గ్రామ పంచాయతీ ఎన్నికల FAQ

 

1.గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ బ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది ? 

జ: గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ బ్యాలెట్ పింక్ కలర్ లో ఉంటుంది. బ్యాలెట్ లో రెండు భాగాలు ఉంటాయి. 

1. కౌంటర్ ఫైల్ 

2. ఓటరుకు ఇవ్వవలసిన బ్యాలెట్ పత్రం. 

PO తనకు ఇవ్వబడిన బ్యాలెట్లు సరిచూసుకుని కౌంటర్ ఫైల్ పై గ్రామపంచాయతీ పేరు, గ్రామపంచాయతీ నెంబర్, వార్డు నెంబరు రాసి ఉంచుకోవాలి. 

బ్యాలెట్ పేపర్ భాగంలో ఎలాంటి రాతలు రాయకూడదు. 

బ్యాలెట్ పేపర్ను వెనుకకు తిప్పి కుడివైపు పైన, కింద డిస్టింగిష్డ్ స్టాంపు వేయాలి.

కౌంటర్ ఫైల్ పై మరియు బ్యాలెట్ పేపర్ పై వెనక వైపు కుడివైపున ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాలి. 

డిస్టింగేష్డ్ స్టాంపు వేసేటప్పుడు మరియు సంతకం చేసేటప్పుడు అవి గుర్తుల పైకి వెళ్లకుండా చూసుకోవాలి.

కౌంటర్ ఫైల్ కు మరియు ఓటర్ కు ఇవ్వవలసిన బ్యాలెట్ కు మధ్యలో ఒక గొలుసు ప్రింటు ఉంటుంది.

గొలుసు ప్రింటుపై స్కేల్ పెట్టి బ్యాలెట్ పేపర్ ను జాగ్రత్తగా చింపి మడత పెట్టీ ఓటర్ కు ఇవ్వాలి. 


ఓటరు బాణాల క్రాస్ మార్క్ తో తన ఓటును గుర్తించి మళ్లీ అలాగే మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేస్తాడు.

👉 సర్పంచ్ అభ్యర్థులు ఏడుగురు ఉన్నట్లయితే ఏడుగురు తో పాటు ఒక నోట మొత్తం ఎనిమిది గుర్తులు ఉంటాయి. 

ఒక వైపు సీరియల్ నెంబర్స్ మరొకవైపు గుర్తులుంటాయి.


7గురు లేదా అంతకన్న ఎక్కువ మంది అభ్యర్ధులు ఉంటే ఎడమవైపు 6గురికి, మిగిలిన వారివి కుడివైపు సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటాయి.




బ్యాలెట్ ముద్రణ పైన చూపెట్టినట్లు ఉంటుంది.

             *****************

2.గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డ్ మెంబర్ బ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది ? 

జ: గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డ్ మెంబర్ బ్యాలెట్ తెలుపు కలర్ లో ఉంటుంది. బ్యాలెట్ లో రెండు భాగాలు ఉంటాయి. 

1. కౌంటర్ ఫైల్ 

2. ఓటరుకు ఇవ్వవలసిన బ్యాలెట్ పత్రం. 

👉 కౌంటర్ ఫైల్ పై గ్రామపంచాయతీ పేరు గ్రామపంచాయతీ నెంబర్ వార్డు నెంబరు రాసి ఉంచుకోవాలి. 

బ్యాలెట్ పేపర్ భాగంలో ఎలాంటి రాతలు రాయకూడదు. 

బ్యాలెట్ పేపర్ను వెనుకకు తిప్పి, కుడివైపు పైన కింద డిస్టింగిష్డ్ స్టాంపు వేయాలి.

కౌంటర్ ఫైల్ పై మరియు బ్యాలెట్ పేపర్ పై వెనక వైపు కుడివైపున ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాలి. 

డిస్టింగేష్డ్ స్టాంపు వేసేటప్పుడు మరియు సంతకం చేసేటప్పుడు అవి గుర్తుల పైకి వెళ్లకుండా చూసుకోవాలి.

కౌంటర్ ఫైల్ కు మరియు ఓటర్ కు ఇవ్వవలసిన బ్యాలెట్ కు మధ్యలో ఒక గొలుసు ప్రింటు ఉంటుంది.

గొలుసు ప్రింటుపై స్కేల్ పెట్టి బ్యాలెట్ పేపర్ ను జాగ్రత్తగా చింపి మడత పెట్టీ ఓటర్ కు ఇవ్వాలి. 


ఓటరు బాణాల క్రాస్ మార్క్ తో తన ఓటును గుర్తించి మళ్లీ అలాగే మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేస్తాడు.

👉 వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఏడుగురు ఉన్నట్లయితే ఏడుగురు తో పాటు ఒక నోట మొత్తం ఎనిమిది గుర్తులు ఉంటాయి. 

👉 ఒక వైపు సీరియల్ నెంబర్స్ మరొకవైపు గుర్తులుంటాయి.

👉 7గురు లేదా అంతకన్న ఎక్కువ మంది అభ్యర్ధులు ఉంటే ఎడమవైపు 6గురికి, మిగిలిన వారివి కుడివైపు సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటాయి.



                 ****************


ప్రశ్న3: పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఇస్తారు ? ఎక్కడ వేయాలి.

పోస్టల్ బ్యాలెట్ పారం XIV ఉద్యోగి పనిచేస్తున్న మండల mpdo గారికి అందజేయాలి.

Mpdo గారు ప్రతి రోజు సాయంత్రం వారికి అందిన ఫారం 14 ఉద్యోగి సొంత మండల mpdo గారికి అందిస్తారు. 

వారు ఆయా గ్రామాల స్టేజి 2 లకు అట్టి పత్రాలు అందిస్తారు. వారు ఉద్యోగికి 8వ, తారీకు వరకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందిస్తారు. ఉద్యోగులు అక్కడే బ్యాలెట్ కవర్స్ మరియు ఫార్మ్స్ ఫిల్ చేసి బ్యాలెట్ నమోదు చేసి అక్కడే ఏర్పాటు చేసిన వారి గ్రామ పంచాయతీ బాక్స్ లో వేయాలి.

పోస్టల్ బ్యాలెట్ ఫారం XVII, XVIII(A), XIX(B) ఉంటాయి. ఫారం XVII, XVIII పైన బ్యాలెట్ పేపర్ క్రమ సంఖ్య వేయాలి.

ఫారం XX సూచనల ఉంటాయి.

ఫారం XIX పైన ఓటరు మహిళ అయినట్లయితే W అని రాయాలి.

బ్యాలెట్ పేపర్ ఫారం- XVIII కవర్ లో పెట్టీ గమ్ముతో సీల్ చేయాలి. డిక్లరేషన్ ఫారం -XVII, కవర్- XVIII లను  ఫారం- XIX ఔటర్ కవర్ లో( పెద్దది) పెట్టాలి.

                     ***********

4. ఉద్యోగి వేరే జిల్లా వారు అయినట్లయితే ఎలా ? 

ఉద్యోగి వేరే జిల్లా అయినప్పటికీ తను పని చేసే చోట ఫారం 14 అందివ్వాలి. అట్టి అప్లికేషన్ ఉద్యోగి పనిచేయుచున్న మండల ఎంపీడీవో గారు ఉద్యోగి యొక్క సొంత మండల ఎంపీడీవో గారికి పంపిస్తారు.

తరువాత ఉద్యోగి తన సొంత మండల mpdo ఆఫీస్ కు వెళ్లి బ్యాలెట్ వేయాలి.

(లేదా) 

ఆ జిల్లా ఎన్నికల అధికారి సూచనలు పాటించండి.

5. EDC అనగా నేమి?

జ: election duty certificate. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. EDC ద్వారా ఉద్యోగి డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.ఈ సర్టిఫికెట్ ద్వారా సాధారణ ఓటర్ లాగా బ్యాలెట్ పేపర్  ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఈడీసీకి తక్కువ అవకాశం ఉంటుంది. MP, MLA ఓటింగ్ సమయంలో edc ఎక్కువగా ఉపయోగపడుతుంది.

EDC పోలింగ్ కేంద్రం RO ఇస్తారు. 

6. చనిపోయిన వ్యక్తి ఓటు వేయడానికి వచ్చాడు ? అతనిని ఓటు వేయడానికి అనుమతించాలా ? (ASD List voters)

అవును అనుమతించాలి. 

మీ ఓటర్ లిస్టులో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించబడి ఉండి ఆ వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క గుర్తింపును ప్రిసైడింగ్ ఆఫీసర్ రుజువు పరుచుకోవాలి. 

అతని గుర్తింపు పై ప్రీసైడింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందిన తర్వాత అతనికి సాధారణ ఓటర్ లాగా ఓటు వేయడానికి అనుమతించాలి.

ASD: ( absent shifted died waters list ) లో ఉన్న ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లయితే పిఓ గారు అతని యొక్క గుర్తింపును నిర్ధారించుకొని ఓటు ఇవ్వాల్సి ఉంటుంది.

7. తక్కువ వయసు ఉన్న వ్యక్తి ఓటు వేయడానికి వచ్చాడు ? అతనికి ఓటు ఇవ్వాలా ?

జ: అవును ఓటు వేయడానికి అనుమతించాలి.

పోలింగ్ సిబ్బందికి, ఓటరు వయసును నిర్ధారించే అధికారం లేదు.

PO కు ఏదైనా సందేహం వస్తే వయసు నిర్ధారణ డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి ఓటరు సంతకం చేయించాలి.

8. ఓటరు కు సిరా గుర్తు పెట్టడం మరిచిపోయాను ఎలా ?

జ: మరిచి పోకూడదు. తప్పకుండా సిరా గుర్తు ఎడమచేతి చూపుడు వేలు పై పెట్టాలి.

9. ఓటరు పోలింగ్ కేంద్రం లోకి ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా వచ్చాడు. అతనిని ఓటు వేయడానికి అనుమతించాలా ?

జ: లేదు అనుమతించకూడదు. ప్రతి ఓటరు విధిగా నిబంధనల ప్రాకారం ఏదైనా గుర్తింపు కార్డు ప్రిసైడింగ్ అధికారికి చూపించాలి. ఇట్టి విషయాన్ని BLO ద్వారా ముందే ప్రచారం చేయించాలి.

10. బ్యాలెట్ పేపర్ పై ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్టిగ్ స్టాంపు ఎక్కడ వేయాలి మరియు సంతకం ఎక్కడ చేయాలి ?

జ: బ్యాలెట్ పేపర్ వెనక కుడివైపున కౌంటర్ ఫైల్ పై మరియు బ్యాలెట్ పేపర్ పై మీ వార్డు యొక్క డిస్టింగేష్డ్ స్టాంపు వేయాలి. స్టాంపు వేసిన చోట ప్రిసైడింగ్ అధికారి పూర్తి సంతకం చేయాలి.

11. బ్యాలెట్ పేపర్ ను ఎలా మడత పెట్టాలి ?

జ: బ్యాలెట్ పేపర్ పై ఒకే వరసలో గుర్తులు ముద్రించబడి ఉన్నట్లయితే మొదటగా నిలువుగా మడత పెట్టండి. ఆ తర్వాత మీ వార్డు యొక్క డిస్టింగేష్డ్ స్టాంపు మరియు ప్రిసైడింగ్ అధికారి సంతకం పైకి కనిపించేలా అడ్డంగా మడతపెట్టండి.

12. 18 సంవత్సరాల నుండి  మనవడు తన తాతను పోలింగ్ బూతుకు తీసుకువచ్చి  సహాయకునిగా ఓటు వేయించినాడు. మరల కొంతసేపటి తర్వాత అతని నానమ్మతో సహాయకునిగా వచ్చినాడు అతనిని సహాయకునిగా అనుమతించాలా? అనుమతించకూడదా ?

జ: అనుమతించకూడదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకరికి ఒకేసారి సహాయకునిగా అనుమతించబడతాడు. ఎవరిని కూడా రెండవసారి సహాయకునిగా అనుమతించకూడదు. సహాయకుడు అదే గ్రామంలో ఓటరుగా నమోదయి ఉండాలి.అతడు కూడా తన ఐడెంటిటీ కార్డును ప్రిసైడింగ్ అధికారికి చూపించాలి.

గుర్తింపు కార్డు లేకుండా వచ్చిన కంపానీయన్  ను అనుమతించవలసిన అవసరం లేదు.

13. ఒక ఓటరు యొక్క ఇంటి పేరు తప్పుగా నమోదయింది, (లేదా) ఓటరు తండ్రి పేరు ఓటర్ లిస్టులో తప్పుగా నమోదయింది. అతనిని ఓటు వేయడానికి అనుమతించాలా ?

జ: అవును అనుమతించాలి. వ్యక్తి ఇంటిపేరు తప్పు ఉన్నంత మాత్రాన ఓటును తిరస్కరించే అవకాశం లేదు. ఏదైనా సందేహం ఉన్నట్లయితే బి ఎల్ ఓ లేదా గ్రామ కార్యదర్శి ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటర్ యొక్క గుర్తింపును రుజువు పరుచుకోవాలి. ఓటరు గుర్తింపు రుజువైన తర్వాత ఓటు వేయడానికి అనుమతించాలి. 

14. నేను పిఓ గా విధులు నిర్వహిస్తున్నాను. పోలింగ్ బూత్ లో నేను ఫోన్ ఉపయోగించుకోవచ్చా ?

జ: ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. పోలింగ్ బూతులోకి మొబైల్ ఫోను అనుమతి లేదు. పోలింగ్ సిబ్బందితో సహా ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి ఫోన్ తీసుకువెళ్లకూడదు.

15. ఓటు వేయడానికి వచ్చిన ఓటరు తన మొబైల్లో ఆధార్ కార్డు గుర్తింపుగా చూపించినాడు. ఓటు వేయడానికి అనుమతించాలా ?

జ: అనుమతించకూడదు. నిజమైన గుర్తింపు కార్డును చూపించినప్పుడు మాత్రమే ఓటర్ల ఓటు వేయడానికి అనుమతించాలి.  పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్ తో వచ్చిన ఓటర్ను ఓటు వేయడానికి అనుమతించకూడదు. పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్  వెళ్లడానికి అనుమతి ఉండదు.



Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies