పెన్షనర్ మరణిస్తే ఏం చేయాలి ?
పెన్షనర్ మరణిస్తే
సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులు మరణించిన పెన్షనర్లకు రావలసిన ప్రయోజనములు ఏవో తెలుసుకోవలసి ఉంటుంది.
ఇందుకు వారి కుటుంబ సభ్యులే కాకుండా, వారి బంధుమిత్రులు కూడా అవగాహన కలిగి ఉండాలి.
ఈ క్రింది విషయాలు గమనించగలరు:
1) సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో అట్టి విషయమును సంబంధిత ట్రెజరీ అధికారులకు ఫోన్ ద్వారా గాని లేదా లిఖితపూర్వకంగా గాని నమ్మకమైన వ్యక్తుల ద్వారా తెలియజేయాలి.
2) పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యధావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలుపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
3) పెన్షనర్ మరణించిన విషయము తెలియజేయునపుడు తప్పకుండా వారి *పి.పి. వో. నెంబర్, పి. పి. ఓ. ఐ. డి. నెంబర్, మరియు పేరు ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి*
4) సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ కేవలం ఒక అప్లికేషన్ మరణ ధ్రువీకరణ పత్రం జతపరుచుచూ ట్రెజరీ అధికారి గారికి పెట్టినచో అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. ఈ అంత్యక్రియల ఖర్చు ప్రస్తుతం ఒక నెల పెన్షన్ గాని, లేదా 20 వేల రూపాయలు గాని ఏది ఎక్కువైతే అది ఇస్తారు.
5) సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి, ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియల ఖర్చులు ఇస్తారు.
దయచేసి గ్రూప్ సభ్యులను కోరునది ఏమనగా మీకు తెలిసిన ఇతర పెన్షనర్లకు ఈ రకమైన ఇబ్బంది ఏర్పడ్డప్పుడు వారికి కూడా మీరు తగు సలహాలు సూచనలు అందించి సహాయపడగలరు.
సర్వీస్ పెన్షనర్ మరణించిన సందర్భంలో
ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు జత చేయవలసిన సర్టిఫికెట్లు:-
1) సర్వీస్ పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రం.
2) ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ.
3) ఫ్యామిలీ పెన్షనర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్.
4) పాన్ కార్డు జిరాక్స్.
( ఇది తప్పని సరి కాదు)
5) వ్యక్తిగత అభ్యర్ధన పత్రము.
6) ఏ బి సి డి ఫారం.
7)ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
( ఫ్యామిలీ పెన్షనర్ జీవించి ఉన్న సందర్భంలో ఇది కూడా తప్పనిసరి కాదు. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణిస్తే ఇది తప్పనిసరి అవుతుంది.
9) ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్
(అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుండి గాని లోకల్ ఫండ్ నుండి గాని వచ్చినది. ఇది తిరిగి ఫ్యామిలీ పెన్షనర్ కు ఇస్తారు.)
Comments
Post a Comment