ITR : FY 2022 -23, AY: 2023 -24
ITR : 2022 - 23
💠 ఇలా చేస్తే ఇన్కమ్ టాక్స్ తక్కువగా పడుతుంది.
ఉపాధ్యాయ మిత్రులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2022 - 23)ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకుందాం.
ముందుగా FY మరియు AY అంటే ఏమిటో తెలుసుకుందాం.
👉 FY : ఆదాయం పొందిన సంవత్సరాన్ని ఫైనాన్సియల్ ఇయర్ అంటారు ఈ ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించడం జరుగుతుంది.
👉 AY : ఉద్యోగి తీసుకున్న ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించే సంవత్సరాన్ని ఎసెస్మెంట్ ఇయర్ అంటారు.
ఉదాహరణకు: 2022 - 23 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2023 - 24 ఎసేస్మెంట్ ఇయర్ అవుతుంది.
(2020 - 21 ఫైనాన్సియల్ ఇయర్ నుండి ఆదాయపన్ను రెండు రకాలుగా లెక్కిస్తారు
1.ఓల్డ్ ఆదాయ పన్ను విధానం
2.న్యూ ఆదాయ పన్ను విధానం.
మీరు మీకు ఇష్టమైనటువంటి పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
👉 పాత ఆదాయ పన్ను విధానం లో మనకు గతంలో పొందినటువంటి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి పన్ను విధానం గతంలో మాదిరిగా ఉంటుంది.
👉 కొత్త ఆదాయ పన్ను విధానం లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయపన్ను తక్కువగా ఉంటుంది.
👉 Salary as for sce 17(1) లో మన grass salary చూపెడుతుంది.
నిబంధనల ప్రకారం మనం చూపించుకో గలిగిన మినహాయింపులు
"మినహాయించగలిగిన అలవెన్స్"
👉 ఆదాయ పన్ను చట్టం as for sec 10(13A) ప్రకారం ఇంటి అద్దె అలవెన్సు
1.వాస్తవ ఇంటి అద్దె
2.వేతనం(pay+DA )లో 10 శాతం
3. వేతనం (Pay+DA) లో 40 శాతం మూడింటిలో ఏది తక్కువ ఐతే అదే మినహాయింపు వస్తుంది.
నెలకు మూడు వేల రూపాయల అద్దె వరకు ఎలాంటి అద్దె రసీదు ఇవ్వవలసిన అవసరం లేదు.
ఇంటి అద్దె లక్ష రూపాయల లోపు (నెలకు @ ₹8330) ఉన్నట్లయితే అద్దె రసీదు జత చేస్తే సరిపోతుంది.
IT సర్కీలర్ No. 8/2013 dt: 10.101.2013 ప్రకారం అద్దె లక్ష రూపాయలు దాటి నట్లయితే ఇంటి అద్దె రసీదు,ఇంటి యజమాని పాన్ కార్డును జిరాక్స్ ప్రతి జతచేయాలి.
💠 "అర్హత కలిగిన మినహాయింపులు".💠
👉 Standerd Deduction u/s 16(ia) లో అందరికి ₹ 50000 వస్తుంది. పూర్తి మినహాయింపు వస్తుంది.
👉 professional tax U/S 16(iii) B లో చూపాలి. పూర్తి మినహాయింపు.
B2
Type of House property
👉 Self occupied (సొంత ఇల్లు) అయితే
u/s 24 house లోన్ పై ఇంటరెస్ట్ 2 లక్షలు, sec 80EEA ప్రకారం మరో 1.5 లక్షలు exemption అవుతుంది.( 2 to 3.5 lakhs).
💠 "హోమ్ లోన్ పై ఇంట్రెస్ట్ ఉన్నా మినహాయింపు పొందే విధానం."💠
1. హోమ్ లోన్ పై ఇంట్రెస్ట్ 3.5 లక్షలు ఉంటే sec 24 ప్రకారం ₹ 2 లక్షలు, sec 80EEA లో
₹ 1.5 లక్షలు మినహింపు పొందవచ్చు.
(home loan april-2019 to mar-2022 మధ్య loan ₹ 45 లక్షల లోపు తీసుకొని ఉండాలి)
2. అదే లోన్ ఇంటరెస్ట్ 2.5 లక్షలు ఉంటే sec 24 లో 2 లక్షలు, sec 80EE లో మరో 50,000 లు మినహాయింపు పొందవచ్చు.
(home loan FY 2016-17 లో తీసుకొని ₹ 35 లక్షల లోపు ఉండాలి)
Sec 80EE, మరియు sec 80EEA లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించుకోవాలి.
👉 Self occupied వారు intrest on barrowed capital లో house లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపు పొందవచ్చు.
👉 సొంత ఇల్లు ఉండి దానిని కిరాయికి ఇచ్చి,మరొక ఇంట్లో ఓనర్ కిరాయికి ఉంటే Letout అంటారు. Letout అయితే HRA మరియు house లోన్ ఇంట్రెస్ట్ రెండు మినహాయింపు పొందవచ్చు. కానీ తమ ఇంటిపై వచ్చే కిరాయిని అదాయంగా చూపాలి.
👉 తమ సొంత ఇంట్లో తల్లిదండ్రులు ఉంటూ, ఉద్యోగి వేరే ఇంట్లో. కిరాయి ఉండి, ఇంటిపై బ్యాంకు లోను ఉన్నట్లయితే హౌస్ లోన్ ఇంట్రెస్ట్ మరియు హోమ్ రెంట్ రెండు మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగి తమ సొంత ఇంట్లో తల్లిదండ్రులు నివాసం ఉంటున్నట్లు డిక్లరేషన్ జత చేయాలి.
👉 Two houses ఉంటే Deemed letout సెలెక్ట్ చేయాలి. deemed let out సెలెక్ట్ చేస్తే కిరాయిని ఆదాయంగా చూపాలి. Gross rent received లో కిరాయిని ఆదాయంగా చూపాలి.
B3
👉 SEC 80C లో
💠 lic, tsgli, gpf, ,gis,
💠 ఇద్దరు పిల్లల children టుషన్ ఫీజ్,
💠 సుకన్య సమృద్ది,
💠 ఇంటి కోసం చెల్లించే లోన్ అసలు,
💠 5 సవతరాల FD,
💠 నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్,
💠 పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
💠 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,
లు అన్ని కలిపి ₹150000 ల వరకు మినహాయింపు.దీనిలో cps వారు ₹ 5000 మినహాయింపు చుపెట్టవచ్చు.మీరు సేవింగ్ ఎంత చూపెట్టిన మీకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం ₹ 150,000 వేల రూపాయలు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.
👉 CPS వారు 80ccd (1బి)లో అదనంగా ₹50000 మినహాయింపు.
👉 U/S 80D లో హెల్త్ ఇన్సూరెన్స్(self, spouse & children) కోసం ₹ 25000,
senior citizens parents medical insurance కోసం ₹ 50000,
EHS పథకానికి చెల్లి స్తున్న వాయిదాలు పూర్తిగా మినహాయింపు పొందవచ్చు.
మాస్టర్ హెల్త్ చెకప్ ఖర్చు ₹ 5000 మినహాయింపు పొందవచ్చు. ఈ సెక్షన్లు మొత్తం మినహాయింపులు లక్ష వరకు చూపెట్ట వచ్చు.
👉 SEC 80DD
యజమానిపై ఆధార పడ్డ వారు ఎవరైనా 40 నుండి 80 శాతం వికలాంగత్వం కలిగి ఉంటే వారి వైద్యానికి ఖర్చులు₹ 75 వేల వరకు,
వికలాంగత్వం 80 శాతానికి పైబడి ఉంటే ₹ 1.25 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.
👉 SEC 80DDB
ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే 40 వేల వరకు, సీనియర్ సిటిజన్ అయినట్లయితే లక్ష రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు.
ఫారం 10- I లో ఖర్చుల వివరాలు సంబంధిత డాక్టర్ చే సమర్పించాలి
👉 SEC 80EE
హోమ్ లోన్ పై వడ్డీ రాయితీని ఈ సెక్షన్ ప్రకారం 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.
👉 Sec 80 CCD
cps ఉద్యోగులు 80CCD 1 ప్రకారం 1.5 లక్షలు, 80CCD 2 ప్రకారం 50,000 వరకు అదనపు మినహింపు ఉంటుంది.
👉 80EEB ఫైనాన్స్ ద్వారా 1.04.2019 - 31.03.2023 మధ్య ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్న వారికి వారి చెల్లించిన లోన్ పై వడ్డీ 1,50,000 వరకు మినాహింపు పొందవచ్చు.
👉 SEC 80-G:
💠 100 శాతం మినహాయింపు వచ్చేవి💠
జాతీయ రక్షణ నిధి
ప్రధానమంత్రి సహాయ నిధి
జాతీయ రాష్ట్ర రక్తనిధి సంస్థలకు
నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ
జాతీయ బాలల నిధి
జాతీయ రాష్ట్ర అ స్పోర్ట్స్ అథారిటీ సంస్థలకు
ముఖ్యమంత్రి సహాయనిధి
విద్యా నిధి కి ఇచ్చిన మొత్తం పూర్తి గా మినహాయింపు పొందవచ్చు.
💠50 శాతం మినహింపు వచ్చేవి💠
1.Jawaharlal Nehru Memorial Fund.
2.Prime Minister’s Drought Relief Fund.
3.Indira Gandhi Memorial Trust.
4.Rajiv Gandhi Foundation.
👉 Sec 80 E
ఉద్యోగి తాను,తమ కుటుంబ సభ్యుల కోసం తీసుకొన్న ఎడ్యుకేషన్ లోన్ పై పూర్తి వడ్డీని మినహాయింపు పొందవచ్చు.
👉 SEC 80U
ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగి వికలాంగత్వం కలిగి ఉంటే ₹ 75 వేల వరకు, వికలాంగత్వం 80 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 1.25 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.
👉 80 TTA
పన్ను చెల్లింపుదారులు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పై వచ్చే వడ్డీ లో పదివేల వరకు మినహాయింపు పొందవచ్చు.
👉 SEC 80TTB
పన్ను చెల్లింపుదారులు 60 సంవత్సరములు దాటిన సీనియర్ సిటిజన్ అయినట్లయితే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లపై వడ్డీని 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.
👉 80GG
చాప్టర్ VI-A income tax act 1961, sec 80GG ప్రకారం ఇంటి అద్దె రానీ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు ఇంటి అద్దె నెలకు ₹5000 రూపాయల చొప్పున మినహాయింపు పొందవచ్చు.
పైన చెప్పిన ఆదాయపన్ను సెక్షన్ ల ప్రకారం మీకు అర్హత ఉన్నచోట ఆదాయపన్ను మినహాయింపులు పొంది మీ రిటర్న్ దాఖలు చేయవచ్చు.
Tax Slab(₹) Old. New New Tax
upto 2,50,000 0% 0%
2,50,001 – 5,00,000 5% 5%
5,00,001 – 7,50,000 20% 10%
7,50,001 - 10,00,000 20% 15%
10,00,001 -12,50,000 30% 20%
12,50,001 -15,00,000 30% 25%
15,00,000 & above 30% 30%
Rebate of 100% of tax payable will be provided under Section 87A, subject to a maximum of Rs12,500 per assessee. That makes any taxable income up to Rs5 lakh entirely tax free.
...
All the best......
Comments
Post a Comment