APAAR: సందేహాలు - సమాధానాలు

 1.అపార్ ఎక్కడ జనరేట్ చేయాలి ?

Apaar - Automated Permanent Academic Account Registry

APAAR అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని సూచిస్తుంది, ఇది భారతదేశంలోని విద్యార్థులందరి కోసం రూపొందించబడిన ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ. 2020 కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి'

అపార్ ఐడి ని యూడైస్ ప్లస్  లో

 Apar module అనే ఆప్షన్ లోకి వెళ్లి జనరేట్ చేయాలి. ఇక్కడ తరగతి సెలెక్ట్ చేసుకుని GO ఆప్షన్ క్లిక్ చేయాలి. విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి.

విద్యార్థి పేరు చివరలో generate అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ లోకి వెళ్లడం ద్వారా అపార్ ఐడి జనరేట్ చేయాలి.



2.అపార్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఏమి చేయాలి ?

జ: అపార్ జనరేట్ చేయడానికి విద్యార్థి యొక్క ఆధార్ వాలిడేట్ చేయాలి. విద్యార్థి ఆధార్ వాలిడేట్ చేయకుండా( in school activities )అపార్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అపార్ జనరేట్ కాదు. ఎర్రర్ మెసేజ్ వస్తుంది. 


3.ఆధార్ వెరిఫికేషన్ ( validate )అంటే ఏమిటి ?

జ: విద్యార్థి యొక్క వివరాలు uidai ద్వారా సరి చూడడమే ఆధార్ వెరిఫికేషన్. యుడైస్ ప్లస్ లో ఉన్న విద్యార్థి వివరాలు, ఆధార్ లో ఉన్న వివరాలతో మ్యాచ్ అయినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. 

వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల వివరాలను ఆధార్ లో ఉన్న వివరాలతో సరి చేయాలి.


4.ఆధార్  ఎలా validate చేయాలి ?

జ: విద్యార్థి యొక్క వివరాలను ఆధార్లో ఉన్న వివరాలతో ముందుగా అప్డేట్ చేయాలి. ఆ తర్వాత list of all student లోని 

active students అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. అందరి విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఆధార్ వాలిడేట్ చేయాలనుకున్న విద్యార్థి పేరుకు కుడివైపు చివరలో 

validate Aadhar from UIDAI 

అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆధార్ వ్యాలిడేట్ చేయాలి.

5.విద్యార్థి పేరు తప్పుగా ఉంది ఎలా మార్చాలి ?

జ: యుడైస్ ప్లస్ లో జనరల్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే విద్యార్థి పేరు రెండు చోట్ల కనిపిస్తుంది. 

ఒకటి టైటిల్ name, మరొకటి as per Aadhar ఈ రెండు పేర్లు కూడా ఆధార్లో ఉన్న పేరుతో మ్యాచ్ కావాలి. 

Title name ( student name as per School record ) 4.1.1 మార్చడానికి మెయిన్ మెనూలో 

Student Name Update అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్లడం ద్వారా కొన్ని పరిమితులకు లోబడి విద్యార్థి యొక్క పేరు మార్చడానికి వీలుంటుంది. in school activities

Condition Current Name New Name

1.Rearrange of words in Name:

Mohit Kumar Sharma

Sharma Mohit Kumar OR 

Kumar Mohit Sharma

2.Correction of the Name by adding or removing of One Character.

Mohit Sharma

Moohit Sharma OR 

Mohita Sharma

3.Removal of spaces in Name

Kumar Mohit(space)

Kumar Mohit

4.Removal of title in Name (Only Miss)

Miss Mohita

Mohita

5.Removal of any word is not allowed

Mohit Kumar Sharma

Mohit Shrama

Student name as per Aadhar మార్చడానికి 4.1.7 లో

Do you want to change AADHAAR Details in SDMS?

Options లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏ షరతులు లేకుండా పేరును ఆధారలో విన్న విధంగా మార్చవచ్చు.


6.పుట్టిన తేదీ తప్పుగా ఉంది ఎలా మార్చాలి ?

జ: విద్యార్థి యొక్క పుట్టిన తేదీని జనరల్ ప్రొఫైల్ ( GP ) ఓపెన్ చేసి ఆధారంలో విన్న విధంగా మార్పిడి చేయవచ్చు.

7.తల్లిదండ్రుల పేర్ల స్పెల్లింగులు తప్పుగా ఉన్నాయి ఎలా మార్చాలి ?

జ: విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ ( GP ) ఓపెన్ చేసి తల్లి తండ్రి మరియు గార్డియన్ పేరు స్పెల్లింగ్స్ సరి చేయవచ్చు.

8.విద్యార్థి తక్కువ తరగతి లో నమోదయి ఉన్నాడు ఎలా మార్చాలి ?

జ: విద్యార్థి యొక్క తరగతిని మార్చే అవకాశం ప్రధాన ఉపాధ్యాయులకు లేదు. తరగతి మార్చడానికి MIS కోఆర్డినేటర్ ను సంప్రదించాలి.

9.జనరల్ ప్రొఫైల్ అంటే ఏమిటి ?

యుడైస్ ప్లస్ లో విద్యార్థి వివరాలు మూడు రకాల సెక్షన్స్ లో అప్డేట్ చేయాలి.

1.GP - general profile 

2. EP - educational profile 

3. FP - facility profile 

జనరల్ ప్రొఫైల్లో విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి పేరు, 

పుట్టిన తేదీ, కులం, తల్లిదండ్రుల పేర్లు, జెండర్ వివరాలు ఉంటాయి.


10.అపార్ కార్డు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ?

Apaar card డిజి లాకర్ అకౌంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డీజి లాకర్ వెబ్సైట్ ఓపెన్ చేసి విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ చేయాలి. సెర్చ్ లోకి వెళ్లి అపార్సెర్చ్ చేయడం ద్వారా కార్డు డౌన్లోడ్ చేయవచ్చు.

Digi locker CLICK HERE 


11. విద్యార్థి పేర్లు చాలా తప్పులు ఉన్నాయి ఎలా ?

జ: విద్యార్థి పేర్లు ప్రధానోపాధ్యాయులు ఒకే ఒక అక్షరాన్ని తొలగించగలరు లేదా యాడ్ చేయగలరు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అక్షర దోషాలు ఉన్నట్లయితే SO3 ఫారం ఫిల్ చేసి మీ మండల MIS కోఆర్డినేటర్ కు ఇచ్చినట్లయితే వారు విద్యార్థి పేరును సరి చేస్తారు ఆ తర్వాత అపార్ జనరేట్ చేయవచ్చు. 

  SO3 form కొరకు CLICK HERE 


12. తప్పుడు వివరాలతో అపార జనరేట్ అయింది ఎలా ?

జ: ఇది సాధ్యం కాదు. విద్యార్థి వివరాలు UIDAI తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆధార్ వాలిడేట్ అవుతుంది అప్పుడు మాత్రమే అపార్ జనరేట్ అవుతుంది. విద్యార్థి వివరాలు తప్పుగా ఉన్నట్లయితే అపార్ జనరేట్ కాదు. 


13. విద్యార్థికి అపార్ జనరేట్ చేసినాము, వారి పేరెంటు విద్యార్థి పేరు మార్చితానంటున్నాడు ఇప్పుడు ఎలా ?

జ: ప్రస్తుతానికి, ఒకసారి అపార్ జనరేట్ చేస్తే పేరు మార్చడానికి వీలు లేదు. భవిష్యత్తులో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అట్టి పేరును మార్చడానికి వీలుంటుంది. 

14. అపార్ ఎందుకు ఉపయోగపడుతుంది ?

జ: విద్యార్థి భౌతికంగా తన సర్టిఫికెట్లను ఎక్కడికి మోసుకెళ్లవలసిన అవసరం లేదు. విద్యార్థి అడ్మిషన్ సమయంలో, ఉద్యోగానికి అప్లై చేస్తున్న సమయంలో, ఉద్యోగం ఇంటర్వ్యూ సమయంలో, ప్రైవేటు కంపెనీ ఇంటర్వ్యూలలో, విద్యార్థి తన యొక్క అపార్ నెంబరు చెప్పినట్లయితే అక్కడివారు ఆ సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. ప్రయాణంలో సర్టిఫికెట్లు పోతాయని భయం కూడా ఉండదు. భౌతికంగా సర్టిఫికెట్లు డామేజ్ అయిన ఆన్లైన్లో ఉంటాయి.

15. అపార్ లో తప్పులు జరగకుండా ఉపాధ్యాయులు ఏమి చేయాలి ?

జ: విద్యార్థి యొక్క అన్ని వ్యక్తిగత వివరాలు ఆధార్ కార్డుతో పోల్చి చూడాలి. వారి తల్లిదండ్రులకు తెలియజేసి కన్సెంట్ ఫామ్ పై సంతకం తీసుకోవాలి. విద్యార్థి వ్యక్తిగత వివరాలలో ఏవైనా తప్పులు గుర్తించినట్లయితే ఆ విషయాన్ని విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలి. వారు సవరణలు చేసుకున్న తర్వాత అన్ని సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు అపార్ట్ జనరేట్ చేయాలి. 

విద్యార్థి వివరాలు పాఠశాల రికార్డులో, యుడైస్ ప్లస్ లో, ఆధార్ కార్డులో ఒకే విధంగా ఉండాలి.

16. APAAR GENERATE కావడానికి తల్లిదండ్రుల పాత్ర ఏమిటి ?

విద్యార్థి వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ కు వెళ్లి అట్టితప్పులను సరి చేయించుకోవాలి. ఆధార్ కార్డులో, బర్త్ సర్టిఫికెట్ లో వివరాలు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి.

అన్ని వివరాలు సరిగా ఉన్నాయి అపార జనరేట్ చేయవచ్చు అని consent లెటర్ పై సంతకం చేసి ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలి.

CONSENT LETTER  CLICK HERE 

నోట్: ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల నుండి కన్సెంట్ ఫామ్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.


UDISE PLUS WEBSITE.   CLICK HERE 

Comments

Popular posts from this blog

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి