C TET - 2021 Complete Information
ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారి కోసం CBSE ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-CTET నిర్వహిస్తుంది.
ఈ ఏడాదికి సీటెట్ పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌లో ఇప్పటికే విడుదల అయ్యింది. దరఖాస్తులను సెప్టెంబర్ 20, 2021 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది సీటెట్ ను 16 డిసెంబర్ 2021 నుంచి13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.
పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది.
తెలుగు,ఇంగ్లీష్,హిందీ తో సహా 20 ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు..
దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకొందాం.
ముఖ్యమైన తేదీలు..
అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20, 2021
ఈ-చలాన్ చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ 20, 2021
ఆన్‌లైన్ కరెక్షన్లకు అవకాశం అక్టోబర్ 22-28, 2021
అడ్మిట్ కార్డులు డిసెంబర్ మొదటి వారం
పరీక్ష తేదీలు డిసెంబర్ 16, 2021 నుంచి జనవరి 13, 2022
ఫలితాలు ఫిబ్రవరి 15, 2022
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P ను సందర్శించాలి.
Step 2: అక్కడ ‘Apply Online’ పై క్లిక్ చేయండి
Step 3: రిజిస్టర్ నంబర్ జనరేట్ అవుతుంది. అది సేవ్ చేసుకోవాలి.
Step 4: ఆన్‌లైన్ దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
Step 5: అనంతరం ఫీజు చెల్లించాలి.
ఈ పరీక్ష సీబీఎసీఈ నిర్వహిస్తున్న 15వ పరీక్ష.
సీటెట్ (CTET) దరఖాస్తు ఫీజు- పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500.
రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.600.
అవసరమైన డాక్యుమెంట్స్
పదోతరగతి సర్టిఫికెట్
ఇంటర్ లేదా 12వ తరగతి సర్టిఫికెట్
ఉన్నత విద్య సంబంధించిన ధ్రువపత్రాలు
పాస్‌పోర్టు సైజ్‌ఫోటో
సిగ్నేచర్ స్కాన్ కాపీ
ప్రధానమైన మార్పులు
- ఈ ఏడాది పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
- సీటెట్ వ్యాలిడిటీ గతంలో 7 ఏళ్లు ఉండేది. ప్రస్తుతం ఆ వ్యాలిడిటీని జీవితకాలానికి పెంచారు.
పరీక్ష తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 20 భాషలలో నిర్వహించబడుతుంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించడం మాతృభాషలో బోధన కోసం వాదించే కొత్త జాతీయ విద్యా విధానం (NEP) కి అనుగుణంగా ఉంటుంది.
పూర్తి నోటిికేషన్ కొరకు ఇక్కడ CLICK చేయండి
మోడల్ పేపర్ కోసం ఇక్కడ CLICK చేయండి
తెలంగాణా లో Ctet practice center వివరాలకోసం ఇక్కడ CLICK చేయండి.
Comments
Post a Comment