నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో మన పాఠశాల యొక్క కేవైసీ పూర్తి చేసే విధానం step by step process
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో మన పాఠశాల యొక్క కేవైసీ పూర్తి చేసే విధానం step by step process
గతం లో ప్రాథమిక పాఠశాలల ను పోర్టల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం NSP పోర్టల్ లో KYC పూర్తి చేయాలి.ఇలా చేసినప్పుడు మాత్రమే మన పాఠశాల విద్యార్థులు స్కాలర్ షిప్ apply చేయడానికి అవకాశం ఉంటుంది.
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి
వెబ్ సైట్ మెయిన్ స్క్రీన్లో institute login కనిపిస్తుంది click చేయండి.
తర్వాత స్క్రీన్ లో పాఠశాల యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మొదటి బాక్స్ లో
Institute nodal officer సెలక్ట్ చేయండి.
రెండవ బాక్స్ academic year: 2021- 22 సెలెక్ట్ చేయండి.
మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి అనేది మనకు రిజిస్ట్రేషన్ టైంలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుండి జనరేట్ అయినటువంటి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పోర్టల్ నుండి జనరెట్ అయిన పాస్వర్డ్ నమోదు చేయాలి.( P W మరిచిపోతే forgot password తో కొత్త పాస్వర్డ్ పొందవచ్చు)
క్యాప్చా ఎలాంటి తప్పు లేకుండా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి.
మొదటి సారి వివరాలు సబ్మిట్ చేయగానే పాస్వర్డ్ మార్చమని అడుగుతుంది. మీరు మీ సొంత పాస్వర్డ్ రీసెట్ చేసుకొని, ఫ్రెష్ గా లాగిన్ చేయండి.
లాగిన్ చేసిన ప్రతి సారి మీ పాఠశాల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. OTP verify చేయాలి.
తర్వాత హోం పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో లెఫ్ట్ సైడ్
Administration మరియు logout అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Administration క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెను లో
Update profile మరియు change password అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
మీరు update profile క్లిక్ చేయండి.
తర్వాత స్క్రీన్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
ఓటిపి వెరిఫై చేయగానే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ లో మీ పాఠశాల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి.
ఈ విద్యా సంవత్సరం యొక్క ఎన్రోల్మెంట్ ను నమోదు చేయండి.
School registration certificate
upload అని ఉంటుంది.
Upload బటన్ క్లిక్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధార్ కార్డును 100 kb నుండి 250 kb సైజులో JPEG ఇమేజ్ మోడల్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
తర్వాత ప్రధానోపాధ్యాయులు యొక్క ఆధార్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లో ఉన్నటువంటి పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలు నమోదు చేయాలి. హెడ్మాస్టర్ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత చివర్లో ఉన్నటువంటి final submit బటన్ క్లిక్ చేయండి. మీరు ఇచ్చినటువంటి వివరాలు అప్డేట్ చేయడం జరుగుతుంది.
దీంతో KYC ప్రాసెస్ పూర్తవుతుంది.
తర్వాత పాఠశాల యొక్క కోర్స్ వివరాలు( తరగతుల వివరాలు) మరియు కోర్సు ఫీజు వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది.
తర్వాత administration బటన్ క్లిక్ చేయండి డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
ఈ మెనూ లో
Add and update course level
Add and update course
Add course fee
Update course fee
అనే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Add and update course level క్లిక్ చేయండి.
Offer course level లో
మీ పాఠశాల యొక్క కోర్స్ లెవెల్ 1 to 10th సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి.
బ్యాక్ వచ్చి add and update course క్లిక్ చేయండి.
Choose your option లో ఒక్కొక్క తరగతి సెలక్ట్ చేసి సబ్మిట్ చేయండి మీ పాఠశాలలో 1 నుండి 5 తరగతులు ఉన్నట్లయితే ఐదు తరగతులు సెలెక్ట్ చేయండి.
6 నుండి 10వ తరగతి ఉన్నట్లయితే ఒక్కొక్క తరగతి ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. మీ పాఠశాల యొక్క అన్ని కోర్సుల వివరాలు అప్డేట్ అవడం జరుగుతుంది.
తరువాత add course fee క్లిక్ చేయండి.
Course లో తరగతులు సెలెక్ట్ చేయాలి.
Course year: one year select చేయండి.
Category: all category
Gender: all gender
Admission fee: 0
Tution fee: 0
Other fee: 0
ఇలా సెలక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇదే పద్ధతిలో ఒక్కొక్క తరగతి వివరాలు సెలక్ట్ చేస్తూ సబ్మిట్ చేయండి.
Primary school : 1 to 5th
High school: 6th to 10th (or)
1st to 10th వివరాలు అప్లోడ్ చేయాలి.
ఈ వివరాలన్నీ నమోదు చేసినట్లయితే మీ పాఠశాల నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో విజయవంతంగా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థుల చేత స్కాలర్షిప్ కోసం అప్లై చేయించవచ్చు.
NSP portal లోకి ప్రవేశించడానికి ఇక్కడ CLICK చేయండి.
Comments
Post a Comment