Foundation Literacy study మూల్యాంకనం ఎలా చేయాలి ?

 Foundation Literacy study మూల్యాంకనం ఎలా చేయాలి ? 

దేశవ్యాప్తంగా FLS సర్వే ఫిబ్రవరి26 - 2026 నాడు నిర్వహించడం జరుగుతుంది. 

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుంది

👉 Fls - భాష మరియు గణితం విషయాలలో విడివిడిగా రిపోర్ట్ నమోదు చేయాలి. 

విద్యార్ధులను ఒక్కొక్కరిని సామర్థ్యాల వారిగా పరీక్షించాలి. 

👉 ప్రతి విద్యార్థికి ఒక్కో ప్రశ్నా పత్రం ఇచ్చి పరీక్షించవచ్చు లేదా ఒక ప్రశ్నా పత్రం సహాయంతో ఉపాధ్యాయుడు ఒక్కో విద్యార్ధిని పరీక్షించి సామర్థ్యాలు సాధించాడా? లేదా అనే రిపోర్ట్ నమోదు చేయాలి. 

👉 ఇంగ్లీష్ లో 6 సామర్థ్యాలు మొత్తం ప్రశ్నల సంఖ్య :11

👉 గణితం లో  7 సామర్థ్యాలు, మొత్తం ప్రశ్నల సంఖ్య :11 

ఇంగ్లీషు EC01 నుండి EC06 

 ( EC - effective communicator)

గణితం IL01 నుండి IL07

  ( IL - Interactive Learner)

Note: ప్రతి ప్రశ్నలో విద్యార్ధి 80% చేయగలిగితే ఆ సామర్థ్యం సాధించినట్లు.

ఉదా: ఇంగ్లీష్ లో fls report నమోదు చేసే విధానం

👉 ఉదా1: EC 01 సామర్థ్యం లో 5 ప్రశ్నలు ఉన్నాయి.

విద్యార్ధి 4 ప్రశ్నలకు సరియైన సమాధానం చేసినచో అతడు ఆ సామర్థ్యం సాధించినట్లు. ✅

అనగా రిపోర్ట్ లో ✅ మార్కు ద్వారా లేదా able అని నమోదు చేయాలి.

ఉదా2: EC 02 లో 12 అంశాలు ( ప్రశ్నలు ) ఉన్నాయి. విద్యార్ధి 9 ప్రశ్నలు చేయగలిగితే ఆ సామర్థ్యం సాధించనట్లు. ❌ నమోదు చేయాలి.

కొద్ది మంది ఉపాధ్యాయులు పాయింట్లు నమోదు చేయాలి అంటున్నారు. మీరు పాయింట్లు నమోదు చేసినా చివరకు చేయవలసినది ఆ విద్యార్ధి ఆ సామర్థ్యం సాధించినాడా లేదా ? అనగా able or not able.

కాబట్టి మీరు రిపోర్ట్ లో FLN లాగా ✅ or ❌ పెట్టండి. ( అదనపు సమాచారం కావాలంటే అదే బాక్స్ లో విద్యార్ధి సాధించిన ప్రశ్నల సంఖ్య రాయండి 4- ✅ )

👉 ఏ సామర్థ్యం అయినా విద్యార్ధి 80% చేయగలిగితే అతడు సాధించినట్లు భావించాలి.

EC03 లో 100 పదాలకు 80 పదాలు సరిగా చదివితే ఆ సామర్థ్యం సాధించినట్లు.

EC 04 సామర్థ్యం లో 50 పదాలు ఉన్నాయి. 40 పదాలు సరిగా చదివితే సామర్థ్యం సాధించినట్లు.

EC 05 లో 50 నాన్సెన్స్ పదాలు ఉన్నాయి. 40 చదివితే సాధించినట్లు.

➡️ ఇదే విధానం లో అన్ని సామర్థ్యాలను పరీక్షించాలి.

     


         పైన చూపిన మూడు పద్ధతులలో మీకు easy and informative అనిపించిన method లో రిపోర్ట్ నమోదు చేయండి


                   ***********************  

 🔶గణితం🔶

👉 గణితం లో 7 సామర్థ్యాలు, 11 ప్రశ్నలు ఉన్నాయి.

ఉదా: IL 01 లో 6 ప్రశ్నలు  ఉన్నాయి. విద్యార్ధి 80% అనగా 5 ప్రశ్నలు  చేయగలిగితే ఆ సామర్థ్యం సాధించినట్లు. 

5 జవాబులు చేయగలిగిన విద్యార్థికి ఆ సామర్థ్యానికి ✅ మార్కు నమోదు చేయండి.

నోట్: 1వ, సామర్థ్యం లో 24 అంకెలు ఇవ్వబడినాయి. విద్యార్ధి 19 అంకెలు తప్పులు లేకుండా చదవగలగాలి. ✅ నమోదు చేయాలి.

ఉదా: 2వ, సామర్థ్యం ( LOC )  14 అంశాలు. విద్యార్ధి కేవలం 4 అంశాలు ( ప్రశ్నలు ) మాత్రమే చేయగలిగితే అతడు ఆ సామర్థ్యం సాధించనట్లు. ❌

ఇదే విధానం లో అన్ని సామర్థ్యాలు పరీక్షించి ✅ or ❌ నమోదు చేయండి.

ఉదా: ప్రశ్న 8 లో మొత్తం పరీక్షించవలసిన అంశాలు 8. కాబట్టి విద్యార్ధి 6 అంశాలు చేయగలిగితే ఆ సామర్థ్యం సాధించినట్లు.

విద్యార్ధులను గ్రూపుగా విభజించి రెమిడియల్ టీచింగ్ చేయండి.

👉 శాతం కనుక్కోవడానికి FLN సూత్రం ఉపయోగించండి.


గణితం రిపోర్ట్ నమోదు చేసే విధానం.పైన చూపిన మూడు పద్ధతులలో మీకు easy and informative అనిపించిన method లో రిపోర్ట్ నమోదు చేయండి



Suggestive Strategies & Focus Areas 

Model lessons on competencies

 • Daily practice using Item Bank (1 period for Language and 1 period for Mathematics) 

• Group practice + 1:1 oral testing

 • Maintain learner progress sheets

 • Strong remedial measures for Teacher Support Learners 

• Promote peer learning

 • Provide immediate remedy and ensure student progress

 • Conduct Mock Tests in given time schedule

Comments

Popular posts from this blog

10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025