MEDICAL REMBURESEMENT (మెడికల్ రీయంబర్స్మెంట్) 👉 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును. *( G.O.Ms.No.74 తేది:15-03-2005 )* 👉 ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును. *( G.O.Ms.No.397 తేది:13-11-2008 )* 👉 కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు. 👉వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి. *( G.O.Ms.No.346 dt: 17.12.2011 ) 👉 ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు. *( G.O.Ms.No.68 తేది:28-03-2011 )* 👉 కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు. 👉 కంటి చికిత్స,దంత చికిత...