English language enrichment course లో upload చేసే tasks ఎలా ప్రిపేర్ చేయాలి ?
English language enrichment course
అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్స్ యొక్క tasks ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా tasks పర్ఫెక్ట్ గా తయారు చేసి upload చేయడానికి అవకాశం ఉంటుందో తెలుసుకొండి.
Webinar లో ఉత్సాహవంతంగా పాల్గొనండి.
mentor అడిగే ప్రతి ప్రశ్నకు విశ్లేషణాత్మకంగా ఆన్సర్ చేయండి.
Webinar కు హాజరై నిశ్శబ్దంగా ఉండకండి.
Webinar లో ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి.
👉 1.టాస్క్ లో ఎలాంటి విషయాన్ని అప్లోడ్ చేయాలో నిర్ణయించుకోండి.టాస్క్ ను విశ్లేషణాత్మకంగా upload చేయండి.
టాస్క్ ప్రిపేర్ చేయడం కంటే ముందు మీరు టాస్క్ లోని ప్రశ్నను 2, 3 సార్లు చదివి అర్థం చేసుకోండి. టాస్క్ లో అడిగిన విషయం ఏమిటి? మీరు అప్లోడ్ చేయవలసినది కామెంట్ లేదా ఆడియో ఫైలు అనేది డిసైడ్ చేయండి.
కామెంట్ చేయవలసి చోట టెక్స్ట్ మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి.
ఆడియో ఫైల్ అప్లోడ్ చేయమని అడిగిన చోట తప్పనిసరిగా మీ సొంత వాయిస్ తో ఆడియో ఫైల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ఆడియో ఫైల్స్ అప్లోడ్ చేసినట్లయితే అలాంటి fake ఫైల్స్ ను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
డిస్కషన్ ఫారం లో కామెంట్ చేయమని అడిగినప్పుడు,
ఇచ్చిన వీడియోను లేదా అక్కడ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత కామెంట్ చేయాలి. కామెంట్ అనేది విశ్లేషణాత్మకంగా చేయాలి. కేవలం ఒక సింగిల్ లైన్ లో కామెంట్ చేయడం కాకుండా పూర్తి విశ్లేషణ తో మీ కామెంట్ అప్లోడ్ చేయండి అప్పుడే మీ టాస్క్ 100% successfull గా చేసినట్లు అవుతుంది.
2. ఏం విషయాన్ని అప్లోడ్ చేయాలో ముందుగా నిర్ణయించుకోండి.
టాస్క్ లోని ప్రశ్నలు చదివిన తర్వాత ఆ ప్రశ్నకు సరైన జవాబు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఎలాంటి విషయాన్ని అప్లోడ్ చేసినా సిస్టం తీసుకోవడం జరుగుతుంది.
కాబట్టి ప్రశ్నలు జాగ్రత్తగా చదివి ప్రశ్నకు సరైన జవాబు మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఏదో ఒక అంశాన్ని అప్లోడ్ చేసి పూర్తయిందని భావించవద్దు.
3.సరియైన పద్ధతిలో టాస్క్ అప్లోడ్ చేయండి.
టాస్క్ అప్లోడ్ చేసేటప్పుడు ఆడియో ఫైల్ అని ఉన్న చోట ఆడియో ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయండి.
కామెంట్ చేయ వలసిన చోట కామెంట్ మాత్రమే అప్లోడ్ చేయండి.
4.మీరు సొంతగా ప్రిపేర్ చేసిన విషయాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి.
ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది మిత్రులు ఇతరుల ప్రిపేర్ చేసినటువంటి విషయాన్ని కాపీ చేసుకొని అప్లోడ్ చేస్తున్నారు.
అలా కాకుండా మీరు సొంతగా విశ్లేషణ చేసి టెక్స్ట్ కామెంట్ కానీ, మీ సొంతమాటల్లో రికార్డ్ చేసినటువంటి ఆడియో ఫైల్ కానీ అప్లోడ్ చేయాలి.
5.టాస్క్ ను డ్యూ డేట్ కంటే ముందే అప్లోడ్ చేయండి.
మీరు టాస్క్ ప్రిపేర్ చేసిన తర్వాత, అప్లోడ్ చేయడం చాలా ముఖ్యమైనది. డ్యూ డేట్ కంటే ముందుగానే మీరు టాస్క్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో కనీసం end date కంటే ముందుగా అయినా మీ టాస్క్ అప్లోడ్ చేయాలి.
End date తర్వాత డిస్కస్ బటన్ అనేది మీకు కనిపించకుండా పోతుంది.
అప్పుడు మీరు టాస్క్ ఆప్లోడ్ చేయడానికి సాధ్యం కాదు.
అన్ని tasks సకాలంలో పూర్తి చేసి అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీరు elec కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు భావించబడుతుంది.
Task upload chese విధానం తెలుసుకోవడానికి ఇక్కడ
CLICK చేయండి
Comments
Post a Comment