Nishtha 3.0 Registration & Login process
Nishtha 3.0 Registration మరియు login చేసే పూర్తి విధానం.
👉 చివరలో ఉన్న లింకు క్లిక్ చేయండి
నెక్స్ట్ స్క్రీన్ లో మీకు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది.
(ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు కోర్సు పూర్తి చేయడానికి లాగిన్ చేయవలసి ఉంటుంది)
👉 మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
👉 తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉 నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి.
👉 మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
👉 ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఒకసారి చెక్ చేసుకోండి.
👉 తర్వాత మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్వర్డ్ లో ఎనిమిది క్యారెక్టర్స్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది.
వీటిలో ఒక బిగ్ ఆల్ఫాబెట్, ఒక స్మాల్ ఆల్ఫాబెట్, ఒక నెంబర్ మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
Ex: Abcdef@1234
నెక్స్ట్ బాక్స్ లో అదే పాస్వర్డ్ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
👉 I understand and accept the diksha terms of use చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వండి.
నెక్స్ట్ రిజిస్టర్ క్లిక్ చేయండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడి కి ఒక ఓటిపి వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విజయవంతం అవుతుంది తర్వాత మీరు లాగిన్ చేయవలసి ఉంటుంది.
👉 లాగిన్ చేసిన తర్వాత
మనకు సంబంధించిన కంటెంట్ తెలుసుకోవడానికి చేయడానికి కొన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటగా మీరు బోర్డు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ సెలెక్ట్ చేయండి. (మీ స్టేట్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డు సెలెక్ట్ చేయండి)
మీడియం సెలెక్ట్ చేయండి.
మీరు కోర్స్ ఏ మీడియంలో పూర్తి చేయాలి అనుకుంటున్నారో ఆ మీడియం మాత్రమే సెలెక్ట్ చేయండి.
క్లాస్ అని ఉన్న చోట others సెలెక్ట్ చేయండి.
సబ్జెక్ట్ అని ఉన్న చోట CPD అని సెలెక్ట్ చేయండి.
👉 వివరాలు సబ్మిట్ చేయండి తర్వాత స్క్రీన్ లో పేరెంట్స్, స్టూడెంట్, టీచర్ school head అని కనిపిస్తాయి.
మీరు టీచర్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
👉 మన లొకేషన్ వివరాలు కనిపిస్తాయి
చివర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి.
తర్వాత submit button పైన క్లిక్ చేయండి.
మీ అన్ని వివరాలు సేవ్ చేయడం జరుగుతుంది. దీనితో లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
👉 మీ ప్రొఫైల్ చెక్ చేయడానికి రైట్ సైడ్ టాప్ లో సర్కిల్లో మీయొక్క నేమ్ లోని మొదటి ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి మీ యొక్క ప్రొఫైల్ వివరాలన్నీ కనిపిస్తాయి.
👉 మీయొక్క కోర్సు పూర్తయిన తర్వాత లాగవుట్ చేయండి మళ్ళీ కోర్సు లోకి రావటానికి లాగిన్ చేయండి.
మీరు కోర్సు పూర్తి చేసిన తర్వాత మీయొక్క సర్టిఫికెట్ ప్రొఫైల్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
All the best
Registration చేయడానికి ఇక్కడ CLICK చేయండి
Comments
Post a Comment