INSTRUCTIONS TO 10TH CLASS STUDENTS
👉 6 పేపర్లు ఉంటాయి. ప్రతి పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. 20 మార్కులు ప్రాజెక్టులకు ఇస్తారు. ప్రాజెక్టు మార్కులు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు మీకు కేటాయిస్తారు
మొత్తం వంద మార్కులకు ( 80 + 20 = 100 ) మేమో వస్తుంది. గ్రేడులు ఉండవు. వంద మార్కులకు సబ్జెక్టు వారీగా మీరు స్కోరు చేసిన మార్కులు ఉంటాయి.
👉 మొదటి పది నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి. ప్రశ్నలను అర్థం చేసుకోండి. మీరు సరియైన సమాధానాలు రాయగలిగిన ప్రశ్నలను గుర్తించండి.
👉 OMR sheet part -A లో మాత్రమే విద్యార్థి సంతకం అని ఉన్నచోట మీ సంతకం చేయండి. మీరు హాల్ టికెట్లో సంతకం ఎలా చేశారు అలాంటి సంతకం మాత్రమే OMR లో చేయాలి.
ఏ సందేహం ఉన్న ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.
👉 OMR sheet ను మలవకండి.
👉 మీకు 24 పేజీల బుక్లెట్ మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వబడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు అందులో మాత్రమే రాయవలసి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. బుక్లెట్ మీ ఆన్సర్స్ రాయడానికి సరిపోతుంది.
👉 బుక్లెట్లో జవాబులు ఎక్కడినుంచి ప్రారంభించాలో తెలియజేస్తారు మీరు అక్కడి నుంచే జవాబులు రాయడం ప్రారంభించండి.
👉 చాలా నీట్ గా మార్జిన్ లైన్స్ కొట్టండి. కొంతమంది విద్యార్థులు నాలుగు వైపుల ఎక్కువ మార్జిన్స్ కొట్టి ఆన్సర్ రాసే స్పేస్ తక్కువ అయ్యేలా చేస్తారు. అలా చేయవద్దు.
👉 ఎడమవైపు ప్రశ్న సంఖ్య రాయడానికి కొంత ఎక్కువ మార్జిన్ వదలండి. కుడివైపు, పైన, కింద తక్కువ మార్జిన్ వదలండి.
👉 Section nembar మరియు ప్రశ్న సంఖ్య క్లీయర్ గా రాయండి. ఒక సెక్షన్ లోని అన్ని ప్రశ్నలు ఒకే చోట రాసే ప్రయత్నం చేయండి. కొంతమంది విద్యార్థులు ప్రశ్నకు జవాబు తెలియక, తరువాత రాయడానికి స్పేస్ వదిలి మర్చిపోతారు. అలా చేయకండి.
👉 ప్రశ్నలకు జవాబులు వరుస క్రమం లో రాయండి. మీకు ఏదైనా జవాబు తెలియక, చివరలో జవాబు రాయలనిపిస్తే అక్కడ section nembar, ప్రశ్న సంఖ్య చాలా క్లియర్ గా రాసి జవాబు రాయండి. ఏదైనా జవాబు తప్పు అయితే దానిపై ఇంటూ మార్క్ మాత్రమే( × ) పెట్టండి. ఇష్టం వచ్చినట్లు పిచ్చిగా కొట్టివేకండి.
👉 చాయిస్ ప్రకారం ప్రతి ప్రశ్నకు జవాబులు, సూచనల ప్రకారం ఎన్ని వాక్యాలు రాయమంటే , ఖచ్చితంగా అన్ని వాక్యాలు రాయండి. అంతేకాని సమాధానం సాగదీయకండి.
👉 Section ప్రకారం ప్రతి ప్రశ్నకు సమాధానం రాయండి. ఏ section లో నైనా చాయిస్ ఉంటే , చాయిస్ ప్రకారమే రాయండి. అంతే కాని సమయం ఉన్నది, ఆన్సర్ తెలుసు అని అన్ని సమాధానాలు అవసరం లేదు.
👉 కొన్ని ప్రశ్నలకు జవాబు కొంత, ప్రశ్నలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదివి జవాబు రాయండి.
EX: english, science లో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి.
👉 కొన్ని ప్రశ్నలకు సొంతగా సమాధానాలు రాయవలసి ఉంటుంది.
EX: telugu లో పండగలు,లెటర్, గ్రామ చరిత్ర,గ్రామాల్లో జరిగే ముఖ్యమైన పండగ,
సైన్స్ లో విశ్లేషణ , అభిప్రాయాలు, జాగ్రత్తలు లాంటివి. ఇలాంటి ప్రశ్నలను అస్సలు వదలండి. సొంత గా రాసే జవాబు కాబట్టి మీకు స్కోర్ పెరుగుతుంది.
👉 గణితం లో జవాబులు రాసేటప్పుడు అదనపు స్టెప్స్ రాసి లెక్కను చాలా పెద్దగా చేయకండి. లాజికల్ గా సమాధానాలు రాయండి. ఇక్కడ మీరు ఎన్ని స్టెప్స్ వేశారు అనే దానికంటే, ఎంత లాజిక్ ఉపయోగించారు అనేదే ముఖ్యం.
👉 గణితం రఫ్ వర్క్ లెక్కకు కుడివైపు మార్జిన్ కొంత ఎక్కువ వదిలి అక్కడే రఫ్ వర్క్ చేయండి. రఫ్ కదా అని చెత్త, చెత్తగా చేయకండి. లేదా చివరి పేజీలో రఫ్ చేయండి.
👉 ప్రతి పేజీలో 13 నుండి 15 లోపు లైన్లు మాత్రమే రాయండి. అక్షరాల, పదాల మధ్య దూరం పాటించండి. పేరాగ్రాఫ్ లాగా రాస్తే పేరా గ్రాఫ్ మొదటి లైన్ కొంత స్థలం వదిలి ప్రారంభించండి. జవాబు సాగదీయకండి. ఎక్కువ మార్కులు ఏమి రావు.
👉 లైన్ చక్కగా రాయండి. రాత ఎలా ఉన్న తప్పులు లేకుండా అర్థం అయ్యేలా రాయండి. తెలుగు గుండ్రంగా రాయవచ్చు. కానీ ఇంగ్లీష్ అక్షర నియమాలు పాటించాలి. అనగా అక్షరాలు కొన్ని పైకి, కొన్ని కిందికి ఉంటాయి.
👉గణితం లో ఏదైనా గ్రాఫ్ లేదా నిర్మాణం, సైన్స్ లో బొమ్మలకు పెన్సిల్ వాడండి. భాగాలు తప్పకుండా గుర్తించాలి.
👉 రంగుల పెన్నులు వాడవలసిన అవసరం లేదు. హెడ్డింగ్ కు బ్లాక్ పెన్ను వాడండి, మొత్తం జవాబులు బ్లూ పెన్ను మాత్రమే వాడండి.
👉 పరీక్ష లో కొత్త పెన్ను వాడకండి. కొంత రాసిన రెండు బ్లూ పెన్నులు, ఒక బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. పెన్సిల్, షార్పెనర్, ఎరైజర్, స్కేల్, ప్యాడ్ తీసుకెళ్ళండి. అనలాగ్ గడియారం ఉంటే పెట్టుకోండి. డిజిటల్, స్మార్ట్ గడియాలకు, కలిక్యులేటర్ కు అనుమతి ఉండదు.
👉 ముఖ్యమైన పాయింట్, లేదా హెడ్డింగ్ మాత్రమే అండర్ లైన్ చేయండి. ఎక్కడపడితే అక్కడ అండర్ లైన్ చేయవద్దు.
PART -B
👉 Part -B లో సమాధానాలు పెన్నుతో మాత్రమే రాయండి. మొదట పెన్సిల్ తో రాసి దానిపై దిద్దకండి. అలా చేస్తే పరీక్ష పెపర్ దిద్దే టీచర్ మీరు కాఫీ చేశారని గుర్తిస్తారు. ఏదైనా సమాధానం తప్పు అయితే దానిపై × ఇంటు మార్క్ మాత్రమే పెట్టీ ( కొంత మంది విద్యార్థులు అక్షరం పై బాగా దిద్ది కోటివేస్తారు ఎలా కాకుండా ) పక్కకు సరియైన సమాధానం రాయండి.
👉 OMR మరియు మెయిన్ బుక్లెట్ దారం కట్టెప్పుడు వేలు పెట్టీ ముడి వేయండి. పేపర్ దిద్దడానికి పేజీలు సులభంగా తిప్పేలా ముడి వేయాలి. ఊడకుండా నాలుగు ముడులు వేయండి.
మీరు ముడి దగ్గరకు వేస్తే పేజీలు తిప్పరాదు. పేపర్ దిద్దే వారు ఇబ్బంది పాడుతారు జాగ్రత్త.
👉 చివరగా ప్రపరేషన్ అయ్యేటప్పుడు చదివిన జవాబులే మళ్ళీ, మళ్ళీ చదవకండి. కొత్త ప్రశ్నలకు జవాబులు నేర్చుకోండి. ఊరికే చదవడం కాకుండా పేపర్ పై ముఖ్యమైన జవాబులు రాయడం ప్రాక్టీస్ చేయండి. మీరు రాసే జవాబులో పాయింట్స్ రాసేటప్పుడు వాటి మధ్య సంబంధం ఉండాలి.
అలా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి.
పుస్తకం చివరి పాఠం నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టి మొదటి పాఠం వరకు పూర్తి చేయండి.
మీ ఉపాధ్యాయుల సూచనలు తప్పకుండా పాటించండి.
ఇప్పుడు మీ స్కోర్ :98/100*
All the best 💐💐💐
Comments
Post a Comment