బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు

 

బయోమెట్రిక్ డివైస్ ఉపయోగించేటప్పుడు పాటించవలసిన సూచనలు.


బయోమెట్రిక్ మిషన్ ను రాష్ట్ర విద్యాశాఖ తరఫున బయోమెట్రిక్ డిపార్ట్మెంట్ వారు వివిధ పాఠశాలలకు అందించడం జరుగుతుంది.

బయోమెట్రిక్ మిషన్ పాఠశాలకు అందించేటప్పుడు ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఐడి లు కేటాయించి వారి వివరాలన్నీ అందులో పొందుపరిచిన తరువాత, ప్రధాన ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ మిషన్ ను అందిస్తారు.

బయోమెట్రిక్ డేటా మొత్తం ఆధార్ డేటా తో అనుసంధానం అయి ఉంటుంది.

పాఠశాల సిబ్బందితోపాటు ఆ పాఠశాలలో స్టూడెంట్ ఇన్ఫో ప్రకారం నమోదు అయిన ప్రతి పిల్లవానికి ఒక బయోమెట్రిక్ ఐడిని కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ బయోమెట్రిక్ టెక్నీషియన్స్ మిషన్లలో సేవ్ చేసి ఇస్తారు.

బయోమెట్రిక్ మిషన్లో యుఐడిఏఐ ఆధారంగా తంబు వేస్తూ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వేలి ముద్రల ద్వారా హాజరు నమోదు కానీ వారు, ఐరిష్ (కంటి పాప) స్కాన్ చేయడం ద్వారా హాజరు వేయవలసి ఉంటుంది.

ఆధార్ లో  వేలిముద్రలు అప్డేట్ చేసుకున్న వారికి వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ మిషన్ లో హాజరు నమోదు అవుతుంది.

కొంతమంది విద్యార్థులకు వేలిముద్రలు అప్డేట్ చేసి ఉండవు అలాంటి వారికి వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేయలేము. వీరికి కంటి పాపను స్కాన్ చేయడం ద్వారా హాజరు వేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే హాజరు తీసుకుంటున్నారు. విద్యార్థుల హాజరు తీసుకోవడం లేదు.

పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ సిబ్బంది వేలిముద్రల ద్వారా తమ ఐడిని నమోదు చేసి బయోమెట్రిక్ మిషన్లో హాజరు వేయవలసి ఉంటుంది.

పాఠశాల సిబ్బంది అందరి వివరాలను బయోమెట్రిక్ వారు మిషన్లో  సేవ్ చేసి ID నెంబర్లను ఇస్తారు. మీరు కేవలం మిషన్ చార్జింగ్ చేసుకొని ఆన్ చేయడం ద్వారా హాజరు వేయవలసి ఉంటుంది.

ఉదయం మొదటగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు బయోమెట్రిక్ మిషన్ ను ఆన్ చేయాలి. 2 లేదా 3 నిమిషాలలో బయోమెట్రిక్ సిస్టం రెడీ అవుతుంది. RD రెడీ అయిన తర్వాత మాత్రమే హాజరు నమోదు చేయాలి.

మిషన్ ను ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసేది ఏమీ ఉండదు. కేవలం ప్రతిరోజు చార్జి చేస్తూ అటెండెన్స్ నమోదు చేయాలి.

బయోమెట్రిక్ డివైస్ లో ఉదయం పాఠశాల సిబ్బంది అందరూ హాజరు నమోదు చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయవచ్చు. తిరిగి పాఠశాల వదిలిన తర్వాత మిషన్ ఆన్ చేసి అందరి సిబ్బంది హాజరు నమోదు చేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళవలసి ఉంటుంది.

బయోమెట్రిక్ మిషన్లో స్క్రీన్ ఆఫ్ చేసే ఫెసిలిటీ లేదు. కాబట్టి మీరు మిషన్ ను స్విచ్ ఆన్ చేసి ఉంచినట్లయిటే త్వరగా చార్జింగ్ పోతుంది. కాబట్టి ఉదయం హాజరు నమోదు చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి. తిరిగి పాఠశాల వదిలేయడానికి ఐదు నిమిషాల ముందు మిషన్ స్విచ్ ఆన్ చేయండి. మిషన్ రెడీ అవ్వగానే హాజరు నమోదు చేసి తిరిగి స్విచాఫ్ చేయండి.

                      🌹🌹🌹🌹🌹🌹

హాజరు నమోదు చేయడానికి ఈ క్రింది సూచనలను పాటించండి

1. బయోమెట్రిక్ డివైస్ లో అటెండెన్స్ నమోదు చేయడానికి మొదటగా మీరు బయోమెట్రిక్ డివైస్ ఆన్ చేయండి.



2. డివైస్ (RD- registered device) రెడీ అయ్యేంతవరకు వేచి ఉండండి. డివైస్ లో సిగ్నల్ ఉన్నదా లేదా అనే విషయాన్ని గమనించండి. ఒకవేళ సిగ్నల్ లేనట్లయితే, సిగ్నల్ రీచ్ అయ్యేంతవరకు వేచి ఉండండి.

3. డివైస్ స్కానర్ మరియు మీ యొక్క ఫింగర్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

4. మీ ఐడిని నమోదు చేసి స్కానర్ పై తంబు వేయండి. బీప్ సౌండ్ వచ్చే వరకు థంబ్ తీయవద్దు. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత తంబు తీయండి.

5. మీ యొక్క హాజరు విజయవంతంగా నమోదు చేయబడుతుంది. స్క్రీన్ పైన మీ హాజరు విజయవంతంగా నమోదు చేసినట్లు మెసేజ్ కనిపిస్తుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే సమస్య ఏమిటనేది కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది.

6. కొన్ని సందర్భాలలో మనం హాజరు వేయడానికి ప్రయత్నించినప్పుడు RD నాట్ స్టార్టెడ్ అని వస్తుంది.

7. అలాంటప్పుడు డివైస్ రెడీ అవ్వలేదని అర్థం చేసుకోవాలి. మరికొంత సమయం వేచి ఉండాలి.

8. సర్వర్ డౌన్ గా ఉన్నప్పుడు నాట్ రీచబుల్ అని, response not received అని వస్తుంది. ఇలాంటి సందర్భాలలో వెంట వెంటనే థంబ్ నమోదు చేయకండి. కొంత సమయం వేచి ఉండి ఆ తర్వాత నమోదు చేయండి అటెండెన్స్ నమోదు అవుతుంది.

9. ఐడిని తప్పుగా ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అలాంటప్పుడు ఒకసారి మీ వివరాలు సరి చూసుకోండి.

👉 కొన్ని సందర్భాలలో మనం ఒకటి కంటే ఎక్కువసార్లు హాజరు నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు "మీరు ఎక్కువసార్లు నమోదు చేయడానికి ప్రయత్నించారు" అని లేదా "మీ హాజరు ఇదివరకే నమోదు చేయబడినది" అనే ఇండికేషన్ వస్తుంది గమనించండి.

హాజరు నమోదు విషయంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ మండల బయోమెట్రిక్ టెక్నీషియన్ ను సంప్రదించండి.

               **********************

👉 బయోమెట్రిక్ డివైస్ లో CL అప్లై చేసేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

లేనట్లయితే సి ఎల్ అప్లై చేస్తున్న ఉపాధ్యాయునికి CL నమోదయ్యే అవకాశం ఉన్నది.

👉 బయోమెట్రిక్ లో CL అప్లై చేయడానికి ఆరోజు హాజరైన ప్రధానోపాధ్యాయులు లేదా ఇతర ఉపాధ్యాయులు ఎవరో ఒకరు డివైస్ లాగిన్ చేయవలసి ఉంటుంది.

👉 ఎవరైతే CL అప్లై చేస్తున్నారో వారి బయోమెట్రిక్ ఐడి తో డివైస్ లాగిన్ చేయాలి.

తర్వాత CL options సెలెక్ట్ చేయాలి.

👉 ఆప్షన్స్ డిస్ప్లే అయిన తర్వాత CL type & డేట్ సెలెక్ట్ చేయాలి.

👉 ఈ స్టెప్స్ వరకు లాగిన్ అయిన ఉపాధ్యాయిని ఐడి మాత్రమే అక్కడ active గా ఉంటుంది.

👉 CL టైపు సెలెక్ట్ చేసి, డేటు సెలెక్ట్ చేసిన తర్వాత మీ ID బదులు,

 మీరు ఏ ఉపాధ్యాయునికి CL నమోదు చేయాలనుకుంటున్నారో, ఆ ఉపాధ్యాయిని బయోమెట్రిక్ ఐడిని నమోదు చేసిన తర్వాత మాత్రమే CL సబ్మిట్ చేయాలి.

👉 ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు పొరపాటుగా ఐడిని మార్చకుండా CL సబ్మిట్ చేస్తున్నారు.

👉 దీనివలన ఎవరైతే లాగిన్ చేశారో ఆ ఉపాధ్యాయునికి CL నమోదు అవుతున్నది.

👉 కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు.

👉 CL నమోదు చేసిన తర్వాత డివైస్ లో ఎడిట్ కానీ డిలీట్ కానీ చేసే ఆప్షన్ ప్రస్తుతానికి లేదు.

👉 ఇలాంటి సమస్య లేకుండా ఉండటం కోసం CL మీ మొబైల్ ద్వారా వెబ్ పోర్టల్ లో అప్లై చేయండి.

👉 ఒకవేళ మీరు CL నమోదు చేసేటప్పుడు పొరపాటుగా ఒక ఉపాధ్యాయుని CL మరొక ఉపాధ్యాయునికి నమోదు చేయబడిన లేక CL డేట్ తప్పుగా నమోదు చేసినా...

ఇలా చేసిన తప్పుడు ఎంట్రీ ని బయోమెట్రిక్ వెబ్ పోర్టల్ లాగిన్ చేయడం ద్వారా డిలీట్ చేయడానికి అవకాశం ఉన్నది.

👉 మీ పాఠశాల యొక్క యు డైస్ కోడ్, పాస్వర్డ్ తో వెబ్సైటు లాగిన్ చేయండి. 

👉 మెనూ నుండి లీవ్స్ మేనేజ్మెంట్ లో లీవ్స్ లిస్ట్ సెలెక్ట్ చేయండి.

👉 తర్వాత మీరు ఏ తేదీన రాంగ్ ఎంట్రీ చేశారో ఆ తేదీని సెలెక్ట్ చేయండి. అన్ని ఆప్షన్స్ నమోదు చేసి మీరు ఏ ఉపాధ్యాయుని యొక్క రాంగ్ ఎంట్రీ సిఎల్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఉపాధ్యాయుని ఐడి నమోదు చేసి సబ్మిట్ చేయండి.

👉 మనం తప్పుగా నమోదు చేసిన CL వివరాలు డిస్ప్లే అవుతాయి. అక్కడే కుడివైపు చివరలో డిలీట్ బటన్ ఉంటుంది. 

👉 డిలీట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు తప్పుగా నమోదు చేసిన CL వివరాలను డిలీట్ చేయండి.

Web portal లో CL apply చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.

తప్పుగా నమోదు చేసిన CL వివరాలను డిలీట్ చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి


Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION