💠ఉద్యోగి మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లు💠
కుటుంబం లో ఉద్యోగి మరణిస్తే ఏమి చేయాలి, ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం అవుతాయి, అవి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పూర్తి సమాచారం మీ కోసం.....
1.డెత్ సర్టిఫికెట్
👉మీ సేవ నందు అన్ లైన్ లో నమోదు చేయాలి. సొంత అడ్రస్ ఏదైనా చనిపోయిన వారి నివాస ప్రాంతం లోని పరిధి లో డెత్ సర్టిఫికెట్ ఇస్తారు.
👉అందుకు చనిపోయిన వారి మరియు అప్లై చేసే వారి ఆధార్ అవసరం. భార్య లేదా పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు.
👉మీ సేవలో అయితే ఒక ఫామ్ ఇస్తారు వివరాలు నింపాలి, గ్రామ పంచాయతీ అయితే తెల్ల కాగితం పైన అప్లికేషన్ రాస్తే సరిపోతుంది.
👉 ఉద్యోగికి చనిపోయిన విధానం ను బట్టి (పోస్ట్ మార్టం జరిగి ఉంటే) ఆ రిపోర్ట్ కానీ, హాస్పిటల్ లో ఏదైనా వ్యాధి తో చనిపోతే ఆ వివరాల ప్రతులు మరియు ఆధార్ Xerox జత చేయాలి.
👉గ్రామ పంచాయితీ/మునిసిపాలిటీ లో హార్డ్ కాపీ ఇవ్వాలి.గ్రామం లో గ్రామ కార్యదర్శి/ మున్సిపాలిటీ అయితే కమిషనర్ సర్టిఫికెట్ ఇస్తారు.
♦️మీ సేవలో అన్ లైన్ చేశాక రిసిప్టు ఇస్తారు.అది భద్ర పరచాలి. ఈ రిసిప్ట్ సహాయంతో సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు
2.ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్.
👉డెత్ సర్టిఫికెట్ వచ్చాక మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ప్రకారం.అంటే మీ సొంత గ్రామం లేదా సొంత పట్టణం పరిధి లో మాత్రమే ఇస్తారు.
👉కుటుంబ సభ్యుల అందరి ఆధార్ లతో లేదా ఓటర్ గుర్తింపు కార్డ్స్ తో చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ తో మీ సేవ నందు అన్ లైన్ లో అప్లై చేయాలి. మీ సేవలో కుటుంబ సభ్యుల నోటరీ తయారు చేసి ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. దీనిలో అందరి కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలి.
👉 ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీ మొత్తం ఆఫీస్ లో ఆర్. ఐ గారికి అప్పగించాలి.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీ సొంత గ్రామం లోకి వెళ్లి ఆ విషయం గురించి పంచనామ నిర్వహిస్తారు. ఆ సమయంలో మీరు అందుబాటులో ఉండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ముగ్గురు లేదా నలుగురు సాక్షి సంతకాలు చేయవలసి ఉంటుంది.
ఫ్యామిలీ మెంబర్స్ లో కావాలనే ఉద్దేశంతో ఏ ఒక్క సభ్యున్ని మిస్ చేసిన వారు అభ్యంతరం తెలియ చేసే అవకాశం ఉంటుంది. చనిపోయిన వ్యక్తి కి ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే వారిని కూడా సర్టిఫికెట్ లో చేర్చాల్సి ఉంటుంది.
పంచనామా నిర్వహించిన తర్వాత రెవెన్యూ ఆఫీస్ వారు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులను గ్రామపంచాయతీ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ మరియు ఎంపీడీవో ఆఫీస్ లో ఇవ్వవలసి ఉంటుంది. ఇలా నోటీసులు జారీ చేసిన 15 రోజుల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే మాత్రమే మీకు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ అప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ సేవకు వెళ్లి సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎన్ని కాపీలు అవసరమైతే అన్ని కాపీలు అప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కాదు.
3.నో ఎర్నింగ్ మెంబెర్స్ సర్టిఫికెట్.
👉ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ వచ్చాక మీ సేవ నందు అన్ లైన్ అప్లై చేయాలి. దీనికి డెత్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ జత చేయాలి
👉అన్ లైన్ చేసిన ఆప్లికేషన్ కు డెత్,ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ జత చేసి MRO ఆఫీస్ నందు ఇవ్వాలి.
👉 వారం రోజులకు MRO గారు నో ఎర్నింగ్ నెంబర్ సర్టిఫికెట్ ఇస్తారు. కుటుంబం లో సంపాదించే సంపాదన గురించి ఇచ్చేది NO ఎర్నింగ్ సర్టిఫికెట్.
4.నో ప్రాపర్టీ సర్టిఫికెట్
👉మీ సేవ నందు అన్ లైన్ చేయాలి.ఆన్లైన్ చేసిన పత్రాలకు డెత్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ లు జత చేసి MRO ఆఫీస్ నందు ఇవ్వాలి.
👉 MRO గారు వారం రోజుల తరువాత నో పాపర్టీ certificate ఇస్తారు.
ఈ సర్టిఫికేట్ లో కుటుంబ కలిగిఉన్న ఆస్తుల గురించిన వివరాలు ఉంటాయి.
5.ఎంప్లాయ్ మెంట్ కార్డ్
👉కారుణ్య నియామకం కోసం కుటుంబ లో ఉద్యోగం పొందవలసిన వారికి ఎంప్లాయ్ మెంట్ కార్డ్ ఉండాలి.
👉 ఎంప్లాయిమెంట్ కార్డు లేకపోతే ఒరిజినల్ సర్టిఫికెట్లు,ఒక ఫోటో క్యాస్ట్ సర్టిఫికేట్ తో మీ సేవ నందు అప్లై చేయాలి.
👉 వారం రోజుల తరువాత మీ సేవా నందే సర్టిఫికెట్ తీసుకోవాలి.
👉 దీనికి మీ సేవ వారు క్రియేట్ చేసిన యూజర్ ఐడి, పాస్వర్డ్ భద్ర పరచాలి. వీటి సహాయంతో కార్డ్ అప్రూవ్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి.
6.NOC. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్.
👉కారుణ్య నియామకం కోసం.ఉద్యోగం పొందే కుటుంబ సభ్యునికి, మిగతా కుటుంబ సభ్యులు మాకు అభ్యంతరం లేదు అని రాసి ఇవ్వాలి.
👉ఇది మీ సేవ వారి దగ్గర ఉంటుంది 50రూ.బాండ్ పేపర్ మీద ప్రింట్ తీసి ఇస్తారు. కుటుంబ సభ్యులు అందరూ దీనిపై సంతకం చేయాలి.
7.క్యాస్ట్ సర్టిఫికేట్.
👉కారుణ్య నియామకం కోసం ఉద్యోగం పొందే వారు మొదలే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసి ఉంచాలి. లేని వారు ఆధార్ కార్డ్ Xerox తో మీ సేవ కేంద్రం లో అప్లై చేయాలి. వారం రోజుల్లో సర్టిఫికెట్ అప్రూవ్ అవుతుంది.
సబ్మిట్ చేయవలసిన బిల్స్
DDO నుండి STO కు ఇవ్వవలసిన బిల్స్
👉GIS
👉 హాఫ్ పే లీవు లు
👉ఉన్న EL లు సరెండర్ bills చేయించి ఉద్యోగి సంబంధిత STO ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.
TSGLI
👉నామిని ఫోటో తో ఫామ్ నింపి.DDO సంతకాలు చేయించి ఒరిజినల్ బాండ్స్ జత చేసి జిల్లా కార్యాలయం లో ఇవ్వాలి.
నామిని పేరు మధ్యలో మార్చినట్లయితే గత నామిని తో నో అబ్జెక్షన్ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.
ఒకవేళ మొదటి నామిని చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
ఉదా: పెళ్ళికాని ఉద్యోగి మొదటగా నామినీగా తమ తండ్రి లేదా తల్లి పేరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. పెళ్లయిన తర్వాత నామిని భార్య పేరు మీదకి మార్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో మొదటి నామిని యొక్క నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ లేదా డెత్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.
ఉద్యోగి యొక్క అన్ని tsgli బాండ్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే వెంటనే మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది.
మీరు ప్రీమియం చెల్లిస్తూ దానికి సరిపడే బాండు లేనట్లయితే అట్టి బాండుకు తగిన విధంగా పాలసీ అమౌంట్ చెల్లించబడదు.
కాబట్టి ఉద్యోగి ప్రీమియం పెంచిన సమయంలో తప్పనిసరిగా దానికి సరిపడే బాన్డును తీసుకోవలసి ఉంటుంది.
ఎలాంటి మిస్సింగ్ క్రెడిట్స్ లేకుండా ఉండాలి. ఉద్యోగి అప్పుడప్పుడు మిస్సింగ్ క్రెడిట్స్ చెక్ చేసుకుంటూ వాటిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
GPF
👉GPS బూస్టర్ స్కీమ్ ఫైనల్ ఎమౌంట్ DDO సంతకాలు చేయించి GPF జిల్లా కార్యాలయం లో ఇవ్వాలి.
నామిని పేరు మధ్యలో మార్చినట్లయితే గత నామిని తో నో అబ్జెక్షన్ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.
ఒకవేళ మొదటి నామిని చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
ఉదా: పెళ్ళికాని ఉద్యోగి మొదటగా నామినీగా తమ తండ్రి లేదా తల్లి పేరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. పెళ్లయిన తర్వాత నామిని భార్య పేరు మీదకి మార్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో మొదటి నామిని యొక్క నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ లేదా డెత్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.
కాబట్టి ఉద్యోగి మొదటి నామిని యొక్క ప్రొసీడింగ్ మరియు మధ్య నామిని పేరు మార్చినట్లయితే ఆ ఫీలింగ్ ను తీసుకున్నట్లయితే ఇలాంటి సందర్భాలలో ఉపయోగపడుతుంది.
జిపిఎఫ్ పూర్తి అమౌంట్ మన చేతికి అందాలంటే మధ్యలో ఎలాంటి మిస్సింగ్ క్రెడిట్స్ ఉండకూడదు. కాబట్టి ఉద్యోగి అప్పుడప్పుడు మిస్సింగ్ క్రెడిట్ చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాటిని మిస్సింగ్ లేకుండా చూసుకోవచ్చు. లేనట్లయితే ఉద్యోగి చనిపోయిన తర్వాత జిపిఎఫ్ సరెండర్ కోసం వెళ్లినప్పుడు మిసింగ్ క్రెడిట్స్ ఉన్నట్లయితే అలాంటి మిస్సింగ్ క్రెడిట్స్ ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల చే స్టేట్మెంట్ చేయించి యాడ్ చేసిన తర్వాత మాత్రమే సరెండర్ చేయడానికి వీలవుతుంది.
పెన్షన్,గ్రాట్యుటీ
👉పెన్షన్ మరియు గ్రాట్యుటీ బిల్లులు చేయించి DDO సంతకాలు పూర్తి అయిన తరువాత AG HYD కార్యాలయం లో ఇవ్వాలి. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ మరియు డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది.
👉 కారుణ్య నియామక ఫైల్ సబ్మిషన్
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు.
కారుణ్య నియామకాలు రెండు రకాలు.
ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.
రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి
ఆధారితులకు ఇచ్చేది.
ఎవరికి ఇస్తారు
1.ఉద్యోగి భార్య/భర్త,
2.కుమారుడు/కుమార్తె,
3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,
4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె,
5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు,
6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.
ఏ ఉద్యోగం లో నియామకం చేస్తారు.
జూనియర్ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.
నియామక విధానం
ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులుయ నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.
ఎవరు నియామకం చేస్తారు
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 వరకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.
Comments
Post a Comment