PRASHAST app ఎందుకు ? ఉపయోగం ఏమిటి ?
అన్ని వైకల్య పరిస్థితులు కనిపించే విధంగా ఉండవు. చాలా వైకల్యాలను పరిశీలన ద్వారా గుర్తించవలసి ఉంటుంది. నూతన విద్యా విధానం 2020 కి అనుకూలంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులలో గల వైకల్యాలను ప్రశస్త్ ఆప్ ద్వారా గుర్తించడానికి NCERT వారు తయారు చేసినటువంటి ఒక సాధనము. చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను విద్యార్థులలో గుర్తించవలసి ఉంటుంది. PRASHAST అనగా.. " ప్రాథమిక అంచనాలు పాఠశాలల కోసం స్క్రీనింగ్ టూల్". Pre assessment holistic screening tool. ప్రశస్త్ app ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి అన్ని రకాల శారీరక, మానసిక, సామాజిక,విద్యా సామర్ధ్యాలకు, చలనాలకు సంబంధించినటువంటి వైకల్యాలను పరిశీలించి యాప్ లో ఒక సర్వే ఫారం ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది పూర్తిగా app లో చేసేటటువంటి సర్వే ఎలాంటి డాక్యుమెంట్ ఉపయోగించవలసిన అవసరం లేదు. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ యాప్ ను అందరూ ఉపాధ్యాయులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లో ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల మెయిల్ ద్వార...