How to Register school on Vidyanjali 2.0
విద్యాంజలి 2.0 లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.
👉 విద్యాంజలి వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
కుడివైపు ఉన్న గ్రీన్ కలర్ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి.తరువాత స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
కిందికి స్క్రోల్ చేయండి
👉 New user Registration కనిపిస్తుంది.
👉 అందులో మొదటిది వాలంటీర్ రిజిస్ట్రేషన్.
స్కూల్ కు ఎడ్యుకేషన్ సపోర్ట్ ( అనగా విద్యా వాలంటీర్ గ స్వచ్ఛంద సేవలు అందించుట) లేదా పాఠశాల అవసరాలు ( డెస్క్ బెంచీలు, కంప్యూటర్, led tv, ఎలెక్ట్రిక్ సామగ్రి, అదనపు గదులు, ఫ్యాన్ లు, మంచి నీటి సరఫరా, రిపర్స్ మొదలైనవి) తీర్చడానికి సుముఖంగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
👉 వెబ్సైట్ లో పాఠశాలను రిజిస్టర్ చేయడానికి రెండవ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
ఇప్పుడు 'school Registration' క్లిక్ చేయాలి.
తరువాత స్క్రీన్ లో మీ పాఠశాల u dise code మరియు క్యాచ్ప ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
👉 తర్వాత స్క్రీన్ లో మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి చెక్ చేసుకోండి. మీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబరు మరియు మరొక సీనియర్ టీచర్ (Respondent) ఫోన్ నెంబర్ కనిపిస్తాయి.
ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్ నమోదు చేసి
👉 Get OTP క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ Verify చేయాలి.
👉 తర్వాత స్క్రీన్ లో చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వాలి.
School Name,
status - not registered
Action - Register on Vidyaanjali
కనిపిస్తాయి. Action పై క్లిక్ చేయాలి.
👉 మన రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ కు పంపడం జరుగుతుంది.
👉 నోడల్ ఆఫీసర్ నుండి ఎకౌంట్ యాక్టివేషన్ మెసేజ్ వచ్చే వరకు వేచి ఉండాలి.
👉 ఎకౌంటు యాక్టివేషన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ సహాయంతో లాగిన్ అయి పాఠశాలకు కావలసినటువంటి అసెట్స్ రిక్వెస్ట్ వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలి.
👉 అకౌంట్ యాక్టివేషన్ అయిన తరువాత స్టేటస్:
School successfully onboard. please login to post contribution request అని చూపిస్తుంది.
Vidyanjali 2.0 లో పాఠశాల ను రిజిస్టర్ చేసే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.
👉 విద్యాంజలి వెబ్ సైట్ లో మీ పాఠశాలను రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి.
Udise, mobile number not matched
ReplyDeleteUdise mobile number not matched ani vasthundhi Sir
ReplyDelete