గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1

 గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం - PART:1

సాధారణంగా గుణకారం ఎక్కాలు బట్టి విధానంలో నేర్చుకుంటారు.

ఇలా నేర్చుకోవడం వలన మధ్యలో ఎక్కమ్ మరచిపోయినట్లయితే లెక్క చేయడంలో తప్పులు జరుగుతుంటాయి.

అలా కాకుండా ఎక్కాలని శాస్త్రీయ విధానంలో నేర్పినట్లయితే మర్చిపోయే అవకాశం ఉండదు. లెక్కలను వేగంగా మరియు సరిగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది.

ఎక్కాలు మొదటగా ఒకటో ఎక్కం నుంచి 9 వరకు శాస్త్రీయపద్దతిలో నేర్పించాల్సి ఉంటుంది.

ఎక్కాలను పునరావృత కూడిక విధానంలో 1 నుంచి 9 వరకు నేర్పించాలి.

గుణకారం ఎక్కాల లో చాలా వరకు 1 నుంచి గుణకారం చేసే విధానంలో ఎక్కాలు నేర్పుతూ ఉంటారు.

 ఉదా: 2 × 1= 2 ఇలా మొదలుపెట్టి పది వరకు వ్రాయించి ముగిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు.

ఏ ఎక్కమైనా 0 నుంచి రాయడం మొదలుపెట్టి (పిల్లలకు అర్దం అయ్యే వరకు) పది వరకు లేదా అంతకంటే ఎక్కువ వరకు రాయించాలి.

ఉదా: 2 × 0 = 0

         2 × 10 = 20

         2 × 12 = 24

ఎక్కము నేర్పించే విధానం : పునరావృత కూడిక విధానంలో.....

ఉదా:

 2 × 2 = ?

 దీని అర్థం 2ను 2 సార్లు కూడాలని అని అర్థం

అనగా : 2 + 2 = 4 జవాబు అవుతుంది.


        2 × 3 = ? 

దీని అర్థం రెండును మూడు సార్లు కూడాలని

   2+2+2 = 6

     

    2 × 10 అనగా

రెండును పదిసార్లు కూడాలి

2+2+2+2+2+2+2+2+2+2= 20


   2 × 1 = ? 

రెండు ను ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి జవాబు 2 అవుతుంది.


  2 × 0 = ? 

   2 ను సున్న సార్లు కుడాలి ( సున్న సార్లు అనగా విలువ సున్న). అనగా దీని జవాబు 0 అవుతుంది.

మరికొన్ని ఉదాహరణలు:

9 ×0 = 0 

9 × 1 = 9      9

9 × 2 = 18    9+9= 18

9 × 3 = 27    9+9+9 = 27

9 × 4 = 32    9+9+9+9 = 36  ఇలా రాయింఛాలి.

కాబట్టి గుణకారం ఎక్కాలు నేర్పించే విధానం లో ఏదైనా సంఖ్యను 0 చే గునిస్తే జవాబు 0 అని, 

మరికొన్ని ఉదాహరణలు:

 3×0= 0

10×0 = 0

100 × 0 = 0 ...


ఏదైనా సంఖ్యను 1 చే గుణిస్తే జవాబు అదే సంఖ్య వస్తుంది అని అర్దం అయ్యేలా చెప్పాలి.

3 × 1 = 3

10 × 1 = 10

100 × 1 = 100 

1000 × 1 = 1000 ...


👉 ఏ ఎక్కం అయినా సరే 0 మొదలుపెట్టి, విద్యార్థికి వీలయినంత వరకు రాయించాలి. అంతే కానీ 10 వద్ద అపవద్దు.

👉 ఇలా నేర్పినట్లయిటే ఎక్కాలు ఎప్పుడూ మరిచిపోకుండా గుర్తుంటాయి. 

ఒకవేళ మధ్యలో మరిచిపోతే పునరావృత కూడిక విధానంలో జవాబు తెలుసుకుంటారు.

ప్రారంభదశలో ఎక్కాలు నేర్పించడానికి చింత గింజలు, రాళ్ళు, చెక్ రూల్ కాపీ లోని డబ్బాలు ఉపయోగించి నేర్పవచ్చు


       

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS