How to upload School photos in PRABANDH portal

 ప్రబంధ పోర్టల్ లో ఫోటోలు అప్లోడ్ చేయడానికి సూచనలు. In school activities

అప్లోడ్ చేయవలసిన ఫోటోలు

1. లైబ్రరీ ఫోటో: పిల్లలు లైబ్రరీ పుస్తకాలు చదువుతున్న ఫోటో కానీ,

 లైబ్రరీ బుక్స్ నిల్వ చేసిన రాక్ ఫోటో కానీ అప్లోడ్ చేయవచ్చు.

2. హై స్కూల్ వారు స్మార్ట్ క్లాస్ రూమ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ప్రైమరీ స్కూల్ వారికి ఈ ఫోటో ఉండదు.

3. ఆట వస్తువుల ఫోటోలు. పిల్లలు ఏదైనా ఆట ఆడుతున్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు క్యారం ఆడటం, చెస్,

  వాలీబాల్, స్కిప్పింగ్ లాంటివి.

4. బాలికల టాయిలెట్ లోపలి భాగం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.

 

5. బాలర టాయిలెట్ ఫోటో.

(ఈ ఫోటోలో పిల్లలు అవసరం లేదు)

6 . మీ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఫోటో.

7. మీ పాఠశాలలో పిల్లలకు ఏర్పాటు చేసిన తాగునీటి వసతి ఫోటో. పిల్లలు మంచి నీళ్లు తాగుతున్న ఫోటో.

8. TLM ఫోటో. ఉపాధ్యాయులు తరగతి బోధనలో T.L.M. ఉపయోగించిన టువంటి ఫోటో.

9. టీచర్స్ రిసోర్స్ మెటీరియల్. ఉపాధ్యాయులకు బోధనకు సహాయపడే రిసోర్స్ మెటీరియల్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ ఉన్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఇన్నోవేటివ్ మెటీరియల్, సబ్జెక్టు టీచింగ్ ఉపయోగపడే అదనపు మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లో ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. గణితం మరియు సైన్స్ ఉపయోగించిన పోటోస్ అప్లోడ్ చేయవచ్చు. వివిధ మోడల్స్ , working modals ఉపయోగించిన ఫోటోలు అప్లోడ్ చేయవచ్చు.

10. పాఠశాల లో CWSN పిల్లలు ఉన్నట్లయితే వారికి ఉపయోగపడే ఉపకరణాలు పంపిణీ చేసినటువంటి ఫోటోలను అప్లోడ్ చేయాలి.


11. సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ కి సంబంధించిన ఫోటోలు. ఇది ఉన్నత పాఠశాల, అప్పర్ ప్రైమరీ స్కూల్ వారికి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల వాళ్లు కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి నట్లయితే ఆ ఫోటోలు అప్లోడ్ చేయవచ్చు. ట్రైనర్ పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ నేర్పిస్తున్న ఫోటోను అప్లోడ్ చేయాలి.

ఫొటోస్ రెండు రకాలుగా అప్లోడ్ చేయవచ్చు

1. అన్ని ఫోటోలు మొదటగా ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకోవాలి ఫోటోలన్నీ 500kb లోపు రీసెట్ చేసుకోవాలి.

Prabandh portal లాగిన్ చేసి, ఫోటో అప్లోడ్ సెలెక్ట్ చేయాలి. Choose file select చేసి గ్యాలరీ లోని ఫోటోలను అప్లోడ్ చేసి సేవ్ చేయాలి. 

2. Choose file click చేసి image capture చేసి డైరెక్ట్ గా అప్లోడ్ చేయవచ్చు 

మీ పాఠశాల ఫోటోలు ప్రబంధ పోర్టల్ లో అప్ లోడ్ చేయడానికి ఇక్కడ CLICK చేయండి

                               


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి