CENSUS 1 నుండి 34 ప్రశ్నలకు జవాబులు నమోదు చేసే విధానం
CENSUS 2027 ముఖ్యమైన సమాచారం
ఎన్యూమరేట్ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే విధానం
➡️ Mritunjay Kumar Narayan, an IAS officer, is the current Registrar General and Census Commissioner of India.
➡️ Bharati Hollikeri is the Director of Census Operations for Telangana as of early 2026.
➡️ రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర జాబితా వరుస సంఖ్య 69 కింద జనాభా గణన చట్టం 1948 ద్వారా జనాభా గణన నిర్వహించబడుతుంది.
🔶 Definations
1. HLB - house listing black
2. HLO - house listing operations
3. FE - field enumerator
4. CMMS - census management and monitoring system
5. SE - SELF ENUMERATION
మీరు self enumeration ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.
భవనము/కట్టడము: నాలుగు గోడలు కలిగి పై కప్పు ఉన్న భూమి మీద చేసిన నిర్మాణాన్ని భవనం అంటారు.
ఆవరణ ( premises): భవనం స్థలం తో సహా దానికి అనుబంధంగా ఉన్న ఇతర ఉమ్మడి స్థలాలు. భవనం చుట్టూ కాంపౌండ్ గోడ ఉండచ్చు లేక ఉండక పోవచ్చు.
గణన గృహము ( census house): భవనం లో భాగం, రోడ్డు నుండి లేదా ప్రాంగణం నుండి ప్రత్యేక ప్రవేశ ద్వారం కలిగిన కట్టడం. నివాసం లేదా నివాసేతర అవసరాలకు వాడుతారు.
💠 ప్రత్యేక ప్రవేశ ద్వారం కలిగిన కట్టడం. నివాసం లేదా నివాసేతర అవసరాలకు వాడుతారు. ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉన్న కట్టడాన్ని గణన గృహం అంటారు.
ఒక భవనం లో ప్రత్యేక ప్రవేశ ద్వారం తో మూడు కట్టడాలు ఉంటే వాటిని మూడు గణన గృహాలుగా భావించాలి.
కుటుంబం ( hose hold): కొంత మంది వ్యక్తులు కలిసి ఉంటూ ఒకే వంటగది నుండి భోజన చేస్తే దానిని కుటుంబం అంటారు.
సాధారణ కుటుంబం ( Normal house hold ): బంధుత్వం ఉన్న, బంధుత్వం లేని, లేదా మిశ్రమ కలిగిన కొందరు వ్యక్తులు ఉమ్మడి వంటగది నుండి భోజన చేస్తూ కలిసి ఉండే వారిని సాధారణ కుటుంబం అంటారు.
సంస్థాగత కుటుంబం ( institutional household): బంధుత్వం లేని కొందరు వ్యక్తులు ఒకే సంస్థలో నివాసం ఉంటూ ఒకే భోజనశాల నుండి భోజనం చేస్తూ ఉన్నట్లయితే అట్టి దానిని సంస్థాగత కుటుంబం అంటారు. రిజిస్టర్ అయితే సంస్థాగత కుటుంబం. రిజిస్టర్ కాకపోతే మామూలు కుటుంబం లా భావించాలి.
ఇల్లు లేని కుటుంబాలు ( house less households) : రోడ్డు పక్కన, పట్ పాత్ పైన, పెద్ద పైపులలో ప్రార్థన మందిరాలలో, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మెట్ల కింద నివసించే కుటుంబాలు.
💠💠💠💠💠💠💠💠💠
HLB మ్యాపును తయారు చేయుట
👉 ఎన్యూమరేటర్ మొదటి మూడు రోజులు మీ ఎనీమరేషన్ బ్లాక్ లో బిల్డింగ్స్, గణన గృహాలను సంఖ్యను గుర్తించాలి ఆ తర్వాత మీ బ్లాక్ యొక్క మ్యాప్ గీయాలి.
మ్యాప్ గీసే సందర్భం లో పక్కా ఇల్లు, కచ్చా ఇల్లు గుర్తించాలి.
పక్కా ఇల్లు: గోడలు మరియు పైకప్పు నిర్మించిన వస్తువుల ఆధారంగా ఇల్లు నిర్ణయించాలి.గోడలు రాయి, జిఐ, మెటల్, సిమెంట్ రేకులు, కాల్చిఇటికలు సిమెంటు ఇటుకలు, కాంక్రీట్, టింబర్ తో నిర్మించబడాలి.
పైకప్పు యంత్రపు తయారి పెంకులు, సిమెంటు పెంకులు, కాల్చిన ఇటుకలు, సిమెంటు ఇటుకలు, రాయి, జి ఐ, మెటల్ సిమెంట్ రేకులు, కాంక్రీట్, టింబర్ ఉపయోగిస్తే పక్కా ఇల్లు.
కచ్చా ఇల్లు: గోడలు లేదా పైకప్పు కాల్చని ఇటుకలు, వెదురు, మట్టి, గడ్డి, తుంగ, తాటాకు, ప్లాస్టిక్, వదులుగా పేర్చిన రాళ్లు, ఉపయోగిస్తే కచ్చా ఇల్లు గా గుర్తించాలి.
🔶 HLO APP వినియోగం
➡️ మొదట HLO యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఇచ్చినటువంటి యూజర్ ఐడి మరియు క్యాప్చా తో రిజిస్టర్ కావాలి. Register పై క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
OTP నమోదు చేసి verify చేయాలి.
తరువాత PASSWORD నమోదు చేయాలి. ఈ సమయం లో లాంగ్వేజ్ ఎంపిక చేయాలి. లాంగ్వేజ్ ఒకసారి ఎంపిక చేశాక మార్పిడి ఉండదు. మీ ఎనిమరేషన్ పూర్తయ్యే వరకు అదే భాషలో కొనసాగాలి కావున జాగ్రత్త వహించగలరు.
మీరు ENGLIAH లేక TELUGU భాష select చేసుకోండి.( English లో చేయడం సులభం.)
తరువాత 4 అంకెల PIN set చేసుకోవాలి. తరువాత PIN confirm చేయాలి. తరువాత ప్రతి సారి PIN నెంబర్ తో APP పని చేస్తుంది.
💠💠💠💠💠💠💠💠💠💠
పిన్ ఎంటర్ చేయగానే హోమ్ స్క్రీన్ వస్తుంది. హోమ్ స్క్రీన్ లో మీ ఎన్యూమరేషన్ బ్లాక్ వివరాలతో పాటు,
రాష్ట్రం, జిల్లా, sub district, గ్రామం, వార్డు, హౌస్ లిస్టింగ్ బ్లాక్ నెంబర్ కనిపిస్తాయి. సెల్ఫ్ ఇన్నిమరేషన్ ఐడి వివరాలు కనిపిస్తాయి.
➡️ (మీరు మీ బ్లాక్ లో ప్రతి కట్టడము /నిర్మాణమును నమోదు చేయాలి.)
NOTE: ఒక భవనం లో రెండు లేదా మూడు ప్రత్యేక గృహాలు ఉండి, ఒకే కుటుంబం అన్ని గృహాలను నివాసం కొరకు వాడినట్లయితే అది మొత్తం ఒకే గణన గృహం అని భావించాలి.
NOTE: ఒక భవనం లో నాలుగు ప్రత్యేక గృహాలు ఉండి మొదటి రెండు నివాసం, ఒకటి పశువుల షెడ్, మరొకటి వర్క్ షాప్ అయితే ఇక్కడ గణన గృహాల సంఖ్య మూడుగా భావించాలి.
NOTE : ఎడమ చేతి వైపు గృహాలను నమోదు చేస్తూ వెళ్ళండి. మద్యలో ఎవరైనా లేనట్లయితే లాక్ నమోదు చేసి నోట్ చేసుకోండి. ఆ యజమాని అందుబాటులోకి రాగానే గణన పూర్తి చేయండి.
👉 గృహాల గణన వాయవ్యం నుండి ఈశాన్యం వైపు వెళ్లి అక్కడ నుండి నైరుతి దిశలో వచ్చి ఆగ్నేయం వైపు వెళ్లి పూర్తి చేయాలి.
మీరు డ్రా చేసిన లేఅవుట్ మ్యాప్ ప్రకారం అంచనా వేసిన బిల్డింగ్ సంఖ్యను నమోదు చేయాలి. ఈ సంఖ్యను తిరిగి మార్చలేము.
అంచనా వేసిన ఘనన గృహాల సంఖ్యను నమోదు చేయాలి. ఈ సంఖ్యను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
మీ గణన పూర్తయ్యేసరికి మీరు గణన చేసిన గృహాల సంఖ్య మీ అంచనా విలువకు సమానంగా లేదా ఎక్కువగా ఉండాలి తక్కువ మాత్రం కాకూడదు.
➡️ యాప్ లో ఇండ్ల జాబితా కార్యకలాపాలపై ( house list operations) క్లిక్ చేసి మీరు గణన గృహం యొక్క వివరాలు నింపవలసి ఉంటుంది.
➡️ HLO బటన్ పై క్లిక్ చేయగానే 6 కొత్త ట్యాబ్లు కనిపిస్తాయి.
HLO app basic information తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.
1. న్యూ హౌస్ లిస్ట్ ఎంట్రీ NEW HOUSE LIST ENTRY: నూతన గృహ నమోదుకు దీనిలోకి వెళ్లాలి.
2. Updation data: మీరు గణన చేసిన గృహ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి ఏదైనా మార్పులు ఉన్నట్లయితే చేసుకోవడానికి ఇక్కడ వీలుంటుంది.
3. Edit already single data: మీరు గణన చేసిన గృహాల వివరాలను సింక్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలంటే ఇక్కడ చేయడానికి వీలవుతుంది కానీ ఎడిట్ చేయగానే మీరిచ్చిన పూర్వపు డేటా ఎరైజ్ అవుతుంది అన్ని వివరాలు మరల నమోదు చేయాలి.
4. View summary : ఇక్కడ మీరు గణన చేసిన గృహాలకు సంబంధించిన సంఖ్యను ఇతర వివరాలను కనుగొనవచ్చు.
5. Sync : మీరు గణన చేస్తున్న సమయంలో ఒక గృహం యొక్క గణన పూర్తి అవగానే సింక్ చేయవచ్చు లేదా ఐదు నుండి పది గృహాలు పూర్తికాగానే సింక్ చేయవచ్చు.
సింక్ చేసే ప్రతి సందర్భంలో మీరు డిజిటల్ గా సంతకం చేయాలి.
6. Mark as complete: మీ బ్లాక్ లో సర్వే పూర్తి అయిన తర్వాత మార్కాదు కంప్లీట్ చేయాలి.
యాప్ లో ఉపయోగించే మరికొన్ని బటన్లు
1. Previous: మునుపటి ప్రశ్నను చూడడానికి
2. jump: ఏదైనా ప్రశ్నను చూడడానికి - jump క్లిక్ చేయగానే 34 ప్రశ్నల లిస్టు కనిపిస్తుంది. కావలసిన ప్రశ్నను ఎంపిక చేసుకోవచ్చు. ప్రశ్న ఎంచుకొని మరల jump క్లిక్ చేయండి ఆ ప్రశ్న మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తుంది.
3. next: తరువాత ప్రశ్నకు వెళ్లడానికి.
HLO APP - QUESTIONS & ANSWERS
1వ, ప్రశ్న. Line number: లైన్ నెంబరు అప్ లో ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుంది ఇది ఒక వరుస క్రమంలో 001 నుండి జనరేట్ అవుతుంది. మీరు యాప్ లో చేసే ప్రతి నమోదుకు లైన్ నంబర్ జెనరేట్ అవుతుంది. ఒక విధంగా ఇది సీరియల్ నెంబర్. దీని ద్వారా మీరు ఎన్ని నమోదులు చేశారో తెలుస్తుంది.
2 వ ప్రశ్న:Building number: కొత్త బిల్డింగ్ నమోదు చేయడానికి బిల్డింగ్ నెంబర్ను ఎన్యూమరేట్న మోదు చేయాలి. అదే బిల్డింగ్ నెంబర్ రిపీట్ చేయడానికి ఆప్ లో repeat బటన్ ఉంటుంది.
బిల్లింగ్ నెంబర్ లో మూడు అంకెలు ఉంటాయి. Ex: 001
3వ ప్రశ్న. Census house number: గణన గృహం యొక్క సంఖ్య ఇది యాప్ లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే గణన గృహంలో రెండు కుటుంబాలు ఉన్నట్లయితే అదే నెంబర్ను తిరిగి నమోదు చేయడానికి repeat బటన్ ఉంటుంది.
గణన గృహము కొత్తవి అయినట్లయితే NEW అనే బటన్ నొక్కాలి. గణన గృహము నెంబరు మునుపటిలాగే ఉన్నట్లయితే REPEAT బటన్ నొక్కాలి.
ఈ నెంబర్ లో 4 అంకెలు ఉంటాయి Ex: 0001.
HLO app వినియోగం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
ఒక గణన గృహం లో ఒకటికంటే ఎక్కువ సెన్సెస్ హౌసెస్ మరియు ఒక్కొక్క ఘనన గృహంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబాలు ఉన్నట్లయితే అట్టి సందర్భంలో నమోదు చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
➡️ మొదటి మూడు ప్రశ్నలు నమోదు చేయగానే
Weather household has completed
self enumeration SE అని అడుగుతుంది.
ఇక్కడ యజమాని ఇచ్చిన సమాచారం ప్రకారం NO లేక YES ఎంపిక చేయాలి.
No - ఎంపిక చేసినట్లయితే వివరాలన్నీ మీరే నమోదు చేయాలి.
YES - ఎంపిక చేసినట్లయితే సెల్ఫ్ అన్నీమరేషన్ ఐడి నమోదు చేసి యజమాని నమోదు చేసిన వివరాలను సరిచూసి సేవ్ చేయాలి.
YES ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే
7వ, ప్రశ్నలో 1- residency
మరియు 2- residence come other use రకము గణన గృహాల ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి.
NOTE: సెల్ఫ్ ఇన్నిమరేషన్ residential మరియు residential come other use houses కు మాత్రమే చేయాలి.
తరువాత 12 అంకెల SE నమోదు చేసి వివరాలు సరి చూడాలి.
అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే
ACCEPT AND SUBMIT నొక్కాలి డేటా సేవ్ చేయబడుతుంది.
ఒకవేళ వివరాలు ఎడిట్ చేయాలనుకుంటే EDIT ఆప్షన్ ఎంపిక చేయాలి అన్ని ప్రశ్నలు ఓపెన్ అవుతాయి అవసరమైన చోట మార్పులు చేసి సేవ్ చేయాలి.
************
MATERIAL PARTICULARS OF CENSUS HOUSE: ప్రశ్న 4 నుండి 6
4వ, ప్రశ్న: floor of the census house -
నేలకు వాడిన ప్రధాన వస్తువు
జ: గణన గృహం నేలను పరిశీలించి ఎక్కువ భాగం వాడిన వస్తువును తీసుకొనవలెను.
1. మట్టి, 2. కలప/వెదురు, 3. కాల్చిన ఇటుక, 4. రాయి, ( గ్రానైట్, మార్బుల్) 5. సిమెంట్, 6. మొజాయిక్/ ఫ్లోర్ టైల్స్, 7. ఇతరాలు
NOTE:మొజాయిక్ టైల్స్ (Mosaic Tiles) అంటే గాజు, సిరామిక్, రాయి, లోహం లేదా పెంకు వంటి పదార్థాలతో చేసిన చిన్న చిన్న పలకలు.
గ్రానైట్, మార్బుల్ ను రాయిగా భావించాలి CODE 4 నమోదు చేయాలి.
*************
5వ, ప్రశ్న: predominant material of wall - గోడ నిర్మాణానికి వాడిన ప్రధాన వస్తువు.
జ: గణన గృహ యజమానిని గోడ నిర్మాణానికి వాడిన ప్రధాన వస్తువు ఏమిటో అడిగి ఈ ప్రశ్నకు జవాబు ఎంపిక చేయాలి.
సిమెంట్ ఇటుకలు వాడినట్లయితే కాంక్రీట్ గా భావించాలి. కోడ్ 9
యజమాని గోడ నిర్మించడానికి ఉపయోగించిన వస్తువు చెప్పలేని సందర్భంలో 0 సున్నా కోడ్ నమోదు చేయాలి.
****************
6వ, ప్రశ్న: predominant material of roof
పైకప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు.
జ: పైకప్పు నిర్మాణానికి ఎక్కువ భాగం వాడిన వస్తువును జవాబుగా గుర్తించాలి.
CODE 7 పలక అనగా బూడిద రంగు, ఆకుపచ్చ , నీలం ఉదా రంగుల రాయి.
NOTE: ఒక ఘనన గృహంలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు నమోదు చేసినట్లయితే ఈ మూడు ప్రశ్నల యొక్క జవాబులు స్వయంచాలకంగా మిగిలిన రెండు కుటుంబాలకు నమోదు చేయబడతాయి.
**********
CENSUS HOUSE PARTICULARS: ప్రశ్న 7 మరియు 8.
7వ, ప్రశ్న: use of census house - గణన గృహము వాడుక
గణన గృహము వాడుకను నిర్ధారించుట ఎలా అనే సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.
( వీడియో చూడండి )
జ: గణన గృహమును పూర్తిగా నివాసముగా లేదా
నివాసము మరియు ఇతర వాడుకగా ఉండే అవకాశం ఉంటుంది.
లేదా పూర్తిగా ఇతర అవసరాల కోసం వాడవచ్చు.
ఇక్కడ 1. Is locked
2. Is institutional అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
➡️ గణన గృహము పూర్తిగా నివాసం కొరకు ఉపయోగించినట్లయితే CODE -1 ఎంపిక చేయాలి.
ఉదా: బంగ్లా, అపార్ట్మెంట్, గుడిసె, అవుట్ హౌస్, గుడారము, గ్యాంగ్ మాన్ గుడిసె, బంగ్లా గార్డు యొక్క గుడిసె, పెంకుల ఇల్లు, రేకుల ఇల్లు
➡️ ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే 34 ప్రశ్నలకు జవాబులు పూజించాలి.
ఒకవేళ గణన గృహము తాళము వేయబడినచో తాళం వేయబడినది అనే ఆప్షన్ నమోదు చేయాలి.
ఆ సందర్భం లో తాళం వేయబడింది అనే option నమోదు చేయాలి. తదుపరి 34వ ప్రశ్న మొబైల్ నెంబర్ మాత్రమే నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ పక్కవారిని లేదా అడిగి నమోదు చేయండి. ప్రస్తుతం ప్రతి గ్రామం లో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. కాబట్టి మొబైల్ నెంబర్ సులభంగా తెలుసుకోవచ్చు.
తర్వాత గణన గృహ యజమాని అందుబాటులో ఉన్నప్పుడు పూర్తి డేటాను నమోదు చేయాలి. ఒకవేళ మీ అన్యుమరేషన్ నమోదు పూర్తయ్యేంతవరకు ఎవరు అందుబాటులో లేనట్లయితే తాళం వేసినట్లుగానే నమోదు చేయాలి.
➡️ గణన గృహము నివాసం మరియు ఇతర వాడుకకు ఉపయోగించినట్లయితే CODE -2 ఎంపిక చేయాలి.
ఇక్కడ ఇతరవాడుక నమోదు చేయుటకు ఒక బాక్స్ ఎనేబుల్ అవుతుంది ఆ బాక్స్ లో ఇతర వాడుక ఏమిటో నమోదు చేయాలి.
తదుపరి 34 ప్రశ్నలు పూరించాలి.
ఉదా: ఇలాంటి సందర్భాలు
1. నివాసము మరియు కిరాణా కొట్టు
2. నివాసము మరియు టైలర్ కొట్టు
3. నివాసము మరియు మందుల దుకాణం
4. నివాసము మరియు పండ్ల కొట్టు
5. నివాసము మరియు కూరగాయల కొట్టు
6. నివాసము మరియు చీరలు కొట్టు
7. నివాసము మరియు ఐరన్ హార్డ్వేర్
8. నివాసము మరియు టిఫిన్ సెంటర్
9. నివాసము మరియు గాజుల దుకాణం
10. నివాసము మరియు మొబైల్ షాప్
11. నివాసము మరియు జిరాక్స్ సెంటర్
12. నివాసము మరియు చికెన్ దుకాణం
13. నివాసము మరియు జువెలరీ
14. నివాసము మరియు కుమ్మరి పని
15. నివాసము కంసాలి పని
16. నివాసము మరియు వెల్డింగ్ పని
17. నివాసము మరియు క్లినిక్
18. నివాసము మరియు బట్టలు నేయుట.
ఇలాంటి సందర్భాలలో అన్ని ప్రశ్నలకు జవాబులు నమోదు చేయాలి.
CODE 2 ఎంపిక చేసినట్లయితే
IS LOCKED
IS INSTITUTIONAL అనే ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి.
➡️ ఒకవేళ గణన గృహము సంస్థాగతము.
is institutional అని ఎంపిక చేసినట్లయితే 11వ ప్రశ్న వరకు ఎంట్రీలు చేయాలి
9వ, ప్రశ్నలో 999 నెంబర్ జెనరేట్ అవుతుంది.
Ex:
1. నివాసము మరియు వృద్ధాశ్రమము
2. నివాసము మరియు హాస్టల్
3. నివాసము మరియు జైలు
4. నివాసము మరియు లాడ్జి
5. నివాసము మరియు అతిధి గృహము
➡️ గణన గృహము 3 నుండి 9 వరకు గల అవసరాలకు ఉపయోగించినచో ఇందులో ఎటువంటి అదనపు నమోదు చేయవలసిన అవసరం లేదు. 1 నుండి 7 వ, ప్రశ్న వరకు మాత్రమే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది.
➡️ గణన గృహము ఖాళీగా ఉండి (0 సున్నా) ఎంపిక చేసినట్లయితే ఇక్కడ కూడా ఎటువంటి అదనపు నమోదులు చేయవలసిన అవసరం లేదు. ఎందుకు ఖాళీగా ఉన్నది అనే విషయాన్ని నమోదు చేయాలి.
➡️ కాబట్టి గణన గృహం యొక్క వాస్తవ వినియోగాన్ని సరిగ్గా అంచనా వేయాలి. ఇది అత్యంత ప్రాధాన్యం.
ఉదాహరణకు CODE 3 :SHOP/OFFICE
SHOP➡️ బట్టల దుకాణము
కిరాణా దుకాణము
మందుల దుకాణం
టీ దుకాణము
కూరగాయల దుకాణము
పండ్ల దుకాణము
క్యాంటీన్
ఉడిపి హోటల్
➡️ OFFICE: ప్రభుత్వ ఆఫీస్
భీమా కార్యాలయం
బ్యాంకు
సహకార సంస్థ
న్యాయవాదుల ఆఫీస్
రవాణా ఆఫీస్
పోలీస్ స్టేషన్
తాసిల్దార్ ఆఫీస్
ఎంపీడీవో ఆఫీస్
అగ్నిమాపక కేంద్రం
CODE:4➡️ విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు
Ex: పాఠశాల, సంగీత పాఠశాల, కోచింగ్ సెంటర్, కాలేజ్, డాన్స్ స్కూల్, వ్యవసాయ శిక్షణ కేంద్రం వయోజన అక్షరాస్యత కేంద్రం, టైపింగ్ సెంటర్, కంప్యూటర్ సెంటర్, పారిశ్రామిక శిక్షణ సెంటర్, అంగన్వాడి సెంటర్.
CODE 5: hotel/ ladge/ guest house ➡️
వీటిని తాత్కాలిక బస కొరకు వాడుతారు. Ex: డాకు బంగ్లా, ఇన్స్పెక్షన్ బంగ్లా, అతిథి గృహము, ధర్మశాల, విశ్రాంతి గృహము, సత్రము ప్రయాణికుల వసతి గృహము.
CODE: 6 ➡️ hospital /dispensary
Ex: వైద్యశాల, రోగ నిర్ధారణ కేంద్రం, క్లినిక్, నర్సింగ్ హోమ్, ప్రసూతి గృహం, దంత వైద్యశాల, టీకా కేంద్రం, ఎక్స్ రే, ప్రధమ చికిత్స కేంద్రం.
CODE:7 ➡️ factory/ workshop/ workshed
ఇక్కడ ఉత్పత్తి ప్రాసెసింగ్ మరమ్మత్తులు జరుగుతాయి
Ex: స్పిన్నింగ్ మిల్లు, కాటన్ మిల్లు, ఎరువుల ఫ్యాక్టరీ, ఆటోమొబైల్ సర్వీస్, బేకరీ, ఫర్నిచర్ తయారీ, బియ్యం పిండి నూనె మిల్లులు, ప్రింటింగ్ ప్రెస్, పాల ఉత్పత్తుల కేంద్రం, కమ్మరి వర్క్ షాప్, బంగారు ఆభరణాల వర్క్ షాప్.
Note: షాపు మరియు ఫ్యాక్టరీ కి తేడా గమనించండి. . ( షాప్ లో వస్తువులు అమ్ముతారు, ఫ్యాక్టరీ లో వస్తువులు తయారు చేస్తారు.)
CODE 8: place of worship
ప్రార్థన మందిరాలు ఉదాహరణ దేవాలయము గురుద్వారా, మసీదు, చర్చి.
CODE:9 ➡️ other than residential use -నివాసేతర గృహాలు
ఉదాహరణ: కమ్యూనిటీ హాల్, సినిమా హాలు, క్లబ్బులు, కళామందిరం, వ్యాయామశాల, క్రీడా ప్రాంగణం, మ్యూజియం, జూపార్క్, గోశాల, కోళ్ల వృద్ధి కేంద్రం, ప్రయాణికుల ప్రాంగణం ( బస్ స్టాండ్ ) పెట్రోల్ పంపు, గ్రంథాలయము, పవర్ సబ్ స్టేషన్.
CODE:0 ➡️ గణన గృహం ఖాళీగా ఉన్నట్లయితే 0 నమోదు చేయాలి. ఖాళీగా ఉండటానికి కారణాలు నమోదు చేయాలి.
1. ఖాళీ మరమ్మత్తులో ఉన్నది.
2. ఖాళీ అద్దె కొరకు
3. ఖాళీ నిర్మాణం ఆ సంపూర్ణం
4. ఖాళీ కూల్చివేయడానికి.
గణన గృహం ఉపయోగం ఎలా నిర్ధారించాలో తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి
💠💠💠💠💠💠💠💠💠
ప్రశ్న 8: condition of this census house
నివాస గృహం యొక్క మరియు నివాస ఇతర అవసరానికి ఉపయోగించే గణన గృహం యొక్క స్థితి
బాగుంది : మంచి స్థితిలో ఉన్నట్లు ( ఏ రిపేర్ అవసరం లేదు )
నివసించదగింది : కొన్ని మరమ్మత్తులు అవసరమయ్యే ఇల్లు
శిధిలావస్థలో ఉన్నది: శిధిలావస్థలో ఉన్నది, ఎక్కువ మరమ్మత్తులు అవసరమయ్యేది, పునర్నిర్మాణం చేయలేని ఇల్లు.
💥💥💥💥💥💥💥💥💥💥
HEAD OF THE HOUSEHOLD PARTICULARS: ప్రశ్న: 9నుండి 13 వరకు.
ప్రశ్న 9: household number - కుటుంబ సంఖ్య
నివాసము - తాళం వేయబడింది అవకాశం ఉంటుంది
నివాసము మరియు ఇతర ఉపయోగము, తో పాటు -
is institutional మరియు - IS locked కూడా ఉంటుంది
జ: నివాసము లేదా నివాసము మరియు ఇతర వాడుక ఉన్న అన్ని గణన గృహాలకు యాప్ లో కుటుంబ సంఖ్య ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది.
మీరు నివాసము మరియు ఇతర వాడుకతో పాటు is institutional ఎంపిక చేసినట్లయితే కుటుంబ సంఖ్య 999 గా వస్తుంది.
ఒకవేళ తాళం వేయబడింది అని ఎంపిక చేసుకున్నట్లయితే కుటుంబ సంఖ్యను కేటాయించదు.
Note : ఒకవేళ మీరు వెళ్లినప్పుడు నివాస గృహము లేదా నివాసం & ఇతర వాడుక గృహాలు తాళం వేసి ఉన్నట్లయితే అట్టి గృహానికి, నేల,గోడలు, పై కప్పు కు సంబంధించిన ప్రశ్నల వివరాలు మీరు బయట నుండి అంచనా వేయగలిగినట్లయితే నమోదు చేయండి. లేదా అట్టి నిర్మాణాలకు వాడిన వస్తువులు తెలియనట్లయితే చివరి ఆప్షన్ ANYOTHER నమోదు చేయండి.
ప్రశ్న 10 ➡️ total number of persons normally deciding in this census house
జ: కుటుంబంలో ప్రస్తుతం అక్కడ నివాసం ఉండే వారందరినీ నమోదు చేయాలి చిన్నపిల్లలతో సహా ( ఆరోజు పుట్టిన పిల్లలతో సహా )
ప్రశ్న 11: ➡️ name of the head of the household - కుటుంబ యజమాని పేరు
జ: కుటుంబము తరపున నిర్ణయాలు తీసుకునే వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ ఎవరైనను, చిన్న వయసు వారైనను యజమానిగా నమోదు చేయాలి.
హాస్టల్స్, వృద్ధాశ్రమాలు, రక్షణ గృహాలు, జైల్లో ఆ సంస్థ యొక్క హోదా రీత్యా పెద్దవారిని గుర్తించి వారి హోదాను మాత్రమే నమోదు చేయాలి.
ప్రశ్న 12:➡️ SEX - లింగ భేదము
కుటుంబ యజమాని ఆడ మగ లేదా ట్రాన్స్ జెండర్ అనే కూడ నమోదు చేయాలి.
ప్రశ్న 13: ➡️ SC or ST or OTHERS
SC- హిందువులు సిక్కులు మరియు బౌద్ధులు మాత్రమే ఉంటారు. కోడ్ 1.
ST - ఏ మతం వారైనా ఉండవచ్చు కోడ్:2
OTHETS : SC లేక ST కానట్లయితే ఆదర్శగా కోడు 3 నమోదు చేయాలి.
CENSUS HOUSE PARTICULARS : ప్రశ్న: 14 నుండి 16
ప్రశ్న 14: ownership status of this house - ఇంటి యాజమాన్య స్థితి
Code -1: సొంత ఇల్లు
Code -2: అద్దె ఇంట్లో నివసిస్తున్నారు భారతదేశంలో మరొక చోట సొంత ఇల్లు ఉన్నది
Code -3 : అద్దె ఇంట్లో నివసిస్తున్నారు భారతదేశంలో మరెక్కడ సొంత ఇల్లు లేదు.
CODE -4: సొంత ఇల్లు కాదు, అద్దె ఇల్లు కూడా కాదు ➡️
ఆక్రమిత భూమిపై నిర్మించిన ఇల్లు లేదా
వదిలివేయబడిన భవనాల్లో నివాసం ఉంటున్నారు.
అద్దె చెల్లించకుండా అనధికారికంగా ఉంటున్న ఇండ్లు.
Note: తండ్రి ఇంట్లో కొడుకు అద్ద చెల్లించకుండా నివాసం ఉన్నట్లయితే అట్టి ఇల్లును సొంత ఇల్లుగా భావించాలి CODE - 1 నమోదు చేయాలి.
💠💠💠💠💠💠💠💠💠💠💠
ప్రశ్న15: number of dwelling rooms - కుటుంబ స్వాధీనంలో ఉన్న నివాస గదుల సంఖ్య.
నివాస గది అనగా : 2 మీటర్ల పొడవు, 1.5 మీ వెడల్పు, 2మీ ఎత్తు ఉండాలి.
జ: లివింగ్ రూమ్, పడకగది, భోజన గది, కూర్చునే గది, చదువుకునే గది, పని మనుషుల గది.
లెక్కించకూడనివి: స్నానాల గది, వంటగది, మరుగుదొడ్డి, స్టోర్ రూమ్, వరండా నివాస గదులుగా లెక్కించరాదు.
NOTE: నివాసము మరియు ఇతర ఉపయోగము గా గణన గృహం ఎంపిక చేసినప్పుడు ఒక గదిని ఆఫీసు కోసం వాడుతున్నట్లయితే అట్టి గది నివాసపు గది కింద లెక్కించకూడదు.
ఒకే గది ఉన్న గృహంలో అట్టి గదిని బహుళ అవసరాలు అనగా వంట, నిద్ర, విశ్రాంతి, స్నానం కొరకు వాడినట్లయితే ఆ కుటుంబానికి నివాసపు గదులు ( 1 ) గా నమోదు చేయాలి.
Note: ఒక నివాస గదిలో ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నట్లయితే ప్రతి కుటుంబానికి నివాసగదులు లేనట్లుగా భావించి సున్నా ( 0 ) నమోదు చేయాలి.
ఒక గుడిసె లో కుటుంబం నివసిస్తున్న సందర్భం లో నివాస గదులు 1 గా నమోదు చేయాలి.
ప్రశ్న 16: number of couples - కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య:
జ: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం వివాహితులై కలిసి నివసిస్తున్న దంపతుల సంఖ్యను నమోదు చేయాలి. సహజీవనం చేస్తున్న జంటను సైతం దంపతులుగా లెక్కించాలి.
ఒక గణన గృహంలో ఒక వ్యక్తి ఒంటరిగా నివసిస్తున్న లేదా వివాహ దంపతులు లేనట్లయితే ఆ సందర్భంలో సున్నా ( 0 ) నమోదు చేయాలి.
Note: ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే భర్త పేరును ఒకచోట మాత్రమే నమోదు చేయాలి.
ఒకవేళ ఒకే ఇంట్లో ఒక భర్త ఇద్దరు భార్యలు కలిసి ఉన్నట్లయితే దంపతుల సంఖ్య రెండుగా నమోదు చేయాలి.
దంపతులు సాధారణంగా కలిసి నివసించనట్లయితే వారిని జంటగా పరిగణించకూడదు.
వితంతువులకు, విడిపోయిన వారికి, ఒంటరిగా జీవిస్తున్న వారికి దంపతుల సంఖ్య స్థానంలో సున్నా నమోదు చేయాలి.
ప్రశ్న 17 నుండి 25 వరకు కుటుంబమునకు లభించుచున్న వసతులు
ప్రశ్న 17: main source of drinking water - త్రాగునీటి ప్రధాన వనరు.
జ: గణన కుటుంబము సంవత్సరంలో ఎక్కువ రోజులు ఆ ఇంటికి నీటిని ఏ వనరు ద్వారా ఉపయోగిస్తారు గుర్తించి కోడు నమోదు చేయాలి.
శుద్ధి చేయబడిన కొళాయి నీరు: వడకట్టుట ద్వారా మలినాలు తొలగించి రసాయన చర్యల ద్వారా సూక్ష్మజీవులను చంపిన నీరు పైపుల ద్వారా సరఫరా చేయడం, ఉమ్మడి ఆరో సిస్టం ద్వారా శుద్ధి చేయబడిన నీరు ప్లాంట్ ద్వారా పైపుల ద్వారా వ్యక్తిగత ప్లాట్స్ కు సరఫరా చేయుట.
NOTE: కొంత మంది సురక్షిత కొళాయి నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్యాకేజ్డ్ నీరు వాడినట్లయితే ప్యాకేజ్డ్/ బాటిల్ నేరుగా పరిగణించాలి.
శుద్ధి చేయబడని కొళాయి నీరు: ఒక కుటుంబమునకు త్రాగునీరు గొట్టముల ద్వారా బావి లేదా బోరుబావి నుంచి నేరుగా పంపిణీ చేయుట, గుట్టకు బావినీరు ఓవర్ హెడ్ ట్యాంకు పంపించడం దాని నుండి కుటుంబ ఆవరణకు నల్లా ద్వారా పంపించడం శుద్ధి చేయబడని కొళాయినీరుగా భావించాలి.
బావి,చేతి పంపు, బోరుబావి, ఊట, నది/ కాలువ, చెరువు,
ప్యాకేజీ /బాటిల్ నీరు: సీసాలు, జాడీలు, ప్యాకెట్లు మొదలైన కంటైనర్లలో నింపిన త్రాగునీరు.
CODE - 0 :ఇతర వనరులు.➡️ ట్యాంకర్లు, బండ్లు, వర్షపు నీరు మొదలైనవి.
ప్రశ్న 18: available of drinking water - త్రాగునీటి వనరు లభ్యత.
1. ఆవరణ లోపల ➡️ ఇంటి లోపల
2. ఆవరణ సమీపాన ➡️ ఇంటికి వంద మీటర్ల దూరంలో
3. ఆవరణకు దూరము ➡️ ఇంటికి 500 మీటర్ల దూరంలో
Note: ప్యాకేజ్డ్ నీరు ఇంటి వద్దకే సరఫరా చేసినట్లయితే దీనిని ఆవరణ లోపల గా పరిగణించి కోడు CODE :1 గా ఎంపిక చేయాలి.
ప్రశ్న 19: main source of lighting - వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు.
జ: 1.విద్యుత్ శక్తి, 2.కిరోసిన్, 3.సౌర శక్తి, 4.ఇతర నూనెలు, 5.ఏదైనా ఇతర వనరులు, 6.వెలుతురు లేదు.
ప్రశ్న 20: access to letrin ➡️ మరుగుదొడ్డి వసతి అందుబాటు.
1. ఈ కుటుంబము వాడుటకు మాత్రమే
2.ఇతర కుటుంబాలతో కలిసి వాడుకకు
3.పబ్లిక్ మరుగుదొడ్డి ➡️సులభ్ కాంప్లెక్స్, మొబైల్ మరుగుదొడ్డి, ఆవరణ బయట ఉన్న ఉమ్మడి మరుగుదొడ్డి.
4.బహిర్భూమి. ➡️ పొలాలు, పొదలు, రైల్వే ట్రాక్స్.
ప్రశ్న 21: type of latrine ➡️ మరుగుదొడ్డి రకము ?
flush/ pour - flush latrin connected
1. Pipe saver system : భూగర్భ మురుగుపారుదల పద్ధతి ➡️ భూగర్భ పైపుల ద్వారా మరుగు మొత్తం కూడా ఒక ట్యాంకు కలపబడుతుంది. ఈ పద్ధతి సాధారణంగా బహుళ అంతస్తు భవనాలలో, గేటెడ్ కమ్యూనిటీలలో కనిపిస్తాయి.
2. Septic tank : భూగర్భంలో నీరు చోర బడకుండా కట్టబడిన పెద్ద ట్యాంకు కలపబడిన వ్యవస్థ
3. Other system: పై రెండు కాకుండా వ్యర్ధాన్ని వీధికి, పెద్ద డ్రైనేజీకి, ఇతర ప్రాంతాలకు ఫ్లష్ చేసే సందర్భాలు.
Twin pit latrine ➡️ ఈ పద్ధతిలో భూమి లోపల రెండు గొయ్యిలు నిర్మాణం చేస్తారు.
4. కప్పుతో గాలి సౌకర్యము గల మలవిసర్జన నేరుగా భూమిలో తవ్వబడిన గోతిలోకి చేరుతుంది గొయ్యి అడుగు బాగాన కాంక్రీట్ వేయరు. ఈ పద్ధతిలో రెండు గొయ్యిలు ఉంటాయి.
5. కప్పు లేకుండా గొయ్యి మాత్రమే ఉంటుంది మలవిసర్జన భూమి లోపల తవ్వబడిన గొయ్యిలోకి వెళ్తుంది
Single pit latrine ➡️ ఈ పద్ధతిలో భూమి లోపల ఒకే గొయ్యి నిర్మాణం చేస్తారు.
6. కప్పుతో గాలి సౌకర్యము కల గది ఉంటుంది . భూమి లోపల ఒక గొయ్యి మాత్రమే ఉంటుంది.
7. కప్పు గాలి సౌకర్యం లేకుండా గొయ్యి మాత్రమే ఉంటుంది.
Service latrine
8. వ్యర్ధాలను మనుషులచే తొలగించినట్లయితే CODE -8
9. వ్యర్ధాలను జంతువులు తొలగించినప్పుడు
0. మరుగుదొడ్డి నేరుగా మూతలేని మురుగు కాలువలో వదిలేసే విధానము.
💠💠💠💠💠💠💠💠💠💠💠
ప్రశ్న 22: waste water outlet connected to - మురుగు నీటిపారుదల ఈ క్రింది వాటికి కలపబడ్డది.
CODE 1: మూసివేసి ఉన్న మురుగుపారుదల
( అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మూసిన ఇంకుడు గుంత)
CODE 2 : పై కప్పులేని మురుగుపారుదల ( ఓపెన్ డ్రైనేజ్, మూతలేని ఇంకుడు గుంత )
CODE 3 : మురుగుపారుదల వసతి లేదు.
Note: మురుగు నీరు చెట్లకు వెళ్లేలా పెట్టినా వారికి మురుగు కాలువ, లేదా ఇంకుడు గుంత ఉన్నదా ? లేదా ? అనే విషయాన్ని పరిశీలించాలి.
ప్రశ్న 23: bathing facility available within the premises - ఆవరణ లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి ?
Code 1: ప్రత్యేకమైన స్నానాల గది
CODE 2 : పై కప్పు లేని స్నానాల గది ఉన్నట్లయితే
CODE 3 : స్నానాల గది వసతి లేదు.
ప్రశ్న 24: available tea of kitchen and LPG/ PNG connection - వంటగది మరియు ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ సౌకర్యము.
వంటగదిలో వంట cooking in kitchen
CODE 1 : LPG/ PNG కనెక్షన్ ఉంది
CODE 2 : LPG/ PNG కనెక్షన్ లేదు
ఇంటి లోపల వంట కానీ వంట గదిలో కాదు - Cooking inside house but not in kitchen
CODE 3: LPG/ PNG కనెక్షన్ ఉంది
CODE 4 : LPG/ PNG కనెక్షన్ ledu
ఆరు బయట / ఇంటి బయట వంట - Cooking in open / out side house
CODE 5. : LPG/ PNG కనెక్షన్ ఉంది
CODE 6: LPG/ PNG కనెక్షన్ లేదు
CODE 7 : వంట చేయడం లేదు ( ఇంట్లో వంట చేయకుండా బయట నుండి తెచ్చుకొని తినడం )
ప్రశ్న 25 : వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం - main fuel used for cooking ?
జ: సంవత్సరంలో వంట చేయుటకు ఎక్కువగా వాడే ఇంధనమును నమోదు చేయాలి.
CODE 1 వంట చెరుకు ➡️ కర్ర ,చెక్కలు, కొమ్మలు , మొద్దులు మొదలైనవి.
CODE 2 గడ్డి /చొప్ప మున్నగునవి ➡️ పంటల వ్యర్ధాలు, పత్తి ,మొక్కజొన్న ,కొబ్బరి, వేరుశనగ, గోధుమ..
CODE 3 పిడకలు ➡️
CODE 4 బొగ్గు/ లిగ్నైట్ /చార్కోల్
CODE 5 కిరోసిన్
CODE 6 LPG /PNG
CODE 7 విద్యుత్ శక్తి
CODE 8 బయోగ్యాస్
CODE 9 సౌరశక్తి
CODE 0 ఏదైనా ఇతర ఇంధనము ➡️
26 నుండి 32 వరకు కుటుంబం కలిగి ఉన్న ఆస్తులు
ప్రశ్న 26 : radio / transistor - రేడియో ట్రాన్సిస్టర్
రేడియో వినే సౌకర్యం ఉన్నదా ? లేదా ?
కుటుంబంలో నివసించేవారు రేడియోను ఎలా వింటున్నారు అనేది నమోదు చేయాలి.
జ: CODE 1 ట్రెడిషనల్ రేడియో సెట్ : ఇప్పటికీ రేడియో ఉపయోగిస్తున్నట్లయితే లేదా ట్రాన్సిస్టర్ ఉన్నట్లయితే.
CODE 2 : మొబైల్ ఫోను /లేదా స్మార్ట్ ఫోన్ : ఏదైనా మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్లో రేడియో వినే సౌకర్యం ఉన్నట్లయితే.
CODE 3 : ఏదైనా ఇతర పరికరము : కారవాన్ ( CARVAAN ) పరికరంలో విన్నట్లయితే. లేదా కారు స్టీరియోలో విన్నట్లయితే
CODE 4 : ఎలాంటి పరికరాలు లేనట్లయితే ➡️ లేదు NO
ప్రశ్న 27 : టెలివిజన్ - TELEVISION ➡️ టీవీ చూడడానికి ఉపయోగిస్తున్న ప్లాట్ఫారం.
జ: CODE 1 : దూరదర్శన్ వారి ఉచిత సేవలు
CODE 2 : Other DTH / DISH చెల్లింపులు ఉంటాయి.
CODE 3 : CABLE CONNECTION కేబుల్ ఆపరేటర్ సిస్టమ్.
CODE 4 : ANY OTHER ➡️ jio fiber, mobile net ఉపయోగించి, fire stick
CODE 5 : NO టెలివిజన్ లేదు
ప్రశ్న 28 : Access to internet ➡️ ఇంటర్నెట్ సదుపాయం వినియోగం
జ: కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం ఉన్నది /లేదు
ఉన్నట్లయితే ఏ విధంగా ఉపయోగిస్తున్నారు.
CODE 1 : On లాప్టాప్ /కంప్యూటర్ : కుటుంబము ఇంటర్నెట్ సదుపాయాన్ని లాప్టాప్ /కంప్యూటర్ ద్వారా ఉపయోగిస్తే
CODE 2 : on మొబైల్ /స్మార్ట్ ఫోన్ : కుటుంబము ఇంటర్నెట్ సదుపాయాన్ని మొబైల్/ ఫోన్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగిస్తే
CODE 3 : on any other device : WI-FI లేదా ఇంటర్నెట్ డాంగిల్ ద్వారా, పబ్లిక్ వైఫై ద్వారా ఉపయోగిస్తే
CODE 4 : కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం లేనట్లయితే.
ప్రశ్న 29: LAPTAP / COMPUTER
CODE 1 : YES
CODE 2 : NO
ప్రశ్న 30 : TELEPHONE AND MOBILE PHONE /SMARTPHONE
YES
CODE 1 : ల్యాండ్ లైన్ మాత్రమే ఉంటే
MOBILE ONLY
CODE 2 : స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉంటే
CODE 3 : ఇతర బేసిక్ ఫోన్
CODE 4 : BOTH ➡️ ల్యాండ్ లైన్ మరియు స్మార్ట్ ఫోన్ /బేసిక్ ఫోన్ రెండు ఉన్నట్లయితే మాత్రమే
NO
CODE 5 : NO ఏదీ లేనట్లయితే
ప్రశ్న 31 : సైకిల్ మరియు స్కూటర్ /మోటార్ సైకిల్/ మోపెడ్
జ: CODE 1: సైకిల్ మాత్రమే ఉన్నట్లయితే
CODE 2 : స్కూటర్ /మోటార్ సైకిల్/ మోపెడ్, మాత్రమే ఉన్నట్లయితే
CODE 3 : సైకిల్ మరియు స్కూటర్ /మోపెడ్/ మోటార్ సైకిల్ రెండూ ఉన్నట్లయితే.
CODE 4 : రెండు చక్రాల వాహనము ఏదీ లేనట్లయితే.
ప్రశ్న 32 : కారు /జీపు/ వ్యాను
CODE 1 : కుటుంబ సభ్యులలో ఎవరికైనా కారు జీపు వ్యాను ఉన్నట్లయితే.
CODE 2 : కుటుంబ సభ్యులలో ఎవ్వరికీ కారు జీపు వ్యాను లేనట్లయితే
ప్రశ్న: 33 : కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం
జ: 1- బియ్యం- Rice - బియ్యం, నూక, రవ్వ ,అటుకులు, మరమరాలు ,గంజి, బియ్యపు పిండి.
2- గోధుమలు- WHEAT : గోధుమలు లేదా గోధుమపిండి ఆహారం తీసుకున్నట్లయితే Ex: రవ్వ, గోధుమ రవ్వ, బిస్కెట్లు, కేకులు, మైదా
3- జొన్నలు JOWAR : జొన్నలు లేదా జొన్న రొట్టెలు, జొన్న ఉత్పత్తుల
4- సజ్జలు - BAJRA : సజ్జలు లేదా సజ్జ ఉత్పత్తులు
5- మొక్కజొన్న -MAIZ : మొక్కజొన్న, కార్న్ ఫ్లెక్స్ ,మొక్కజొన్న పిండి మొదలైనవి
6- ఇతరములు- ANY OTHER: కుటుంబ సభ్యులు వివిధ రకాలైన ధాన్యాలు తిన్నట్లయితే. Ex: ఓట్స్ బార్లీ రాగి
ప్రశ్న 34: మొబైల్ నెంబర్
జ: కుటుంబ యజమాని మొబైల్ నెంబరు లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదైనా ఒక మొబైల్ నెంబరు మనుగడలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే నమోదు చేయాలి.
జాగ్రత్తలు: యాప్ ను అన్ఇన్స్టాల్ చేయకూడదు.
పొరపాటున uninstall అయితే సింక్ చేయని డేటా మొత్తం పోతుంది.
యాప్ హాంగ్ అయితే కొంత సమయం వేచి ఉండండి.
యాప్ లో లాగ్ ఔట్ చేయకూడదు. జస్ట్ exit కావాలి.
PIN నెంబర్ తో ప్రొసీడ్ కావాలి.
Self enumeration చేయడానికి వీడియో వీక్షించండి.
~ In school activities
.jpeg)
Comments
Post a Comment