ఇదివరకే Code క్రియేట్ చేయబడిన vendor ను మన SMC pfms అకౌంట్ కు Mapping చేయడం
కొన్ని సందర్భాలలో మనం VENDOR ను ADD చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వెండర్ alreday exist అని చూపించడం జరుగుతుంది.
వేరే ప్రధానోపాధ్యాయులు లేదా మరొకరు, మనం add చేయాలనుకున్న vendor ను, ఇదివరకే కోడ్ క్రియేట్ చేసి ఉన్నట్లయితే మనం add చేయాలనుకున్నప్పుడు alredy exist అని వస్తుంది. అక్కడ ఒక యూనిక్ కోడ్ కనిపిస్తుంది ఆ కోడ్ నోట్ చేసుకోండి.
ఇలాంటి సందర్భాలలో మనం ఆ VENDOR ను మన అకౌంట్ కు Mapping చేసుకోవాల్సి ఉంటుంది.
Vendor ను mapping చేయడానికి
ఆపరేటర్ లాగిన్ చేయండి.
Maaters ➡️ Vendors ➡️ Manage
click చేయాలి.
Next screen open అవుతుంది. ఇక్కడ options కనిపిస్తాయి.
1st option Search criteria క్లిక్ చేయండి.
డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
3rd option vendors not map with me క్లిక్ చేయండి.
మళ్లీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు నోట్ చేసుకున్న
unique code or ఆ VENDOR bank account number
enter చేసి SEARCH click చేయాలి.
Next,
ఆ ఎకౌంటుతో క్రియేట్ అయిన Vendor వివరాలు Display అవుతాయి. ఈ వివరాలు మన pfms అకౌంట్ కి మ్యాప్ చేయడానికి Left side లో ఉన్న
check box select చేయాలి.
అక్కడే ఉన్న Map Vendors క్లిక్ చేయాలి.
వెంటనే ఈ Vendor వివరాలన్నీ మన SMC pfms account కి MAP అవుతాయి.
MAP అయింది, లేనిది చెక్ చేయడానికి
Maaters ➡️ Vendors ➡️ Manage క్లిక్ చేయాలి.
Next screen లో SEARCH CRITERIA click చేయాలి.
Next 2వ option
vendors map but registered by others క్లిక్ చేయాలి.
మనం మ్యాప్ చేసిన VENDOR name కనిపిస్తుంది.
Vendor ను ఇలా mapping చేయండి.
Comments
Post a Comment