ఉద్యోగి మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లు
💠 ఉద్యోగి మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లు💠 కుటుంబం లో ఉద్యోగి మరణిస్తే ఏమి చేయాలి, ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం అవుతాయి, అవి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పూర్తి సమాచారం మీ కోసం..... 1.డెత్ సర్టిఫికెట్ 👉మీ సేవ నందు అన్ లైన్ లో నమోదు చేయాలి. సొంత అడ్రస్ ఏదైనా చనిపోయిన వారి నివాస ప్రాంతం లోని పరిధి లో డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. 👉అందుకు చనిపోయిన వారి మరియు అప్లై చేసే వారి ఆధార్ అవసరం. భార్య లేదా పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు. 👉మీ సేవలో అయితే ఒక ఫామ్ ఇస్తారు వివరాలు నింపాలి, గ్రామ పంచాయతీ అయితే తెల్ల కాగితం పైన అప్లికేషన్ రాస్తే సరిపోతుంది. 👉 ఉద్యోగికి చనిపోయిన విధానం ను బట్టి (పోస్ట్ మార్టం జరిగి ఉంటే) ఆ రిపోర్ట్ కానీ, హాస్పిటల్ లో ఏదైనా వ్యాధి తో చనిపోతే ఆ వివరాల ప్రతులు మరియు ఆధార్ Xerox జత చేయాలి. 👉గ్రామ పంచాయితీ/మునిసిపాలిటీ లో హార్డ్ కాపీ ఇవ్వాలి.గ్రామం లో గ్రామ కార్యదర్శి/ మున్సిపాలిటీ అయితే కమిషనర్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦️మీ సేవలో అన్ లైన్ చేశాక రిసిప్టు ఇస్తారు.అది భద్ర పరచాలి. ఈ రిసిప్ట్ సహాయంతో సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు 2.ఫ్యామిలీ మెంబెర్స్ సర...