సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు.. if the service pensioner dies

 

      సర్వీసు పెన్షనర్ మరణించిన సందర్భంలో ... ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు..


సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత మాత్రమే సర్వీస్ పెన్షనర్ వారసులకు ఫ్యామిలీ  పెన్షన్  సంబంధిత ఆఫీసర్ చే మంజూరు చేయబడుతుంది. 


సర్వీస్ పెన్షనర్ కు  రిటైర్మెంట్ సమయంలో ఏ జి ఆఫీస్ వారు  మంజూరు చేసిన 

పి పి ఓ  ఆర్డర్లో తెలియపరిచిన  స్పవుజ్  / అర్హత గల బెన్ఫిషరీ కి ఫ్యామిలీ పెక్షన్ మంజూరు చేస్తారు.


దీనికిగాను  సర్వీస్ పెన్షనర్  మరణించిన తర్వాత PPO లో పొందు పరచిన పేరు కల  గల  వారసులు  ప్యామిలి పెంక్షన్ మంజూరు కోరుతూ , సర్వీసు పెన్షనర్ మరణ వివరాలను తెలుపుతూ, ప్యునరల్ చార్జీలు చెల్లింపు కోరుతూ  వ్రాయబడిన దరఖాస్తు తో పాటు  ఈ క్రింది వివరాలను  పెన్షన్ డ్రా చేయుచున్న సంబంధిత ATO/STO  గారికి అందజేయాలి.


దరఖాస్తు తో పాటు జతపరచవలసినవి....

1. Service Pensioner PPO book.

2. పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రము.(ఒరిజనల్ )

2. ప్యామిలి పెన్షనర్ పేరున ఓపన్ చేసిన SB ఎకౌంట్  బ్యాంకు పాసుబుక్ ఫస్ట్ పేజి జిరాక్స్ కాపీ.(SB A/c No, Name, IFSC code etc వివరాలతో)

3.  పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ (not mandatory)

4.ఆదార్ జిరాక్స్


డెత్ డేట్ మరుసటి రోజునుండి ప్యామలీ పెన్షనర్ కు ప్యామిలి పెన్షన్ మంజూరు చేయబడు తుంది. 

సర్వీసు పెన్షనర్ కు డెత్ జరిగిన రోజువరకు చెల్లింప వలసిన పెన్షన్ వారి ఖాతాకు జమ చేయ బడుతుంది.

(ఇంకా డిఆర్.prc, ఎరియర్)

సర్వీసు పెన్షనర్ మరణ వివరాలను STO కార్యాలయంలో వెంటనే తెలియ చేయాలి.

పిపిఓ లో AG ఆఫీసు వారు పొందు పరచిన నామినీకి  డెత్ రిలీఫ్ , ఏవేని అరియర్లు ఉంటే అవి చెల్లించబడతాయి.


కొంతమంది తెలిసో/ తెలియకో సర్వీసు పెన్షనర్ మరణించిన మరణ వార్తను సంబందిత STO లకు తెలియచేయక పోవడం వల్ల వారి పెన్షన్ నిలుపుదల కాక చనిపోయిన పెన్షనర్ ఖాతాకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువు వరకు జమ అవుతున్నాయి. 

చని పోయిన పెన్షనర్  మరణ విషయం తెలియ చేయక పోవడం ,బ్యాంకు ఖాతా నుండి ఏటియం /ఇతర విధంగా డబ్చు డ్రా చేయడం వల్ల కొంతమంది అనేక కేసులలో ఇరుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. 

కావునా ఇటువంటి విషయంలో వారసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

డెత్ విషయం వెంటనే STO ఆఫీసుకు తెలియచేసి పెన్షన్ నిలుపుదల చేయమని వ్రాత పూర్వకంగా తెలపాలి.


సర్వీసు పెన్షనర్ మరియు పిపిఓ లో పొందు పరచిన ప్యామిలి పెన్షనర్ ఇరువురు చనిపోతే  వారసులు స్ధానిక తహశిల్దార్ నుండి లీగల్ హెయిర్ / ప్యామిలి మెంబర్స్ సర్టిఫికెట్ , నో అబ్జెక్షన్ సర్టిఫికెట్  తో యస్ టి వో గారికి మరణ దృవీకరణ పత్రం జతచేసి ప్యూనరల్ చార్జీలు కొరకు దరఖాస్తు చేయవలసిఉంటుంది.

సర్వీసు పెన్షనర్ , PPO లో ఉన్న ప్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించి వారికి ఫేమలీ పెన్షన్ పొందుటకు అర్హతలు గల  వారసులుంటే - పెన్షన్ ప్రపోజల్స్ లో కుటుంబ సబ్యుల డిస్క్రిప్టివ్ రోల్సులో వారి పేరు నమోదయి ఉంటే వారు డిస్క్రిప్టివ్ రోల్సు ఇవ్వనక్కరలేదు. 

రిటైర్ అయిన తరువాత సంతానం కలిగినా , రిటైర్ అయిన తరువాత సంతానంలో ఎవరికైనా వికలాంగత కలిగిన, విడో డాటర్స్ ఉన్నా అట్టివారు డిస్క్రిప్టివ్ రోల్సు తో వారికి ప్యామిలి పెన్షన్ మంజూరు చేయమని కోరుతూ పెన్షన్ ప్రపోజల్స్ ను- సర్వీసు పెన్షనర్ పదవీ విరమణ పొందిన కార్యాలయాధి పతి ద్వారా యస్ ఆర్ తో సహా AG ఆఫీసుకు/స్టేట్ ఆడిట్ ఆఫీసుకు పంపవలసి ఉంటుంది.

  అర్హత కల వికలాంగ పిల్లలు ఉంటే పెన్షసర్ చనిపోక ముందే AG OFFICE .కు.ఫామిలీ పెన్షన్ ప్రపోజల్ పంపవచ్చు

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION