నిష్ట కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు


నిష్ట కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు

👉 నిష్ఠ 2.0 మరియు నిష్ఠ 3.0 ఆన్లైన్ కోర్సెస్ మన వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా ఉపయోగకరం.



👉 నిష్ట 2.0 ఉన్నత, ప్రాథమికోన్నత స్థాయి ( LP, SA, గెజిటెడ్ HM ). నిష్ఠ 3.0 ప్రాథమిక స్థాయి ( SGT, LFL HM ).

👉 కాబట్టి అందరూ ఉపాధ్యాయులు నిష్ఠ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

👉 కొత్త వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పడికె రిజిస్టర్ అయిన ఉపాధ్యాయులు మీ user ID, password ద్వారా లాగిన్ చేయాలి.

👉 కోర్సు పూర్తి చేయడానికి మొదటగా మీరు కోర్సు యొక్క లింకు ద్వారా వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి కోర్సులో జాయిన్ కావాలి. జాయిన్ బటన్ క్లిక్ చేసి మీ వివరాలు షేర్ చేయాలి. తరువాత కంటిన్యూ లెర్నింగ్ క్లిక్ చేయాలి.


👉 తర్వాత మీకు కంటెంట్ ఓపెన్ అవుతుంది ఒక్కో మాడ్యుల్  క్షుణ్ణంగా 100% చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు నిదానంగా చదవాలి. మీరు చదవకుండా పేజీలను ఫాస్ట్ గా స్క్రోల్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత సేపు చదివామో ఆ టైమ్ రికార్డు అవుతుంది. చదివేటప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇలా చేస్తే క్విజ్ లో 100 శాతం విజయం సాధించగలుగుతారు.


👉 మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయడం మరియు ఫార్వర్డ్ చేయడం చేయకూడదు.

👉 కోర్స్ లో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత మాత్రమే మదింపు చేయాలి.

👉 మాడ్యూల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చదివి క్విజ్ attempt చేయాలి.

👉 మదింపు చేయడానికి మూడు అవకాశాలు ఉంటాయి. ఈ మూడు అవకాశాలలో మీరు 70 శాతం స్కోర్ సాధించాలి. మొదటి సారి మీరు 70 శాతం సాధిస్తే మిగిలిన రెండు సార్లు మీ స్కోర్ పెంచుకోవచ్చు. లేదా ఆగిపోవచ్చు.


👉 కోర్స్ పూర్తయిన తరువాత ఒక గంట నుండి రెండు వారాలలో  మీ సర్టిఫికేట్ జనరెట్ అవుతుంది. ప్రొఫైల్ సెక్షన్ నుండి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు 


👉 నిష్ఠ ఆన్లైన్ క్విజ్  ర్యాండమ్ గా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి సోషల్ మీడియా వీడియోస్ పై ఆధార పడకుండా మీ సొంత గా చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా విజయం సాధిస్తారు.


👉 నిష్ఠ కోర్సు పూర్తి చేయడం ద్వారా మనం పాఠశాల నిర్వహణలో మరియు తరగతి గది బోధనలో అద్భుతాలను సృష్టించవచ్చు.


👉 మనం మరింత ఉత్సాహంగా పని చేయడానికి నిష్ఠ ఆన్లైన్ ట్రైనింగ్ అదనపు వనరుగా మరియు బూస్ట్ లాగా పనిచేస్తుంది.

కాబట్టి అందరూ ఉపాధ్యాయులు నిష్ఠ ఆన్లైన్ ట్రైనింగ్ లోని అన్ని కోర్సులను పూర్తిచేసి మీయొక్క శిక్షణను ను విజయవంతంగా పూర్తి చేయగలరు.

👉 కోర్స్ లో జాయిన్ అయ్యే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి

👉 సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకోవడానికి ఇక్కడ CLICK చేయండి.

                  All the best 💐💐👍👍

Comments

Popular posts from this blog

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి

Adding the teacher's name from the old school to the transferred new school

SMC 2024 ELECTION