ALL INDIA SAINIK SCHOOL ENTRANCE EXAMINATION -2025
కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతోంది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2025) ద్వారా ప్రవేశాలు కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధప్రదేశ్‌లోని రెండు సైనిక్ స్కూల్స్‌తో సహా.. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 👉 దరఖాస్తు దాఖలు చేసేందుకు 24.12.24 నుండి జనవరి 13 ,2025 న ఆఖరు తేదీ. అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు ఆన్లైన్ లో fees చెల్లించడానికి చివరి తేదీ: 14.01.2025 తప్పులు సవరించుకోవడానికి: 16.01.2025 నుండి 18.01.2025 వరకు. ప్రవేశ పరీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పరీక్షా కేం...