గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1
గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1 సాధారణంగా గుణకారం ఎక్కాలు బట్టి విధానంలో నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవడం వలన మధ్యలో ఎక్కమ్ మరచిపోయినట్లయితే లెక్క చేయడంలో తప్పులు జరుగుతుంటాయి. అలా కాకుండా ఎక్కాలని శాస్త్రీయ విధానంలో నేర్పినట్లయితే మర్చిపోయే అవకాశం ఉండదు. లెక్కలను వేగంగా మరియు సరిగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కాలు మొదటగా ఒకటో ఎక్కం నుంచి 9 వరకు శాస్త్రీయపద్దతిలో నేర్పించాల్సి ఉంటుంది. ఎక్కాలను పునరావృత కూడిక విధానంలో 1 నుంచి 9 వరకు నేర్పించాలి. గుణకారం ఎక్కాల లో చాలా వరకు 1 నుంచి గుణకారం చేసే విధానంలో ఎక్కాలు నేర్పుతూ ఉంటారు. ఉదా: 2 × 1= 2 ఇలా మొదలుపెట్టి పది వరకు వ్రాయించి ముగిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఏ ఎక్కమైనా 0 నుంచి రాయడం మొదలుపెట్టి (పిల్లలకు అర్దం అయ్యే వరకు) పది వరకు లేదా అంతకంటే ఎక్కువ వరకు రాయించాలి. ఉదా: 2 × 0 = 0 2 × 10 = 20 2 × 12 = 24 ఎక్కము నేర్పించే విధానం : పునరావృత కూడిక విధానంలో..... ఉదా: 2 × 2 = ? దీని అర్థం 2ను 2 సార్లు కూడాలని అని అర్థం అనగా : 2 + 2 = 4 జవాబు అవుతుంది. 2 × 3 = ? దీని అర్థం రెండును మూడు సార్ల