Posts

Showing posts from May, 2023

ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  🏵️ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎన్‌క్యాష్‌మెంట్‌ మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు. యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా రవాణా చార్జీలు ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు సస్పెన్షన్‌లో ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.., సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్...

తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Image
  తెలంగాణలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 2023 - 24 విద్యా సంవత్సరం ప్రవేశాలు. 1. TTWURJC ఏటూరునాగరం ( బాలురు ): ములుగు 2. TTWURJC చేగుంట ( బాలికలు ): మెదక్ 👉 ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 👉 4వ, తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అర్హత ఉన్నది.        ప్రవేశం: 5వ, తరగతి. 👉 ఈనెల 25వ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసే విద్యార్థులు 100 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 👉 అప్లై చేసే విద్యార్థి కి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, మార్కుల మెమో బోనఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి. 👉 అప్లై చేస్తున్న విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. 💥 గుండె, బీపీ సంబంధిత,మరియు లివర్ సంబంధిత సమస్యలు ఉండకూడదు. 💥 హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, మరియు చర్మ వ్యాధులు ఉండకూడదు. 💥 కంటి చూపు సమస్యలు ఉండకూడదు. 💥 వంటిపై టాటాలు ఉండకూడదు. నోట్: *విద్యార్థుల ఎంపిక విధానం తర్వాత తెలియజేయబడుతుంది*. పూర్తి వివరాలుకు ఇక్కడ CLICK చేయండి  ఆన్లైన్ లో అప్లై చేయడానికి  ఇక్కడ CLICK చేయండి..