TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

 TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.



ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

ఓ టి ఆర్ చేయడానికి మీ యొక్క అన్ని విద్యార్హతల వివరాలు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి, 

Qualification

నేమ్ అఫ్ ది బోర్డ్

స్టేట్

డిస్ట్రిక్ట్

Place of study 

స్టడీ టైప్: రెగ్యులర్/ ప్రైవేట్

 హాల్ టికెట్ నెంబర్

 పాస్డ్ డేట్ - 

మొత్తం మార్కులు

మీరు సాధించిన మార్కులు

మార్కుల శాతం

కాలేజీ వివరాలు.

 ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి.

1. మొదటగా వ్యక్తిగత వివరాలు అన్నీ జాగ్రత్తగా నింపండి పార్శల్ సేవ్ చేయండి.

పేరు

తండ్రి పేరు

తల్లి పేరు

పుట్టిన తేది

జెండర్

వ్యక్తిగత వివరాలలో క్రీమీలేయర్, నాన్ క్రిమిలేయర్ అన్నచోట మీరు నాన్ క్రీమీలేయర్ సెలెక్ట్ చేయండి.

EWS అభ్యర్దులు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 

నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1.04.2023 తర్వాత మాత్రమే మీ ఎమ్మార్వో నుండి తీసుకోండి. ఇప్పటికే మీరు తీసుకున్న నాన్ క్రిమిలేయర్, ఇన్కమ్ సర్టిఫికెట్ పనిచేయదు.

మీరు ఉద్యోగానికి ఎంపిక అయిన తరువాత తీసుకుంటే మంచిది. ఎందుకంటే నాన్ - క్రీమిలేయర్, ఇన్కమ్ సర్టిఫికేట్ వాలిడిటీ ఒక సంవత్సరము మాత్రమే ఉంటుంది. 

         ( 1.04.2023 నుండి 31.03.2024 వరకు)

మీరు ముందే నాన్ క్రీమీలేయర్, ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకుంటే ఉద్యోగ నియామక సమయానికి ఒక సంవత్సరం పూర్తి అయినట్లయితే మళ్లీ కొత్తది తీయవలసి వస్తుంది.

క్యాస్ట్ సర్టిఫికెట్ yes సెలెక్ట్ చేసి, మీ- సేవ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసి save చేయండి. 

ఇక్కడ మీ క్యాస్ట్ మరియు sub- caste సరిగా ఎంపిక చేయండి.

కొన్నిసార్లు మీసేవ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ చేసినప్పటికీ డేటా సేవ్ కావడం లేదు.

 మళ్లీ ప్రయత్నించి సేవ్ చేయండి.

మీసేవ క్యాస్ట్ సర్టిఫికెట్ లేనట్లయితే ఇప్పుడు కొత్తగా తీసుకోండి.

మీరు క్యాస్ట్ గాని నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ గాని అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు.

క్యాస్ట్ సర్టిఫికెట్ పెళ్లి అయిన  మహిళలకు తండ్రి పేరు తో మాత్రమే తీసుకోండి. 

క్యాస్ట్ సర్టిఫికెట్ తల్లిగారి ఊరు నుండి లేదా అత్తగారి ఊరు నుండి ఏకాడైనా తీయవచ్చు. 

 ప్రస్తుత నివాస ప్రాంతం నుండి తండ్రి పేరుతో తీసుకోండి. సాధ్యం కానప్పుడు తల్లి గారి ఊరు లో తీసుకోండి. 

అడ్రస్ వివరాలలో మీ ప్రస్తుత అడ్రస్, మరియు పర్మినెంట్ అడ్రస్ ఇవ్వండి.

రెండు ఒకటే అయినట్లయితే రెండు పర్మినెంట్ అడ్రస్లు ఇవ్వండి.

స్కూల్ స్టడీ విషయంలో 

మీరు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు ఉన్నట్లయితే స్టడీ "రెగ్యులర్" అని సెలెక్ట్ చేయండి. వివరాలు నింపండి

ఒకవేళ మీరు ఒకటి, రెండు తరగతులు లేదా ఇతర తరగతులు పాఠశాలలో చదవనట్లయితే " ప్రైవేట్" అని సెలెక్ట్ చేయండి.

మీరు పాఠశాలలో చదవని తరగతులకు మీ ప్రాంత మండల తాసిల్దార్ నుండి లోకల్ ఏరియా సర్టిఫికెట్ తీసుకోండి.

2.తర్వాత విద్యార్హతల వివరాలు ఓపెన్ అవుతాయి.

అక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం అడిగిన విద్యార్హతల వివరాలన్నీ తప్పులు లేకుండా ఫిల్ చేయండి.

10th

10+2

Graduation

Post graduation

Bed/ Bped/ Blisc: ఇక్కడ మీరు బిఈడి వివరాలు మొదటగా నింపినట్లైతే B LISC, BPED ఉన్నట్లయితే ఆ వివరాలను చివరిలో యాడ్ క్వాలిఫికేషన్లో నింపండి

SET

TET 

Additional qualification.

      ఇంకా మీకు అదనపు విద్యార్హతలు ఉన్నట్లయితే చివరలో యాడ్ క్వాలిఫికేషన్ ఉంటుంది మీరు ఆడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఉన్న అన్ని విద్యార్హతలను ఆడ్ చేయవచ్చు.

ఉదా: M.ED, B LISC, M.LISC......

TGT లో టెట్ మార్కులకు వెయిటేజీ ఉన్నది కాబట్టి ఏ టెట్లో ఎక్కువగా మార్కులు వచ్చాయో ఆ వివరాలు నింపండి.

మీరు చదివిన యూనివర్సిటీ, లిస్టులో కనిపించినట్లయితే other యూనివర్సిటీ సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీ వివరాలు నింపండి.

అన్ని విద్యార్హతల వివరాలు నింపిన తర్వాత పార్సల్ సేవ్ క్లిక్ చేయండి అన్ని సేవ్ అవుతాయి.

ఒకవేళ సేవ్ కానట్లయితే మీరు మళ్లీ మొదటి నుంచి అన్ని వివరాలు నింపి సేవ్ చేయాలి.


3. చివరగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.

ఫోటోగ్రాఫ్ JPEG ఫార్మేట్ లో 50kb లోపు రీసైజ్ చేసుకోవాలి. ( 2.5cm × 2.5cm)

సిగ్నేచర్ 30kb లోపు రీసైజ్ చేసుకోవాలి.( 2.5cm × 1.5cm)

తర్వాత preview క్లిక్ చేయండి.

మీరు అప్లోడ్ చేసిన డేటా పూర్తిగా కనిపిస్తుంది. అన్ని వివరాలు మరోసారి చెక్ చేయండి. ఏదైనా తప్పును గమనించినట్లయితే ఎడిట్ చేసి సరి చేయండి.

అన్ని సరిగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ క్లిక్ చేయండి.

OTR సేవ్ అవుతుంది మీరు ఈ వివరాలను ప్రింట్ తీసుకోండి.

ప్రింట్ తీసుకున్న తర్వాత మరొకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా తప్పు ఉన్నట్లు భావిస్తే భయపడవలసిన అవసరం లేదు OTR ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసి సవరణలు చేయవచ్చు.

OTR నమోదు చేయడానికి ఇక్కడ CLICK చేయండి 

ఓ టి ఆర్ ఎడిట్ చేయడానికి ఈ క్రింది లింకులోకి వెళ్ళండి. ఇక్కడ CLICK  చేయండి.

OTR Successful గా సేవ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ మెసేజ్ లో వస్తుంది. ఆ ఐడి నెంబర్ భవిష్యత్తు అవసరాలకు భద్రపరచుకోండి.


తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.

 4. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి signup లోకి వెళ్ళండి.

ఇక్కడ మొదటి బాక్స్ లో మీ యొక్క ఓ టి ఆర్ ఐ డి ( యూజర్ ఐడీ) ఎంటర్ చేయండి.

తర్వాత బాక్స్ లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.

తరువాత

మీరు ముందుగానే తయారు చేసుకున్న పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. చివరి బాక్స్ లో అదే పాస్వర్డ్ ను కన్ఫామ్ చేయాలి.

పాస్వర్డ్ లో ఒక అప్పర్ కేస్, ( A - Z )

 ఒక లోయర్ కేస్, ( a - z)

ఒక స్పెషల్ క్యారెక్టర్, ( * # @ : ; = )

ఒక న్యూమరిక్ ( 0 - 9)

 ఉండే విధంగా సెట్ చేసుకోండి.

వివరాలు ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా సెట్ అవుతుంది


5. ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం

ఇక్కడ CLICK చేయండి

Link open చేయండి.


మీయొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ చేత లాగిన్ చేయండి.

1. Fee payment

2. Check payment status

3. Fill application form 

4. print application form ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి.


తరవాత స్క్రీన్ లో మీకు మొదటగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.

పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే నోటిఫికేషన్ వివరాలు కనిపిస్తాయి.

మీరు అప్లై చేయాలనుకున్న నోటిఫికేషన్ కుడివైపు fee payment. క్లిక్ చేయండి.

తరువాత

Declaration check box రైట్ మార్క్ ఇవ్వండి.

తర్వాత మీ వివరాలు ఓపెన్ అవుతాయి.

చివరలో "ఇన్సియేట్ పేమెంట్"

 క్లిక్ చేయండి.

మీయొక్క డెబిట్ కార్డ్ చేత పేమెంట్ చేయండి.

పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది ప్రింట్ తీసుకోండి.

కంటిన్యూ చేసినట్లయితే అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు.

లేదా మీరు తరువాత అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే 3వ, option 

 ఫిల్ అప్లికేషన్ సెలెక్ట్ చేయాలి

ఇలా సెలెక్ట్ చేయగానే మీ పెండింగ్ apllications కనిపిస్తాయి,  కావలసిన application సెలెక్ట్ చేయడం ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ వ్యక్తిగత వివరాలు, photo, singature OTR నుండి ఆటోమేటిక్ గా వస్తాయి.

Educational qualifications మాత్రం మళ్ళీ నమోదు చేయాలి. కాబట్టి ప్రతి application కు డేటా దగ్గర పెట్టుకోండి.

తరువాత ప్రిపరెన్సియల్ ఆర్డర్ ఇవ్వాలి ( DL,JL, PGT )

మీ జోన్ & మీ మల్టి జోన్ లో మొదట ప్రిఫరెన్స్ ఇవ్వండి.

నోట్:  మీ లోకల్ కానీ మల్టి జోన్ కు కూడా ప్రిపరెన్స్ ఇవ్వవచ్చు.

ఉదా: ఒక మహిళ సొంత మల్టి జోన్-1 అనుకుందాం. ఈ మహిళ పెళ్లి అయి మల్టి జోన్-2 స్థిర నివాసం ఉన్నారు. అయితే ఇలాంటి వారు మల్టి జోన్ - 2 మొదటి, లేదా రెండవ  ప్రిపరెన్స్ ఇవ్వవచ్చు. కానీ వారికి ఆ మల్టి జోన్ లో సెలెక్ట కావాలంటే టాప్ ర్యాంక్ రావాలి. ఎందుకంటే నాన్ లోకల్ కోట కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది.

మనం ప్రిపరేన్సియల్ ఆర్డర్ ఎలా ఇచ్చినా నియామక సమయం లో ఓపెన్ కౌన్సిలింగ్ కనుక ఉంటే మీరు మీకు ఇష్టమైన జోన్, లేదా మల్టి జోన్ లో నియామకం కొరకు అడగవ్వచు.

మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకు పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

లేదా

వెబ్ కౌన్సెలింగ్ కానీ, అధికారులు కానీ డైరెక్ట్ గా పోస్టింగ్స్ ఇస్తే మనం ఇచ్చిన ప్రిపరెన్సియల్ ఆర్డర్ ప్రకారం మనకు పోస్ట్ కేటాయిస్తారు. ఇలాంటప్పుడు సెలెక్షన్ లో మన ఇష్టానికి అవకాశం ఉండదు.

TGT కి మీ జోన్ & మల్టి జోన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసుకుంటుంది.

TGT లో

TS TET, AP TET ( 2.06.2014 ముందు క్వాలిఫై కావాలి) , C TET వివరాలు అడుగుతుంది.

మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన టెట్ వివరాలు ఇవ్వండి.

పరీక్ష సెంటర్స్ వరుగా మీకు అనుకూలంగా ఎంపిక చేయండి.


ఆ తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ తీసి భద్రపరచుకోండి.


👉 6. రిజర్వేషన్

మీ సొంత జోన్ లేదా మల్టి జోన్ లో 95 శాతం.

ఇతర జోన్ లో 5 శాతం వర్తిస్తుంది.

👉 ఇదేవిధంగా మీకు అర్హత ఉన్న అన్ని నోటిఫికేషన్ల కు అప్లై చేసుకోవచ్చు.

Note: OTR మరియు ON-LINE APPLICATION మీకు, సిస్టం అందుబాటులో ఉన్నట్లయితే సిస్టంలో చేయండి. లేనట్లయితే మొబైల్ లో కూడా చేయవచ్చు.

సిస్టంలో చేసేటప్పుడు పవర్ కట్ లేకుండా చూసుకోండి.

   All the best.....






Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS