార్కులు
💠 వీటిలో రెండు ప్రశ్నలు పద్య భాగం నుండి ఇస్తారు.
మరొక రెండు ప్రశ్నలు గద్యభాగం నుండి ఇస్తారు.
నోట్: దీనిలో కవి పరిచయము లేదా రచయిత పరిచయము తప్పకుండా అడుగుతారు. దీనిని పట్టిక రూపంలో రాయాలి
కవిపేరు :
జీవితకాలం :
రచనలు :
రచనాశైలి :
బిరుదులు :
ఇతరములు :
ఉదాహరణ:
కవిపేరు:పోతన
జీవితకాలం:15వ శతాబ్దం
రచనలు:భాగవతం, భోగిని దండకం, వీరభద్రవిజయం
రచనాశైలి:భక్తిరసం
బిరుదులు:సహజ పండితుడు
ఇతరములు:ఇతను వ్యవసాయం చేస్తూ జీవనం సాగించాడు
జీవితకాలాలు..
1వ లెసన్, 11వ లెసన్ కవులకు 15వ శతాబ్దం,
మిగతా అన్ని లెసన్స్ కు 20 వ శతాబ్దం
సంవత్సరాలు, డేట్లు అవసరం లేదు. జస్ట్ శతాబ్దం గుర్తు పెట్టుకుంటే చాలు
👉 తెలుగు పుస్తకంలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయి.
వాటిలో
శతక మధురిమ
లక్ష్యసిద్ధి
పాఠాలు మినహాయించి మిగిలిన పది పాఠాలలో నుంచి కవి పరిచయం లేదా రచయిత పరిచయం అడుగుతారు.
లఘు సమాధాన ప్రశ్నలు అడిగే విధానం
👉 ఒక వాక్యము ఇచ్చి దానిని సమర్థించమని అడుగుతారు.
👉 ఈ ప్రశ్న ఉద్దేశ్యం ఏమిటి ?
👉 దీని ఆంతర్యం ఏమిటి ? అని అడుగుతారు.
నోట్: ఈ ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ( లఘు సమాధానం కానీ లేదా వ్యాసరూప సమాధానం కానీ )ఈ ప్రశ్న ఏ పాఠానికి సంబంధించినది. ఆ పాఠం పేరు రాయాలి, ఆ పాఠాన్ని రాసిన కవి పేరు రాయాలి. ఈ పాఠం ఏ గ్రంథం నుంచి తీసుకున్నారో రాయాలి.
ఆ వాక్యాన్ని కొంత వివరించాలి. పాఠంతో అనుసంధానం చేసి మీ సొంత మాటలు జోడించాలి. చివరన మంచి వాక్యంతో ముగింపు ఇవ్వాలి.
ఇలా రాసినట్లయితే 3/3 మార్కులు పడుతాయి.
ఉదా: నాడును, నేడును తెలంగాణ మోడలేదు అన్నాడు కవి. ఎందుకు ?
2. పుట్టుకతో మనుషులందరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అన్న కవి మాటలతో నువ్వు ఏకీభవిస్తావా ? ఎందుకు ?
👉 వ్యాస రూప ప్రశ్నలలో పద్యభాగానికి సంబంధించి ఈ క్రింది పాటల సారాంశం చదువుకోవాలి.
3Q × 7M = 21 మార్కులు
1. దానశీలము
ఉదా: బలిచక్రవర్తి దానం యొక్క గొప్పతనం ఏమిటి ?
2. దానశీలం యొక్క ప్రధానమైన ఆవశ్యకత ఏమిటి ?
2. వీర తెలంగాణ
1. తెలంగాణ తల్లి రగిలించిన పోరాట స్ఫూర్తి గురించి రాయండి.
3. నగర గీతం
1. నగర జీవితం నేడు ఎందుకు సంక్లిష్టంగా మారింది.
4. జీవన భాష్యం
1. మనుష్యుల పదవురు కూడితే ఊరవుతుంది అనే రచయిత మాటల యొక్క ఉద్దేశం ఏమిటి ?
5. బిక్ష
👉 శతక మధురిమలో కథల రూపంలో ప్రశ్నలు అడుగుతారు.
💥 గద్యపాఠాలలో ముఖ్యమైన ప్రశ్నలు
1.కొత్త బాట
1. నాటికి నేటికి ఉన్న పరిస్థితులు.
2. సొంత కాళ్ల మీద నిలబడడం అంటే ఏమిటి ?
3. రావి చెట్టు, రచ్చ కట్ట లాంటి కీలక వాక్యాలపై ప్రశ్నలు ఇస్తారు.
2. భూమిక
1. రూహీ ఆపా కథ
3. లక్ష్య సిద్ధి
1. రాష్ట్ర సాధనలో కవులు, కళాకారులు, రచయితల పాత్ర ఏమిటి
2. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు
4. భాగ్య ఉదయం
1. మీ చుట్టూ ఉన్న సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలడానికి మీరేమీ చేయగలరు.
2. అసమానతలు తొలిగి సమానత్వం రావాలంటే ఏమి జరగాలి.
5. ఎవరి భాష వారికి వినసొంపు.
1. మీ ప్రాథమిక విద్యాభ్యాసంలో మీరు మర్చిపోలేని సంఘటనలను ఒక వ్యాసంగా రాయండి.
2. మీ పరిసరాలలో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి.
3. ఎవరిభాష వాళ్ళకు వినసొంపు ఎందుకు ?
💠💠💠💠💠💠💠💠💠💠💠💠
👉 సృజనాత్మక ప్రశ్నలు
1. కవిత - కవిత అంత్యప్రాసలతో రాయాలి.
2. గేయం
3.ఆత్మకథ - కథను రాసేటప్పుడు దానిలో పాత్రలను ఎంపిక చేసుకోవాలి. ఆసక్తిగా ప్రారంభించాలి. నీతి రూపంలో కథను చెప్పాలి
4. సంభాషణ - సంభాషణ ఇద్దరి వ్యక్తుల మధ్య జరగాలి ఒక్కొక్క వ్యక్తికి ఐదు డైలాగ్స్ ఉండాలి
5. నినాదాలు - నినాదాలు లయాత్మకంగా, ప్రాసబద్ధంగా ఉండాలి. కన్నా - మిన్న, వద్దు - ముద్దు, కావాలి - పోవాలి
1. దాచుకోవడం కన్నా - దానం చేయడం మిన్న
2. చదవకుండా ఉండడం కన్నా - చదువుకోవడం మిన్న.
3. బాల్య వివాహం కన్నా - బాలిక చదివే మిన్న
6. కరపత్రం
1. మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం తయారు చేయండి
7. లేఖ -
1.మీ ఊరిలో జరిగే ముఖ్యమైన పండుగ గురించి తెలిపి మీ స్నేహితుని ఆహ్వానించడం.
2. మేడారం జాతర గురించి తెలుపుతూ మీ స్నేహితుని ఆహ్వానించడం.
8. వ్యాసం - స్వచ్ఛ భారత్ గురించి ఒక వ్యాసం రాయండి
9. సంపాదకీయ వ్యాసం
10. ప్రశ్నావళి
11. ఇంటర్వ్యూ
👉 సృజనాత్మక ప్రశ్నలలో రెండు ప్రశ్నలు ఇస్తారు మీరు ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి.
1Q × 7M = 7 మార్కులు.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
👉 ఉపవాచకం
1. శ్రీరాముని యొక్క గుణగణాలకు సంబంధించిన ప్రశ్న.
2. వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం.
3. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేసిన విధానం.
4. రాముడు అహల్యకు శాపవిమోచన కలిగించిన విధానం.
5. సీత స్వయంవర ఘట్టం
6. కైకేయి శ్రీరాముడు అడవులకు పోవడానికి ఎలా కారణం అయింది.
7. మారిచిని యొక్క వృత్తాంతం.
8. రావణుడు సీతను అపహరించిన విధానం.
9. శ్రీరామ, సుగ్రీవుల యొక్క మైత్రి.
10. వాలి సుగ్రీవుల వైరానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి.
11. హనుమంతుడు సీతా అన్వేషణ చేసిన విధానం.
12. హనుమంతుడు లంకా దహనం చేసిన విధానం.
13. హనుమంతుడు రామబంటుగా పేరు పొందడానికి తగిన కారణాలు.
14. రామాయణం అందించే సందేశం ఏమిటి
15. రావణ సంహారం తరువాత శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం జరిగిన విధానం.
16. రామాయణం ద్వారా మనం అలవర్చుకోవలసిన గుణగణాలు ఏవి?
17. రామాయణం నేటి జీవన విధానానికి మార్గదర్శనం ఎలా ?
18. రామాయణం లో మీకు నచ్చిన పాత్ర ఏది? ఎందుకు ?
🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
PART -B
వ్యాకరణం
1. సంధులు - సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, రుగాగన సంది, వృద్ధి సంధి, రూపక సంధి, త్రిక సంధి, సరళాదేశ సంధి, అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి,
2.సమాసాలు - ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, ఉపమాన పూర్వపద సమాసం, విశేషణ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం, ద్విగు సమాసం, నన్ తత్పురుష సమాసం,
విభక్తులతో ఏర్పడే సమాసాలు
షష్టి తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, చతుర్ధీత పురుష సమాసం
3.అలంకారాలు -
వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, అంత్యాను ప్రాస అలంకారం,
ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం, శ్లేషాలంకారం
4.చందస్సు - ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం
5. వాక్యాలు - ప్రత్యక్ష పరోక్ష కథనం, ఆధునిక వచనం, సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు, కర్తని కర్మని వాక్యాలు
👉 పదజాలం
6.జాతీయాలు - రెండు ఇస్తారు
7.అర్ధాలు - పాఠ్యపుస్తకం చివరిలోని పదవిజ్ఞానంలో నుండి ఇస్తారు
8. పర్యాయపదాలు - పాఠ్యపుస్తకం చివరిలోని పదవిజ్ఞానంలో నుండి ఇస్తారు
9. ప్రకృతి వికృతులు
10. నానార్ధాలు
11.వ్యుత్పత్తి అర్ధాలు
నోట్: ప్రతి పాఠం చివరలో వాక్యాలు, జాతీయాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఉన్నాయి.
💠💠💠💠💠💠💠💠💠💠💠💠
మాదిరి లేఖ -1
పాఠశాలలో జరిగిన స్వయం పాలనా దినోత్సవం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
సూర్యాపేట,
6.03.2025.
మిత్రుడు రాజు కు,
నీ లేఖ చేరింది. ఉభయ కుశలోపరి. గత నెల 26.2.2025న మా పాఠశాలలో మహా వైభవంగా స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఆ రోజు మేము మా పాఠశాలను రంగు కాగితాలతో, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాము. 26వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు స్వయం పాలన దినోత్సవ కార్యక్రమం ప్రారంభమైనది.
ఈ కార్యక్రమంలో నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుల పాత్ర పోషించినాను. ఈ ఒక్కరోజు స్వయం పాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులు యొక్క విధులు మరియు పాఠశాలకు సంబంధించిన నిర్వహణ అంశాల గురించి నేను స్వయంగా నేర్చుకున్నాను. మా మిత్రులు ఎంఈఓ, డీఈవో, కలెక్టర్ గా, ఉపాధ్యాయులుగా తమ పాత్రలను పోషించినారు. ఉపాధ్యాయ పాత్రలను పోషించిన విద్యార్థులు పాఠ్యాంశాలను చాలా చక్కగా బోధించినారు.
ఆ తర్వాత సమావేశ కార్యక్రమం జరిగినది. ప్రధానోపాధ్యాయులు స్వయంపాలన దినోత్సవం ప్రాముఖ్యతను గూర్చి మాకు వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారికి బహుమతులు పంచినారు. ఈ కార్యక్రమంలో నాకు మొదటి బహుమతి వచ్చినది.
మీ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం ఏవిధంగా జరుపుకున్నారు నాకు లేఖ ద్వారా తెలియజేయగలవు.
కార్యక్రమా అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. తప్పక లేఖలు రాస్తూ ఉండు. ఉంటాను.
ఇట్లు,
నీ మిత్రుడు,
చిరునామా, XXXXXXX.
రాజు,
సూర్యాపేట,
508223
*****************************
ప్రశ్న: నీకు నచ్చిన పుస్తకాన్ని గూర్చి సోదరునికి లేఖ వ్రాయండి.
జవాబు:
హైదారాబాద్,
6-03-2025.
ప్రియమైన సోదరుడు మనోజ్ కు,
నేను బాగానే చదువుతున్నాను. నువ్వు కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలవు.
ఈ మధ్య మా నాన్నగారు బారిష్టరు పార్వతీశం అనే పుస్తకాన్ని ఎగ్జిబిషన్లో కొని తెచ్చారు. నేను దాన్ని చదివాను. పార్వతీశంలోని పల్లెటూరితనమూ, పుట్టినరోజుకు అతని మిత్రులు చేసిన హంగామా భలే బాగున్నాయి. పార్వతీశం ఆవకాయజాడీ, గొడుగు, ట్రంకు పెట్టెలతో విదేశీ ప్రయాణానికి వెళ్ళడం చదివి కడుపుబ్బ నవ్వుకున్నాను. తివాచీ తొక్కకూడదని అనుకొని ప్రక్కగా నడిచి పడటము చదువుతుంటే ఇలాంటివారు ఆ కాలంలో నిజంగా ఉన్నారా అనిపించింది. మొత్తం మీద మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి ఈ నవల చదివేవారిని ఆకర్షిస్తుందనడం సత్యము. నీవు కూడా సెలవుల్లో గ్రంథాలయానికి వెళ్ళి ఈ పుస్తకం తప్పక చదవగలవు.
ఇట్లు,
నీ ప్రయమైన మిత్రుడు,
చిరునామా, XXXXXXX.
వి. మనోజ్.
తిరుమలగిరి,
సూర్యాపేట.
నోట్: లేఖ మొత్తం ఒకటే పేజీలో రాయండి. కొంత భాగం పక్క పేజీకి వెళ్ళనీయవద్దు.
🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ తమ పాఠశాలలనూ, ఆఫీసులలో ఉద్యోగులూ , కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.
నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు, వివిధ ఛానల్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
మనం కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని మన కుటుంబ సభ్యులకు మన మిత్రులకు మన గ్రామంలోని ప్రజలకు అవగాహన కలిగిద్దాం.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
కవితలు - భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష.....
1. నేను రోజు చేస్తాను బిక్ష
అది నాకొక పరీక్ష
చేసుకుంటాను సమీక్ష
అదే నాకు శ్రీరామ రక్ష
లేకుంటే గురవుతాను వివక్ష
💠💠💠💠💠
2.దేవుడు మనకు పెట్టాడు మానవుడనే భిక్ష
పెంచుకోవద్దు ఎవరిపై కక్ష
అందరం కలిసి ఉంటే అదే మనకు రక్ష
చేసుకోవాలి ప్రతి రోజూ జీవిత సమీక్ష
లేదంటే గురవుతాము వివక్ష
అందుకే కావాలి ఎల్లప్పుడూ మనకు రక్ష.
💠💠💠💠💠💠
2. ఓ విద్యార్థీ !
పొందాలి జ్ఞాన కిరణాలు
కావాలి సహనాభరణాలు
వెతకాలి నీవు కారణాలు
చేయకూడదు సదా రణాలు
చేయాలి మహనీయుల సంస్మరణాలు
భావిపౌరులకవి తోరణాలు
కోరాలి వాగ్దేవి శరణాలు
స్మరించాలి సదా ఆ తల్లి చరణాలు.
💠💠💠💠💠💠💠💠💠💠
నినాదాలు.....
1. మంత్ర తంత్రాలను మానండి - మూఢనమ్మకాలను పారద్రోలండీ
2. ఎన్ని ఉన్నా - చదువు లేకపోతే సున్నా.
3. బడికి పిల్లలను పంపండి - వారి భవితకు బాటలు వేయండి.
4. ఆడ మగ తేడా వద్దు - అందరికీ చదివే ముద్దు.
5. బాలల చదువు - భవితకు వెలుగు.
6. చెట్లను పెంచండి - ప్రగతిని సాధించండి.
7. పనికెందుకు తొందర - చదువుకో ముందర.
8. చదువుకున్న పిల్లలు - వెలుగునిచ్చే దివ్వెలు.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కరపత్రం
తెలంగాణ వీరుల సంస్మరణ సభకు ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
తెలంగాణ వీరుల సంస్మరణ సభకు ఆహ్వానం
మన స్వేచ్ఛ కోసం తమ స్వేచ్ఛను కోల్పోయి, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఎందరో తెలంగాణ వీరులకు అంజలి ఘటిద్దాం.
భావితరాల సౌభాగ్యం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా పరిత్యజించిన మన తెలంగాణ వీరులను సంస్మరిద్దాం.
మృత్యువుకే చెమటలు పట్టించిన మన వీరాధివీరుల పోరాట పటిమను గుర్తు చేసుకొందాం.
రండి, తరలిరండి, సంస్మరణ సభకు.
తేదీ: 23.03.2025, ఆదివారం ఉదయం 9 గం॥లకు వేదిక: లాల్ర్ బహద్దూర్ స్టేడియం హైదరాబాద్
అందరూ ఆహ్వానితులే.
ఇట్లు,
ఆహ్వాన సంఘం,
తెలంగాణ వీరుల సంస్మరణ కమిటీ.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలడం’ అనే అంశంపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
‘మూఢనమ్మకాలను తరిమికొడదాం’
మన సమాజములో ఎంతో కాలంగా ఎన్నో దురాచారములు, మూఢనమ్మకాలు పాతుకు పోయాయి. వాటిని మనం గుడ్డిగా నమ్మి పాటిస్తూ వస్తున్నాము. రాజారామమోహనారయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగము పంతులుగారు వంటి సంఘ సంస్కర్తలు, సతీ సహగమనము, భర్తపోయిన స్త్రీలకు అలంకారాలు తొలగించడం, వంటి దురాచారాల నిర్మూలనకు కృషిచేసి, విజయం సాధించారు. మన ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగము పంతులుగారు వితంతువులకు తిరిగి వివాహాలు జరిపించారు. ఎన్నో మూఢాచారాలను వారు నిర్మూలించారు.
దెయ్యాలు లేవని, భూత వైద్యం అంతాదగా అని వారు నిరూపించారు. సంఘంలో దెయ్యాలు, చేతబడులు, శకునాలు, వంటి వాటిని నమ్ము తున్నారు. చేతబడులు చేశారని కొంత మందిని చంపేస్తున్నారు. శకునం మంచిది కాదని, ఆ రోజు తిథి మంచిది కాదని, పనులు ఆపేస్తున్నారు. ఇవన్నీ మూఢాచారాలు.
భగవంతుడు సృష్టించిన రోజులు, తిథులు అన్నీ మంచివే. ఎవరు శకునం వచ్చినా, ఫర్వాలేదు. పిల్లి శకునం, వెధవ ముండ శకునం వంటి వాటిని పాటించనక్కరలేదు. అలాగే అంటరానితనాన్ని పాటించకూడదు.
దేవుడి దృష్టిలో అంతా సమానమే. మూఢ నమ్మకాలను తరిమికొట్టండి. మంచిని పాటించండి. పక్కవారిలో దైవాన్ని చూడండి. మతాలు అన్నీ మంచిని చెప్పేవే, నమ్మండి.
ఇట్లు,
వరంగల్ జిల్లా,
విద్యార్థి సంఘం.
Comments
Post a Comment