Posts

Showing posts from November, 2024

TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం

Image
  TSGLI ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే విధానం  👉 జిల్లా భీమా కార్యాలయం:  మీ టి ఎస్ జి ఎల్ ఐ జిల్లా ఆఫీసు పేరు రాయండి  👉 పాలసీ నెంబర్:  కొత్తగా అప్లై చేసేవారు New అని రాయాలి.  ప్రీమియం పెంపదల చేసుకునేవారు వారి పాలసీ నెంబరు రాయాలి.  👉 ప్రతిపాదన నెంబర్: ఇక్కడ ఏమీ రాయకండి  1. Name: మొదట మీ సర్ నేమ్ రాయండి,  2. SEX: male / female 3. Father's name : సర్ నేమ్ తో సహా బాక్సులు సరిపోయినట్లయితే రాయండి. లేదా పేరు మాత్రమే రాయండి.  4. మీ హోదా రాయండి. SGT/SA/LFLHM... 5. Employee office address: మీ పాఠశాల చిరునామా రాయండి. సర్వేస్ రికార్డులో నమోదు చేసిన అడ్రస్ మాత్రమే రాయండి.  6. Date of birth: DDMMYY 7. Date of first appointment: మొదటి నియామకపు తేది రాయండి. 8. Marital status: married/ unmarried /Widow /divorce  9. Is married number of children and their ages: పిల్లల సంఖ్య రాసి వారి వయస్సులు ఒక్కో బాక్స్ లో ఒక్కొక్కరి వయసు వరసగా రాయాలి  10. Basic and pay scale: మొదటి బాక్స్ లో బేసిక్ పే రాయండి, రెండో బాక్స్ లో మీ యొక్క పే స్కేల్ రాయండి...

Socio econamic సర్వే - సూచనలు

  Socio econamic సర్వేకు వెళ్తున్న ( గణకులు ) ఎన్యుమరేటర్లకు సూచనలు  1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం. ( Nov: 1 - 3 ) 2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.  3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.  4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.  5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి. 5. ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని వారికి తెలియజేయండి. 6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా...