పెన్షనర్ మరణిస్తే ఏం చేయాలి ?
పెన్షనర్ మరణిస్తే సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో, వారి కుటుంబ సభ్యులు మరణించిన పెన్షనర్లకు రావలసిన ప్రయోజనములు ఏవో తెలుసుకోవలసి ఉంటుంది. ఇందుకు వారి కుటుంబ సభ్యులే కాకుండా, వారి బంధుమిత్రులు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ క్రింది విషయాలు గమనించగలరు: 1) సర్వీస్ పెన్షనర్ గాని ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో అట్టి విషయమును సంబంధిత ట్రెజరీ అధికారులకు ఫోన్ ద్వారా గాని లేదా లిఖితపూర్వకంగా గాని నమ్మకమైన వ్యక్తుల ద్వారా తెలియజేయాలి. 2) పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యధావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలుపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 3) పెన్షనర్ మరణించిన విషయము తెలియజేయునపుడు తప్పకుండా వారి *పి.పి. వో. నెంబర్, పి. పి. ఓ. ఐ. డి. నెంబర్, మరియు పేరు ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి* 4) సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ కేవలం ఒక అప్లికేషన్ మరణ ధ్రువీకరణ పత్రం జతపరుచుచూ ట్రెజరీ అధికారి...