School Infra Status (SIS App)

 

School Infra Status (SIS App)

1. school Infra Status (SIS) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

2. డౌన్లోడ్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి. 

యూజర్ ఐ.డి. మీ డైస్ కోడ్.

పాస్వార్డు: మీరు యుడైస్ కోసం పెట్టుకున్న పాస్వర్డ్.

ఇలా యూజర్ ఐ.డి. పాస్వర్డ్ లతో లాగిన్ అవ్వాలి.

3. మొదటగా మీ పాఠశాల ప్రాధమిక వివరాలు కనబడతాయి. వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. 

దీని కింద 7 బటన్స్ కనబడతాయి. అవి..

1)రూమ్స్

2)టాయిలెట్స్

3)డ్రింకింగ్ వాటర్

4)Kitchen shed

5)Compound wall

6)Geo fensing

7)Compound view video

   వీటిలో మొదటగా రూమ్స్ ను సెలెక్ట్ చేసుకొంటే 

 classrooms 

Headmaster room, staff room, other rooms అనే options వస్తాయి. వీటిలో ముందుగా క్లాస్ రూమ్స్ select చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం వాటి వివరాలు వస్తాయి. ముందుగా తరగతిని సెలెక్ట్ చేసుకొని ఆ తరగతికి సంబంధించిన 8 ఫోటోలు( east wall, west wall, north wall, south wall, ceiling, flooring, inner view, outer view) తీసుకొని సబ్మిట్ చేయాలి.

ఇలా ఎన్ని తరగతి గదులు ఉంటే అన్ని తరగతి గదులకు ఒక్కొక్క దానికి 8 ఫోటోల చొప్పున తీసి సబ్మిట్ చేయాలి.

ఇదే పద్దతిలో headmaster room, staff room, other rooms కి సంబంధించిన ఫోటోలు కూడా upload చేయాలి.

5. తరువాత టాయిలెట్స్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం డైస్ లో నింపిన వివరాల ప్రకారం టాయిలెట్స్ సంఖ్య display ఆవుతుంది. 

దీనికి సంబంధించిన 4 ఫోటోలు అనగా front view, inner view, flooring, ceiling కి సంబంధించిన 4 ఫొటోలు అప్లోడ్ చేయాలి. 

6. తదుపరి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి.

7. అనంతరం kitchen shed కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ, ఇన్నర్ వ్యూ మొత్తం 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి.

8. Compound wall కి సంబంధించిన  front view, inner view కి సంబంధించిన 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి. 

9. తరువాత GEO fensing అనే బటన్ ని క్లిక్ చేస్తే మొత్తం 10 coordinates కి సంబంధించిన బటన్స్ కనబడతాయి. మీ పాఠశాల కాంపౌండ్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా 10 పాయింట్లను గుర్తించి compound చుట్టూ తిరుగుతూ ప్రతి coordinate వద్ద క్లిక్ చేస్తే మీ పాఠశాలకు geo fensing వేసినట్లే. దీనిని map view అనే option ద్వారా చూసుకొని సరిగా వచ్చింది అనుకుంటే సబ్మిట్ చేయవచ్చు. 

10. అనంతరం compound view video లో మీరు రెండు వీడియో లు తీయాలి. ఒక్కొక్కటి 20 సెకండ్స్ నిడివి ఉండాలి. మొదటిది పాఠశాల బయటి నుండి మొత్తం కాంపౌండ్ కవర్ అయ్యేటట్లు తీయాలి. మరొకటి కాంపౌండ్ లోపలినుండి పాఠశాల మొత్తం కవర్ అయ్యేటట్లుగా విడియో తీసి అప్లోడ్ చేయాలి. 

ఆప్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు

మీరు ఏదైనా అంశాన్ని సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన అన్ని ఫోటోలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన ఫోటోలు సర్వర్లు సేవ్ చేయబడతాయి.

మీరు తిరిగి బ్యాక్ వచ్చి ఆ ఫోటోలు చూడాలని ప్రయత్నించినప్పటికీ అవి కనిపించవు, కానీ సర్వర్ లో  నిక్షిప్తం చేయబడతాయి. ఒకవేళ మీరు ఫోటోలు అప్లోడ్ చేయాలనుకుంటున్నట్లయితే మళ్ళీ అన్ని ఫోటోలను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తాజా ఫోటోలు రీప్లేస్ చేయబడతాయి.

డ్రింకింగ్ వాటర్ నో అని ఉన్నప్పటికీ ఫోటోలు అప్లోడ్ చేయమని అడగటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్  ఫెసలిటీ లేదని మనం ఫోటోలు అప్లోడ్ చేయనట్లయితే ఫైనల్ సబ్మిట్ కావడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రధానోపాధ్యాయులు డ్రింకింగ్ వాటర్ స్పెషల్ టీ కొరకు క్యాన్లను ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు. (మనం పిల్లలకు కేవల ద్వారా మంచినీటిని అందించినపుడు).

మీరు అన్ని ఫోటోలు అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే ఆ అంశాన్ని చూపిస్తుంది. తిరిగి ఆ అంశాన్ని ఎంపిక చేసి ఫోటోలు సెలెక్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు నెట్ ఉన్నది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి.

కొన్ని అంశాలను ఇప్పుడు అప్లోడ్ చేసి మరికొన్ని అంశాలను తర్వాత కూడా అప్ లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 

School infra status app download చేసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION