SSC PUBLIC EXAMINATIONS - TELUGU GUESS PAPER

SSC PUBLIC EXAMINATIONS - TELUGU GUESS QUESTION PAPER PART - A : 60 మార్కులు PART - B : 20 మార్కులు ప్రాజెక్టు - : 20 మార్కులు TOTAL - 100 👉 ప్రశ్నలను జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయండి. కొట్టివేతలు దిద్దుడు లేకుండా చూసుకోండి. ప్రశ్న నెంబరు తప్పకుండా వేయండి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 👉 I. అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం పై 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఉపవాచకం నుండి రెండు పేరాగ్రాఫ్ లు ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్ పై ప్రశ్నలు వివిధ రకాలుగా అడిగే అవకాశం ఉన్నది. 1. ఒక ప్రశ్న ఇచ్చి సమాధానం రాయమనడం 2. తప్పు ఒప్పులను గుర్తించడం. 3. జత పరచడం 4. కీలకమైన పదాలు కొన్ని ఇచ్చి వాటిని వివరించమనడం. ఇలా కూడా అడగవచ్చు. కాని నోట్: ఎక్కువగా పేరాగ్రాఫ్ కు సంబంధించి ప్రశ్నలు ఇచ్చి వాటికి జవాబులు రాయమంటారు . 👉 అపరిచిత గద్యాలు భాష ,సాహిత్య, చారిత్రక అంశాలకు సంబంధించిన రెండు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు ఇస్తారు. ప్రతి పేరాగ్రాఫ్ కు 5 ప్...