PFMS సైట్ లో మీ పాఠశాల మెయిల్ ఐడీ & ఫోన్ నెంబర్ అప్రూవ్ ఇలా చేయండి
PFMS సైట్ లో ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పాఠశాల ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్, అప్డేట్ చేయాలి . ఈ ప్రాసెస్ మొదటగా అడ్మిన్ లాగిన్ లో చేయాలి ఆ తర్వాత DO మరియు DA లాగిన్లలో కూడా ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అప్డేట్ చేయాలి. మొదట అడ్మిన్ లాగిన్ చేయండి. అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి మీరు DO లాగిన్ లో రైట్ సైడ్ పై వైపు కనిపిస్తుంది. యూజర్ ఐడి TLSP 0000_ _ _ _ 12 అంకెల చేత ఉంటుంది. పాస్వర్డ్ Tssa@2022 మీరు లాగిన్ చేసిన తర్వాత ఎడమవైపు మెనూ ఆప్షన్స్ కనిపిస్తాయి My details ➡️ My profile click చేయండి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. Edit click చేయండి . అందులో మీ ప్రస్తుత పాఠశాల యొక్క మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్( HM మొబైల్ )2 బాక్సుల్లో ఇవ్వాలి. రెండు బాక్స్ ల్లో కూడా మీ యొక్క మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలను నమోదు చేసిన తర్వాత అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేయగానే OTP to mobile number అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటిపి బాక్స్ లో నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదే పద...