How file Income tax return 2021-22

   Income tax return 2021-22




💠 ఇలా చేస్తే ఇన్కమ్ టాక్స్ తక్కువగా పడుతుంది.

 ఉపాధ్యాయ మిత్రులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2021 - 22)ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకుందాం.

ముందుగా FY మరియు AY అంటే ఏమిటో తెలుసుకుందాం.

 👉 FY : ఆదాయం పొందిన సంవత్సరాన్ని ఫైనాన్సియల్ ఇయర్ అంటారు ఈ ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించడం జరుగుతుంది.

 👉 AY : ఉద్యోగి తీసుకున్న ఆదాయానికి ఆదాయపన్ను లెక్కించే సంవత్సరాన్ని ఎసెస్మెంట్ ఇయర్ అంటారు.

ఉదాహరణకు: 2021 - 22 ఫైనాన్షియల్ ఇయర్ అయితే 2022 - 23 ఎసేస్మెంట్ ఇయర్ అవుతుంది.

 ఆదాయపన్ను రెండు రకాలుగా లెక్కిస్తారు 

1.ఓల్డ్ ఆదాయ పన్ను విధానం 

2.న్యూ ఆదాయ పన్ను విధానం.

 మీరు మీకు ఇష్టమైనటువంటి పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

👉 పాత ఆదాయ పన్ను విధానం లో మనకు గతంలో పొందినటువంటి అన్ని రకాల మినహాయింపులు ఉంటాయి పన్ను విధానం గతంలో మాదిరిగా ఉంటుంది.

👉 కొత్త ఆదాయ పన్ను విధానం లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయపన్ను తక్కువగా ఉంటుంది.

👉 Salary as for sce 17(1) లో మన grass salary చూపెడుతుంది.


నిబంధనల ప్రకారం మనం చూపించుకో గలిగిన మినహాయింపులు

   "మినహాయించగలిగిన అలవెన్స్"

👉 ఆదాయ పన్ను చట్టం as for sec 10(13A) ప్రకారం ఇంటి అద్దె అలవెన్సు

            1.వాస్తవ ఇంటి అద్దె

            2.వేతనం(pay+DA )లో 10 శాతం 

           3. వేతనం (Pay+DA) లో 40 శాతం మూడింటిలో ఏది తక్కువ ఐతే అదే మినహాయింపు వస్తుంది.

నెలకు మూడు వేల రూపాయల అద్దె వరకు ఎలాంటి అద్దె రసీదు ఇవ్వవలసిన అవసరం లేదు.

ఇంటి అద్దె లక్ష రూపాయల లోపు (నెలకు @ ₹8330) ఉన్నట్లయితే అద్దె రసీదు జత చేస్తే సరిపోతుంది.

 అద్దె లక్ష రూపాయలు దాటి నట్లయితే ఇంటి అద్దె రసీదు,ఇంటి యజమాని పాన్ కార్డును జిరాక్స్ ప్రతి జతచేయాలి.

      💠 "అర్హత కలిగిన మినహాయింపులు".💠

👉 Standerd Deduction u/s 16(ia) లో అందరికి ₹ 50000 వస్తుంది. పూర్తి మినహాయింపు వస్తుంది.


👉 professional tax U/S 16(iii) B లో చూపాలి. పూర్తి మినహాయింపు.


B2 

Type of House property

👉 Self occupied (సొంత ఇల్లు) అయితే 

u/s 24 house లోన్ పై ఇంటరెస్ట్ 2 లక్షలు, sec 80EEA ప్రకారం మరో 1.5 లక్షలు exemption అవుతుంది.( 2 to 3.5 lakhs). 

     💠 "హోమ్ లోన్ పై ఇంట్రెస్ట్ ఉన్నా మినహాయింపు పొందే విధానం."💠

1. హోమ్ లోన్ పై ఇంట్రెస్ట్ 3.5 లక్షలు ఉంటే sec 24 ప్రకారం ₹ 2 లక్షలు, sec 80EEA లో 

₹ 1.5 లక్షలు మినహింపు పొందవచ్చు.

(home loan april-2019 to mar-2021మధ్య loan ₹ 45 లక్షల లోపు తీసుకొని ఉండాలి)

2. అదే లోన్ ఇంటరెస్ట్ 2.5 లక్షలు ఉంటే sec 24 లో 2 లక్షలు, sec 80EE లో మరో 50,000 లు మినహాయింపు పొందవచ్చు.

(home loan FY 2016-17 లో తీసుకొని ₹ 35 లక్షల లోపు ఉండాలి)                     

(👉 2013-14 వరకు House loan తీసుకున్న వారికి 1,50,000                         

👉 2014-15 తరువాత House loan తీసుకున్న వారికి 2,00,000               

👉 2016-17 లో 35 L లోపు House loan తీసుకున్న వారికి 2,50,000                    

👉2019-20 లో 45 L లోపు House loan తీసుకున్న వారికి 3,50,000)

Sec 80EE, మరియు sec 80EEA లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించుకోవాలి.

👉 Self occupied వారు intrest on barrowed capital లో house లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపు పొందవచ్చు.

👉 సొంత ఇల్లు ఉండి దానిని కిరాయికి ఇచ్చి,మరొక ఇంట్లో ఓనర్ కిరాయికి ఉంటే Letout అంటారు. Letout అయితే HRA మరియు house లోన్ ఇంట్రెస్ట్ రెండు మినహాయింపు పొందవచ్చు. కానీ తమ ఇంటిపై వచ్చే కిరాయిని అదాయంగా చూపాలి.

👉 Two houses ఉంటే Deemed letout సెలెక్ట్ చేయాలి. deemed let out సెలెక్ట్ చేస్తే కిరాయిని ఆదాయంగా చూపాలి. Gross rent received లో కిరాయిని ఆదాయంగా చూపాలి.

B3

👉 SEC 80C లో 

💠 lic, tsgli, gpf, ,gis, 

💠 ఇద్దరు పిల్లల children టుషన్ ఫీజ్, 

💠 సుకన్య సమృద్ది, 

💠 ఇంటి కోసం చెల్లించే లోన్ అసలు, 

💠 5 సవతరాల FD,

💠 నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్,

💠 పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

💠 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,

లు అన్ని కలిపి ₹150000 ల వరకు మినహాయింపు.దీనిలో cps వారు ₹ 50000 మినహాయింపు చుపెట్టవచ్చు.మీరు సేవింగ్ ఎంత చూపెట్టిన మీకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం ₹ 150,000 వేల రూపాయలు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.


👉 CPS వారు 80ccd (1బి)లో అదనంగా ₹50000 మినహాయింపు.


👉 U/S 80D లో హెల్త్ ఇన్సూరెన్స్(self, spouse & children) కోసం ₹ 25000,

senior citizens parents medical insurance కోసం ₹ 50000, 

EHS పథకానికి చెల్లి స్తున్న వాయిదాలు పూర్తిగా మినహాయింపు పొందవచ్చు.

 మాస్టర్ హెల్త్ చెకప్ ఖర్చు ₹ 5000 మినహాయింపు పొందవచ్చు. ఈ సెక్షన్లు మొత్తం మినహాయింపులు లక్ష వరకు చూపెట్ట వచ్చు.

👉 SEC 80DD 

యజమానిపై ఆధార పడ్డ వారు ఎవరైనా 40 నుండి 80 శాతం వికలాంగత్వం కలిగి ఉంటే వారి వైద్యానికి ఖర్చులు₹ 75 వేల వరకు,

వికలాంగత్వం 80 శాతానికి పైబడి ఉంటే ₹ 1.25 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.


👉 SEC 80DDB

ఉద్యోగిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు క్యాన్సర్ ఎయిడ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే 40 వేల వరకు, సీనియర్ సిటిజన్ అయినట్లయితే లక్ష రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు.

👉 SEC 80EE

హోమ్ లోన్ పై వడ్డీ రాయితీని ఈ సెక్షన్ ప్రకారం 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.


👉 SEC 80-G: 

💠 100 శాతం మినహాయింపు వచ్చేవి💠

జాతీయ రక్షణ నిధి

ప్రధానమంత్రి సహాయ నిధి

జాతీయ రాష్ట్ర రక్తనిధి సంస్థలకు

నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ

జాతీయ బాలల నిధి

జాతీయ రాష్ట్ర అ స్పోర్ట్స్ అథారిటీ సంస్థలకు 

ముఖ్యమంత్రి సహాయనిధి

విద్యా నిధి కి ఇచ్చిన మొత్తం పూర్తి గా మినహాయింపు పొందవచ్చు.

💠50 శాతం మినహింపు వచ్చేవి💠

1.Jawaharlal Nehru Memorial Fund.

2.Prime Minister’s Drought Relief Fund.

3.Indira Gandhi Memorial Trust.

4.Rajiv Gandhi Foundation.

👉 Sec 80 E 

ఉద్యోగి తాను,తమ కుటుంబ సభ్యుల కోసం తీసుకొన్న ఎడ్యుకేషన్ లోన్ పై పూర్తి వడ్డీని మినహాయింపు పొందవచ్చు.

👉 SEC 80U

ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగి వికలాంగత్వం కలిగి ఉంటే ₹ 75 వేల వరకు, వికలాంగత్వం 80 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 1.25 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.

👉 80 TTA

పన్ను చెల్లింపుదారులు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పై వచ్చే వడ్డీ లో పదివేల వరకు మినహాయింపు పొందవచ్చు.

👉 SEC 80TTB

పన్ను చెల్లింపుదారులు 60 సంవత్సరములు దాటిన సీనియర్ సిటిజన్ అయినట్లయితే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లపై వడ్డీని 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.

👉 80GG

చాప్టర్ VI-A income tax act 1961, sec 80GG ప్రకారం ఇంటి అద్దె రానీ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు ఇంటి అద్దె నెలకు ₹5000 రూపాయల చొప్పున మినహాయింపు పొందవచ్చు.

పైన చెప్పిన ఆదాయపన్ను సెక్షన్ ల ప్రకారం మీకు అర్హత ఉన్నచోట ఆదాయపన్ను మినహాయింపులు పొంది మీ రిటర్న్ దాఖలు చేయవచ్చు.


Tax Slab(₹)                Old.      New Tax  


upto 2,50,000                0%     0%          

2,50,001 – 5,00,000      5%     5%

5,00,001 – 7,50,000      20% 10%

7,50,001 - 10,00,000      20% 15% 

10,00,001 -12,50,000     30% 20%  

12,50,001 -15,00,000      30% 25%  

15,00,000 & above           30% 30%

Rebate of 100% of tax payable will be provided under Section 87A, subject to a maximum of Rs12,500 per assessee. That makes any taxable income up to Rs5 lakh entirely tax free.

Click here to file income tax CLICK HERE


All the best......


Comments

Post a Comment

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి